Previous Page Next Page 
అసిధార పేజి 2

  

  "ఇద్దరి కిద్దరే సరిపోయింది, వాడిని కోప్పడి ఏ ఇమ్జనీరులో కావటానికి ప్రోత్సహించక వాడి తిక్క మాటలకి మీవంతు పాటోకటా!" అంటూ సీతారామ్ విసుక్కునే వాడు.

    పసిపిల్లల మనస్తత్వంతో స్నేహితుల్లా కలసి మెలసి మాట్లాడుకునే తాతా మనవళ్ళు ఇప్పుడు ఒంటరిగా కలుసుకున్నారు.

    "చెప్పండి తాతగారూ" ఎందుకు పిలిచారు.?" ఆయనేం చెప్పినా చేసేవాడిలా వినయంగా స్థిర నిశ్చయంతో అడిగాడు విజయ్.

    "నేనొకటి చెపుతాను నమ్ముతావురా నాన్నా!"

    "మీరేంచెప్పినా నమ్ముతాను మీరేం చేయమన్నా చేస్తాను. చెప్పండి తాతగారూ ! చంద్రమండలం వెళ్ళమంటారా ! ఏగ్రహం లోనయినా మానవులకి పోలిన మనుషులంటే ఆ గ్రహంలోకి వెళ్ళి వాళ్ళపిల్లని ఎత్తుకు రమ్మంటారా?" ఎప్పటికా నవ్వుతూ అడిగాడు విజయ్.

    "రఘురామయ్యగారి కళ్ళు మెరిసి అంతలోనే పర్దుకని ఆ స్థానంలో నిరాశ దోబూచులాడింది.

    తాతగారు ఎం చెప్పాబోతున్నారో అన్నట్లు మౌనం వహించాడు విజయ్.

    "కుక్క మూతిగాళ్ళ గురించి ఎప్పుడైయిన విన్నావురానాన్నా!"

    ఆ ప్రశ్న వింటూనే వులుక్కి పడ్డాడు విజయ్ మరణం ఆసన్న మౌతుంటే మతి చెలించి అకటా వికటం మాటలు మాట్లాడటం లేదుకదా! అనుకున్నాడు. ముఖంలో ఏ భావం వ్యక్తం చేయకుండా "వినలేదు తాతగారూ!" అంటూ తాపీగా పలికాడు.

    "ఇప్పుడు వినబోతున్నావు. అంతేకాదు. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. జాగ్రత్తగావిని అర్ధం చేసుకో మృత్యువు తనహస్తాల చాచి రరమ్మ౦టున్నది. నామనసులోమాట చెప్పక పొతే శాంతి వుండడు అందు....."

    "తాతగారూ ! అదేదో తర్వాత చెప్పొచ్చు . మీరు మాట్లాడటూఅయాసపడుతున్నారు" విజయ్ అడ్డుతగిలాడు.

    "హ్హూ .... ఈ ఆయాసం గీయాసం నన్నేం చేయరేవురా నాన్నా! నామాటలకి అడ్డురాక నేచేప్పేది విను. మన దేశంలో స్వార్ధపరులు ఎక్కువ ఇది ఈనాటి సంగతి కాదు గత చరిత్రల్లో గతయుగాల్లో ఎక్కడ చూసినా స్వార్ధపరులు కాసవస్తారు.  మనం ఏదైనా కొత్తది కనిపెట్టం అనుకో. దానిని మన పిల్లలకి చెప్పం పది మందికి . కనీసం అన్నీ తెలిసిన ఓ పెద్దవాడికీ చెప్పం. కొత్తది కనిపెట్టామనే గర్వం. అది తనతోనే అంతం కావాలనే స్వార్దం . మన భారతీయులు ఎలా పైకి వస్తారు. చెప్పరా నాన్నా!

    అదే ఇతర దేశాలవాళ్ళ సంగతి చూడు లెక్కలేనన్నీ , రేడియో కనిపెట్టింది. మాదేశంవాడు. ట్రైను కనిపెట్టింది మావాడు. కరెంటు కనిపెట్టింది మావాడు. కార్లు విమానాలు చంద్రమండలంలో కాలు పెట్టడం అన్నీ మేమే దేశం అంతామేమే అని వాళ్ళు చెప్పుకుంటుంటే నోరు తెరచుకు వినటం మనవంతు. భారతీయుల్లో దమ్ములేదా! భారతీయులు ఏమీ కనిపెట్టాలేదా!   

    "కనిపెట్టకేం తాతగారూ! ఆవకాయ ఎలా తయారు చేయాలో. గుంటూరు గోంగూర పచ్చడి ఏడాది నిలవ వుండాలంటే ఎం చేయాలో అబ్బో చాలా కనిపెట్టారు."

    "అవును అని బాగానే కనిపెట్టారు." వ్యంగ్యంగా అని "అది కాదురా నాన్నా! కనిపెట్టడం అంటే చరిత్రలో నిల్చిపోయేది.అలాంటిది వక్కటిచెప్పు! వింతగా విడ్డూరంగా చెప్పుకునే విధంగా వుండాలి."

