Read more!

About God's Creation

 

సృష్టి ఎలా ప్రారంభమైంది?!

About God's Creation

 

సృష్టి క్రమంలో వారివారి గుణాలు, చర్యలు, స్వభావాన్ని బట్టి వారికి నివాసాలను ఏర్పరిచారు. దా౦తో ఎవరి స్థావరాలకు వాళ్ళు వెళ్లి అక్కడే ఉండడం ప్రారంభించారు. అనంతరం బ్రహ్మదేవుడి శరీరం నుండి మరికొ౦తమంది జనించారు . బ్రహ్మదేవుడి ఒడినుండి నారదుడు, బొటనవేలినుండి దక్షుడు, ప్రాణంనుండి వశిష్టుడు, చర్మం నుండి భ్రుగువు, చేతినుండి క్రతువు, నాభి నుండి పులహుడు, చెవినుండి పులస్త్యుడు, ముఖం నుండి అంగీరసుడు, కళ్ళ నుండి అత్రి, మనసు నుండి మరీచి మొదలైన మహర్షులు జన్మించారు.

 

అలాగే రుచి, కర్దముడు, బృహస్పతి, సముద్రాలు, ఛందస్సు, ధర్మం, అధర్మం, కామక్రోధలోభాలు, ఓంకారం తదితరాలు కూడా బ్రహ్మ శరీరం నుండే పుట్టాయి . బ్రహ్మ అంశతోనే స్వయంభువ మనువు కూడా జన్మించాడు. పద్మగంధి, శతరూపి అనే కన్యామణుల్ని సృష్టించి మనువు జరుపుతాడు బ్రహ్మదేవుడు. ఈ దంపతులకు అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాతుడు అనే కుమారులు, రాకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు జన్మించారు.

 

రాకూతికి రుచితోను, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షుడితోను పెళ్ళిళ్ళు జరిగాయి. ఇక శ్రీశకుడు దాక్షిణాఖ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి అర్చిష్మ౦తులనే ఇరవైఐదుమంది సంతానం కలిగింది. దేవహూతికి కర్దముని వల్ల కపిలుడు తదితరులు జన్మించారు. ప్రసూతికి దక్షుని వల్ల అరవైనాలుగుమంది పుత్రికలు జన్మించారు. ఈ దక్షపుత్రికల్లో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, శాంతి, తుష్టి, పుష్టి, కీర్తి, సిద్ది, బుద్ధి, క్రియ, మేథ, లజ్జ, వసువు, అనే 13 మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు.

 

అలాగే ఖ్యాతి, సతి, సంభుతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నుతి, అనురూప, ఊర్జ, స్వాహ, స్వధ, అనే 11 మందిని భ్రుగువు వివాహమడాడు. సతీదేవిని పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నాడు. మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని పెళ్లిచేసుకోగా, క్రతువు పులహుడు, అత్రి, వశిష్టుడు, అగ్నిపితరులు వీరంతా కూడా దక్షపుత్రికలను వివాహం చేసుకుంటాడు. అలా అయన సంతానాన్ని వీళ్ళ౦తా వివాహాలు చేసుకుని ప్రణయ జీవితాన్నిసాగిస్తుంటారు. వీరి ప్రణయ జీవితం కారణంగా ఈ సృష్టిలో ఎన్నో జీవరాసులు ఉత్పన్నమయ్యాయి. “అలా ఈ సృష్టి మొదలైంది” అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు వివరంగా చెప్పాడు.

 

ఇదంతా విన్న శౌనకాది మహర్షులు సూతునితో “మహానుభావా! నువ్వు చెప్పిన సంగతులు విన్న తర్వాత మా సందేహాలు తీరాయి. ఇంత విశదంగా పురాణాన్ని వివరించగలిగే శక్తి వేరెవరికీ లేదు.. మీకివే మా నమస్సులు'' అంటూ నమస్కరించారు.

 

ఇంకా ఉంది.....

 

shiva purana part 10, Brahma manasa putrulu, hindu God's Creation, brahmadeva complete details, brahma in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics