ప్రతి రోజూ ఉదయాన్నే చేసే ఈ ఆరు తప్పుల వల్ల అమ్మాయిలు  ఎంత నష్టపోతున్నారో తెలుసా?

 

ఉదయం లేచింది మొదలు మనిషి రోజు మొదలవుతుంది. ఈకాలంలో చాలామంది ఎక్కువగా ఆరోగ్యోం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆరోగ్యం అనుకుంటూ ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మరికొందరు సాధారణం అనుకునే అలవాట్లు ఎన్నెన్నో  నష్టాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు డైటింగ్ విషయంలోనూ, అందాన్ని కాపాడుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిలో చాలావరకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి. వీటిని తెలుసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పూర్తీగా అందం ఆరోగ్యం నష్టపోయాక భాధపడాలి. అందరూ కామన్ అనుకుంటూ చేస్తున్న ఆ ఆరు తప్పులు ఏంటో తెలుసుకుంటే..

ఓట్స్..

అమ్మాయిలు ఉదయాన్నే ఎక్కవగా తీసుకునే అల్పాహారం ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగరని తద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ప్రతి రోజూ ఓట్స్ తీసుకుంటే ఉదయాన్నే శరీరానికి అందాల్సిన పోషకాలు చాలావరకు లాస్ అవుతారు. ఓట్స్ లో పైబర్, బరువు తగ్గింటే కారకాలు ఉంటాయి తప్ప శరీరానికి ప్రోటీన్ ఏమీ అందించదు. పైపెచ్చు ఓట్స్ ను ప్రతిరోజూ తింటే చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. చర్మం మీద చారలు చారలుగా గీతలు ఏర్పడటం జరుగుతుంది.

స్నానం..

ఉదయాన్నే వేడినీటితో స్నానం చేస్తే కలిగే రిఫ్రెష్మెంట్ యే వేరు. కానీ ప్రతిరోజూ వేడి నీటి స్నానం ఆరోగ్యానికి మంచి చేకూర్చకపోగా చెడు చేస్తుందంటున్నారు. వేడినీటి స్నానం శరీరంలో తేమశాతాన్ని చాలా తొందరగా లాగేస్తుందట. ఇక ముఖం కడగడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం చాలా తొందరగా  ముడతలు వస్తాయి. ముఖం ముసలిగా మారిపోతుంది.

కాఫీ..

చాలామందికి కాఫీ అనేది ఒక ఎమోషన్.  ఉదయాన్నే ఒక కప్పు కాఫీ పడితే కానీ పనులు ముందుకు సాగవు. ఆ తరువాత కాఫీ టిఫిన్  కు ముందు, ఇక చాలామందికి టిఫిన్ తరువాత  వేడిగా, స్ట్రాంగ్ గా కాపీ పడాల్సిందే. కానీ ఈ అలవాటు చాలా చెడ్డది. సహజంగానే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లడంలో ఇబ్బంది కలిగిస్తుంది.

సన్ స్క్రీన్..

అమ్మాయిలు సన్ స్క్రీన్ అప్లై చేయడం లైఫ్ స్టైల్ లో భాగం చేసుకున్నారు. ఇది  సుర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కానీ కొందరు అలవాటులో పొరపాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్నానం తరువాత సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. దీని కారణంగా చర్మం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే అవసరమైన సందర్బాలలో మాత్రమే సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

బ్యూటీ ప్రోడక్ట్స్..

చర్మం  ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అమ్మాయిలు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ చర్మం బాగుండాలంటే ఈ బ్యూటీ ఉత్పత్తులేవీ అక్కర్లేదు. కేవలం సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా సీజన్ తో సంబంధం లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే  ముఖచర్మం చాలా తొందరగా వృద్దాప్యంగా మారుతుంది.

ఫేస్ వాష్..

ఉదయం లేవగానే చాలామందికి ముఖమంతా చాలా జిడ్డుగా ఉంటుంది.  దీన్ని వదిలించుకోవడానికి చాలా గాఢత కలిగిన కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరికి పేస్ వాష్ ఉపయోగించడం అంటే అదొక ఫ్యాషన్. కానీ  ఫేష్ వాష్ లు ముఖ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తాయి. అందుకే  ముఖం జిడ్డుగా ఉంటే తేలికపాటి క్లెన్సర్ ని ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.

                                              నిశ్శబ్ద.