గుడ్డుతో అందానికి మెరుగులు!
గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు . ఇంట్లో నే అందానికి గుడ్డుతో మెరుగులు పెట్టుకోవటానికి కొన్ని మార్గాలు ..ఇవి..
1. గుడ్డులోని తెల్ల సొనకి అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె , ( పావు చెమ్చా కి సగం ) , కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే ముఖం కాంతివంతం గా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది .
2. తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారెట్ తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి . యాంటి ఏజింగ్ పాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది .
3.అలాగే పచ్చ సోనకి తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే ..చర్మం బిగుతుగా మారుతుంది .
4. చర్మం పొడి పొడి గా వుండి , దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని ..పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది.
5. అలాగే పచ్చసోనలో ముల్తాని మట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు
6.ఒట్టి తెల్ల సొనని బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి , అది ఆరాకా కడిగి చూడండి . ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది . ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పాక్ వేసుకుంటే , త్వరగా అయపోతుంది, మంచి ఫలితం కూడా వుంటుంది .