- సంత్రా, టమాట రసాన్ని సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది. - పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి. - ఎండబెట్టిన సంత్రా పండు యొక్క తొక్కలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి. - దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది. - రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.

బ్లాక్ హెడ్స్ బాధ వదలాలంటే...!   తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి కదా! అయితే వీటిని మనం డిస్టర్బ్ చేస్తే మళ్లీ కనిపించకుండా మాయమైపోతాయి. అందుకే ఈ చిట్కాలు చకచకా పాటించేయండి. - బ్లాక్ హెడ్స్ ని డ్రైగా చేసే యాంటీసెప్టిక్ గుణాలు టొమాటోల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు టొమాటో రసాన్ని ముఖమంతా రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. ఒకట్రెండు వారాల పాటు ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ పొడిబారిపోయి రాలిపోతాయి.  - ఓట్స్ పొడిలో పెరుగు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకుని... బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. - గ్రీన్ టీ ఆకుల్ని పొడి చేసి, కొంచెం నీళ్లు చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని రాసుకుంటే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. - బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ముఖాన్ని మసాజ్ చేసుకున్నా సమస్య తీరిపోతుంది.  - దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేసినా చాలు.. బ్లాక్ హెడ్స్ బెడద తీరిపోతుంది. - గోరువెచ్చని పాలలో తేనె కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట పూయాలి. కాసేపటి తర్వాత పొడి బట్టతో ఆయా ప్రదేశాల్లో గట్టిగా ఒత్తుతూ తుడిస్తే బ్లాక్ హెడ్స్ ఊడిపోతాయి. - కోడిగుడ్డులో తేనె కలిపి వేసుకునే ప్యాక్ కూడా బ్లాక్ హెడ్స్ బాధను వదిలిస్తుంది   -Sameera N

గోళ్లు తెల్లగా మెరవాలంటే...   అందం అనగానే ముఖం గుర్తొస్తుంది మనకి. ఆ తర్వాత జుత్తు. అందుకే వాటిని తీర్చిదిద్దుకోవడంలోనే మునిగిపోతాం. ఆ తర్వాత కాస్తో కూస్తో స్కిన్ కేర్. ఇక కళ్లకి కాటుక, పెదవులకి లిప్ స్టిక్. గోళ్లకి మాత్రం నెయిల్ పాలిష్ వేసేసి లైట్ తీసుకుంటాం. అవి ఆరోగ్యంగా ఉన్నాయా అన్న విషయం ఎప్పుడూ ఆలోచించం. దాంతో అవి రంగు మారిపోయి, రఫ్ గా అయిపోయి కళావిహీనంగా తయారవుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే... - తరచుగా నిమ్మచెక్కతో గోళ్లను బాగా రుద్దితే రఫ్ నెస్ పోయి గోళ్లు సాఫ్ట్ గా అవుతాయి. తిరిగి తెలుపును సంతరించుకుంటాయి. - రోజూ గోళ్లను టూత్ పేస్టుతో రుద్ది కడిగితే రంగు మారిన గోళ్లు మళ్లీ తెల్లగా అవుతాయి. - బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి రుద్దుకున్నా మంచి ఫలితం ఉంటుంది. - నెయిల్ పాలిష్ రిమూరవ్ లో దూదిని ముంచి అప్పుడప్పడూ గోళ్లను రుద్దినా కూడా సమస్య తీరుతుంది. - గోళ్లను తేనెలో ముంచిన దూదితో బాగా రుద్ది కడగాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే రఫ్ గా ఉన్న గోళ్లు స్మూత్ గా అవుతాయి. - దూదిని చిన్న చిన్న ఉండలుగా చేసి పాలలో ముంచండి. వీటిని గోళ్ల మీద పెట్టి కాసేపు అలానే వదిలేయాలి. తరువాత తీసేసి చల్లని నీటితో కడిగేసి, ఆపైన మాయిశ్చరయిజింగ్ క్రీమ్ తో గోళ్లను కాసేపు రుద్దాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే గోళ్లు రఫ్ గా అవ్వవు. రంగు మారవు. ఆల్రెడీ ఆ సమస్యలు ఉంటే తీరిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. పాటించడం సులువు. కాబట్టి పాటించి గోళ్ల సౌందర్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ ఏం చేసినా గోళ్ల రంగు మారకపోతే ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి. ముఖ్యంగా గోళ్లు పసుపు రంగులోకి మారిపోయాయంటే అది అనారోగ్యం సూచన కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. - Sameera

