Previous Page Next Page 
అసురవేదం పేజి 3

   

   "హాయ్ హనీ!" చివరగా చనువుగా ప్రదర్శించింది హనితకి వరసుకి మేనబావా , మరో బోర్డు మేమ్బరూ అయిన శవారావుని.

    అందరినీ విష్ చేస్తూ దీర్ఘ చతురస్రాకారంలో  వున్న ఓ టేబుల్ కి ఓమూల చెయిర్ లో  కూర్చున్న హానిత ఓక్షణం సాలోకాహ్నగా చూసింది. "డాడీ ఊళ్ళో లేరు కాబట్టి ప్రస్తుతానికి ఆ సీటు ఖాళీగానే వుంచూదా౦" మధ్య వున్న ఎమ్. డి. సీటు వేపు చూస్తూ  అంది.

    అందరిలోనూ ఉత్కంఠ. అసలింత హడావుడిగా ఈ బోర్డుమీటింగు ఆమె ఎందుకేర్పాటు చేసిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమె సుదర్శన రావు కూతురినే కాకుండా ఇప్పుడిప్పుడు  ఆమె ప్రదర్శిస్తున్న డైనమిజం బోర్డు మేమ్బర్సు లో చాలా కంగారు పుట్టిస్తూ౦ది.

    "వెల్ __ వయసులోకానీ, అనుభవంలోకాని మీకంటే చిన్నదాన్ని నేను. అయినా కబురు చేయగానే ఇక్కడ సమావేశమైనందుకు క్రుతజ్ఞారాల్ని."

    "ఇప్పుడు జరగబోయే సంఘటన బోర్డు మేంబర్సులో కొందరికి మింగుడు పడకపోవచ్చనిఆమెకు తెలుసు. కాబట్టే ముందు అందరి స్వాతిశయాన్నీ చల్లార్చే సైకలాజికల్ ఎప్రోచ్ తో  క్రమంగా విషయాన్ని యుక్తిగా వారి ముందుంచుతూ౦ది. "మిస్టర్ రణధీర్ మీకు తెలుసు."

    "ఆఫ్ కోర్స్! ఎబ్రిలియంట్ బోయ్! హైదరాబాదులోని మన కెమికల్ యూనిట్ కి మేనేజర్!"

    ప్రభంజనరావు ఉత్సాహంగా అన్నాడు. " ఈ మధ్యనే ఎందుకూ కొరగాకుండా పడివున్న టేబ్లేట్ కంప్రోషన్ మిషన్ని చాలా ఎక్కువ ధరకి అమ్మి బోలెడంత ప్రాపిట్ సంపాదించాడు."

    "ఆఫ్ కోర్స్" తలపకించింది. హానిత భావరహితంగా.

    "అవును" ఎలిజిబెత్ వంట పలికింది. "పది లక్షలకు మించి రాదనుకున్నను. పన్నెండు లక్షలదాకా రాబట్టగలిగాడు."

    "అతన్నిప్పుడు లోపలి పిలుస్తున్నాను" ఇంటర్ కంలో పియఎకి చెప్పింది రణధీర్ ని పంపమని.

    ముందు రోజు సాయంకాలమే హైదరాబాదు నుంచి వచ్చిన రణధీర్ సంప్రాదాయకంగా తెలసిన రణధీర్ యిలా కాన్ఫరెన్స్ హాల్లోకి పిలిపించడాన్ని వూహించలేకపోతున్నాడు. మనసు ఆనందంతో ఉద్విగ్నమావుతూంది.

    "యూ హేవ్ డన్ గుడ్ జాబ్" అభినందనగా చూసింది. హానిత. "మాకు మిస్ ఎలిజిబెత్ అంచనా ప్రకారం రెండు లక్షల లాభాన్ని సంపాదించారు."

    "థాంక్స్ మేడమ్"వినయంగా తల పకించాడు.

    "మామూలుగా అయితే మీకు కనీసం రెండు ఇంక్రిమెంట్స్ పెంచాలి. యా మై రైట్ ?"

    నిశ్సబ్దంగా చూస్తున్నారు. హానిత ఇప్పుడేం మాట్లాడాలని పిలిచిందీ వారి ఊహకందడంలేదు.

    "అసలు అ మెషిన్ ప్రోక్యూలర్ మెంట్ కి ముందు ప్లాన్ చేసింది ఎవరు?' వెంటనే అడిగింది మొహంలో ఎలామతి భావం కనిపించనివ్వకుండా.          

    "నేనే" రణధీర్ ఇలామ్టి ప్రశ్న ఊహించలేదు.

    "ఇప్పుడు అవసరంలేదు అని నిర్ణయించింది.?"

    "నేనే" రణధీర్ గొంతు వణికింది.

    "మూడేళ్ళ క్రితం అది ఎందుకు కొన్నట్టు?" యిప్పుడు ఎందుకు అమ్మినట్టు?"

