అసురవేదం
__ కొమ్మనాపల్లి గణపతిరావు.
"నేస్తం ....
అనంత విశ్వాన్ని నిశ్చలంగా దర్శించగల వరం కాబట్టే నీ మనసొక సరోవరం. అసురసంధ్యకి అంత్యక్రియలు చేసిన నువ్వు వెన్నెల సముద్రాన్ని మథిస్తే సూర్యుడు ఉద్భవించి అమృతాన్ని నీ చేతి కందివ్వడు. ఉన్న చంద్రుడే అద్వేగంగా విషం కక్కుతాడు. తాపాన్ని తామనపు బురదపైన మేడలా కట్టుకుంటే అది జ్యోర్లింగమైపోదు. నీటి నియమాల వైధవ్యంలో నిలబెట్టుకున్న ఆ కోర్కెల తేనెతుట్టె ముందు పుట్టవుతుంది అందులో పుట్టే ప్రతి ఆలోచనా బుసకొడుతూ నీ బ్రతుకు క్షేత్రాన్ని శ్యామలం చేసే హలంగా కాక హాలహలపై నీ పైన జ్వలాల్ని చిమ్ముకుంది. సరిగ్గా రాజసాన్ని సాత్వికత కాటేసిన ఈ క్షణంలోనే ఒక నాదం రవళిస్తుంది. అదే అసురవేదమై నీ బ్రతుకును శాసిస్తుంది."
* * * *
అర్దరాత్రి .....
కనిపించని ధాత్రికి సదూరంగా సముద్ర జలాలపైన తుఫాను ఉద్బతమైంది. నభోమండలం విరిగి నీటి మీద పడుతున్నట్టుగా ఫెళఫేళార్భటంతో సముద్ర చిన్నాభిన్నమై పోతూంది.
ప్రళయ ప్రభంజనపు హోరుతో ఉవ్వెత్తున పైకిలేచే కెరటాలు చీకటి మెరుపులా మధ్య మెరుపులై నౌక అంచును తాకి మరుక్షణం వెనక్కీ విరిగి పడుతున్నాయి.
ఆ కుడుపుకి ఓడ ఒరిగినట్టు కకావికలైన సిబ్బంది నౌకను అదుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు.
సుడిగాలి మరింత పెరిగింది.
పగులుతున్న రాత్రిలో చుట్టుముడుతున్న కెరటాలు మ్రుత్యుపద ఘట్టానలై వేగంగా ఓడని డీ కొడుతుంటే డెక్ పైకి పరుగెత్తుకొచ్చిన కెప్టెన్ చుట్టూ చూశాడు.
రేడియో కమ్యునికేషన్ సిస్టమ్ కి విఘత మెర్పడి చాలా సేపైంది. ఎటు చూసినా బుసకోడుతున్న నీటి అలలు .... క్షణక్షణానికీ ధైర్యాన్ని సడలిస్తున్న తుఫాను భీభత్సం. బడబాగ్ని శిఖల్లా పైకిలేస్తున్న కెరటాల హొరు .... ఆకాశపు ఒంపులు పాతాళానికి చొచ్చుకుపోయి ఒడ్డుకి కొన్నిమేళమైళ్ళ దూరంలో ఉన్న ఓడని చవబావుతున్న జీవాల మొరకి సరిహద్దుల్ని సూచిస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చిందేదో .....
సెల్లర్ లోకి పరుగెత్తబోతూ ఠక్కున ఆగిపోయాడు.
డెక్ పైనే మూల నిలబడిందామె. హనిత.
"మేడం."
"అప్పటికే నీటి తుంపరులకు తడిసిన ఆమె గడ్డకట్టిన నయాగారాలా లేదు. జీవన వాస్తవికతల హలాహాలాన్ని జీర్ణించుకుంటున్న నీళ్ళ మధ్య నిప్పులకుంపటిళా ఉంది.
"గో ఎవే .... మీ ప్రయత్నాల్లో మీ రుండ౦డి." ఒక శాసిమ్పులా అంది.
రెండు పదులు దాటినా ఆమె అక్కడో సామ్రాజ్యాన్ని శాశించగల యువతి అయినా ఇక్కడ అగాధమైన బాధలో కూరుకుపోయిన ఓ నిస్సహాయ ప్రాణి అక్కడెక్కడో ఆమె ఓ ప్రత్యూష మందారం ..... ఇక్కడ ఆరిపోతున్న అసంపూర్ణ కర్పూరం.
మేడం ! పరిస్థితి విషమిస్తూంది" ఏదో చెప్పబోయిన క్రూ కెప్టెన్ ఆమె చూపులకి అర్ధోక్తిలోనే ఆగిపోయాడు.
దాస్య మెరుగని లాస్యం ఆమె పెదవుల పైన.
దూరంగా ఓ పిడుగు మోత.
సముద్రయానంలో అపారమైన అనుభవమున్న కెప్టెన్ గుండె క్షణం ఆగింది. చుట్టూ భయానకంగా విరుచుకుపడే సాగర సమరాన్ని చూడలేనట్టు అందోళనగా ఇంజన్ రూమ్ వేపు దూసుకుపోయాడు.
హనిత నిశ్సబ్దంగా చూస్తూంది అలా నిలబడే.
ఆ స్థితిలో కూడా చెక్కుచెదరని నిశ్చలత్వం ఆమెలో .... నూరేళ్ళ సుదీర్ఘయానానికి విఘాతమేర్పడుతూందని ఆమెకీ తెలుస్తూంది . అయినా అదే లాలిత్వం.
హఠాత్తుగా తండ్రి గుర్తుకొచ్చారు.
అణువంత అలజడి.
రేకుని తొడిగిన మొగలి పువ్వులా రెప్ప అంచున ఓ నీటిబొట్టు నిలిచింది.
"డాడీ!"
దూరంగా భూతంలా దూసుకోస్తూందో కెరటం.
"అయిదు పదుల మీ యాత్రలో మీరు నిర్మించుకున్న చలువరాతి సామ్రాజ్యాన్ని నిన్న గాక మొన్న నా పరం చేస్తున్నానని మీరు నన్ను పరీక్షించాలనే అన్నారేమో కాని, నేను మీ కురుత్నిగా గెలవాలనే నిర్ణయించుకున్నను. ఆ విజయంతో మీ కనుకోనలల్లో నేనే ఒక ఆనంద భాష్యంగా చోటు చేసుకుందామనుకున్నాను. కానీ ఇదిగో .... అంధకార సముద్రపు ఒడ్డున ఉన్న మీకిచ్చిన మాట నిలువుకోకుండానే బ్రతుకు దగ్ధమైపోతూంది. కురిసే తొలి తొలకరి చినుకు బొట్టు నేలకు తాకకుండానే ఈ నెమలి రెక్క విరిగిపోతూంది ఎప్పుడన్నా నా కంటి నుంచి ఒక నీటిబావుత్తయినా రాల్చడం మీరు చూశారా డాడీ? కాని ఇప్పుడు నా కళ్ళూ వర్షిస్తున్నాయి. చుట్టూ పేరుకున్న భయానిక వాతావరణాన్ని చూసో, ముంచుకోస్తున్న మృత్యువుకి భయపడో కాదు. ఈ స్థితిలో కూడా నేనెంత నిబ్బరంగా ఉన్నదీ, మీరు చూసే అవకాశం లేకపోయినందుకు ! బ్రతకనని తెలుసు. కానీ ఇక్కడ కూడా మనదే అయిన ఈ ఓడ మునిగిపోటూ నాకు ణా మొండితనాన్ని గుర్తుచేస్తోంది. చుట్టూ సముద్రం కరళానృత్యం .... అయినా కోన ఊపిరిదాకా పోరాటం ... జీవితాన్ని మీ రిలాగే దిపైన్ చేసేవారుగా డాడీ?"
ఆమె నివేదన ఇంకా పూర్తికాలేదు. మేఘమంత ఎత్తులో కసిగా మీది కొచ్చిన ఓ కెరటం ఓడను గుద్దింది.
తూలి పడబోతూ రైలింగ్ ని పట్టుకుందామె బలంగా.
ఉప్పు నీటితో తడిసిన ఆమె దేహం మృత్యువు కనురెప్పలమాటున మెరుపు వీణగా మారింది.
మరో పక్కనుంచి ఇంకో కెరటం ఓ పెద్ద పర్వతంలా .....
మెరుపు వెలుగులో కడలి మొత్తం కదిలి గాలి తోడుగా ఓడని చుట్టుముట్టింది.
నౌక ఒరిగిపోతూంది.
జలధి గర్భాంతరిక బడబాగ్ని తాకినట్టు తుఫాను హొరులో కలసిపోతున్న మావాకారాలు ....
విరుగుతున్న శేషాఫణిలా ఫెటేల్మన్న చప్పుడు.
దద్దరిల్లే మాత్రుహృదయ రోదనలా ఖరాళ్ మన్న పిశాచగణ ఘీంకారం .....