అందమైన కురులు కావాలంటే....   మగువకు కురులే అందం అంటారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటివి ఆ అందానికి అన్యాయం చేస్తున్నాయి. ప్రతిరోజూ శిరోజాలు రాలిసోతోంటే దిగులుపడటం తప్ప ఏమీ చేయలేక దిగులుపడుతున్నారు ఎంతోమంది మహిళలు. నిజానికి  జుత్తు కాపాడుకోడానికి పెద్ద కష్టపడక్కర్లేదు.... ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే చాలు అంటున్నారు ప్రముఖ  సెటెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ మార్క్ టౌన్సెన్డ్. అవేమిటో చూడండి... - జుత్తు పెరగడం లేదే అని బెంగపడటం కూడా జుత్తును పాడు చేసుకోవడమే. ఎక్కువగా దిగులు పడేవాళ్లు, ఒత్తిడి పడేవాళ్ల జుత్తు త్వరగా ఊడిపోవడమే కాదు, పెరిగే లక్షణాన్ని కూడా కోల్పోతుందట. మహా అయితే జుత్తు నెలకు అరంగుళం పెరుగుతుందంతే. కాబట్టి రాత్రికి రాత్రే పెరిగిపోవాలని ఆశపడటం అనవసరం. - జుత్తు కట్ చేస్తే పొట్టిగా అయిపోతుందని దిగులుపడుతుంటారు. కానీ జుత్తును ఎంతగా కత్తిరిస్తే అంతగా పెరుగుతుందన్నది నిజం. కాబట్టి పది పన్నెండు వారాలకోసారి జుత్తుని ఒక అంగుళం కత్తిరించడమే మంచిది. - ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలంటుకున్నప్పుడు మాత్రం మురికి పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్ అప్లై చేయాలి. - వారానికోసారి తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేయాలి. దానివల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తలపై ఉన్న చర్మంలో తేమ పెరుగుతుంది. అది జుత్తు పెరుగుదలకు దోహదపడుతుంది. - జుత్తును ఎడా పెడా దువ్వేయకూడదు, రుద్దేయకూడదు. కొందరు నూనె రాసుకునేటప్పుడు, దువ్వుకునేటప్పుడు జుత్తును అటూ ఇటూ వేసేస్తుంటారు. అది తప్పు. జుత్తును ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో దువ్వుకోవాలి. అప్పుడే పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రాలకుండానూ ఉంటుంది. - తలంటుకున్న తర్వాత జుత్తుని టవల్ తో మరీ గట్టిగా కట్టేసుకోకూడదు. తడిసిన జుత్తు చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు బిగించి కట్టడం వల్ల చిట్లిపోవడం, తెగిపోవడం జరుగుతుంది. - మరీ వేడి నీటితో తలంటుకోకూడదు. చల్లని లేక గోరు వెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. షాంపూని ఒకే పద్ధతిలో పెట్టుకోవాలి. మురికి పోవాలి కదా అని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకోకూడదు. - జుత్తుకీ దిండుకీ సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? కానీ ఉందట. గట్టిగా ఉండే దిండు మెడ, తల కండరాలకే కాదు... జుత్తుకి కూడా హాని చేస్తుందంటారు మార్క్. అందుకే మెత్తగా ఉండే దిండు మాత్రమే వాడాలి. అలాగే ఉన్ని, ఖద్దరు దిండు కవర్లు వాడకూడదు. అవి జుత్తుని డ్యామేజ్ చేస్తాయట. వీలైనంత వరకూ శాటిన్ కవర్లు వాడటమే మంచిదట. చూశారా! వీటిలో చాలా తప్పులు మనం చేస్తుంటాం. కొన్ని చేయాలని తెలిసి కూడా చేయకుండా దాటవేస్తుంటాం. అందమైన కురులు కావాలంటే నిర్లక్ష్యం తగదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తపడండి మరి! - Sameera

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే...     డెలివరీ అయ్యాక మహిళలకు పెద్ద తలనొప్పి... స్ట్రెచ్ మార్క్స్. అవి ఓసారి వచ్చాయంటే ఓ పట్టాన పోవు. చర్మం బాగా సాగి మళ్లీ మామూలుగా అయ్యే క్రమంలో పడే ఈ గీతల్ని పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. డెలివరీ అనే కాదు... బాగా లావయ్యి, తర్వాత సన్నబడిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే ఇది పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్యేం కాదు. దానికి కొన్ని చిట్కాలున్నాయి.   - స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడంలో కోడిగుడ్డు మంచి ఎక్స్ పర్ట్. దీనిలో ఉండే విటమిన్ ఎ, ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్ చర్మ కణాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా పని చేస్తాయి. అందుకే మార్క్స్ ఉన్నచోట కోడిగుడ్డు సొనతో తరచుగా రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. - అలొవెరా జెల్ లో ఉండే అలోసిన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ జెల్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రోజూ పడుకోబోయే ముందు రాసుకుంటే... కొన్నాళ్లకు సమస్య తీరిపోతుంది. - నిమ్మచెక్క పెట్టి తరచుగా రుద్దుకుంటూ ఉన్నా మంచిదే. - ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మసాజ్ లు కూడా స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టి, చర్మం ఎప్పటిలాగా అయ్యేందుకు దోహదపడతాయి. - బంగాళాదుంపని బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంతో మార్క్స్ ఉన్నచోట బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే అతి తక్కువ సమయంలోనే అవి పోతాయి. - ఆముదం కూడా స్ట్రెచ్ మార్క్స్ కి మంచి మందు. - పంచదారలో కొంచెం నిమ్మరసం కానీ కాస్తంత బాదం నూనె కానీ కలిపి రుద్దినా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని మార్గాలు ఉండగా స్ట్రెచ్ మార్క్స్ గురించి చింత ఎందుకు? వీటిని ఫాలో అవ్వండి... వాటిని వదిలించుకోండి. - Sameera

