ఆ భారతీయ విద్యార్ధులపై చర్యలు తీసుకుంటా..
posted on Apr 12, 2016 @ 11:49AM
తెలియక తప్పు చేస్తే ఏముండదు కానీ.. తెలిసి, తెలిసి తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉండాలనుకున్న భారతీయ విద్యార్ధుల పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే.. మోసపు యూనివర్శిటీ అని తెలిసీ కూడా.. వీసా గడువు లేకుండా దేశంలోనే ఉండిపోవాలని చూసిన 306 మంది భారతీయ విద్యార్ధులపై అమెరికా చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొంతకాలం నుండి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లోనే అసలు వివరాలు బయటపడ్డాయి. అధికారులే బోగస్ వర్శిటీని స్పష్టించి విద్యార్ధులపై వల విసిరారని.. వీసా పొడిగింపుకు ప్రయత్నించి అది పొందలేకపోయిన వారికి బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి వర్శిటీలో ప్రవేశాన్ని ఇప్పించారని.. అయితే మొత్తం 1000 మంది విద్యార్ధులు వర్శిటీలో చేరగా అది తప్పు అని తెలియక కొంతమంది చేరగా.. అందులో విషయం తెలిసినా కూడా కొంతమంది విద్యార్ధులు చేరారని తెలిసింది. దీంతో అమెరికా కూడా అది ఫ్రాడ్ అని తెలిసినా కూడా తప్పు చేసిన విద్యార్దులపై మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఈ ఆపరేషన్లో బయటపడ్డ మొత్తం 32 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు.