పండగ సమయంలో అందంగా కనిపించాలంటే?
 

 

1. దుస్తుల ఎంపికలో చాలా రిచ్ గా కనబడేటప్పుడు అందుకు మినిమమ్ మేకప్ టిప్స్ అవసరం. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దుస్తులు వేసుకొన్నప్పుడు సింపుల్ మేకప్ సరిపోతుంది. అదే లైట్ కలర్ డ్రెస్ వేసుకొన్నప్పుడు మేకప్ తో బాగా కవర్ చేయాలి. కాబట్టి మీరు ధరించే దుస్తులను బట్టే మేకప్ ఎంత మోరకు అవసరమో తెలుసుకొని వేసుకోవడం మంచిది.

2. ముందుగా ముఖం శుభ్రం చేసి తర్వాత టోనర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మ శుభ్రపడుతుంది. టోనర్ ను అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా వేసుకొన్న మేకప్ చాలా సేపు అలాగే ఉండేలా చేస్తుంది.

3. మేకప్ వేసుకొనే ముందు ఫౌడేషన్ తో మొదలు పెట్టాలి. ముఖం మీద ఏదేని నల్లని మచ్చలు, మొటిమలు తాలూకు మచ్చలు ఉన్నట్లైతే కన్సీలర్ ను తప్పనిసరిగా వాడాలి. కన్సీలర్ ను ఉపయోగించడం వల్ల నల్ల మచ్చలు చర్మ రంగుతో కలిసిపోయినట్లు కనబడుతుంది. ఫౌండేషన్, కన్సీలర్ రెండూ కొనే ముందు మీ చర్మతత్వానికి సరిగ్గా సరిపోయేది మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

4. లైట్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. తర్వాత కళ్ళకు వేసుకొనే మేకప్ లిప్ స్టిక్, లిప్ గ్లాస్ వాడే కలర్ సూట్ అయ్యేవిధంగా ఉండాలి. కళ్ళు ఆకారం స్పష్టంగా పెద్దవిగా కనబడాలంటే ఐలైనర్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మస్కార అప్లై చేయడంతో ఐమేకప్ పూర్తి చేయండి. అలాగే మీరు వేసుకొనే డ్రెస్ కలర్ పెన్సిల్ ను లైట్ ఐలైనర్ వేసుకోవచ్చు.

5. పెదాలకు డార్క్ కలర్ షేడ్ కలిగినటువంటి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ముఖం చాలా సింపుల్ గా, సహజ అందంతో మేకప్ వేసుకోని సమయంలో లిప్స్ ను డార్క్ కలర్ లిప్ స్టిక్స్ తో హైలైట్ చేయండి.

6. డార్క్ కలర్ మేకప్ వేసుకొనేటప్పుడు కళ్ళ మీద కానీ, లేదా పెదాల మీద కానీ మరింత ప్రత్యేకత తీసుకోవాలి. డార్క్ మేకప్ తో మరింత అందంగా కనబడవచ్చు. అయితే డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

7. డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఐషాడోను అప్లై చేస్తే మరింత ఆకర్షనీయంగా కనబడుతారు. ఐషాడో మీద డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది.

8. డార్క్ మేకప్ వేసుకొనే వారికి ఐషాడో బ్లూ, గ్రీన్, పర్ఫుల్, బ్లాక్ మరియు గ్రే కలర్స్ ఐ మేకప్ కి బాగా సూట్ అవుతాయి. అవికూడా మీరు ధరించే దుస్తులకు మ్యాచ్ అవుతాయో లేదా ఒక సారి చూసుకొని మరీ ధరించాలి. ఐలైనర్ తో కంటిదగ్గర పలుచగా లైన్ గీసి దాని లోపలగా ఐ షాడోను అప్లై చేయాలి.

9. డార్క్ మేకప్ కోసం న్యూడ్ కలర్స్ ఎంపిక చేసుకోవడం వల్ల మేకప్ అధికంగా కనబడదు. స్కిన్ కలర్, లేదా డ్రెస్ కలర్ మేకప్ టిప్ప్ చాల అద్భుతంగా ఉంటాయి.

10. ఒక వేళ మేకప్ లైట్ గా వేసుకొన్నట్లైతే మరింత అందంగా కనబడేందుకు మేకప్ కు తగ్గ అందమైన భారీ చెవిపోగులు ధరించాలి. అప్పుడు మరింత అట్రాక్షన్ గా కనబడుతారు. కేశాలంకరణ కూడా ఫ్రీగా లూజ్ హెయిర్ లేదా జడ అల్లిక లేదా స్టైల్ బన్స్ లా అలంకరణ చేసుకొంటే సాంప్రదాయంగా కనిపిస్తారు.