మన ముఖానికి శత్రువులు మనం వాడే వస్తువులే...!   అందంగా ఉండటానికి అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్ని కొన్ని అజాగ్రత్తల వల్ల మన ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. శరీరంలోని ఇతర భాగాల అందాన్ని పెంచుకునేందుకు మనం వాడే కొన్ని వస్తువులు మన ముఖానికి శత్రువులు. అవేంటో తెలుసుకోవాలని ఉందా.... పాదాల పగుళ్లకు రకరకాల క్రీములు వాడుతుంటాం. ఇవి పాదాలను బాగు చేస్తయేమో కానీ ముఖానికి తీవ్ర హాని చేస్తాయి. వాటిలో ఉండే కెమికల్ ఎక్స్ ఫాలియెంట్స్ ముఖ చర్మపు సున్నితత్వాన్ని పాడు చేస్తాయి. అలాగే హెయిర్ స్ర్పేలు. వీటిలో అధిక మోతాదులో ఉండే ఫ్రాగ్రెన్స్ లు ముఖంపై పడితే చర్మం డ్యామేజ్ అయ్యి దురద, మంట వంటివి కలుగుతాయి. తలంటుకునేటప్పుడు చాలాసార్లు షాంపూ ముఖానికి కూడా అంటుకుంటూ ఉంటుంది. కానీ తరచుగా ఇలా జరిగితే మాత్రం ముఖం పాడవడం ఖాయం. ఎందుకంటే జుత్తుపై ఉండే జిడ్డు, మురికి వంటివి వదిలించడానికి అనువుగా తయారుచేసే షాంపూలోని రసాయనాల్ని... ముఖ చర్మంలో ఉండే డెలికేట్ మాలెక్యూల్స్ తట్టుకోలేవు. దాంతో చర్మం పొడిబారిపోతుంది. అదే విధంగా డియోడరెంట్స్, హెయిర్ కలర్స్. ఇవి ముఖానికి ఓ పరిమితి దాటి తగిలితే సున్నితమైన ముఖ చర్మానికి ఉండే స్వేదరంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఒంటికి రాసుకుంటున్నాం కదా అని బాడీ లోషన్స్ ని ముఖానికి కూడా రాసేసుకుంటూ ఉంటారు. అది మంచిదే అయితే ముఖానికి ప్రత్యేకంగా క్రీములు తయారై ఉండేవి కావు. ముఖంపై ఉండే చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే దానికి అధిక రసాయనాలు పడవు. అందుకే దాని సున్నితత్వం పాడవకుండా ఉండే రసాయనాలతో ఫేస్ క్రీములు తయారవుతాయి. కానీ బాడీ లోషన్స్ అంత సున్నితమైనవి కావు. అందుకే వాటిని ముఖానికి రాసుకోకూడదు. లేదంటే పొడి చర్మం కలవారి ముఖం మరింత పొడిగా... జిడ్డు చర్మం ఉండేవారి ముఖం మరింత జిడ్డుగా అయిపోతుంది. మెల్లమెల్లగా సున్నితత్వం మాయమైపోయి ముఖం రఫ్ గా తయారవుతుంది. ఇవన్నీ మనం తెలియకుండా చేసే పొరపాట్లే. అజాగ్రత్తగా ఉండటం వల్ల వీటన్నిటినీ ముఖానికి పూసేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండొచ్చు. ముఖసౌందర్యానికి ముప్పు రాకుండా చూసుకోవచ్చు. ఏమంటారు! - sameeranj  

Shaving Tips For Women Today though many women wax their legs, shaving is still the least expensive way to remove your hair. Shaving has to be done carefully or it will result in nicks and irritation. Here are a few shaving tips for women to ensure that they are doing it right. * Do not shave dry skin. Wet your skin and let the moisture soften your skin. Shaving is a natural exfoliator and if your skin is dry, your razor will get blocked with dead skin and you are likely to nick yourself as well. * Do not waste money by buying creams specially made for women, as they are almost the same as those made for men. * To find the perfect razor you will just have to use all those available and choose the one that you like best. You can ask your friends who shave to recommend razors. Look for a razor with lubricated strips, pivoting heads and spring mounted multiple blades. * Exfoliate before you shave to ensure that the dead skin cells do not clog your razor and prevent a close shave. * For your legs you will have begin shaving from your ankles and then work upwards. For your underarms you will have to shave in every direction as hair grows in every direction under your arm. * After you have finished shaving apply oil or moisturizer. The skin on your leg has few oil glands and hence may become dry. * When hair curls back under the skin it caused ingrown hairs. To avoid ingrown hairs exfoliate everyday and use a glycolic acid body lotions. * If you have a chronic case of ingrown hairs then use a lotion that is specially made for ingrown hairs, that is easily available at the chemists. Apply it in the morning and at night and the bumps will vanish within a few days. * If you shave your legs coarse hair will grow back fast. Therefore consider waxing your legs at least.

గుడ్డుతో అందానికి మెరుగులు     గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. ఇంట్లో నే అందానికి గుడ్డుతో మెరుగులు పెట్టుకోవటానికి కొన్ని మార్గాలు.. ఇవి.. *గుడ్డులోని తెల్ల సొనకి అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె, ( పావు చెమ్చా కి సగం ), కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది.     *  తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారట్ తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి. యాంటీ ఏజింగ్ ప్యాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది. * అలాగే పచ్చ  సోనకి  తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే.. చర్మం బిగుతుగా మారుతుంది . * చర్మం పొడి పొడి గా వుండి, దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని.. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది.     * అలాగే పచ్చసోనలో ముల్తాని మిట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు. * ఒట్టి తెల్ల సొనని  బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి, అది ఆరాకా కడిగి చూడండి. ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది. ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పాక్ వేసుకుంటే, త్వరగా అయిపోతుంది., మంచి ఫలితం కూడా వుంటుంది.

వర్షాకాలంలో మీ చర్మానికి చిక్కుల్లేకుండా..!   వర్షాకాలం వచ్చేసింది..చిటపట చినుకుల్లో ఫ్రెండ్స్‌తో అలా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనో..సరదాగా ఆడిపాడాలనో చాలా మందికి ఉంటుంది. ఎండాకాలంలో వేడిని భరించలేక చల్లదనాన్ని కోరుకోవడం మనిషికి అత్యంత సహజం..అయితే ఆ ఆనందాన్ని ఆవిరి చేయడానికి అనేక చర్మ సమస్యలు రెడీగా ఉంటాయి..కామన్‌గా ఎండాకాలంలో చెమట ఎక్కువ పోస్తుంది కాబట్టి స్కిన్‌ని చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసి..వర్షాకాలంలో కాస్త బద్దకిస్తుంటారు..కానీ ఎండాకాలంతో పోలీస్తే వానల్లోనే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి..ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారడం, యాక్నె, పింపుల్స్, ఇతర చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశముంది..కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే..వర్షాకాలాన్ని మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తూనే అందాన్ని కాపాడుకోవచ్చు. వీటి కోసం బ్యూటీపార్లర్లకో..హెల్త్‌కేర్ సెంటర్లకో పరుగులు పెట్టక్కర్లేదు. మన వంటింట్లో..పెరట్లో దొరికే వస్తువులతోనే మెరిసిపోవచ్చు. * తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది..చిన్న చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమల వంటి సమస్యలను దూరం చేయడంలో ఇవి మంచి ఔషదంలా పనిచేస్తాయి. * వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు అద్భుతమైన విరుగుడు కలబంద. చర్మంలోని రక్తకణాలను శుభ్రం చేసే శక్తి కలబందకు ఉంది. అందువల్ల బయటకు వెళ్లినప్పుడు కలబంద జెల్‌ను రాసుకోవడం అన్ని విధాల మంచిది. * తేనే, ఆలివ్ ఆయిల్, నిమ్మరసాలను కలిపి ముఖానికి మాస్క్‌లా పెట్టుకుంటే పొడి చర్మంతో బాధపడే వారికి మంచి ఫలితం కనిపిస్తుంది. * పుచ్చకాయ రసంలో మిల్క్‌పౌడర్‌ను కలుపుకుని రాసుకుంటే చర్మం మీదున్న మచ్చలు వదిలిపోతాయి. * వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మనలో చాలా మంది నీళ్లు సరిగా తాగరు. కానీ ఈ కాలంలోనూ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. దీని వల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది.

Take Care of Those Eyelashes!     Long and thick eyelashes are every woman’s priced possession. Apart from being lucky enough to have naturally long and thick lashes it is also important to take care of these little ones! Use of lash comb or a clean or unused mascara brush can be used to clean and com them. This prevents premature breakage and also strengthens them, however over brushing can loosen lashes. It is very important to take off the makeup before going to bed, you can use makeup remover or more organic removal will be with olive oil. If left on will lead to eye infections and weakening followed by breakage. Every time you use a curler make sure it is disinfected well, as accumulated makeup stuff is a breeding place for germs. Try avoiding fake eyelashes, glue weakens the roots sooner or later your lashes may fallout, moreover while peeling off the glue it might pull few along. If you are accustomed to use mascara frequently, then once in a while give your eyelashes some fresh air too. Make sure you keep your dirty hands off your eyes, to avoid infection. Condition your eyelashes with castor oil, coconut oil or petroleum jelly to eye lashes before sleeping and just rinsing the conditioning treatment in the morning. We can use cotton ball, mascara brush or Q-tip as applicator. Results will start to show in two to three months. We should enrich our diet with Vitamin C, D, E and H. Include kiwi, oranges and watermelons, for good amounts of Vitamin C for healthy hair. Vitamin D strengthens the hair found in cheese, fish and cereals. Vitamin H helps rebuild hair that is already dry and splitting, it revives your eye lashes to its healthy fullness, found in good quantities in mushrooms and whole grains. - Koya Satyasri

పాదాల  పగుళ్ళా ?     పాదాల పగుళ్ళకు ..... ప్రతి రోజు .. * ఆముదం + రోజ్ వాటర్ + నిమ్మ రసంలను సమ పాళ్ళల్లో కలిపి , పాదాలు పగిలిన చోట ప్రతి రోజు 2 లేక 3 సార్లు పూయవలెను.  * పుట్ట మైనంను కొద్దిగా వేడి చేస్తే కరిగి పోవును. తర్వాత కరిగిన మైనం + మైనం బరువులో సగ భాగం ఆవాల నూనెను మొత్తం మైనంలో కలుపవలెను. ఒక పాత్రలో నీళ్ళు పోసి, ఆ పాత్రలో  నూనెను కలిపిన మైనంను వేయవలెను. కొద్ది సేపటి తర్వాత నీళ్ళను వడబోయవలెను. అప్పుడు క్రింద వున్న పదార్దాన్ని, గాజు సీసాలో నిల్వ చేసుకొనవలెను. రాత్రి పడుకునే ముందర కాళ్ళ పగుళ్ళకు పూయవలెను. ( 7 రోజుల్లో సమస్య తొలగి పోవును ) * రాత్రి పడుకునే ముందర ..... వేడి చేసిన కొబ్బెర నూనెను పాదాల పగుళ్ళకు పూయవలెను.. ఉదయం Socks లను తీసివేసి, వేడి నీళ్ళల్లో పాదాలను 15 నిమిషాలు వుంచవలెను. తర్వాత.. పగుళ్ళను నిదానముగా బ్రష్ తో శుభ్రం చేయవలెను. తర్వాత శుభ్రంగా పాదాలను తుడిచి నూనెను పూయవలెను . * 1 spoon మైనం ( wax ) + 1 spoon స్వదేశి ఆవు నెయ్యిని కలిపి వేడి చేయవలెను . కరిగిన పదార్ధం, వేడి చుక్కలను పాదాలా పగుళ్ళల్లో వేయవలెను. ( పాదాల పగుళ్ళు తగ్గే వరకు ప్రతి రోజు ఆచరించవలెను ) * 25 గ్రాముల మైనం + 100 గ్రాముల ఆవాల నూనెను వేసి , ఒక పొంగు వచ్చే వరకు మరగించవలెను. నూనె చల్లారక మునుపే ఒక వెడల్పు మూతి కలిగిన పాత్రలో నిల్వ చేసుకొనవలెను. చల్లారిన తర్వాత ointment లాగ తయారవును. చర్మ పగుళ్ళు, పాదాల పగుళ్ళకు పూయవలెను. ( పగుళ్ళు తగ్గిపోవును. ఒక వేళ మొదట పగుళ్ళు పెరిగిన, నిదానముగా తగ్గిపోవును. ప్రతి రోజు క్రమంగా ointment లాగా పూయవలెను ). 2 పాదాల  joint దగ్గర వాపు. ( Bunions ) పాదాల ఎముకల joint దగ్గర వాపు ఉన్న చోట.. గోరింటాకుల పేష్ట్ ని లేపనంలాగా పూసి కట్టు కట్టవలెను. 2 లేక 3 గంటల తర్వాత కట్టు విప్పి, శుభ్రం చేసుకొనవలెను. ( కొన్ని రోజులలో వాపు, నొప్పి తగ్గిపోవును )  పై పద్దతులను ఆచరించండి, ఆరోగ్యాని పొందండి.

