ముఖం మీద మచ్చలు తొలగించి మెరుపును ఇచ్చే అద్బుతమైన చిట్కా..! ముఖం అందంగా, ఆరోగ్యంగా మచ్చలు లేకుండా ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ముఖం మీద మచ్చలు, మొటిమలు, చర్మ సమస్యలు ఏవో ఒకటి లేకుండా కనిపించే అమ్మాయిలు చాలా అరుదు. వాణిజ్య ప్రకటనలు చూసి చాలా మంది అమ్మాయిలు చాలా ఉత్పత్తులు వాడుతు ఉంటారు. కానీ పాత కాలం నుండి ఉపయోగిస్తున్న ఒకే ఒక పేస్ట్ ముఖం మీద మచ్చలు తొలగించడంతో పాటు ముఖానికి అద్భుతమైన మెరుపును కూడా ఇస్తుందట. ఇంతకీ అదేంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. పాత రోజుల్లో రసాయన ఉత్పత్తులు లేవు. అప్పటి కాలం వారు శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, పచ్చి పాలు, తేనె, పసుపు వంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన పేస్టులను మాత్రమే వాడేవారు. ముల్తానీ మట్టితో తయారు చేసిన పేస్ట్, సబ్బులను ఉపయోగించారని, ఇది వారి ముఖం, శరీరంలోని మిగిలిన చర్మాన్ని కూడా శుభ్రంగా ఉంచేదని చెబుతారు. ఇలాంటి ఒక పేస్ట్ తయారీ గురించి తెలుసుకుంటే.. ముల్తానీ మట్టి పేస్ట్.. ముల్తానీ మట్టి పేస్ట్ తయారు చేయడానికి, 1 గిన్నె ముల్తానీ మట్టికి అవసరానికి అనుగుణంగా పచ్చి పాలు, 2 టీస్పూన్ల తేనె వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఎక్కువ పాలు వేయకూడదు. లేకుంటే పేస్ట్ చిక్కగా మారుతుంది. ఈ పేస్ట్ ని ఉపయోగించడానికి, ముందుగా దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. సమయం ముగిసిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి, ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది. ప్రయోజనాలు.. ముల్తానీ మట్టి చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా, వృద్ధాప్యాన్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి పూయడం వల్ల పెద్ద చర్మ రంధ్రాలు తగ్గుతాయి. చర్మం మచ్చలేనిదిగా కనిపిస్తుంది. అదనంగా మచ్చలు తగ్గుతాయి, మెరుపు పెరుగుతుంది. సబ్బు కూడా.. శరీర చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే ముల్తానీ మట్టితో తయారు చేసిన సబ్బుతో స్నానం చేయడం మంచిది. దీన్ని తయారు చేయడానికి మీకు పేస్ట్ కోసం ఉపయోగించే పదార్థాలు మాత్రమే తప్ప పెద్దగా అవసరం లేదు. ముల్తానీ మట్టి చిక్కటి పేస్ట్ తయారయ్యాక, దానికి సబ్బు ఆకారం ఇచ్చి, ఎండలో ఆరనివ్వాలి. అది రాయిలా మారుతుంది. ఇప్పుడు స్నానం చేసే ముందు 2-3 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై స్నానానికి వాడాలి. *రూపశ్రీ.
