Previous Page Next Page 
అసురవేదం పేజి 2

  

   ఓడ పగిలింది మధ్యగా, ఘాటెక్కిన ఘంధక దూమంలా నీళ్ళు దూసుకుకోస్తున్నాయి. మృత్యువు జైత్రయాత్రాపథపు పోరాటంలో అలసిన ఓడ కడలి గర్భంలో ఒరిగి కరిగి అదృశ్యమౌతుంటే .....

    మౌన నిశ్వాసాల పిలుపుల్ని బావురుమనే గుండెల ఏడ్పుల్నీ ఆలకిస్తూ, మీదకి ఉరికిన నీటి సుడులలో జారిపోతూ .... అప్పుడు అరిచింది హనిత కేవ్వుమంటూ.

    ఆక్రందన గొంతులోనే సమాధి కాగా ఉద్వేగంగా లేచిన హనిత చుట్టూ చూసింది.

    అంతవరకూ తను కలకన్నా విషయం స్పురించడానికి అర నిముషం పట్టింది.

    విశాలమైన 'విల్లా' లోని ఆమె బెడ్ రూమ్ ఆర్దికాట్వేడ్ స్టోన్ లామినేషన్స్ సబ్ ట్యూడ్  లైటింగ్ లో ఊదారంగు మెరుపుని చిమ్ముతున్నాయి.

    స్వేదంతో తడిసిన నితీ ఆ చిరువేలుగులో ఆమె ఒంటి పసిమిఛాయని బహితర్గం చేస్తుంటే సన్నని అలజడితో ఎగిరిపడుతున్న ఒంపులు అప్పటిదాకా నిద్రలోని ఆమె ఉద్వేగాన్ని స్పష్టం చేస్తున్నాయి.

    అప్పుడు  గమనించింది ఫోన్ రింగవాటాన్ని.....

    పాలభాగంపైన  అలుముకున్న స్వేదబిందువుల్ని సుతారంగా తుడుచుకుంటూ ఫోంబెడ్ పై నుంచే ఓకే టీపాయ్ వేపు చేతిని చాచింది.

    గోడ మీదున్న డిజిటర్ క్లాక్  రాత్రి పన్నెండున్నర గంటలు సూచిస్తూంది.

    "హనితా హియర్ "

    "హనీ డియర్ ..... నేను __ " దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఒకడైన దుదర్శనరావు గొంతు వినిపించింది. బిజినెస్ కాన్ఫరెన్స్ కి అయన బాంబే నుంచే ఫోన్ చేస్తున్నాడు. "డిస్టర్బ్ చేశానుగా బేబీ బాగా నిద్రపోయినట్టున్నావు."

    "పదకొండు గంటలదాకా మీ ఫోన్ కోసం వెయిట్ చేశాను డాడీ! అవునూ ...."

    అప్పుడు  గుర్తుకొచ్చిందామెకి. ఆ మధ్య కాస్త అనారోగ్యానికి. గురైన ఆయన్ని రాత్రి పది గంటలకల్లా బలవంతంగా నిద్రపుచ్చేస్తూ బయటికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ సూత్రాన్ని సంపాదించి తీరాలని శాశించి మాట తీసుకుంది. "ఈవేళదాకా మేల్కొనే వున్నారన్నమాట"

    "ఏదీ _" ఈ ప్రశ్నని అయన ఊహించలేదు. "ఇప్పటిదాకా డెలికేట్స్ ...."

    "డాడీ డాడీ , మీరు మాట తప్పారు ."

    "చూడు డియర్ ...." హనితని ముఖ్యంగా కంగారు పెట్టిన మైల్డ్ హార్డ్ ఎటాక్ గుర్తుచేసుకున్నట్టుగా అన్నారాయన "నా గుండె అంత తొందరగా ఆగిపోదమ్మా __ ఎందుకంటె దాని నిండా నువ్వే వున్నవుగా ?"
   
    "యూ ఆర్ బ్లఫింగ్ డాడీ " చిరుకోపంగా అంది. "అదే నిజమయితే నా కిచ్చిన మాట తప్పేవారు కాదు, ఈ సారినుంచి మీరే కాన్ ఫరెన్స్ కీ  వెళ్ళటానికి వీల్లేదు.... మీ బదులు నేను చూసుకుంటాను అవన్నీ. ఓ.కే?"

    ఉన్న ఒక్కగానొక్క కూతురి అసాధారణ ప్రజ్ఞా ప్రభావాలపైన నమ్మకమో, లేక ఆ కూతురి గొంతు నుంచి ధ్వనించే అనూహ్యమైన ఆప్యాయతకి మనసే ద్రవించిందో కాని, కొన్ని క్షణాలపాటు నిశ్సబ్దంగా ఉండిపోయారు.

    "ఓ.కే బేబీ .... ఇకనుంచి నువ్వు గీసిన గీత దాటను. నర్సరీ చైర్డ్ లా నువ్వు చెప్పిందే ఆచరిస్తాను. వెల్! రేపు ఈవినింగ్ ఫ్లయిట్ కి నేను వస్తున్నానుగాని నేను చెప్పిందంతా స్టడీ చేశావా?"

    "ఎస్ డాడీ!" ఇప్పుడామె గొంతు సేరియస్ గా పలికింది. "మీరు పర్మిట్ చేస్తే ఒక ముఖ్యమయిన నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను."

    " యూ ఆర్ వన్ ఎమాంగ్  డైరెక్టర్స్. అన్ని విషయాలూ బోర్డుకో సంప్రదించాల్సిన అగత్యం లేదు. నీక స్వతంత్రం వుంది. ప్రొసీడ్ ఆమెని వివరాలు సైతం అడగలేదు. "గుడ్ లక్ అండ్ గుడ్ నైట్ " ఫోన్ క్రేడిల్ చేసిన చప్పుడు.

    హనిత ఇక నిద్రపోవాలనిపించక నెమ్మదిగా హాల్లోకి నడిచింది. గోడలకున్న సం గ్లాసెస్ కి దూరంగా సముద్రపు హొరు. డ్వాలైన్స్ నోఫ్ కొండపైన లైట్ హౌస్ కాంతి అస్పష్టంగా కనిపిస్తూంది.

    గదిలో లైటువేసి బడలికగా రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుంది. టేబుల్ పైన ఉన్న ఫైల్సు తెరచి మరోమారు చూసింది.

    నిన్న మొన్నటిదాకా ఆమె ఓ యూనివర్సిటీ విద్యార్ధిని. తల్లి అందాన్నీ, తండ్రి మేధనీ పుణుకిపుచుకున్న ఆమె ఈ మధ్యనే తండ్రి బిజినెస్ లో అడుగు పెట్టింది.

    సుమారు ముప్ఫైయేళ్ళ క్రితం ఓ చిన్న యూనిట్ గా ప్రారంభమైన 'సాకేత అండ్ కో' ఇప్పుడు ఆరుగురు డైరెక్టర్స్ ఉన్న ఓ ప్రైవైట్ లిమిటెడ్ కంపెనీగా సుమారు ఏడాదికి రెండువందల కోట్ల టర్నవర్స్  ఉన్న సంస్థగా విస్తరించింది డ్రగ్స్ తో బాటు కెమికల్స్ సేస్తిసైడ్స్, టుబాకో, ఎలక్ట్రానిక్ గూడ్స్, మెషిన్ టూల్స్ ఉత్పత్తి మాత్రమేగాక, ట్రేడింగ్ రవాణాకోసం సొంతంగా ఆరు షిప్స్ ఉన్న పెద్ద ఇన్ స్టిస్త్యూషనది. అలాంటి సంష్టలో హానిత కూడా ఇప్పుడు ఓ డైరెక్టర్.
   
    నిజానికి ఆమె కోరని అవకాశమిది. రేయింబవళ్ళు తండ్రి పడేశ్రమని చూస్తూ చాలాకాలం  నిశ్శబ్దంగా ఉందిపోయింది. కాని ఈ మధ్య సుదర్శనానికి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ముందు కలవరపడింది. ఇక్కడ ఆమె కుతూహలంగా గ్రహించింది. అయన శారీరకంగా అలసి పోతున్నాడని మాత్రమె కాదు __ మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాడని.

    సుమారు అయిదు వేలమంది దాకా కార్మికులున్న వివిధ పరిశ్రమలు క్రమంగా నష్టాలవేపు ప్రయాణం చేయడాన్ని గాని, 'ఇండస్ట్రీయల్ అన్ రెస్ట్ ' తో కార్మిక సంఘాలు సమస్యలు సృష్టించడాన్ని గాని __ మేనేజింగ్ డైరెక్టరు గా ఉన్న తన తండ్రి మాత్రమె బడహ్యటగా స్వీకరించి మానసికంగా నలిగిపోతున్నా నని గ్రహిమ్హి తనూ కొంత షేర్ చేసుకోవలనుకుంది.

    ఆ ప్రొపెసర్ లో  ఎంత లోతుగా వెళ్ళిందీ అంటే నాలుగు రోజుల వ్యవధిలోనే చాలా వివరాల్ని పరిశీలించింది.

    గత నాలుగేళ్ల సంస్థ చరిత్రని బేలెన్స్ షీట్స్ ద్వారా గ్రహించింది. అయిదేళ్ళ క్రితందాకా లాభాల్లో నడిచిన సంష్ట మూడేళ్ళ క్రితం బ్రేక్ యీవెన్ పాయింటు దగ్గర ఆగింది. రెండేళ్ళనుంచి క్రమంగా నష్టాలవేపు పరుగు తీస్తూంది.
     
     హఠాత్తుగా హనితికి ఇందాకటి కళ గుర్తుకొచ్చింది. అంతా అనుభావం ఉన్న నావికులే అయినా పోతెక్కిన సముద్రం మధ్య నౌకని రక్షించలేకపోయారు. సరిగ్గా అక్కడి తుఫాను ఆర్గనైజేషన్ ప్రస్తుత స్థితిని గుర్తు చేస్తూంది. కలలో తనూ మునిగింది. ఓడతోపాటు. కాని వాస్తవంలో ఆమె అలా భావించడం లేదు. ఒక విద్యాదికురాలిగా డిమాండ్ _ నేససిటీన్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ యేటి కాయేడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కాని, సమస్యల్లా ఉత్పత్తి అవసరాన్ని చేరుకోలేక పోతూంది.
   
    సాధ్యాసాధ్యాల గురించి ఆమె ఆలోచించలేదు. ఒక పోరాటంలో అడుగు పెట్టాక ఆఖరిదాకా  ఆశావడంతో దూసుకుపోవాలనే పట్టుదల ఉన్న తండ్రి నుంచి సంక్రమించిన వరసత్వమో, లేక తను నమ్మిన మోడరన్ థీయరీ అమలు చేయాలన్న సంకల్పమో గాని, ముందు ప్రక్షాళన టాఫ్ మేనేజ్ మెంటుతో ప్రారంభించాలనుకుంది.

    ఆ ఉద్దేశ్యంతోనే ఇందాకటిదాకా కొన్ని ఫైల్స్ తిరగవేస్తూ చాలా స్టడీ చేసింది. కూడా

    మరుసటిరోజే ప్రారంభానికి మొదటిరోజు అని దృఢనిశ్చయ౦తో పైకి లేచింది.

                                                           *    *    *    *   

    వాల్టర్ ఆఫ్ లెండ్స్ లోని పదంతస్తుల అధునాతనమైన బిల్డింగ్ అది, సుమారు ఆరెకరాల విస్తీర్ణమున్న ప్రదేశంలో నిర్మించిన ఆ భవంతి సాకేత అండ్ కంపెనీకి చెందినది. అందులో వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో ఉండే కంపెనీ ప్యాక్తరీలను సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు మాత్రమెగాక కొన్ని రీసెర్చిలేబరేటరీస్, ప్లానింగ్ డివిజన్సూఉన్నాయి. అధునాతనమైన గ్లాస్ స్ట్రక్చర్ తో ఒక పెద్ద అర్గనైజేషన్ మేధకి అసలు స్థావరంగా కనిపించే ఆ బిల్డింగ్ లోనే మూడో అంతస్తులో బోర్డు మీటింగ్ కి అనుకూలంగా ఓ విశాలమైన కాం ఫరేన్స్ హాలు వుంది.

    డైరెక్టరు అత్యవసరంగా కలసి చర్చించాల్సి వచ్చినప్పుడు తప్ప సామాన్యంగా ఆ ప్లోరులో ఎవరూ అడుగుపెట్టరు.

    సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల ప్రా౦తంలో అక్కడ ఒక సిట్రాన్ ఆగివుంది. యూనిఫాములో వున్న గరదు డోర్ తెరవగానే హానిత కిందికి దిగింది. నీలం సిఫాన్ శారీలో రాయంచలా ఆమె కదులుతుంటే అభ్యంగనస్నానం చేసిన ఆమె కురులు సముద్రపు గాలికి మృదువుగా నర్తిస్తున్నాయి. నిరాడంబరంగా ఉన్న ఆమె అలంకరణ ఒక కోటీశ్వరుడి కూతురు అనే భావం కన్నా ఒక సంష్ట బాధ్యతాయుతమైన అధికారిణి అనే ఆలోచనే స్పురింపచేస్తూంది.

    విశాలమైన 'లావీ' ని దాటి వెళ్ళిన హానిత గరదు సవినయంగా మార్గం చూపించిన ఎలివేటర్ లో అడుగు పెట్టింది. ఆ భవనానికి రెండు లిష్టులు ఉన్న ఇప్పుడు హానిత ప్రవేశించిన ఎలివేటర్ కేవలం బోర్డుమెంబర్సు కి మాత్రమె ప్రత్యేకం.

    మూడో అంతస్తులలోని కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించిన హనితని ముందు విష్ చేసింది. ఎలిజిబెత్. ముప్ఫై సంవత్సరాల వయసు దాటినా ఇంకా పాతికేళ్ళ యువతిలాగే కనిపించే ఎలిజిబెత్ తోబాటు ఏభై ఏళ్ళ పయనున్న ప్రభంజనరావు, నలభయ్యేళ్ళకే అరవైయేళ్ళ వృద్దుడిలా కనిపించే సత్యనంలో తాము కూర్చున్న చోటి నుంచే ఆమెను ఆప్యాయంగా పరామర్శించారు........

 Previous Page Next Page