    కొద్దిగా త్రోటుపడ్డాడు రణధీర్. "అప్పుడు అవసరం అనిపించింది. అందుకే ఒకేసారి రెండు మెషిన్స్ కొన్నాం."

    "ఇప్పుడు ఒక మెషిన్ అమ్మేశారు" టక్కున ఖండించి౦ది హానిత. "అంటే నిజానికి ఫ్యాక్టరీకి అవసరం. ఒక్క మెషిన్ మాత్రమె. అవునా?"

    తలూపేడు గొంతు తడారిపోతుంటే.

    "వాట్ డజిట్ మీన?" హనిత పెదవులపైన సన్నని చిరునవ్వు. "మీ ప్లానింగ్ లో పొరపాటు జరిగింది. ఒక ఉత్పత్తిని బట్టి ఎన్ని మెషిన్స్ అవసరమో అన్నది ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు . కాబట్టే పదిహేను లక్షల ఖరీదుచేసే యంత్రాన్ని కొని మూడు సంవత్సరాలపాటు డెడ్ క్యాపిటల్ గా మార్చి మీరు ఆర్గనైజేషన్ లో ఓ ప్రముఖ స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ గ కంపెనికీ సరయిన న్యాయం చేయలేక పోయారు. ఇప్పుడు పన్నెండు లక్షలకి మరో కెమికల్ ఫ్యాక్టరీకి అమ్మి యిదీ లాభం అంటూ మేనేజ్ మెంటుకి స్పష్టం చేయలనుకుంటున్నారు. యామై రైట్ ?"

    ఒక్కోపదం ఆమె నోటినుంచి తూటాల్లా బయటకి వస్తుంటే ...... రణధీర్ మాత్రమె కాదు _ అక్కడ బోర్డు డైరెక్టర్సంతా అవాక్కయిచూస్తున్నారు.

    "ఆచరణకి ముందుస్థాయి ఆలోచన అన్న సూత్రాన్ని బట్టి మీరు ఆలోచన లేకుండా తొందరపడ్డారు. యూ అరె ఎగ్జిక్యూటివ్ వితౌట్ ప్రోఫర్ ప్లానింగ్!" ఓ క్షణం సూటిగా చూసింది. "అండ్ డిస ఆర్గానైజేషన్ డజంట్ నీద యువర్ సర్వీస్ ఎనీమోర్! మీరీ క్షణంనుంచే కంపెనీ సర్వీస్ నుమ్హి వెళ్ళిపోతున్నారు. మీ ఎకౌంట్స్ సెటిల్ చేయించాను. ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో మీకు రావాల్సిందికలెక్ట్ చేసుకుని వెళ్ళండి."

    "మేడమ్!" రణధీర్ ఏదో చెప్పబోయాడు.

    "ప్లీజ్ గో ఎవే!"

    హనిత కంఠంలోని కాఠిన్యం అతన్ని నిరుత్తరుణ్ణి చేసింది.నిశ్సబ్దంగా వెళ్ళిపోయాడు.

    "ఇట్స్ టూ మచ్" అసహనంగా పలికాడు ప్రభంజనరావు. "ఒక చిన్న కారణంతో ఒక ఎగ్జిక్యూటివ్ ని ఉద్యోగంనుంచి తప్పించడం సమంజంసంగా లేదు."

    హనిత ముఖ కవళికల్లో మార్పులేదు. "ఇది చిన్న కారణమెలా అవుతుంద౦కుల్? ప్రణాళిక అన్నది దేశానికి, మనిషి జీవితానికి మాత్రమె కాదు. ఫ్యాక్టరీ కి అవసరమే! వందమంది కార్మికుల్లో ఒకడు అమయామ్కంగా తప్పుచేస్తే క్షమించవచ్చు. కానీ ఆ వందమందినీ లీడ్ చేసే ఎగ్జిక్యూటివ్ తప్పిదాన్ని హర్షిచటం ..... నిజానికి రణధీర్ తన డ్యూటీలో మాత్రమె విఫలం కాలేదు. ఒకరకంగా కంపెనీకి ద్రోహం చేశాడు" ఎనలైటికల్ గా చెప్పుకు పోతూందామె.

    "అలాంటివి ఎ ప్యాక్టరీలో అయినా జరుగుతుంటాయి." శివరావు జోక్యం చేసుకున్నాడు.

    "అలాంటప్పుడు ఇలాంటివి జరగడం తప్పనిసరి."

    "బుల్ షిట్" ప్రభంజనరావు నిగ్రహాన్ని కోల్పోయాడు. అతని అరుపులో కోపం మాత్రమె కాదు, నిన్నగాక మొన్న కళ్ళు తెరచిన పసిపిల్ల తమకి తర్కం నేర్పడం అసహజమన్న భావం కూడా వుంది. "ఇది పొరపాటేమోగాని ద్రోహమెలా అవుతుంది?"