మొటిమలు ఎందుకు వస్తాయి?దీని వెనకున్న అసలు కారణాలు ఇవీ..! ముఖం మీద మొటిమలు రావడం అనేది ఒక సాధారణ సమస్య. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ముఖంపై మొటిమలు పదే పదే కనిపించినప్పుడు సమస్య పెరుగుతుంది. ఇది అందాన్ని పాడు చేయడమే కాకుండా మొత్తం ముఖాన్ని కూడా పాడు చేస్తుంది. కానీ ముఖం మీద మొటిమలు పదే పదే ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? మొటిమలు రావడానికి కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల మార్పులు.. హార్మోన్ల మార్పుల వల్ల కౌమారదశలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. హార్మోన్ల మార్పుల వల్ల కూడా స్త్రీలకు ఋతుస్రావం, గర్భధారణ సమయంలో మొటిమలు రావచ్చు. హార్మోన్ల మార్పుల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ముఖంపై మొటిమలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా ముఖం మీద మొటిమలు వస్తాయి. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నవారు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఇది కాకుండా కొన్ని పోషకాల లోపం వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తాయి. రసాయన ఆధారిత ఉత్పత్తులు.. మెరిసే చర్మాన్ని పొందడానికి, చాలా మంది రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ వీటిలో మొటిమలకు కారణమయ్యే రసాయనాలు ఉంటాయి. తప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం, నిద్ర లేకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. ఇలాంటి వారు ముఖ మచ్చలను, మొటిమలను వదిలించుకోవాలనుకుంటే ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోవాలి. ఇది కాకుండా, ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. *రూపశ్రీ
హెయిర్ స్పా చేయించుకుంటున్నారా...ఈ నిజాలు తెలుసా! హెయిర్ స్పా అనేది జుట్టుకు పోషణను, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేసే ఒక రకమైన హెయిర్ ట్రీట్మెంట్. ఇది జుట్టు, తలపై చర్మాన్ని లోతుగా కండిషనింగ్ చేస్తుంది, తేమ చేస్తుంది, జుట్టును మృదువుగా, మెరిసేలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొంతకాలం బాగానే అనిపిస్తుంది కానీ జుట్టుకు చాలా హానికరం అని అంటున్నారు కేశ సంరక్షణ నిపుణులు. హెయిర్ స్పాలో షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ మాస్క్, కండిషనర్ మొదలైన వాటిని అప్లై చేయడం ద్వారా జుట్టును డీప్ మాయిశ్చరైజ్ చేస్తారు. కానీ హెయిర్ స్పా వల్ల జుట్టుకు చాలా నష్టం జరుగుతుందట. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. జుట్టు రాలడం.. క్రమం తప్పకుండా హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య తొలగిపోతుంది. తల చర్మం సున్నితంగా ఉండే వ్యక్తులలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా సంభవిస్తాయి. సున్నితమైన తల చర్మం ఉన్నవారు హెయిర్ స్పా ను నివారించాలి. ఒక వేళ హెయిర్ స్పా చేయించుకుంటున్నట్లయితే అందులో వాడే ప్రోడక్స్ట్ ను ఖచ్చితంగా చెక్ చేసుకుని తరువాత చేయించుకోవాలి. తల చర్మం దెబ్బతినడం.. హెయిర్ స్పాలో చాలా రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ రసాయన ఉత్పత్తులకు అలెర్జీ ఉంటే హెయిర్ స్పా చేయించుకోకుండా ఉండటం మంచిది. కొందరికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కుతూహలంగా ఉంటుంది. కానీ ఇది తల చర్మానికి చాలా నష్టం చేకూరుస్తుంది. జుట్టు రంగు పోతుంది.. క్రమం తప్పకుండా హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు రంగు మసకబారుతుంది. హెయిర్ స్పాలో బ్లీచ్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టు రంగు పోతుంది. జుట్టు తెల్లగా మారే అవకాశాలు ఎక్కువ చేస్తుంది. పొడి జుట్టు.. కొందరు హెయిర్ స్పా ఎక్కువగా చేస్తుంటారు. దీని వల్ల జుట్టు సహజ తేమ కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా తల చర్మం పొడిగా మారవచ్చు. ఇది తరువాత చుండ్రుకు కారణమవుతుంది. *రూపశ్రీ
