Read more!

Brahma and Vishnu's Birth

 

బ్రహ్మ, విష్ణుల ఆవిర్భావం

Brahma and Vishnu's Birth

 

నీలిరంగు మేను, సుందర వదనం, తామరపూవ్వుల్లాంటి నేత్రద్వయం, చతుర్భుజాలు కలిగి ఆయుధపాణియైన ఆ తేజోవంతుడు పరమేశ్వరుని ముందు నిలిచి నయనానందం కలిగించేలా ఉన్నాడు. మహేశ్వర సంకల్పంతోనే ఆ మహాపురుషుడు ఆవిర్భవించాడన్న మాట. అంతలోనే ఈ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపచేశాడు పరమశివుడు. వీరిద్దరి జంటా ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది. ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాల్ని, పట్టుపీతాంబరాలని ప్రసాదించాడు మహేశ్వరుడు. వాటిని ధరించిన ఈ తేజేవంతుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు. ఆ ఉత్తమ పురుషుని చూస్తూ మహేశుడు ఇలా అన్నాడు

 

''పీతవస్త్రాన్ని ధరించడంతో నిన్ను పీతాంబరధారుడని, మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడవని, విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని, అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురు షోత్తముడని వ్యవహరిస్తా ’’రని చెప్పాడు. ఇంతేకాదు.. ఇంకా అనేక పేర్లతో కూడా పూజింపబడతావు.. '‘నమశ్శి వా య'' పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండు... ముందుముందు నీవు అ త్యంత ప్రధా నపాత్ర వహిస్తా'' వని అక్కడి నుండి శివపార్వతులు అంతర్థానమైపోయారు.

 

మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోయాడు. ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపించింది. ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు, కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి, ''నీవు సకల జ్ఞానస్వరూపుడవు. అందులోనూ నీళ్ళలోనే ఉండేవాడివి కాబట్టి నీవు నారాయణుడిగా కీర్తింపబడతావు. నారము అంటే జ్ఞానమనీ, నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణుడనే నామం సార్థకం అవు తు౦ది’'' అంటూ అశరీరవాణి వినిపించింది.

 

దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాలలోని సారం కూడా అవగతమైంది. ఇక అప్పటినుంచి సృష్టిని ఎలా ఉద్భవింపచెయ్యాలి? ఇందుకు ఎవరెవరు అవసరం అవుతారు? ఇత్యాది విషయాల్ని ఆలోచిస్తూ నమశ్శివాయ మంత్రాన్ని తప్పక జపించసాగాడు. త్రిగుణాలైన సత్వ రజో స్తమోగుణాలు కలిగినదే ప్రకృతి. ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి. వీటివల్లే పంచన్మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం) పుడతాయి. వీటివల్ల పంచభూతాలు (భూమి. జలం, అగ్ని, వాయువు, ఆకాశం) ఉద్భవిస్తాయి. అలాగే, జ్ఞానేంద్రియాలు (త్వక్కు, చక్షు, శ్రోత్రం, జిహ్వ, ఆఘ్రణం), కర్మేంద్రియాలు (వాక్కు, పాణి, పాదం, వాయువు, ఉపస్థ), అంతఃకరణాలు (మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం) జనిస్తాయి.

 

ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని నాభిప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది. దాని మొదలు చివర ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుందా పుష్పం. ఆ పుష్పంపైనే బ్రహ్మ, సరస్వతులు ఆసీనులై ఉంటారు. బ్రహ్మదేవుడి శరీరం ఎరుపుకాంతిలో ఉంటుంది. తమోగుణ ప్రధానుడై ఉంటాడు. జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పద్మంపై ఉండడంతో కిందిభాగం కూడా కనిపించలేదు. దాంతో ఈయన పుట్టుకకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మ కళ్ళకు ద్యోతకం కాలేదు. అసలు తానెలా పుట్టింది తెలియక ఆ విషయమై సుదీర్ఘకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు.

 

ఇంకా ఉంది.....

 

shiva purana part 9, Brahma and Vishnu's Birth, brahma vishnu and maheswara in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics, shiv purana and salvation