    హనితలో మార్పులేదు ..... తన ముందు కూర్చున్న వాళ్ళు అంతాఈ సంస్థ పురోభివృద్ధికి కారణ మనుకుమ్తున్న వ్యక్తురే. ఇక్కడ ఒర్పుని కోల్పోతే జరగావాల్సిన చాలా పనులకి మేర్పడుతుంది

    "వెల్ అంకుల్ ..... " హనిత నిలబడింది. "ఇది పొరపాటు మాత్రమే అంటున్నారు. అది మాత్రమే అయితే నేనూ అంతా తొందర పడేదాన్ని కాదేమో!" అప్పుడు అందించింది ఓ ఫైల్!

    ఫైల్ తెరచి చూసిన ప్రభంజనరావు అర్ధం కాలేదు అందులో ఉన్నదేమిటో.

    "మిస్టర్ రణధీర్ ఆ మేషీన్ అమ్మింది శాలినీ కెమికల్స్ వాళ్ళకి. అది మీదున్న డాక్యుమెంట్ స్పష్టం చేస్తూంది. దిగువ మరో పేపరుంది చూడండి. అదే కెమికల్ ఫేక్టరీలో రణధీర్ కి నాలుగేళ్లగా షేర్లున్నాయి . అంటే ?" నిశ్చలంగా చూస్తూ అంది "వాళ్ళతో లాలూఛీపడి వాళ్ళకోసమే ఈ మెషిన్ ఆనాడు మనచేత కొనుగోలు చేయించాలన్నది నా అభియోగం ఇప్పుడు చెప్పండి ఇది పొరపాటా. ద్రోహమా?"

    అయిదేళ్ళు డైరెక్టర్స్ అనుభవంలో అంతగా ఉలిక్కిపడింది. తొలిసారి పిల్లకాకి అనుకుంటే..... కాదు, అవసరమైనపుడు ఆస్ట్రిచ్ ని అంటూ నిరూపించ గలిగింది. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం.

    అక్కడున్న  వాళ్ళలో పోరాపాటునైనా ఆ స్థానంలో కొనసాగిస్తే అంతకుమించిన ఆత్మద్రోహం మరోటు౦డదని.

                                                         *    *    *    *   

    సాయంకాలం నాలుగున్నర కావస్తుంది.

    జంటలతో. పసిపిల్లతో భీచ్ సందడిగా ఉంది. పగిలిన సూర్య గోళపు కాంతిసాగరం పైన చెల్లాచెదురుగా పడుతుంటే ఒడ్డునున్న వాళ్ళకి వెండి జలతారును చూస్తున్నట్లుగా ఉంది.

    నిశ్సబ్దంగా నడుస్తోంది. హనిత.

    కొందరు పసిపిల్లలు బోరియల్లోని పీతల వెంట పడుతుంటే ఒడ్డునున్న వాళ్ళకి వెండి జలతరును చూస్తున్నట్లుగా ఉంది.

    నిశ్సబ్దంగా నడుస్తోంది హనిత.

    కొందరు పసిపిల్లలు బిరయాల్లోని పీతల వెంట పడుతుంటే మరి కొందరు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ నీటి అలల తాకిడికి కూలిపోతుంటే నిశ్శేష్టులై చూస్తున్నారు.

    ఎంత అపురూపమైన సన్నీ వేశమది! బాధలకీ, బాధ్యతలకి అతీతమైన ఈ వయసులోనే కదూ మనిషి నిజంగా సుఖపడేది గాని, స్పటికమంత స్వచ్చంగా మనగలిగేది గాని!

    పాదాలు ఇసుకలో కూరుకుపోతుంటే పరిసరాల్ని చూస్తూ శాంతి ఆశ్రమం వేపు సాగిపోతూందామె. ఆమెకు తెలీదు అక్కడున్న ప్రతి పురుషుడూ ఆమెను గమనిస్తున్నాడని. అసలు గమనించే స్థితిలో కూడా లేదామె.  మధ్యాహ్నం నుంచీ ఆలోచిస్తుందామె. ఉదయం తనుతావుమ్దర పడలేదనీ తెలుసు. ఇలా సెకెండ్ థాట్ కి అవకాశమివ్వడం పోరాటంలో అడుగు తెలుసు. ఆలోచించకుండా ఉండబెట్టిన మనిషి చేయతగ్గది కాదని కూడా తెలుసు. ఆలోచించకుండా ఉండ లేకపోతూంది. గాయానికి బెంజైన్ పూసే ముందు గాయాన్ని శుభ్రం చేయాలి. అదే తను చేసింది, చేయబోతున్నది. ఒకర్ని సంతృప్తి పరచాలీ అంటే మరోకర్ని అసంతృప్తిలోకి నెట్టాలి. ఈ తర్కం కాదు తనది. పెను తుఫానుళకైనా నిలబడే వటవృక్షాలు కుమ్మరి పురుగుల మూలముగా నేలకులుతాయి. వాటినిప్పుడు ఏరేసే ప్రయత్నంలో నిమగ్నమైంది.                  

 Previous Page Next Page