Previous Page Next Page 
కాలనాగు పేజి 4

    మేరు పర్వత స్థెయిర్యంగా వుంటుంది  అరుంధతి. కానీ ఆమె ఆ మాటలు వినగానే భయపడిపోయింది.... అన్నగారూ! అంది బెంబేలు పడిపోతూ....

    "భయపదకమ్మా!" అన్నాడు స్థిరంగా "వైధ్యం చేద్దాం. బాగుచేస్తాను నేను_" అన్నాడు దైర్యం చెబుతూ.

    "అదికాదు అన్నయ్యగారూ! ఎందుకిలా జరిగింది? విశాగాలులు ఎలాపీల్చారు? ఎక్కడ? అప్పుడే నేను  కాఫీ యిచ్చి వెళ్ళాను.లోపలకి వెళుతూ వుంటే ఫోన్ మ్రోగింది. కాస్సేపాగి నేను వచ్చేసరికి యిలా వున్నారు_"

    ఆలోచనల్లో పడ్డారు డాక్టరు దేవనాథ్

    "ఆదిత్య ఎక్కడ?"

    "మామూలుగా సాయంకాలం బయటకి వెళ్ళాడు. రావాలి... ఓ నిమషంలోనో_ అర నిమషంలోన-'
 
    " ఈ రాత్రంతా జాగ్రత్తగా వుండాలి?"

    అనే ముఖంలో భయం కన్పించింది.

    "ఏం ప్రమాదం లేదు. కానీ ఈ విషవాయువు అయన ఎలా పీల్చోడో_ ఏమో_ మళ్ళీ అది జరక్కుండా చూడాలి ఎవరో ఫీల్చోలా చేసివుంటే_మనం జాగ్రత్తగా వుండాలి_"

    ఏవో తెలియని వింత భయాలు

    మరేదో తెలియని విషహస్త విన్యాసాలు

    ఎక్కడో కనిపించని హస్తం ఆడించే వింత నాటకం!

    అరుంధతి ఆలోచనలో పడిపోయింది

    మరోసారి ధర్మారాజుని పరీక్షచేసి, జాగ్రత్తలు చెప్పి, భయం పోగొట్టి వెళ్ళిపోయాడు దేవనాథ్.
   
   
                                                                          3


    ఆదిత్య నుంచి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళింది సంధ్య.

    ఆమె యిల్లు చేరుకునే వేళకి ఇల్లంతా భీభత్సంగా వుంది.

    కనకదుర్గమ్మగారికి మళ్ళీ పూనకం వచ్చింది. విశ్వేశ్వరంగారు తన ధోరణిలో వున్నారు. భార్య దగ్గర కూర్చుని నాగాష్టకం చదువు చదువుతున్నారు బిగ్గరాగా.

    అ ప్రయత్నంగా వచ్చిన శ్లోకాలు అవి

    చిత్రం! విశ్వేశ్వరంగారు కవికాదు. పండితుడు కాదు అయన సంస్కృతం చదువుకోలేదు. తెలుగు అంతంత మాత్రమే అయన డిగ్రీ చేసింది ఇంగ్లీష్ మీడియంలో! కానీ అయన స్మస్కృత వచనాలు పఠిస్తున్నది ఆమె ఆడపడుచు విశాలాక్షి.

    విశాలాక్షి విశ్వేశ్వరంగ్రి చెల్లెలు. ఆమె అవివాహిత. సాక్షాత్తూ స్రీ నాగేంద్ర స్వామికి తన యవ్వనాన్ని, జీవితాన్ని అర్పించి కన్యగా మిగిలింది గణాచారి అయింది.

    అది ఆ యింటి సంప్రదాయం

    ఆ యింత వెలసిన తొలి స్రీ సంతానాన్ని దైవదత్తంగా, దైవ చిహ్నంగా, స్వామి సేవకు అర్పించటం ఆనవాయితీ.

    అ ముత్తెదువ స్రీ సుబ్రహ్మాణ్యెశ్వరిస్వామి వారికి ఇల్లాళ్ళు. దేవదాసిగా కాకుండా దేవదూతగా భూత భావిష్యద్వార్తమానాలు చెబుతూ ఆ యింటిని, ఆ వూరిని కాపాడుతూ వుంటారు ఆ గుణచార్లు.