పెదవుల నలుపును కంప్లీట్ గా తొలగించే భలే చిట్కా..! పెదవులు నల్లగా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరికి టాన్ కారణంగా పెదవులు నల్లబడతాయి. మరికొందరికి పిగ్మెంటేషన్ కారణంగా నల్లగా మారతాయి. ఇంకొందరికి పెదవుల విషయంలో సరైన సంరక్షణ తీసుకోకపోవడం వల్ల నల్లగా మారతాయి. మరికొందరికి నీరు సరిగా తాగకపోవడం వల్ల పెదవుల మీది చర్మం పొడిబారి నల్లగా మారుతుంది. అయితే కారణం ఏదైనా పెదవుల మీద నలుపు రంగును పొగొట్టుకోవడం కోసం చాలా మంది చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇంకొందరు పెదవుల రంగు కవర్ చేయడానికి విప్స్టిక్, లిప్ బామ్ వాడతారు. అయితే పెదవుల మీద నలుపును పూర్తీగా తొలగించే చిట్కా ఉంది. అది ఇంట్లోనే తయారు చేసుకున్నఔషద గుణాలు కలిగిన లిప్ బామ్.. దీన్ని వాడితే పెదవుల మీద నలుపు రంగు పోయి పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. దీన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే.. రత్నజోత్.. రత్నజోత్ అనేది ఒక రకమైన మూలిక. ఇది ఆహారం నుండి ఆరోగ్యం వరకు చాలా విధాలుగా ఉపయోగిస్తారు. సాధారణంగా దీన్ని రంగు కోసం ఉపయోగిస్తుంటారు. ఇది శరీరంలోని అనేక ఆరోగ్యి సమస్యలకు ఔషదంగా పనిచేస్తుంది. రత్నజోత్ ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు, ముఖం మీద మచ్చల తాలుకూ గుర్తులు వంటివి లేకుండా పోతాయి. ఈ మూలికను పెదవుల మీద కూడా అప్లై చేయవచ్చు. దీంతో లిప్ బామ్ ఎలా తయారు చేయాలంటే.. కావలసిన పదార్థాలు.. ఎండిన రత్నజోత్ ఆకులు - 1 టీస్పూన్ స్వచ్చమైన కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు నెయ్యి - 1 స్పూన్ లిప్ బామ్ తయారీ.. ముందుగా, ఒక పాన్ తీసుకొని దానిలో సగం నీరు నింపాలి. ఒక గుడ్డను నీటిలో ముంచి, దానిపై ఒక గిన్నెలో రత్నజోత్ ఆకులు, కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. ఇలా చేసిన తర్వాత గిన్నెలో ఉంచిన రత్నజోత్ దాని రంగును విడుదల చేస్తుంది. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రత్నజోత్ విడుదల చేసిన రంగు కారణంగా గిన్నెలో ఉంచిన కొబ్బరినూనె గులాబీ రంగులోకి మారుతుంది. ఇలా రంగు మారినప్పుడు గ్యాస్ ఆపివేయాలి. ఇప్పుడు ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక చెంచా దేశీ నెయ్యి వేయాలి. దీని తరువాత అందులో రత్నజోత్ ద్రావణాన్ని నెయ్యితో కలపాలి. అదంతా సెట్ అయ్యేలా కొద్దిసేపు వదిలేయాలి. ఇది గట్టి పడిన తరువాత పెదవుల నల్లదనాన్ని తగ్గించే హెర్బల్ లిప్ బామ్ నిమిషాల్లో సిద్దమైనట్టే.. ప్రయోజనాలు.. కొబ్బరి నూనె అయినా లేదా నెయ్యి అయినా రెండింటినీ పెదవులపై రాసుకోవడం వల్ల పొడిబారిన, పగిలిన పెదవుల సమస్య పరిష్కారమవుతుంది. ఇది పెదవుల నల్లదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పెదవులను మృదువుగా గులాబీ రంగులోకి మారుస్తుంది. *రూపశ్రీ.
వయసు ప్రకారం సీరమ్ ఎంచుకోవాలా...అసలు నిజాలు ఇవీ..! అమ్మాయిలకు చర్మ సంరక్షణ పట్ల ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. చాలామంది అమ్మాయిలు ముఖ చర్మం అందంగా ఉండటానికి పేస్ సీరమ్ వాడుతుంటారు. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతో పాటు చర్మం క్లియర్ కావడంలో సహాయపడుతుంది. అయితే చాలామంది ఫేస్ సీరమ్ వాడుతున్నా సరే చర్మంలో మెరుగుదల లేదని, చర్మం మరింత పాడవుతోందని అంటుంటారు. అయితే ఫేస్ సీరమ్ ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక పద్దతి ఉందని. వయసును బట్టి ఫేస్ సీరమ్ ఎంచుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. అలా చేయకపోవడం వల్లే చర్మం పాడవుతుందని అంటున్నారు.ఇంతకూ వయసును బట్టి ఫేస్ సీరమ్ ఎలా ఎంపిక చేసుకోవాలి తెలుసుకుంటే.. ఏ వయసులోనైనా.. ఏ వయసులోనైనా ఉపయోగించగల కొన్ని సీరమ్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో సూర్యరశ్మి నుండి రక్షణ కల్పించే విటమిన్ సి, బ్లాక్ హెడ్స్ కు ఉపయోగపడే సాలిసిలిక్ యాసిడ్ ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. 