అసిధార
___కురుమద్డాలి విజయలక్ష్మి
ఆ ఇంట్లో అందరి కోరికా ఒక్కటే. నూట పద్దానుగేళ్ళు వయసున్న రఘురామయ్య గారు బతకాలన్నదే ఆ కోరిక.
అరవై ఏళ్ళు జీవించటం చాలన్న సిద్ధాతం కొందరిదైతే. అరవై పై ఇరవై కోరుతారు మరికొందరు. ఓ ముసలాయనో. ఓ వృద్దురాలో వుంటే కోరుతారు మరికొందరు. ఓ ముసలాయనో, ఓ వృద్దురాలో వుంటే అదేదో పెద్ద దిక్కు అనుకోక ఎంత తొందరగా చస్తారా! వీళ్ళ పీడా ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూసేవాళ్ళే ఈ విశాల భారతదేశంలో నూటికి తొంభైతొమ్మిది ఇళ్ళల్లో జరుగుతున్న భాగవతం.
రఘురామయ్యగారి ఫ్యామిలీ విషయానికొస్తే __ ఆ ఇంట్లో అందరికీ కోపతాపాలు వున్నాయి. శౌర్య పరాక్రమాలు వున్నాయి. పిరికిపాలు వుంది. మొత్తానికి ఓ మనిషిలో ఎన్ని వుండాలో అన్నీ వున్నాయి. అయినా ఆ ఇంట్లో అంతా కలసికట్లు మనుషులు.
రఘురామయ్య గారి భార్య పార్వతమ్మ వయసు ఎనభై . హర్యా భర్తల మధ్య ముప్ఫైనాలుగేళ్ళు ఎడం వుంది.
పార్వతమ్మకు అయిదో ఏట వివాహం అయింది. రాత్రి ఒంటిగంటకి ముహూర్తం ఓ పక్క జలుబుచేసి పార్వతమ్మ ముక్కుల్లోంచి గంగా యమునలు జాలువారుతున్నాయి.
"ఇప్పుడు నిద్రోస్తున్నది మావయ్యని పొద్దున్నే పెళ్ళి చేసుకుంటాను పొండి." అంది నిద్దట్లో వున్న పార్వతమ్మ.
రఘురామయ్యగారు పార్వతమ్మ మెడలో తాళికట్టే ముందు తన భుజంమీదున్న ఉత్తరీయంతో ఆమె ముక్కు తుడిచాడు అది చూసి అందరూ "అబ్బో , అయ్యగారికి అప్పుడే పెళ్ళాం మీద ఎంత ప్రేమో ! అని పగలబడి నవ్వారు.
ఆనాటి పెళ్ళి ముచ్చటలు ఈనాటి వరకూ చెప్పుకుని నవ్వుకొని రోజులేదు ఆయింట్లో .
రఘురామయ్యగారు దేవతా పురుషిడిలా రాయిలా తనపని తాను చేసుకుంటూ వుంది పదిరోజుల క్రితం మంచం ఎక్కారు. ప్రస్తుత పరిస్థితి గంటా అరగంటా అన్నట్లు వుంది.
రఘురామయ్యగారి సీతారామ్ ఒక్కడే కొడుకు ముగ్గురమ్మాయిలు. సీతారాం కి వక్కడే కొడుకు , ఇద్దరమ్మాయిలు., ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావటం అత్తావారిళ్ళకి వెళ్ళటం జరిగింది.
రఘురామయ్యగారు మంచం ఎక్కారు. ఆయనపని ఇవాళా రేపా! అన్నట్లు వుందన్న కబురు విని కూతుళ్ళు అల్లుళ్ళు, మనుమరాళ్ళు వల్ల భర్తలు పిల్లా పీచుతో సహా వచ్చారు. వుంటున్నది సౌంతకొంప కాబట్టి తిండి గింజల లోటులేకుండా కొద్దిభూమి ఉండబట్టి ఎందరోచ్చినా అన్నవస్రాలకి లోటులేదు.
