అవిసె గింజలను  ఈ మూడు విధాలుగా వాడితే జుట్టు పెరుగుదల అద్బుతమే!

 

అమ్మాయిల అందంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందంగా ఉన్న కురులు అదనపు ఆకర్షణ తెస్తాయి. దుమ్ము,  పెరుగుతున్న కాలుష్యం  ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మం,  జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సహజ మార్గాల్లో జుట్టును అందంగా, ఆరోగ్యంగా  మార్చడానికి అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.  అవిసె గింజలను మూడు మార్గాలలో ఉపయోగించడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అవిసె గింజలతో ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

హెయిర్ జెల్..

 అవిసె గింజలను హెయిర్ జెల్‌గా ఉపయోగించవచ్చు .  ఈ జెల్‌ను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. అవిసె గింజలను ఉడికించి జెల్ తీసుకోవాలి.  అందులో  అలోవెరా జెల్ కలపాలి.  ఈ హెయిర్ జెల్‌ను కొద్ది మొత్తంలో తీసుకొని మీ జుట్టు మొత్తం పొడవునా అప్లై చేయాలి. తర్వాత తలంతా   మసాజ్ చేయాలి. దీన్ని  15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాధారణ షాంపూతో కడగాలి.

హెయిర్ మాస్క్..

అవిసె గింజలను  హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. కేవలం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని  జుట్టుకు పట్టించాలి. దీనితో  స్కాల్ప్‌కు మసాజ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయాలి.

హెయిర్ ఆయిల్..

 జుట్టుకు నూనెగా అవిసె గింజలను ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టు కోసం అవిసె గింజల  ఆయిల్ ఉపయోగించాలి. దీనితో  స్కాల్ప్‌ని ఐదు నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  అలాగే జుట్టు మెరుపును తీసుకురావడానికి కూడా అవిసె గింజల నూనె  అప్లై చేయవచ్చు.

అవిసె గింజల ప్రయోజాలు..

అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కాల్ప్ సెన్సిటివిటీ,  ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అవిసె గింజలు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి  జుట్టుకు  సరైన పోషకాహారాన్ని అందిస్తాయి.
అవిసె గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
 జుట్టు పెరుగుదలను పెంచడానికి మంచి మార్గం కోసం చూస్తున్నట్లయితే, అవిసె గింజలు సహాయపడతాయి.
చుండ్రు సమస్యకు కూడా అవిసెగింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తాయి, తద్వారా చుండ్రు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

                                                          *నిశ్శబ్ద.