ఫోన్ పెట్టేయ్యకు అయన అంతరంగాన్ని గుర్తించినట్టుగా అన్నారు అవతల నుంచి "నిజం నీకు తేలేదుకానీ నీ కొడుకు ఓ అమ్మాయితో పార్కులో కలుస్తున్నాడు-
"కులకనీ! తప్పేం? అది కులుకే వయస్సేగా! నాలాతివాడు యీ వయస్సులో కులికితే అది తప్పు- అవమానం అయినా నకు తెలీక అడుగుతాను. సినిమాల్లో కులికితే నవ్వుతారు_ సంతోషిస్తారు. నవలలో కులికితే చదివి ఆనందించి తృప్తి పడతారు, మరి అదే నిజజీవితంలో జరిగితే ఓర్చుకోలేరేందుకు? అది ఈర్ష్యనా? అసూయనా? లేక వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదని ఏడుపా?
అవతల నుంచి మృదువుగా నవ్వినశబ్దం.
"దట్సాల్ అంతేనా? ఇంకేమయిన వుందా ?"
"ఇప్పుడే అసలైన వుశయం వుంది_ నీవు నీ కొడుకుని హెచ్చరించాలి , ఆ అమ్మాయితో తిరగొద్దని చెప్పాలి!
ఏం ఎందుకు? ఆమె దేవతా స్త్రీ.
అయితే దేవలోకంలో వుండక యీ భూలోకానికి కెందుకు రావాలి! వచ్చిన మా ముఖానికి అబ్బాయి వెంట పడాలి?
మూర్ఖుఢా! కస్సుబుస్సు మన్నట్టుగా వినిపించింది టెలిఫోన్ గుండా ఏదో వేడిగాలి ముఖ్నికి సోకినట్టు అయిఉంది ఘాటైన వాసన పీల్చిన అనుభూతి
ధర్మరాజుకి కళ్ళు తిరిగినటైంది
మూర్ఖుఢా! దేవతలతో హేళన పనికిరాదు- అనుభవించు
ఏదో విషవాయువు_
గుండెల్లోకి ఆ విషవాయువు చొచ్చుకుపోతున్న బాధ
గుండెల్ని పిండేసినంత బాధ
ధర్మరాజు చేతిలో కప్పు జారిపడి ముక్కలైంది కాఫీ తివాసీ మీద వొలికింది
మరో చేతిలో ఫోన్ జారిపోయి వేలాడసాగిందిఅలాగే
ఎవరితో మాటాడుతున్నారు?
అంతసేపు భర్తతో మాతాడుతున్న దేవరా అని అలోచిస్తొన్న అరుంధతి ప్రశ్నిస్తూ వచ్చింది
ధర్మరాజుగారు జావాబువ్వలేదు భర్త కూచున్న తీరులో ఏదో అసహజత్వం కనిపించి ముందు కొచ్చింది అరుంధతి
ఆమె చూసే సరికి_
స్పృహలో లేదు ధర్మరాజు. కళ్ళు మూతలు పడ్డాయి నోటిగుండా నురుగులు వస్తున్నాయి. ఉచ్చ్వాస నిశ్వాసాలు చాల బరువుగా వస్తున్నాయి ఆవేశమో అన్నతుఉగా ఛాతీ ఎగిరేగిరి పడుతుంది.
"ఏమండీ!" ఆదుర్దాగా పిలిచింది భర్తని. కొద్ద్దిగా కదిపింది అతన్ని
అయినా ఆయనకి స్ప్రుహారాలేదు
భర్త ఎవరితోనో మాట్లాడారు
వాళ్ళేం మాటాడేరు?
అంతగా ఆవేశం వచ్చి బి.పి పెరిగిపోయెంతగా చప్పున విషయం ఏమిటి?
ఫోన్ వైపు ఏ ప్రయత్నంగా చూసిందామె.
అది నిర్జీవంలాగా వేలాడుతోంది
అయితే రెస్ట్ పై పెట్టేశక్తి కూడా లేకపోయిందన్నమాట అనుకుంది.