నూతపద్డానుగేళ్ళు బతకటం అంటే కోటి కోక్కడికి కో౦దా పట్టని అదృష్టం ఈ విషయంలో రఘురామయ్యగారు అదృష్టవంతుడే ఎనభై ఏళ్ళ పార్వతమ్మ గారు మాత్రం ఇంత వయసూ వచ్చిన నాకు ఈ రాట తప్పదా అని విలపిస్తున్నది. అది ఆమె దురదృష్టం.
రఘురామయ్యగారి చుట్టూ మూగి కూర్చున్నారు" ఇంట్లో అందరూ, వాళ్ళకి తోడు వూళ్ళో కొందరు.
రఘురామయ్యగారు నెమ్మదిగా కళ్ళు విప్పారు కొడుకు సీతారామ్ ఈ వార్త అందరికీ చెప్పాడు. అది వింటూనే అందరూ అయన కింకా ఆయ్యుషు౦దనుకున్నారు.
అందరి కళ్ళల్లో ఆనందబాష్పాలు నిలిచాయి.
రఘురామయ్యగారి గొంతు ముందు గరగారలాడింది. లోగోంతుకతో ఆయాసపడుతూ చెప్పారు కొడుకుతో "సీతరాముడూ! వీళ్ళందరినీ ఈ గదిలోంచి అవతలకి పంపు . విజ్జీనోకడినీ నా దగ్గర వుంచి నీవుకూడా అవతలికెళ్ళు వంటరిగా వాడితో నేనోమాట చెప్పాలి"
తండ్రిమాట అక్షరాలా శిరసావహించాడు సీతారామ్.
విజ్జీ పూర్తీ పేరు విజయరామ తారక్. అయిమ్తి ఆనవాయితీ కావచ్చు ఆచారం కావచ్చు రామనామ శబ్దం ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరులో చేర్చాల్సిందే. రఘురామయ్యగారి మనవడు. సీతారామ్ కి ఏ కైక పుత్రుడు విజ్జీ. అతగాడి వయసు ఇరవైమూడు . ప్రేయోగాలు చేయటం అతని హాబీ. అవి పలురకాల ప్రయోగాలు. ఒక వస్తువుని పాడుచేయటం రిపేరు చేయటం మొదలు అరిసెలు ఆవకాయలో నంజుకుంటే ఆ రిషి ఎలా వుంటుంది. లాంటి ప్రయోగాలు కూడా చేసి __ ఏ రుచికా రుచి అని తీర్పు ఇచ్చేసేవాడు. ఇదంతా చూసి సీతారామ్ తన కొడుకు ఇంజనీర్ అయితే బాగుంటుందన్న కోరిక పెంచుకున్నాడు.
ఏమాట కామాటే తండ్రి కోరిక నెరవేర్చటానికి విజ్జీ ఇంటర్ నుంచి అయిదుసార్లు ప్రయత్నించి వల్లకాక ఇంజనీర్ కోర్స్ ఓడబ్బా కోర్సు కనుక చదవను పోమ్మన్నాడు బియస్సీ పాస్ అయి రెండేళ్ళు అయింది. అత్తెసరు మార్కులు రావటంతో ఏమ్మేసీలో ఎవరూ సీటు యివ్వలేదు. ప్రస్తుతం ఇంట్లో గోళ్ళు కొరుక్కుంటూ గోళ్ళు కోరుక్కోవటంలో మేలకవులు నేర్చుకుంటూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు.
ఆ యింట్లో తాతామనవళ్ళ ప్రేమ అపూర్వం అద్భుతం తాతాగారు పోక తప్పదా అని విచారిస్తూ గోళ్ళు కొరుక్కుంటూ తనగదిలో కూర్చున్నాడు విజ్జీ.
కొడుకు ఇంజనీర్ కాలేదన్న కోపం సీతారామ్ కి వుంది. నేనూ పెద్ద చదువులు చదవలేకపోయాను. వీడైనా చదివి గొప్ప పేరు సంపాదిస్తాదనుకుంటే ముష్టి పెట్టని బియస్సేతో మూలాన కూర్చున్నాడు. మరోసారి ఇదేమాట అనుకుని విజ్జీ గదిలోకి వచ్చి తన తండ్రి పిలిచినా విషయం చెప్పి తానూ అక్కడే కూర్చుండిపోయాడు.