    "వింతలు విదూరాలూ కావాలంటే బోలెడు. మన సాటి మనుష్యులు స్వామీజీలు అమ్మాజీలు గుప్పెట మూసి తెరచి విబూది కుంకంసృష్టించగలరు. అంతేగాదు . ఖాళీ డబ్బాలోంచి చిల్లర సృష్టించటం, వేపాకు దూసి తేళ్ళు నిమ్మకాయ కోసి రసం పండితే ఆ రసం నెత్తురు రంగులో వుండటం ఇలా చెప్పెబడులు ఆ విచిత్రాలు గుప్పించి ఓ నవలే రాయవచ్చు."

    "నిజమే గారడీ టక్కుటమారు విద్యలు వచ్చు. వాళ్ళని వదిలెయ్యి. విషయానికొద్దాం మన రామాయణంలో పుష్పక విమానం వుందని. పరకాయ ప్రవేశ విద్య వుందని రాతిమీద మసిబూసి ఆ మసిలోకి చూస్తూ తన వాళ్ళనో . తనకి కావాల్సిందో తల్చుకుంటే మసి మీద కనిపించేడా దృశ్యం అనీ, నీటి మీద నడిచే వారు గాలిలో తేలేవారు, ఇక్కడ మాయా చెప్పులు తొడుక్కుంటే అక్కడ అమెరికాలో తెలవచ్చుననీ. ఈ కబుర్లురా నాన్నా మన వాళ్ళు చెప్పేది ఇవి పూర్తిగా కబుర్లు కాదని నిజం అని నిరూపించటానికి దాఖలా ఏది? ఒక్కటంటే ఒక్కటి చూపమను!

    రామాయణంలో వుంది. భారతంలో వుంది. కాశీమజలీ కధల్లో వుంది అని కాదురా చేసి పదుగురికి చూపాలి. ఆ అద్భుతం ప్రపంచానికి చాటాలి చటలేదు ఎందుకు? ఎందుకు? మన మంశిలో వున్న స్వార్దం మనం చాలా తెలివిగల వారం. ఎన్నో అద్భుతాలు చేసిన వారం, అయినా నిలువునా స్వార్దం జీర్ణించి పోవటం వల్ల మనం తనకు తెలిసింది తన పిల్లలకి కూడా చెప్పకుండా పోవటం వల్ల మనం వెనక బడి వున్నాం పరాయిదేశాలు ఎన్నో కొత్తపరికరాలు కనిపెట్టి వాటికి కస్టమర్లు పెట్టుకుని దేశ దేశాలకి పంపి చూపి వాళ్ళ ఘనత చాటు కుంటున్నారు..

    రఘురామయ్యగారు ఆవేశంగా చెప్పుకు పోతుంటే పదిరిజుల నుండి తిండీ తిప్పలూ లేక నీరసించి ఇప్పుడా! ఇంకాసేపా, అన్నట్లు వుంది ఈయేనేనా . అనిపించింది విజయ్ కి .

    "ఇప్పుడా ఆ విషయాలూ అన్ని ఎందుకు తాతగారూ !"   

    "ఒక ముఖ్యమైన విషయం మొదటిసారిగా నీతో చెప్పబోతూ నాందీగా ఇది చెప్పాను. అసలు విషయానికికోస్తాను. ముందు కాసిని మంచినీళ్ళు అందుకో."

    విజయ్ మంచినీళ్ళు తాతగారి నోటిలో కొద్దికొద్దిగా పోశాడు.

    "మనింట్లో సందూకాపెట్టే వుంది అది తెల్సుగా !"
   
    "అది తెలియక పోవటం ఏమిటి తాతగారూ! ఆ సందూకాపెట్టే మీ ఆరో ప్రాణం . దాని జోలకి ఎవరైనా వెళ్ళినా దానిమాట ఎత్తినా మీకు కోపం వచ్చేది.

    "అవునా, ఆ సందూకాపెట్టేలో బంగారు నగరం వుంది కుక్క మూతిగాళ్ళు వున్నారు......."

    రఘురామయ్యగారు చెప్పకు పోతున్నారు 'తాతగారు అయోమయంలోవుంది ఏదో ఏదో సంధి వాగుడు వాగుతున్నారు' విజయ్ అనుకున్నాడు.

    "నేచేప్పేది జాగ్రత్తగా వింటున్నావా?" రఘురామయ్యగారు హెచ్చరించారు. అప్పటికే మరో ఆలోచనలోవున్న విజయ్ కొన్ని మాటలు వినలేదు. ఆ మాటలే అతి ముఖ్యం అని విజయ్ కి ఏమాత్రం తట్టినా జాగ్రత్తగా వినేవాడే అ మాటలు వినకపోయినా "ఆ ..... ఆ .... వింటున్నాను చెప్పండి తాతగారూ !" అన్నాడు.