అరుంధతి చాలా ధైర్యవంతురాలు. భర్తకు ఏ ప్రమాదం లేదని, అయన బి.పి రేయిజ్ కావడంతో బహుశా స్ప్రుహాతప్పి వుంటారని అనుకుంది.
అంచేత గాబరా పడకుండా తమ ఫామీలి డాక్టర్ గారికి ఫోన్ చేసింది.
అదృష్టశత్తూ డా..దేవనాథ్ అప్పుడే క్లినిక్ కి బయల్దేరుతున్నారు అంతదాకా ఇంటివద్దకు వచ్చిన ఖరీధయైన పేషెంట్ కి ట్రీట్ చేసి క్లినిక్ కి బయల్దేరుతున్నారాయన. సరైన సమయానికి ఫోన్ వెళ్ళింది. క్లినిక్ కి వెళితే మరికొంత ఆలస్యం అయ్యేది.
ఫోన్లో అరుంధతిగారు ధర్మారాజుగారు స్ప్రుతి కోల్పోయిన విషయం చెప్పగానే తను బయల్దేరి వస్తున్నాడని చెప్పాడు అయన.
ఫోన్ క్రేడిల్ చేసింది అరుంధతి
డాక్టరుగారు రావాటానికి కనీసం పది-పదిహేను నిముషాలు పడుతుంది అందాకా ఏం చేయాలి?
ఆమె చప్పున వంటిట్లోకి వెళ్ళి ఫ్రిజ్ లోని చల్లని నీళ్ళు తీసుకుని వచ్చి భర్త ముఖాన చల్లింది. కూలర్ రేంజ్ పెంచి గాలి అయన ముఖాన్ని సోకేలాచేసింది.
అయినా ఆయనకి స్పృహరాలేదు.
డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి స్మేలింగ్ సాల్ట్ తెచ్చి వాసన చూపించింది. ఆ ఘాటుకి అయన తిప్పుకున్నాడే తప్ప కళ్ళు తేరవలేదు ఊపిరి తీసుకోవడంలో మార్పులేదు_
అప్పుడామేకి కొద్దిగా భయం వేసింది.
భర్త మాములుగా వేసుకునే మాత్రలు తెచ్చింది బిగునుకపోయిన పళ్వీని తెరిచిమాత్రలు వేసింది. అవి గొంతు దిగలేదు. కానీ బయటకి రాకుండా పెదాలు మూసింది ఆమె
అప్పుడోచ్చాడు డాక్టర్ - దేవదాథ్
అయన వచ్చీరాగానే ధర్మరాజుని చులగా ఎట్టి మంచంపై పడుకోబెట్టారు. చాతీమీద షర్ట్ గుండీలు వాదులు చేశారు. అర్టిపిషియాల్ రేస్పి రేషన్ కలిగించాయి. స్టిట్ తో పరీక్షించారు.బి.పి చూశారు.
ఇంజెక్షన్ చేశారు.
"ఏదో విషవాయువు పీల్చాడు" అన్నారాయన
'విశావాయువా?' ఆశ్చర్యంగా అడిగింది అరుంధతి
'అవునమ్మా! ఇవి పాయిజన్ లక్షణాలు. విషం తింటే యీ లక్షణాలు వస్తాయి, లేదా మహా విషాన్ని కరిగిస్తే అది ఆవిర్లు అవిర్లుగా వెలువడుతుంటే పీలిస్తే ఇలా అవుతుంది' నింపాదిగా అన్నారాయన.
"విషమా?" ఆశ్చర్యంగా అడిగిందామె
'అవును కాలకూట విషంతో సమానమైంది!' ఏదో ఆలోచిస్తూ అన్నారు. "రేపటిదాకా స్పృహ రాకపోవచ్చు. వచ్చినా తెరలు తెరలుగా స్మృతీపోతూనే వుంటుంది, ఒకటి రెండు రోజులకి బాగా స్పృహవచ్చినా మెదడు సరైన స్థితిలో వుండకపోవచ్చు. ఒక్కక్షణం అగేడు. 'ఇదంతా ఊహే ఏవీ జరక్కుండా మామూలు మనిషిలాగా వుండచ్చు కూడా అన్నాడు.