Previous Page Next Page 
మహావృక్షం పేజి 14

ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ దేబ్బలాడుకుని రోజు వుండేది కాదు. చెల్లి వాళ్ళ దెబ్బలాట వినకూడదని నేను అస్తమానం  టీవి పెద్దగా పెట్టి వుంచేదాన్ని. అలా అలా చదువు మీద శ్రద్ద తగ్గి, టీవిమీద ధ్యాస పెరిగింది నాకు. నెమ్మదిగా టీవి ప్రభావం నామీద పడడం మొదలు పెట్టింది. రక రకాల సీరియల్స్ చూస్తూ నన్ను నేను హిరోయిన్ గా ఊహించుకుంటూ వుండేదాన్ని.
అప్పుడు మాఅమ్మకి కొత్తగా పరిచయం అయ్యాడు. వామనమూర్తి. మాఇంటికి వస్తూ పోతూ వుండేవాడు. అమ్మ, వామనమూర్తి చాలా చనువుగా వుండేవాళ్ళు. అమ్మకి,  మాకూ మంచి మంచి  బహుమతులు, బట్టలు కొనిస్తుండేవాడు.
నాన్నగారు మాత్రం వామనమూర్తితో మాట్లాడేవారు కాదు. ఆయన విషయంలో అమ్మ, నాన్న ఓసారి బాగా గొడవపడ్డారు. నాన్న అమ్మని కొట్టారు. తమ్ముడు, చెల్లాయి నిద్రపోయారు. కానీ నాకు నిద్రపట్టలేదు. అమ్మ బాగా ఏడ్చింది.
వాళ్ళ గదిలోంచి చాలా సేపు ఏడుపు వినిపిస్తూనే వుంది. చాలా సేపటకి నేను నిద్రపోయాను.
తెల్లవారి లేచేటప్పటికి అమ్మ ఇంట్లో లేదు. నాన్న, మేము ఇల్లంతా వెతికాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లన్నిటికి పోన్లు చేశాడు నాన్న. అమ్మ కనిపించలేదు. గంటలు, రోజులు గడిచాయి. అమ్మ తిరిగిరాలేదు. ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియలేదు.
నాన్న తమ్ముడ్ని, చెల్లాయిని మద్రాసు తీసికెళ్ళి, స్కూల్లో చేర్పించి, హాస్టల్లో వుంచేసి వచ్చారు. న్వ్నూ, నాన్నా వుండేవాళ్ళం. అమ్మని వామనము తీసికెళ్లాడని నాన్న అంటుండేవారు. నిజమే అనుకున్నాను. కానీ, ఓ రోజు వామనమూర్తి హటాత్తుగా మాఇంటికి వచ్చి మా అమ్మని హైదరాబాదులో చూశానని చెప్పాడు.
నానా అతని మాటలు నమ్మలేదు, అమ్మ ఒకసారి తనని కాదని వెళ్ళిపోయాక మళ్ళీ ఇంటికి రానవసరం లేదని చెప్పారు. కానీ నాకు మాత్రం అమ్మని చూడాలని చాలా అనిపించింది. నాన్నకి తెలీకుండా ఒకసారి వామనమూర్తి ఇంటికి వెళ్ళి నన్ను హైదరాబాద్ తీసికెళ్ళమని అడిగాను.
 ఆ క్షణంలో ఆయన కళ్ళలో కనిపించిన వెలుగు ఈ రోజూ మర్చిపోలేను. అంతగా ఆయన కళ్ళు వెలిగిపోవడానికి కారణం ఏమిటో నేను ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చాకకానీ తెలియలేదు. రైలు దిగగానే నన్ను తన స్నేహితురాలని చెప్పి, ఒకామె ఇంటికి తీసికెళ్ళాడు. ఒక అపార్ట్ మెంటులో నాలుగో అంతస్టులో వుండేది ఆమె. నేనక్కడ నాలుగు రోజులు వున్నాను.
అమ్మ జాడ చెప్పేవాడు కాదు. రోజూ రాత్రిళ్ళు ఆమె ప్లాట్ కి ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు వస్తుండేవాళ్ళు. తెల్లవారాక వెళ్ళి పోయేవాళ్ళు. వెళ్ళేటప్పుడు అమేకి కొంత డబ్బిచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ డబ్బు వామనమూర్తి, ఆమె పంచుకునేవాళ్ళు. నాలుగురోజులు గడిచాక ఒకరోజు నేను గాఢంగా నిద్రపోతున్నాను .
చెప్పడం ఆపి, వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది నీరజ.
వింటోన్న అందరి గుండెలు బరువెక్కాయి. అనూష ఓదార్పుగా ఆమె తల నిమిరింది.
"ఎవరో ఒకతను వచ్చినా పక్కన పడుకున్నాడు. నా  వంటిమీద చేయివేయగానే నేను భయపడి లేచాను. అతను నన్ను లేవనీయకుండా పట్టుకున్నాడు. చేయి కొరికి మంచం దిగాను. తీరా చూస్తే  తలుపు బయట నుంచి వేసివుంది. ఆ తరువాత అతను నన్ను"కన్నీళ్లు తుడుచుకుంది నీరజ.
"అప్పటినుంచి నన్ను రోజుకొక ప్లాట్ కి తీసికేళ్ళేవాళ్ళు ఆమె, వామనమూర్తి. కొన్నాళ్ళకి వామనమూర్తి వెళ్ళిపోయాడు. ఆమె నాతో బిజినెస్ చేయించింది. ఈలోగా నేను బలహీనంగా వున్నానని అబార్షన్ చేయించడానికి తీసికెళ్ళింది ఆమె. కానీ నేను బలహినంగా వున్నానని అబార్షన్ చేయమని చెప్పింది డాక్టరు.
ఓ రోజు వామనమూర్తి వచ్చాడు. ఆమె వామనమూర్తి చాలా సేపు చర్చించుకున్నారు.ఏం అనుకన్నారో మళ్ళీ అబార్షన్ సంగతి ఎత్తలేదు. ఆ తరువాత ఓసారి తెలిసింది మా అమ్మని కూడా వామనమూర్తి  తీసుకెళ్ళాడని. అమ్మ కూడా వేరే ఊళ్లో ఈ మేలాగే ఇలా సంపాదించి పెడుతోంది వామనమూర్తికని....
ఓరోజు పారిపోవడానికి ప్రయత్నించి పట్టుపడ్డాను. ఆ రోజు నన్ను బాగా కొట్టారెవరో ఇద్దరు మగవాళ్ళు. ఆమె అది చూసి నాకు వార్నింగ్ ఇచ్చింది ఇంకెప్పుడూ పారిపోవద్దని. నెలలు నిండిన నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ లో  అడ్మిట్ చేశాడు వామనమూర్తి.ఆ తరువాత ఏమయింది మీకు తెలుసు.
డాక్టరుగారు! నేను బతికివుంటే వామనముర్తి నన్ను వదిలి పెట్టాడు. నాకు చచ్చిపోవాలని వుంది. నిన్నరాత్రి ఆయన వచ్చాడని  మీరంతా మాట్లాడుకుంటుంటే మెలకువ వచ్చింది. నన్ను ఆయనకి అప్పగిస్తారని భయం వేసింది. అందుకే ఎలాగయినా పారిపోవాలనుకున్నాను. కానీ నిర్మానుష్యంగా వుండడంతో ఎలా వెళ్ళాలో అర్దంకాలేదు. మీరంతా వెతుకుతోంటే గబుక్కున ఆ తొట్టిలో దిగిపోయి కూర్చుండీపోయాను. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు."
"ఎంత పని చేశావు?నీకిష్టం లేకుండా ఎలా పంపిస్తామనుకున్నావు? అసలు అతనెవరో తెలుస్తుందని నిన్ను పిలిపించాను. పైగా నువ్వతని మేనకోడలివి కావని నాకు ఎలా తెలుస్తుంది? రుజువులడిగితే ఎక్కడినుంచి తేను?అందుకే ముందు నేను కూడా అతనిలాగే మంచిగా వుండి అసలు విషయం రాబట్టాలనుకున్నాను. పోనీలే జరిగిందేదో జరిగింది ఇంకెప్పుడు నువ్వు పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఆ వామనమూర్తి సంగతి మేము చూసుకుంటాం" అంది అనూష.
"యస్ కరక్ట్....వాడి సంగతి రేపిపాటికి చూస్తాను నువ్వేం భయపడకు"అంది వీణ.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
"అనూషా! వాడికి పోన్ చేసి, రేపు మీ ఇంటికి రమ్మని చెప్పు....నీరజని అప్పగిస్తామని చెప్పు" వీణ అంది.
"మేము వాడి దగ్గరకే బయలుదేరామని చెప్పారు మనవాళ్ళు ఇందాకే."
ఏం ఫరవాలేదు. కారు ట్రబుల్ ఇచ్చింది, అందుకే మా ఇంటికి వెళ్ళాం అని చెప్పు రేపు రమ్మను.

 

 Previous Page Next Page