    ఆగకుండా మాట్లడ్డం వల్ల రఘుర్మయ్యగారికి కొద్దిగా ఎగస్వాసలక్షణాలు మొదలయ్యాయి. చెవిలోహొరు . కళ్ళు వుండి వుండి చీకట్లు కమ్మతం. ఇవి తనకి ఆఖరి క్షణాలు అని ఓ పక్క అర్ధమై పోతున్నది. మరోపక్క మనసులో మాట చెప్పకుండా పోతాననే దిగులు. చెప్పెయ్యాలి ఊరికే ఆరాటం మొదలై౦ది ఆయనలో.

    'తాతగారూ ! కాసేపు ఆగండి " విజయ్ సంధ్య చీకట్లు ముసురుకు వస్తున్నాయ్ . మనవాళ్ళు స్వార్దంపరులనిచెప్పా చూసు. ఆ కోవలోకి చెందినవాడినే నేనుకూడా. ఇదివరకే యీ విషయం నీకు చెప్పొచ్చు కదా! వుహు చెప్పలేదు. చెపితే నవ్వుతావేమోనన్న శంక. చేస్తావో లేదోనన్న అనుమానం. నామాట వెంటనే అమలులోపెట్టి నాకు దూరం అవుతానన్న భయం . ఇంకా వాడికి వయసు రాలేదన్న చింత. మొత్తానికి ఆ పరమ రహస్యాన్ని నా మనసు అట్టడుగు పోరలోను.. అధరాలు పండుకా పెట్టేలోను దాచాను. మీనాన్నకి చెపితే నవ్వి కొట్టిపారేశాడు. అదసలు మన వంశాచారంలే.

    నా తాతగారి తాతగారు అ నగరానికి వెళ్ళివచ్చారు. అయితే అ మనుషుల మధ్యకి వెళ్ళలేదు చాటుగా వుండి చూసవచ్చారు. మరోసారి వెళదామానుకుంటు౦డగా పొగరుమోతుఎద్దు డొక్కలో కుమ్మతం వల్ల మంచం ఎక్కారు. వారు మంచం ఎక్కింతరువాత తాటియాకుల మీద ఆ నగర విశేషాలు రాసి మంచం ఎక్కింతరువాత తాటియాకుల మీద ఆ నగర విశేషాలు రాసి కన్ను మూశారు. అయన కొడుకులకి ఇవేం పట్టలేదు కాపోతే వాటికి భద్రంగా దాచారు.

    ఆ తర్వాత అయన అనగా నా తాతగారు మంచి సాహాసి . రూపసి. అయన గతాన్ని వెలికిలాగి కొంత ముందుకు వెళ్ళగలిగాడు. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల వెళ్ళలేక ఆ యాత్రని కాగితాలమీద భద్రపరిచారు. నా తాతగారి కొడుకు అనగా మా నాన్నగారు మళ్ళీ ఏమీ పట్టించుకొని మనిషి కావటంవల్ల ఆ అద్భుతాలు సందూకా పెట్టె లోకి వెళ్ళాయి.  నా తరం వచ్చింది ఆ సందూకా పెట్టె నేను శోధించి కొన్ని నిజాలు తెల్సుకున్నాను ఇక్కడో విషయం చెప్పాలి నేను చాలాసార్లు గతంలో ఇల్లువిడిచి పారిపోయేవాడినని అందరికీ తెలిసిన విషయమే మీ బామ్మకూడ నీతో చెప్పి వుంటుంది.

    నేనెక్కడికీ పారిపోలేడురా నాన్నా! ఆ నగర శోధ చూద్దామని దాని మార్గం ఎటు, అసలు వెళ్లగలనా లేదా? నగరం వుందా లేదా? వుంటే బంగారుకాంతులీనే  ఆ బంగారు నగరాన్ని కళ్లారాచూసి యీ అద్భుతాన్ని ప్రపంచానికి చాటాలి. ఈ ఆకాంక్షతోనే వంటరిగా వెళ్ళే వాడివి మార్గంలో అవరోధాలు నన్ను భయపెట్టటంతో మళ్ళీ తిరిగి రావటం మళ్ళీ తగు జాగ్రత్తలో వెళ్ళటం . మళ్ళీ మళ్ళీ వెళ్ళటం రావటం దీనితో కాలం వ్యర్దం అయింది. ఆశ చల్లారి౦ది.

    ఈ వంశాచారం అనుకుంటాను. ఒకడు సాహాసి అద్భుతాలు చేయాలి చూడాలి సాధించాలి అన్న ఆకాంక్షగలవాడైతే అయన కొడుకు పిరికివాడు. స్వరం ఇల్లు __ ఇల్లాలు అనుకునేవాడుగా పుట్టారు. నా తాతతాతల నుంచీ ఇదే జరుగుతున్నది. మా తాతగారి సాహసం మా నాన్నగారిలో లేదు. నాలో వున్న సాహసం నా కొడుకు సీతారామ్ లో లేదు మళ్ళీ నా గుణాలు నీలో వున్నాయి . అందుకేరా నాన్న యీ సంగతులన్నీ నీతో చెబుతోంది.

 Previous Page Next Page