విజ్జి ఒక్కగంలో తన గదిలోంచి బైటికి దూకి మరో నాలుగు అంగాలు వేసి తాతగారి గదిలో ప్రవేశించి తలుపులు లోపల గడియవేశాడు.
రఘురామయ్యగారి మంచమీద కూర్చుని కాస్తవంగి అయన ముఖంలోకి చూస్తూ "తాతగారూ" అన్నాడు విజ్జి.
రఘురామయ్యగారి ముఖం ఆనందంతో వికసించింది. "వచ్చావా నన్న!" అన్నాడు దగ్గుత్తికతో .
రఘురామయ్యగారు ఇంట్లో అందరూ పిలిచేటట్లు విజ్జీ ఆనిగాని బైటవాళ్ళు పిలిచేటట్లు "విజట్"! అనిగాని మనవణ్ణి ఎప్పుడూ పిలవలేదు. తన తండ్రి రూపం పుణికి పుచ్చుకు పుట్టాడని "నాన్నా" అనే ముద్దుగా పిలిచేవారు.
తాతా మనవళ్ళ అనురాగం ఆప్యాయత అపురూపం అద్భుతం రఘురామయ్యగారికి ఇన్నేళ్ళు వచ్చినా గడ్డం వుంది. గడ్డముతలకట్టు వత్తైన జులపాల జుట్టుఉండి దానిని మురీవేసుకునేవారు. మూరెడు గడ్డం వుంది.గడ్డము తలకట్టు వత్తైనకనుబొమ్మలతోసహా పండితెల్లగా అజుట్టు మెరిసిపోతూవుంటుంది."
తరుచు వారిరువురు మధ్య సంబాషణ ఈ విధంగా సాగేది.
"ఇప్పేడే౦పరిశోధన చేస్తున్నారా నాన్నా!"
"తాతగారూ ! కొత్తరకం పరిశోధన చేద్దామని రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాను, నూటపద్హానాలుగు ఏళ్ళు జీవించటం అపూర్వమైన విషయం. మన తాతలనుంచి చూస్తే అంతా దాదాపు వంద ఏళ్ళు జీవించినవాళ్ళే. మీరైతే శతదినోత్సవం దాటి రజితోత్సవం చేసుకోబోతున్న ఆ పూర్వ చిత్రంలా నాకన్నా ఆరోగ్యంగా వున్నారు. అలా వుండాలన్నదే నా కోరిక . నా మరో కోరిక ........"
"అగావేం చెప్పరానన్నా!"
"ఈ లెక్కన చూస్తే నా అయుష్హు గట్టిదే సూపర్ తిండి తింటున్నా గాబట్టి బలంగానే వున్నాననుకుంటు౦న్నాను. ప్రస్తుతం నా తల పడిందాకా ఆలోచించి ఓ కొత్త విషయం కనిపెడతాను నెరసిన వెంట్రుకలని వెండి జుట్టు అంటారు. కాశీమజలీ కధలల్లో ఓ కధలో రాజకుమారికి బంగారపు జుట్టునైతే బంగారంగా మార్చటం చేయాలనీ ఆలోచించి సరికొత్త పరిశోధనకి పూనుకుంటున్నాను. ముందుగా మా తాతగారి కురులని వెండిగా మార్చి దానితో ఓ వెండి కంచం చేయించుకుంటాను."
"ఓరి ఓరి ....... నీ అసాధ్యం కూలా మాన్నాన్న అంటే ఏమిటో అనుకున్నా గాని మాటల్లో ఇంత అఖండుడిననుకోలేదురా నాన్నా!" అని తన అనందం అంతా వ్యక్తం చేస్తూ నవ్వేవారు రఘురామయ్య గారు.
"తాతగారూ! నవ్వండి నవ్వండి. నవ్వినా నాపచెను పండిందని సామెతుంది గుర్తుందా. మీ పండిన జుట్టునే వెండిగా మార్చలేక పొతే"
"పేరు మార్చుకుంటావా!"
"వుహూ, నేగేడ్డం పెంచుకుంటాను. అరవై ఏళ్ళు దాటింతరువాత"
ఈమాట వినంగానే అయన మరోసారి మురిసిపోతూ నవ్వితే ఆయనకి వంతగా విజయ్ నవ్వేవాడు.