తెల్లజుత్తును తరిమేయండి..   పోషకాల లోపాల వల్లో ఇతరత్రా కారణాల వల్లో చిన్న వయసులో జుత్తు తెల్లబడిపోతుంది కొందరికి. దాని గురించి దిగుటు పడక్కకర్లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే తెల్లబడిన హెయిర్ మళ్లీ నల్లబడుతుంది. ట్రై చేసి చూడండి. - రెండు చెంచాల ఉసిరిక పొడి, చెంచాడు బాదం నూనె, అరచెంచా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ల్ లా చేయండి. దీన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని, ఉదయాన్నే తలంచుకోవాలి. వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే ఫలితముంటుంది. - నల్ల నువ్వుల నూనెను, ఆలివ్ నూనెను సమపాళ్లలో కలిపి వేడిచేయాలి. దీన్ని మాడుకు, జుత్తుకు బాగా పట్టించి, ఆరగంట తర్వాత షీకాయ పొడితో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి. -కరివేపాకు వేసి మరిగించిన కొబ్బరి నూనెను రోజూ తలకు రాసుకుని, పొద్దున్న స్నానం చేస్తూ ఉంటే సమస్య పరిష్కారమవుతుంది. - ఉల్లిపాయను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. దీనిలో నిమ్మరసం కలిపి పడుకునే ముందు జుత్తుకు, తలకు బాగా రాయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసి, మైల్డ్ షాంపూతో తలంటుకోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది. - గోరింటాకు, మందార ఆకులు, కరివేపాకుల్ని సమపాళ్లలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. దీన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే తెల్లజుత్తు నల్లబడటమే కాదు, ఆరోగ్యంగా తయారవుతుంది కూడా. -Sameera N

సమ్మర్ లో చర్మఛాయ చిట్కాలు సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది బయటకు రావడానికి కూడా బయపడతారు ఎక్కడ ముఖం నల్లబడిపోతుందో అని. అలా అని ఎక్కడికీ వెళ్లకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసారిగా పాటించుకోవాలి. పెరుగు... ఈ వేసవిలో పెరుగు తింటే ఎంత చలవ చేస్తుందో మన ముఖారవిందాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం. 1. ఈ సమ్మర్ లో ఎండ వల్ల నిరంతరం చెమట వస్తూనే ఉంటుంది. దీని వల్ల ముఖంపై రాషస్ రావడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును పట్టిస్తే చల్లగా ఉండటమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖానికి ఉన్న టాన్ కూడా పోగొడుతుంది. 2. సూర్యరశ్మి వల్ల ముఖంలో పోషణ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు అయిపోతుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 3. పెరుగులో ఆరెంజ్ తొక్కల పౌడర్ ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. 4. పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకొని ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది. 5. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కు మాస్క్ లా వేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.  

మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...!   Must Watch Importance of Parent Child Relations in the General Development ... https://www.youtube.com/watch?time_continue=46&v=U8bvNcltj-8  

