Mahashiva Aavirbhavam
మహాశివుని ఆవిర్భావం
Mahashiva Aavirbhavam
మునీశ్వరులారా! శివుని మాయ గురించి తెలుసుకోవడం, ఇంద్రాదిదేవతలు, విష్ణుమూర్తి తదితర దేవతలకే సాధ్యం కాదు. అటువంటిది సామాన్యులకు ఎలా సాధ్యం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా అడుగైనా ముందుకు కదలదు. ఆయన కరుణిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానంలో ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులం కావాలి ’’ అంటూ శివతత్త్వాన్ని మరింత వివరంగా తెలియచేశాడు సూతుడు. అనంతరం న౦దీశ్వరుడు మార్కండేయునికి చెప్పిన మరో ఆసక్తికర ఘట్టాన్ని వినిపించేందుకు ఉపక్రమించాడు.
సృష్టికి పూర్వం అంతా జలమయమే. ఎక్కడ చుసినా (అసలు చూసేందుకు ఎవ్వరూ ఉండేవారే కాదు) నీరు తప్ప ఏదీ లేదు. అటువంటి మహాజలంనుంచి ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది. ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు. అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలని భావించాడు. అతనికాతలపు రావడం ఏమిటి ఆయన ఎడమభాగంనుంచి ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రభవిస్తుంది. ఆ ఆదిశక్తియే పరాశక్తి, పరాదేవత, జగన్మాత.
జగన్మాత రూపాన్ని వర్ణించడం సామాన్యుడికి సాధ్యం కాదు. మహాశివుని మాదిరిగానే మహేశ్వరి కూడా మూడు కన్నులతోటి ప్రభవించింది. అంతేనా! రెండు వేల చేతులు, ప్రళయాకారంతో కనిపించినప్పటికీ, క్షణంలోనే ప్రణయస్వరూపిణిగా మారిపోగలదు. ఈ తల్లే సకల చరాచర సృష్టికి మూలంగా చెబుతారు.
ఇలా ఆదిశక్తిని ప్రభవింపచేసి ఆమెతో విహారానికి బయలుదేరాడు పరమశివుడు. వారిద్దరూ సంతోషంగా ప్రణయసల్లాపాలతో మునిగి తేలుతుండగా, ఒక మహాపురుషుడు వీరిమధ్య నిలుస్తాడు. అతని రూపం తేజోమయమై ఉంది.
ఇంకా ఉంది.....
shiva purana part 4, shiva aavirbhavam in shiva purana, auspicious shiva purana telugu text, divine shiv purana, shiv purana gives happiness