ముఖం పొడిబారి వాడిపోయినట్టుందా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే!
వాతావరణం మారేకొద్ది శరీరం కూడా మార్పులకు లోనవుతుంది. వర్షాల వల్ల వాతావరణం చలిగానూ, చిరాగ్గానూ మారుతుంది. ఈ వాతరణం దాటికి నీరు తక్కువగా తాగుతుంటారు. ఇక ముఖ చర్మం కూడా చాలావరకు పగులుతుంది, మరికొందరికి శరీరంలో నీటిశాతం తక్కువ ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది తొందరగా దురదలు, దద్దుర్లు, గాయాలకు దారితీస్తుంది. దీనికి విరుగుడుగా వీలైనంత వరకు నీటిని సమృద్దిగా తాగాలి. దీంతోపాటు తేమ కోల్పోయిన చర్మాన్ని, పగిలిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్ లు, లోషనల్ లు అక్కర్లేదు. పొడిబారిన, పగిలిన ముఖ చర్మాన్ని పైసా ఖర్చు లేకుండా మన ఆహారంలో భాగమైన ఒక పదార్థాన్ని ఉపయోగించడం వల్ల చక్కదిద్దుకోవచ్చు. ఇంతకూ అందరికీ అందుబాటులో ఉండే ఆ పదార్థం ఏంటి?? దాన్ని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే…
ప్రతి ఇంటి వంటిట్లో తప్పనిసరిగా ఉండేది పెరుగు. పెరుగు కేవలం కడుపుకు చల్లదనాన్ని ఇవ్వటమే కాదు.. పొడిబారిన ముఖచర్మాన్ని రిపేర్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తుంది. ఇందుకోసం పెరుగును ఎలా ఉపయోగించుకోవాలంటే..
పెరుగు, శనగపిండి..
చలికాలంలో చాలామంది సోప్ వాడటం మానేసి శనగపిండి ఉపయోగిస్తారు. అయితే ఈ శనగపిండి, పెరుగు రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి మెరుపును ఇవ్వటమే కాకుండా ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగు, శనగపిండి రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకుని ముఖానికి పట్టించాలి. దీన్ని 15నిమిషాలు ఉంచి తరువాత కడిగేయాలి.
పెరుగు, బియ్యం పిండి..
ఇది మంచి ఫేస్ ప్యాక్ కమ్ స్క్రబ్. పెరుగు, బియ్యం పిండి కలిపి మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇది ప్యాక్. ఈ ప్యాక్ ఆరిన తరువాత దీన్ని స్క్రబ్ లాగా రుద్దుతూ తొలగించాలి
పెరుగు, తులసి..
7 నుండి 10 తులసి ఆకులను గ్రైండ్ చేసి దానికి పెరుగు కలపాలి. మందపాటి పేస్ట్‌లా చేసి, ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తాయి. ముఖాన్ని మృదువుగా చేస్తాయి.
పెరుగు పసుపు
పెరుగు, పసుపు రెండూ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల l ట్యానింగ్ తగ్గుతుంది.
పెరుగు తేనె..
తేనెను ఉపయోగించడం ద్వారా, ముఖంపై తేమ లోపాన్ని తొలగించవచ్చు. ప్యాక్ చేయడానికి, రెండు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకొని ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయాలి. కొంత సమయం తరువాత దీని ఫలితం కనిపిస్తుంది.
*నిశ్శబ్ద.