20 ఏళ్ల మధ్యలో.. 20 ఏళ్ల మధ్యలో 23, 24, 25, 26 ఏళ్ల వయస్సు గలవారు ఎంచుకోవలసిన సీరమ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వయస్సులో ముఖం నుండి తగ్గడం ప్రారంభం అవుతుంది. ఈ కొల్లాజెన్‌ను సరిచేయడానికి రెటినోల్‌ను ఉపయోగించవచ్చు . మరోవైపు చర్మపు రంగును సమం చేసుకోవాలనుకుంటే నియాసినమైడ్ సీరం ఉపయోగించడం మంచిది. 26 ఏళ్ల తర్వాత.. 25-26 సంవత్సరాల వయస్సు అంటే చర్మంపై ఎక్కువ శ్రద్ధ చూపలేని వయస్సు. పని కారణంగా, మన కళ్ళ కింద నల్లటి వలయాలు, తేలికపాటి ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. వయస్సుకు అనుగుణంగా సరైన సీరం ఎంచుకోవడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకునే సమయం ఇది. అదే సమస్యను మీరు ఎదుర్కొంటున్నట్లయితే, 20 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి డాక్టర్ సిఫార్సు చేసిన పెప్టైడ్స్ సీరం ఉపయోగించాలి. 30 ఏళ్లు పైబడిన వారికి.. 30 ఏళ్ల తర్వాత చర్మంపై మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. మనం మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే, మన చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. అందువల్ల, హైలురానిక్, గ్లైకోలిక్ యాసిడ్ వాడకం ఏ వయసు వారైనా, ముఖ్యంగా 30 ఏళ్లలోపు మహిళలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో, హైపర్పిగ్మెంటేషన్ తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ
మేకప్ మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..! మేకప్ అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన వాటిలో ఒకటిగా మారింది. ఫంక్షన్, పెళ్లి, పండుగ.. సరదాగా బయటకు వెళ్లడం, ఫ్రెండ్స్ తో ఎక్కడైనా టూర్ కు వెళ్లడం.. ఇలా ఒకటనేమిటి.. ప్రతి సందర్భంలోనూ మేకప్ వేసుకుంటేనే వారికి తృప్తి. ఎక్కువ మేకప్ అలవాటు లేనివారు కూడా సింపుల్ గా లిప్స్టిక్, ఫౌండేషన్ మొదలైనవి వేసుకుంటారు. అయితే మేకప్ వేసుకోవడం పెద్ద సమస్య కాదు.. వేసుకున్న మేకప్ ను ఎక్కువ సేపు ఉంచుకోవడం, మేకప్ అట్రాక్షన్ గా ఉంచుకోవడంలోనే అసలు సమస్య దాగుంది. మేకప్ వేసుకోవడం చాలామందికి వచ్చు కానీ మరింత ఆకర్షణగా వేసుకోవడం మాత్రం రాదు. మేకప్ మరింత ఆకర్షణగా వేసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. క్లెన్సర్.. మేకప్ మెరుస్తూ ఉండాలంటే చర్మ రకానికి తగినట్టు తేలికపాటి క్లెన్సర్ ఉపయోగించాలి. ఇది మేకప్ బాగా వచ్చేలా చేస్తుంది. మాయిశ్చరైజర్.. చర్మం హైడ్రేట్ గా ఉండాలంటే చర్మానికి తేలికగా మాయిశ్చరైజర్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. ఫౌండేషన్.. ఫౌండేషన్ ను అప్లై చేయడానికి తడి స్పాంజ్ లేదా బ్రష్ ఉపయోగించాలి. దీని వల్ల ఫౌండేషన్ చర్మంలోకి బాగా కలిసిపోతుంది. సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. అలా చేయకపోతే తెరలు తెరలు లేదా చారలుగా ఫౌండేషన్ ముఖం మీద ఉండిపోతుంది. కన్సీలర్.. కళ్ల కింద ఏవైనా నల్లటి వలయాలు, లేదా మచ్చలు ఉంటే వాటిని కవర్ చేయడానికి కన్సీలర్ ఉపయోగించాలి. వేళ్లతో లేదా బ్రష్ తో కన్సీలర్ ను అప్లై చేసి బాగా బ్లెండ్ చేయాలి. హైటైటర్.. నిగనిగలాడే మేకప్ లో హైలైటర్ చాలా ముఖ్యం. మఖంలో సహజ కాంతి పడే భాగాలలో హైలైటర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది. ఎండింగ్.. మేకప్ ముగించే ముందు లిక్విడ్ రూపంలో ఉన్న లేదా క్రీమ్ రూపంలో ఉన్న హైలైటర్ ను ఉపయోగించాలి. ఇది అయితే బాగా బ్లెండ్ అయ్యి మొత్తం పరుచుకునేలా చేస్తుంది. ఐ షాడో.. ముఖంలో ఆకర్షించేవి కళ్లు. ఈ కళ్ల ఆకర్షణ మరింత పెంచాలి అంటే మెరుపుతో కూడిన ఐ షాడో ను ఉపయోగించాలి. పెదవులు.. పెదవులు కూడా ఆకర్షణగా మెరుస్తూ ఉండాలంటే లిప్ గ్లాస్ లేదా గ్లాసీ లిప్ స్టిక్ ను ఉపయోగించాలి. *రూపశ్రీ.
ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. 40 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపిస్తారు..! యవ్వనంగా కనిపించాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. మహిళలు ఎప్పుడూ అందంగా తయారవుతారు. అయితే మేకప్ లు గట్రా లేకుండా సహజంగా అందంగా కనిపించడంలోనే మహిళల క్రెడిట్ దాగి ఉంటుంది. సాధారణంగా మహిళలకు 40 సంవత్సరాల వయసు అంటే ఒకరో, ఇద్దరో పిల్లలతో ముఖం మీద ముడతలతో, తెల్లని జుట్టుతో వయసును బయటకు వ్యక్తం చేస్తూ ఉంటుంది శరీరం. అయితే అలా కాకుండా 40 ఏళ్లు వచ్చినా సంతూర్ మామ్ లాగా కనిపించాలని అనుకుంటారు మహిళలు. అందుకోసం చాలా చిట్కాలు కూడా ఫాలో అవుతారు. అయితే ఈ కింద చెప్పుకునే 5 చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల 40 ఏళ్ళు దాటినా చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇంతకీ ఈ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. 40 సంవత్సరాల తర్వాత మెడ చర్మం వదులుగా మారి త్వరగా ముడతలు పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ, కొల్లాజెన్ తగ్గడం వల్ల చర్మం ఎలాస్టిన్ గుణం తగ్గిపోతుంది. ఈ కారణంగా చర్మం ముడతలు పడుతుంది. చర్మం బిగుతుగా ఉండాలంటే ఇలా చేయాలి. గ్లైకోలిక్ లేదా సాలిసిలిక్ యాసిడ్ తో ఎక్స్‌ఫోలియేషన్.. మెడ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వారానికి రెండుసార్లు గ్లైకోలిక్ లేదా సాలిసిలిక్ యాసిడ్ ఉపయోగించాలి. ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, కొత్త కణాలను పునరుత్పత్తి చేయడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. రాత్రిపూట వీటిని అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మర్చిపోకూడదు. రెటినాయిడ్స్.. రెటినాయిడ్స్ ముడతలను తగ్గించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అవి చర్మాన్ని లోతుగా రిపేర్ చేసి, కణాల పునరుద్ధరణను పెంచుతాయి. చర్మానికి మరింత యవ్వన రూపాన్ని ఇస్తాయి. రాత్రిపూట రెటినాయిడ్స్‌ను పూయాలి, ఉదయం ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. ఎందుకంటే రెటినాయిడ్స్ చర్మాన్ని సూర్యకాంతికి మరింత సున్నితంగా చేస్తాయి. హైలురోనిక్ యాసిడ్, నియాసినమైడ్ మాయిశ్చరైజర్.. చర్మాన్ని ఎక్కువ కాలం పాటు హైడ్రేటెడ్ గా, మృదువుగా ఉంచడానికి, హైలురానిక్ ఆమ్లం, నియాసినమైడ్ కలిగిన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. హైలురానిక్ ఆమ్లం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అయితే నియాసినమైడ్ చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. రెండు పదార్థాలు మెడ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారం.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బెర్రీలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు, పాలకూర, చిలగడదుంపలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. అవిసె గింజలు, వాల్‌నట్‌లలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. సరైన డైలీ స్కిన్ కేర్ రొటీన్.. మెడ చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి డైలీ స్కిన్ కేర్ న ఫాలో అవ్వాలి. ఉదయం తేలికపాటి క్లెన్సర్‌తో ముఖం, మెడను శుభ్రం చేసుకోవాలి. విటమిన్ సి సీరం లేదా నియాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత SPF 50 సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. సాయంత్రం పూట ముఖాన్ని మళ్ళీ తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు గ్లైకోలిక్ యాసిడ్ రాయాలి. ప్రతి రాత్రి రెటినోయిడ్ వాడాలి. ప్రతి రాత్రి చర్మ సంరక్షణ దినచర్యను హైలురానిక్ యాసిడ్ కలిగిన మాయిశ్చరైజర్‌తో పూర్తి చేయాలి. మెడ చర్మం, ముఖ చర్మం లాగా సున్నితమైనది. దానిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. సరైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలితో ముడతలు, వదులుగా ఉండే చర్మాన్ని నివారించవచ్చు. క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా కాలం పాటు అందంగా మరియు యవ్వనంగా ఉండవచ్చు. *రూపశ్రీ.
బంగాళదుంప రసం చర్మానికి రాస్తే జరిగేదేంటి... బంగాళాదుంపలను సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ దీనితో చేసే కూరను ఎంతో ఇష్టంగా తింటారు. ఇది సాధారణ శాకాహారంగా ఎలాంటి మసాలాలు లేకుండా వండినా రుచిగా ఉంటుంది. మసాలాతో కలిపి వండితే రుచి ఇనుమడిస్తుంది. దీన్ని స్నాక్స్ గా చేస్తే భలే బావుంటుంది. ఇక నాన్ వేజ్ ను పోలి ఘుమఘుమలాడించినా అదరగొట్టేస్తుంది. అయితే బంగాళదుంపలు కేవలం రుచికే కాదండోయ్ చర్మ సంరక్షణలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. బంగాళదుంప రసాన్ని చర్మానికి రాయడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. బంగాళాదుంపలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. బంగాళాదుంప రసం వల్ల కలిగే చర్మ ప్రయోజనాలను తెలుసుకుంటే.. మచ్చల కోసం.. బంగాళాదుంప రసం ముఖ మచ్చలను తగ్గించడంలో ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. మచ్చలేని, మెరిసే చర్మాన్ని పొందడానికి దీన్ని ఉపయోగించవచ్చు. దీని కోసం బంగాళాదుంపను తురుమి దాని రసాన్ని తీయాలి. తర్వాత మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. నల్లటి వలయాలు.. కళ్ళ కింద బంగాళాదుంప రసం లేదా బంగాళాదుంప ముక్కలను పూయడం వల్ల నల్లటి వలయాల సమస్య తగ్గుతుంది. ఇది వాపును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. మెరిసే చర్మం.. బంగాళాదుంప రసం చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖం మీద వేరే మెరుపు కనిపిస్తుంది. మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే బంగాళాదుంపను పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్ లేదా బంగాళాదుంప రసాన్ని ఉపయోగించవచ్చు. సన్ బర్న్.. బంగాళాదుంప రసం కూడా సన్ బర్న్ సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది ఎండ కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేస్తుంది. ముడతలు.. బంగాళాదుంపలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ముడతల సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. మొటిమలు.. మొటిమల సమస్యతో బాధపడుతుంటే బంగాళాదుంప రసం ప్రయోజనకరంగా ఉంటుంది. బంగాళాదుంప రసాన్ని ఉపయోగించడం ద్వారా మొటిమల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. *రూపశ్రీ.
జుట్టు పెరుగుదల కోసం రోజ్మేరీ ఆయిల్ వాడుతున్నారా...ఈ ప్రమాదం ఉందని తెలుసా! ఆరోగ్యకరమైన జుట్టు కోసం అమ్మాయిలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేనా బోలెజు జుట్టు పెరుగుదల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యం విషయానికి వస్తే కొబ్బరి నూనె, ఉల్లిపాయ నూనె, బాదం నూనె వంటివి చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో జుట్టు పెరుగుదల విషయంలో రోజ్మేరీ బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది జుట్టు పెరుగుదల కోసం రోజ్మేరీ నూనెను ఉపయోగించమని రికమెండ్ చేస్తున్నారు కూడా. అయితే ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ అయితే కాదు.. ఎందుకంటే రోజ్మేరి చాలా ఏళ్ల నుండే జుట్టు పెరుగుదలలో, జుట్టు సంరక్షణలో ఉపయోగించబడుతోంది. అయితే రోజ్మేరీ వల్ల జుట్టు పెరుగుదల అని చెప్పడమే కాకుండా.. జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది నిజమేనా అని చాలా మంది షాకవ్వచ్చు. కానీ ఇది నిజమే.. రోజ్మేరీ జుట్టు పెరుగుదలకు ఎలా సహాయపడుతుందో? ఇదే రోజ్మేరీ జుట్టు రాలిపోవడానికి కూడా ఎలా కారణం అవుతుందో తెలుసుకుంటే.. రోజ్మేరీ ప్రయోజనాలు.. జుట్టు పెరుగుదల.. రోజ్మేరీ నూనె తలకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఇది జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. ఆరు నెలలు రోజ్‌మేరీ నూనెను ఉపయోగిస్తుంటే జుట్టు పెరుగుదల చాలా ఆశాజనకంగా ఉంటుంది. చుండ్రును తగ్గిస్తుంది : రోజ్మేరీ నూనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును ఎదుర్కోవడానికి సహాయపడతాయి. రోజ్మేరీలో రోస్మరినిక్ ఆమ్లం, కార్నోసిక్ ఆమ్లం, కార్నోసోల్ ఉన్నాయి, ఇవి యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. రోజ్మేరీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద లేదా చికాకు కలిగించే నెత్తిమీద చర్మాన్ని ట్రీట్ చేస్తాయి. కాలక్రమేణా పొరలుగా మారడాన్ని తగ్గిస్తాయి. రోజ్మేరీ ఆయిల్ జుట్టు రాలడానికి కారణమవుతుందా? రోజ్మేరీ నూనె జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడినప్పటికీ ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుందని కొందరు అంటున్నారు. దానికి ఈ కింది విషయాలు కారణం కావచ్చు. పలుచన .. రోజ్మేరీ నూనె చాలా గాఢంగా ఉంటుంది. క్యారియర్ ఆయిల్‌తో కలపకుండా నేరుగా తలకు పూయడం వల్ల చికాకు కలుగుతుంది. ఇది చర్మం ఎర్రబడటం, దురద, వాపుకు దారితీస్తుంది. దెబ్బతిన్న తల చర్మం జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అధిక వినియోగం.. రోజ్మేరీ నూనె జుట్టు రాలడానికి దాన్ని అతిగా వాడటం కూడా కారణం కావచ్చు. దీన్ని తరచుగా రోజువారీగా లేదా అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నెత్తిమీద నూనె పేరుకుపోతుంది. ఇది జుట్టు కుదుళ్లు మూసుకుపోవడానికి, సహజ నూనె ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల తలలో అధిక జిడ్డును ఏర్పడుతుంది. ఈ రెండూ జుట్టు బలహీనపడటానికి, జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి. అలెర్జీ.. కొంతమందికి రోజ్మేరీ నూనె అప్లై చేసిన తర్వాత అలెర్జీ రియాక్షన్స్ ఉండవచ్చు. అలెర్జీ రియాక్షన్స్ లక్షణాలలో దురద ఒకటి. ఇది పదేపదే తలలో గోకడానికి కారణమవుతుంది. తలపై తరచుగా గోకడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఇది జుట్టు సహజంగా పెరగడానికి ఆటంకం కలిగిస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది. బలహీనమైన జుట్టు.. రోజ్మేరీ నూనె జుట్టు రాలడానికి కారణమవుతుంటే దానికి మూలకారణం రోజ్మేరీని కొత్తగా వాడటం మొదలుపెట్టడమ. ఈ నూనె వాడటం ప్రారంభిచిన కొత్తలో కొంతమందికి జుట్టు రాలడం పెరుగుతుంది . దీనికి కారణం రక్త ప్రసరణ మెరుగుపడి కొత్త, ఆరోగ్యకరమైన జుట్టు పెరగడం ప్రారంభించినప్పుడు బలహీనమైన జుట్టు రాలిపోవచ్చు. ఇలా జుట్టు రాలడాన్ని నూనె సైడ్ ఎఫెక్ట్ గా భావించకూడదు. ఈ సమస్య కొన్ని వారాలలోనే సాల్వ్ అయిపోతుంది. తల చర్మ ఆరోగ్యం.. సెబోర్హెయిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్లుయ ఉంటే రోజ్మేరీ ఆయిల్ సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఇది ఈ నెత్తిమీద సమస్యల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. జుట్టు రాలడానికి కూడా దారితీయవచ్చు. ఇలాంటి చర్మవ్యాధి సమస్యలు ఉన్నవారు రోజ్మేరీ ఆయిల్‌తో సహా ఏదైనా ముఖ్యమైన నూనెను ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
