Brahma Vishnu Maheswara together

 

త్రిలోకాధిపతుల భాషణ

Brahma Vishnu Maheswara together

 

సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుల చర్యలతో బ్రహ్మ ఎంతగానో కలత చెందాడు . అలా బాధపడుతున్న బ్రహ్మ కళ్ళనుంచి అశ్రుబిందువులు రాలాయి. ఆ కన్నీటి బిందువుల సముదాయం ఒక దివ్య తేజోమయ రూపంగా ఏర్పడింది. ఆ రూపమే మహాశివుడిగా రూపొందింది. . శివుని రూపం తెల్లగా స్వచ్చమైన మంచులా అపురూపంగా ఉంది. అలా కళ్ళ ముందు సాకారుడై నిలిచిన ఈశ్వరుని చూసి బ్రహ్మ ''నీవెవరివి?'' అని ప్రశ్నించాడు.

 

అప్పుడు శివుడు “లోకానికి సర్వశుభాల్ని చేకూర్చే మంగళప్రదుడిని.. నన్ను రుద్రుడు అంటారు... జగత్తు సృష్టికి పూనుకున్ననీకు సహాయపడదామని వచ్చాను ” అన్నాడు.

 

అంతలో విష్ణువు శివుని వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయా కార్యాలు నిర్వహించేందుకు తమకు తామే పూనుకున్నఈ ముగ్గురు ఉండే౦దుకు అనువైన స్థావరాల కోసం ఆలోచించారు.

 

అప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మ సరస్వతులకోసం సత్యలోకాన్ని, తానూ లక్ష్మిదేవి ఉండే౦దుకు వైకుంఠాన్ని, శివపార్వతులు నివసించేందుకు కైలాసాన్ని నివాస యోగ్యంగా నిర్ణయించాడు. ఇందుకు బ్రహ్మ, శివుడు కూడా అంగీకరించడంతో ఆవిధంగానే ఆయా లోకాలకు పయనమై అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ''శివ పంచాక్షరీ'' మంత్రాన్నిజపిస్తూ వైకుంఠంలో విష్ణువు ఉండగా,''ఓ౦ నమో నారాయణాయ'' మంత్రాన్ని జపిస్తూ శివుడు కైలాసంలో ఉంటాడు.

 

ఇక బ్రహ్మదేవుడు ఓ౦కార రూపుడైన పరమేశ్వరుని ధ్యానిస్తూ సత్యలోకంలో ఉండి, అక్కడి నుంచి తన సృష్టికార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. సృష్టి నిర్వహణలో భాగంగా తనకు సహాయంగా ఉ౦డే౦దుకు బ్రహ్మదేవుడు కొంతమంది ఉపబ్రహ్మలను సృజించాడు.

 

ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడైన దక్షప్రజాపతికి అరవైనాలుగుమంది సంతానం కలిగింది. ఈ సంతానంలో పదిమంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు . అలా కశ్యపుని వివాహం చేసుకున్న వారిలో అదితి, దితి, వినత, స్వస, కద్రు, ముని, అరిష్ట ,మాతంగి, తామ్ర, ఇల, అనేవారు ఉన్నారు . కశ్యపుడు , అదితులకు, ఇంద్రాదిదేవతలు జన్మించగా, దితికి రాక్షసులు, పుట్టారు. కద్రువకు నాగులు, మునికి గంధర్వులు, అరిష్ట అచ్చరలు, మాతంగికి ఐరావతాదులు, తామ్ర, ఇలలకు పక్షులు ,వృక్షాలు తదితరాలు జన్మించాయి.

 

అదితి కడుపున పుట్టినవారంతా మంచి గుణాలతో త్రిమూర్తులను స్మరిస్తూ ఉంటారు . అందుకని స్వర్గపట్టణాన్ని వీరు ఉండేందుకు నివాసయోగ్యంగా నిర్ణయించారు. అంతేకదా.. ఈ దేవతల్లో ఇంద్రుడిని స్వర్గాధిపతిగా నిర్ణయించారు .అలాగే యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాన్నితీసుకునే అధికారాన్నికూడా వీరికి కల్పించారు.

 

కానీ దితికి పుట్టిన వారంతా తామసగుణంతో లోకాన్నికల్లోలపరిచే గుణం కలిగి ఉన్నారు. అలాగే ఇతరుల బాగు చూసి అసూయతో వేగిపోతూ అందర్నీ తల్లడిల్ల చేస్తూ౦టారు .దా౦తో వీరికి అరణ్యాలు, కొ౦డగుహలు నివాసయోగ్యంగా ఏర్పాటు చేశారు .


ఇంకా ఉంది.....


shiva purana part 4, dicussion of brahma vishnu and maheswara, shiva aavirbhavam in shiva purana, auspicious shiva purana telugu text, trimurthulu together, divine shiv purana, shiv purana gives happiness