మెరిసే చర్మం కోసం ఈ అయిదు చిట్కాలు పాటించండి!   వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిలు కోరుకునేది ప్రకాశించే చర్మం. అయితే, చర్మాన్ని కాంతివంతం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ, ఈ 5 సాధారణ చిట్కాలు పాటించండి, మీరు కలలుగన్న సౌందర్యవంతమయిన చర్మం సులువుగా పొందవచ్చు.   1 . ఖచ్చితమయిన ఆహరం తీసుకోవడం: ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు శరీరానికి ఆహారం అందించినట్లే, మీ చర్మం కోసం కూడా అదే చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు మరియు పండ్లు సమృద్ధిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది బెర్రీలు, గింజలు, తక్కువ ప్రోటీన్లు మరియు ఆకుకూరలతో చేయవచ్చు. ఇవి లోపలి నుండి మీ చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడతాయి.   2 . ముందుగా మొదలెట్టండి: చర్మ సంరక్షణ నియమావళి పాటించడానికి ఎక్కువ సమయం తీసుకోకండి. మీరు యవ్వనంలోకి అడుగిడినప్పటినుండే- చర్మాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజ్ చేయడం మరియు జాగ్రత్త వహించడం మొదలుపెట్టండి.   3 . చెమట పట్టించండి: వ్యాయామం మీ శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుంది! మీ గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ జరిగి, తద్వారా టాక్సిన్స్ (వ్యాధి క్రిములు పుట్టించు విషము) విసర్జన జరిగేందుకు సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత మీ ముఖం ప్రకాశవంతంగా మారడానికి కారణం ఇదే.   4 . మంచి నిద్ర: ఆలస్యంగా నిద్ర పోవడం దీర్ఘ కాలంలో దుష్ప్రయోజనాలు కలిగిస్తుంది. నిద్ర లేమి మీ ముఖం మీద రక్త నాళాలను బిగుతుగా చేస్తుంది. నిద్ర వాస్తవానికి చర్మానికి అత్యంత అవసరమయిన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో, త్వరగా నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయండి.   5 . చర్మానికి కాస్త విశ్రాంతి ఇవ్వండి: మీరు రోజువారీ మేకప్పు ఉపయోగించే వారయితే, చర్మ సంరక్షణ కోసం ఒక రోజు పక్కన పెట్టండి. మీ చర్మం ఒక స్పాంజ్ వలె ఉంటుంది మరియు మీరు ఉపయోగించిన ప్రాడక్టు యొక్క ప్రతి పొరను అది వేగంగా గ్రహిస్తుంది. కాబట్టి, మీరు మీ చర్మానికి మేకప్ వేయకుండా విశ్రాంతి ఇస్తే చర్మ రంధ్రాలను మరియు కణాలను ఫ్రీ చేస్తుంది.   

బంగాళాదుంపతో హేర్ ప్యాక్... జుట్టు పొడవుగా అవుతుంది!!    

ఇలా చేస్తే కళ్ళు అందంగా కనిపిస్తాయి...   అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్‌లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించొచ్చు. అదేలాగో ఈ వీడియో చూడండి మీకు తెలుస్తోంది....  https://www.youtube.com/watch?v=Z_0qgDbf-Us    

ముఖంపై ముడుతలు పోవాలంటే...!   వాతావరణంలో మార్పులు, కాలుష్యం వంటివి చర్మానికి చేసే కీడు అంతా ఇంతా కాదు. జీవం కోల్పోయి, ముడుతలు పడిపోయి వృద్ధాప్యం అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించారనుకోండి... ముడుతలు మాయమైపోతాయి. ముఖం మళ్లీ మెరిసిపోతుంది. - పెరుగులో కాసింత కొబ్బరినూనె, ఆలివ్ నూనె కలిపి రోజూ ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  - పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. కాబట్టి పైనాపిల్ గుజ్జుతో తరచూ ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.  - బ్రౌన్ షుగర్ ను గోరువెచ్చని పాలతో కొద్దిగా తడిపి, దానితో ముడుతలు ఉన్నచోట రుద్దుకుంటూ ఉంటే మెల్లగా ముడతలు పోతాయి. - టొమాటో గుజ్జులో ఆలివ్ ఆయిల్ కానీ ఆవనూనె కానీ కలిపి వారానికి రెండు మూడుసార్లు ప్యాక్ వేసుకున్నా మంచిదే.  - దాల్చినచెక్క పొడిలో పెరుగు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి.  - గ్రీన్ టీలో పెరుగు కలిపి ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  - అరటిపండులో పెరుగు, బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  - పసుపులో చెరకురసం కలిపి వేసుకునే ప్యాక్ కూడా మేలు చేస్తుంది.     - కోడిగుడ్డు తెల్లసొనలో అలొవెరా జిగురు కలిపి ముఖానికి పూసుకోవాలి. తర్వాత మునివేళ్లతో ముఖమంతా మెల్లగా మసాజ్ చేయాలి. ఆపైన నీటితో కడిగేసుకోవాలి.    చూశారుగా ఎన్ని చిట్కాలు ఉన్నాయో. మరి ముఖంపై ముడతలు వచ్చినంత మాత్రాన దిగులు పడటం దేనికి? వీటిని ట్రై చేసి చూడండి. -Sameera