సాయిబాబా, శని దేవుళ్లుగా అనర్హులు.. స్వామి స్వరూపానంద సరస్వతి
posted on Apr 12, 2016 @ 11:24AM
సాయిబాబాను పూజించడంవల్లే కేరళలోని కొల్లం, పుట్టంగల్ దేవి ఆలయంలో ప్రమాదం జరిగిందని ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఘటనపై ఆయన మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయంలో మహిళలు ప్రేవేశించడంవల్లే అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాలుగు శతాబ్ధాలుగా ఉన్న సంప్రదాయాన్ని ఒక్కసారిగా కూల్చివేసి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.. అందుకే అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అసలు షిర్డీ సాయిబాబా, శని దేవుళ్లు.. దేవుళ్లుగా అనర్హులని.. వారికి పూజలు చేయడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.