    ఇపుడు వరస ప్రకారం, జన్మ ప్రకారం 'సంధ్య' గణాచారి కావాలి. కానీ మొట్టమొదటి యీ సంప్రదాయాన్ని కాదన్నది విశ్వేశ్వరంగారు. అయన భార్య కనకదుర్గంమగారు. అపుడు యిద్దరికీ తమ కూతురు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, యియుడు జోడైన  యువకుడిని పెళ్లాడాలని ఆశ పుట్టింది. కనక దుర్గ మాటల్ని మన్నించాడు విశ్వేశ్వరం.

    కూతురు సంధ్య అని నామకరణం చేశారు

    అయిదో ఏట అక్షభ్యాసం చేశారు

    ఆ రోజే విశాలాక్షి విరుచుక పడిపోయింది. ఆమె నోటంట సాక్షాత్తూ శ్రీ  కార్తికేయస్వామి సంధ్య భవిషత్తు పలికించాడు. ఈమెకి చదువు వద్దు. యుగాయుగాలుగా ఈ ప్రపంచభారం నాది. ఈ ప్రపంచ రక్షణ నాది.నేను వేయి శిరస్సులతో మిమ్ము రక్షిస్తున్నాను. ఈ కన్య నా ప్రతినిధి జన్మతోనే అన్ని విద్యలూ_ సంప్రదాయాలు ఈమేకి కరతలమలకం. న భక్తీ వీరికి విద్య_ నామహిమలు వీళ్ళ ఆచారాలు, అదే వీళ్ళ సంప్రదాయం.

    అలాటిది యిప్పుడు గది తప్పించుకండి. అలాటి యిఇమేకి యీ ప్రాపంచక లస్ఖనలు మప్పి సంప్రాదాయన్ని నాశనం చేయకండి.

    'మీరు నాశనమై దేశాన్ని నశింప చేయకండి'   
  
    దేవుడి ప్రతినిధిగా నమ్మే విశాలాక్షి మాటలు విశ్వేశ్వరం విశ్వసించ లేదు. అంతదాకా అన్నేళ్ళూ ఆమె 'వాక్కుని' అనుసరించిన అతను కూతురి విషయంలో లెక్కచెయ్యలేదు.

    "అదేమిటి యీ మూఢాచారం? చదువులేకుండా వుంచాలా? దేవుని వరంలో జన్మిస్తే చదువు అక్కర్లేదా? నేను విశాలాక్షి విషయంలోనే నాన్నకి చెప్పాను_వద్దన్నాను.కానీ ఆయన  వినలేదు.

    చెల్లెలి విషయంలో నాకు స్వాతంత్ర్యం లేదు. కానీ నా బిడ్డ భవిష్యత్తు నాది. ఆమె బాగోగులు చూసే బాధ్యత నాది. ఆమె మంచి చెడ్డలు నావి.నేనెవరి మాటా వినను. నన్ను బలవంతం చేయకండి" అన్నాడు.

    అక్షరాభ్యాసం జరిగింది

    పాఠశాలకి వెళ్ళేది సంధ్య

    వేషధారణ, వస్త్రధారణ, కేశసంస్కరణలోనూ విశాలాక్షి "అన్న"తో విభేదించేది. కానీ ఆయన లెక్కచేయలేదు

    అయితే సంధ్యని గురించి వాదోపవాదాలు జరిగినపుడల్లా విశాలాక్షికి పూనకం వచ్చేది.

    స్వామి "ఆమె" నోటిద్వారా ఏవేవో చెప్పేవాడు

    ఆ కుటుంబానికి దాఖలాగా ఆ చెడు జరిగేది

    అయినా విశ్వేశ్వరం తన పట్టు విడలేదు

    ఆఖరికి_

    సంధ్య వ్యక్తురాలైంది. మన్మధుడు ఆమె శరీరంపై దండయాత్రకి విచ్చేసి జయించి, కోటని కొల్లగొట్టి, గిరిశృంగాలని నిర్మించి, తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.

 Previous Page Next Page