Read more!

Narada and Vishnu Maya

 

నిజానిజాలు తెలుసుకున్న నారదుడు

Narada and Vishnu Maya

 

తనను వంచించిన విష్ణుమూర్తిని ఉద్దేశించి ''నాకింత ద్రోహం చేస్తావా? దేవుడవని నమ్మి వరం అడిగితే ఇంత మోసం చేస్తావా? నాలాంటి మహర్షిని మోసగించిన నీవు ఇంతకింత ఫలితం అనుభవించక మానవు. నన్ను ఏ విధంగా అయితే భార్యసుఖం నుంచి దూరం చేసేందుకు ప్రయ త్నించా వో నువ్వు కూడా అలానే భార్య ను విడిచి బాధపడతావు'' అంటూ శపించాడు నారదుడు. అంతేకాదు! ''నన్ను ఏ రూపంలోనైతే అక్కడ కనిపించేలా చేశావో ఆ వానరాలు, ఎలుగుబంట్ల సాయంతోనే మళ్ళీ నీ భార్యను కలిసి సుఖిస్తా వు అంటూ తన శాపానికి విమోచనం కూడా నారదుడే తెలియచేశాడు.

 

ఇదంతా విని కూడా మహావిష్ణువు ఆవేశపడలేదు. ఎంతో శాంతస్వరంతో ''నారదా! ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీవిప్పుడు వట్టి నారదుడివి కాదు. శివమాయ నిన్ను పూర్తిగా కమ్మేసింది. కాబట్టే ఎవరు ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నీ జ్ఞానమంతా నశించి మోహాంధకారంలో పడి వేగిపోతున్నావు. ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడం, ఆమెను మోహించడం జరిగింది. ఇప్పుడామె నీకు దక్కకుండా పోయిందన్న కోపంతో దానికి నేనే కారణమంటూ అకారణమైన నిందలు వేసి నన్ను శపించావు. అయినా నీమీద నాకు కోపం రావడం లేదు. నీ శాపాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను. త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి దుష్టసంహారం చేసేందు కు నీ శాపం నా కు వరం గా పరిణమిస్తుంది'' అన్నాడు.

 

విష్ణుమూర్తి శాంతస్వరాన్ని, చిద్విలాస రూపాన్ని చూసిన నారదునికి జ్ఞానోదయం అయింది. వెంటనే పశ్చాత్తాపం చెందిన నారదుడు ''వైకుంఠవాసా! పరంధామా!’’ అంటూ పాదాలపై పడిపోయాడు.

 

అప్పుడు విష్ణుమూర్తి, నారదుని తన మృదువైన హస్తాలతో మెల్లగా పైకి లేవ నెత్తి ''నారదా! శివమాయను జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పరమశివుడు ఎవ్వరికీ అందని మహిమాన్వితుడు. అలాంటి మహానుభావుని చులకనగా చూశావు. అందుకే అలా జరిగిం ది’ ’ అన్నాడు.

 

''నిజమే స్వామీ! నా తప్పులు మన్నించు. పావనమైన నీ పాదపద్మాలను ఎల్లవేళలా కొలిచే భాగ్యమిప్పించు ప్రభూ! నన్ను జీవన చదరంగంలో పావును కానీయకు పావనచరితా!!'' అంటూ దీనంగా ప్రార్థించాడు..'' అంటూ శివమాయ గొప్పతనం ఎంతటిదో నందీశ్వరుడు మార్కండేయునికి వివరించగా, ఈ విషయాన్ని శౌనకాది మహర్షులకు సూతపౌరాణికుడు తెలియచేశాడు.

 

ఇంకా ఉంది...

 

shiva purana part 13, Narada and Vishnu Maya, hindu God's Creation, brahmadeva complete details, brahma in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics