విభజనపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్
posted on Oct 29, 2013 @ 10:43AM
విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. విభజన వల్ల శాంతిభద్రతలపై పడే ప్రభావం, నక్సల్స్ సమస్య, హైదరాబాద్ స్థాయి తదితరాలపై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ అదికారి విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. మాజీ ఐపిఎస్ అదికారి ఎ.కె. మహంతి , జెవి రాముడు తదితరులు కూడా ఈ బృందంలో ఉన్నారని చెబుతున్నారు. ఇది రాష్ట్ర అధికార వర్గాల నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఓ వ్యూహాత్మక పత్రాన్ని రూపొందిస్తుంది. కేంద్ర మంత్రుల బృందానికి తన నివేదిక సమర్పిస్తుంది. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి హోంశాఖ గడువు విధించినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే నవంబర్ 5లోగా ఇది జీవోఎంకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉంటున్నదన్నమాట.