అమ్మాయిల ముఖం ఎప్పుడూ కాంతివంతంగా మెరవాలంటే ఈ చిట్కాలు బెస్ట్!

 

అందం కోసం ఆరాటపడని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం ఎన్నెన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా వాడతారు. కానీ ఇవన్నీ తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ విషయం గ్రహించిన తరువాత అమ్మాయిలు సహజంగా అందంగా కనిపించడం గురించి చాలా ప్రయోగాలు చేస్తారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అమ్మాయిలు ఎండల ధాటికి తొందరగా పువ్వుల్లా ఉన్నవాళ్లు కాస్తా వాడిపోయినట్టు అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే..

నీరు తాగాలి..

ప్రతిరోజూ కనీసం 2గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కేవలం వేడి నీరు 2 గ్లాసులు మాత్రమే కాదు.. సాధారణ నీరు కనీసం 4లీటర్ల వరకు తాగాలి. ఎందుకంటే వేసవిలో  ఏ చిన్న పని చేసినా, కొద్ది దూరం నడిచినా శరీరంలో తేమ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. గోరువెచ్చని నీరు తాగితే రక్తప్రసరణను మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు తెస్తుంది.


కీరదోసకాయ..

అటు కూరగాయ గానూ, ఇటు స్నాక్ గానూ, సాధారణంగా తినడానికి ఇష్టపడేది కీరదోసకాయ.  దోసకాయలలో నీటిశాతం ఎక్కువ. ఇది  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. లోపలి నుండి శరీరాన్ని చల్లబరిచి చర్మానికి మెరుపు ఇస్తుంది.దోసకాయలో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.

స్క్రబ్ వాడాలి..

వేసవి కాలంలో అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే భయపడతారు. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ట్యానింగ్. చర్మంలో సూర్యుడి ఎండకు బహిర్గతం అయ్యే భాగం అంతా రంగు మారి నల్లగా అవుతుంది. పాదాలు, చేతులు, ముఖం, మెడ ఈ సమస్యకు లోనవుతాయి. అందుకే వేసవిలో స్కిన్ ట్యాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యంపిండి, కాఫీ, పంచదార, పెసరపప్పు నూక  వంటి పదార్థాలతో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ట్యాన్ తొలగిపోయి చర్మానికి మెరుపు వస్తుంది.

ఇంటి చిట్కాలు..

ముఖం అందంగా కనిపించడానికి ఇంటి చిట్కాలు పాటించడం అమ్మాయిలకు ఎప్పటినుండో ఉన్న  అలవాటు. చాలామంది ఇంటినే బ్యూటీ సెలూన్ గా మార్చేస్తుంటారు. ఇంట్లోనే ఆరోగ్యవంతమైన   మార్గంలో ముఖాన్ని మెరిపించాలంటే పెసరపప్పు, ముల్తానీ మట్టి, శనగపిండి, పసుపు, పచ్చిపాలు, క్యారెట్, దోసకాయ, టమోటా  వంటివి వాడాలి. ఇవి చర్మానికి మంచివి.


అలోవెరా..

అలొవెరాను కలబంద అని కూడా అంటాం. తాజా కలబంద అయినా మార్కెట్లో దొరితే జెల్ అయినా బ్యూటీ టిప్స్ లో బాగా ఉపయోగిస్తారు. తాజా కలబంద జెల్ ను ముఖానికి రాసి 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.


ఆహార జాగ్రత్తలు..

శరీరం హైడ్రేట్ గా ఉండటానికి నీరు అధికంగా ఉన్న పండ్లు, సిట్రస్ పండ్లు,  యాంటీ ఏజింగ్ కు దోహదం చేసే పండ్లు, కూరగాయలు, ఆకుకూరరలు  తీసుకోవాలి. నూనె ఆహారాలు, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, శీతలపానీయాలు, స్వీట్లు  నివారించాలి.


జాగ్రత్తలు..

స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే ముఖం అందంగా ఉంటుంది. బయట నుండి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ఉపయోగించడం,  ముఖ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖానికి రోజ్ వాటర్, మాయిశ్చరైజర్ వంటివి ఉపయోగించడం ఫాలో అవ్వాలి.  ఇవన్నీ చేస్తే చర్మం  సహజ కాంతితో  మెరిసిపోతుంది.  

                                                        *రూపశ్రీ