కుంకుడు కాయలు ఇలా వాడితే చాలు.. తెల్ల జుట్టు పరార్..! తెల్లజుట్టు చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నేటికాలంలో చెడు జీవనశైలి కారణంగా, అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జుట్టు సంరక్షణ కోసం అన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఉత్పత్తులు జుట్టుకు హాని కలిగిస్తాయి. జుట్టు నెరవడానికి, రాలడానికి అతిపెద్ద కారణం చెడు జీవనశైలి. అయితే జుట్టు సంరక్షణ కోసం కుంకుడు కాయలను ఉపయోగించవచ్చు. కుంకుడు కాయలు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గించుకోవడమే కాదు.. తెల్లజుట్టు కూడా నివారించుకోవచ్చట. అది ఎలాగో తెలుసుకుంటే.. కుంకుడుకాయ జుట్టుకు చాలా ఆరగ్యవంతమైనది. దీనిని షాంపూ స్థానంలో ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి కుంకుడు కాయలను పగలగొట్టి రాత్రంతా వేడి నీటిలో నానబెట్టండి. తరువాత ఉదయం దానిని గుజ్జు చేసి, ఆపై ఫిల్టర్ చేయాలి. ఈ నీటిని తల స్నానం కోసం వాడాలి. కేవలం ఇలా కుంకుడు కాయను నీటిలో నానబెట్టి వాడటమే కాదు. కుంకుడు కాయలను బాగా ఎండబెట్టి తరువాత పగలకొట్టి అందులో విత్తనాలు తీసేయాలి. తరువాత ఆ కుంకుడు కాయలను బాగా గ్రైండ్ చేయాలి. ఇలా చేస్తే పొడి తయారవుతుంది. తల స్నానానికి కనీసం అరగంట ముందు ఈ పొడిని వేడి నీటిలో వేసి ఉంచితే చాలు చాలా బాగా నురుగు వస్తుంది. దీంతో తల స్నానం చేయవచ్చు. కుంకుడు కాయలు వాడటం వల్ల కలిగే ప్రయజనాలు ఏంటంటే.. జుట్టును బలంగా మారుస్తుంది.. కుంకుడు కాయ నీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది జుట్టును మందంగా, బలంగా మార్చడంలో సహాయపడుతుంది. చుండ్రును వదిలించుకోవచ్చు.. కుంకుడు కాయ నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, ఇతర జుట్టు సంబంధిత సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. దీని వాడకంతో దురద సమస్య కూడా తగ్గుతుంది. నిస్తేజమైన జుట్టు కోసం.. కుంకుడు కాయ నీరు నిర్జీవంగా ఉన్న జుట్టుకు జీవం పోస్తుంది. ముందుగా ఇది జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. తరువాత జుట్టు ఆకృతిని సరిచేసి దానికి జీవం పోస్తుంది. జుట్టును నల్లగా చేసుకోండి. జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి కుంకుడు కాయను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది తెల్ల జుట్టును నల్లగా చేయడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
ఎండ వల్ల చర్మం కందిపోయిందా...ఇలా చేయండి..! ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళితే చాలు.. ఎండ మిట్టమధ్యాహ్నం కాస్తున్నట్టు ఉంటుంది. సూర్యుడి కిరణాలు మండుతున్న అగ్నిగోళంలా శరీరాన్ని తాకుతాయి. చాలా వరకు సున్నితమైన చర్మం ఉన్నవారు సూర్యుడి వేడి కిరణాల వల్ల చాలా ఇబ్బంది పడతారు. చర్మం ఎండ వేడికి కందిపోయి ఎర్రబడుతుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది వివిధ చిచ్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఎండ వేడికి కందిపోయిన చర్మానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈ కింద చిట్కాలు పాటించాలి. కలబంద జెల్.. కలబంద చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్, చర్మానికి ఊరట ఇస్తుంది. ఎండలో కందిపోయిన ప్రదేశంలో తాజా కలబంద జెల్‌ను పూయడం వల్ల చికాకు తగ్గుతుంది, చర్మం చల్లబడుతుంది. దీన్ని రోజుకు 2-3 సార్లు అప్లై చేయాలి. దీని వల్ల చర్మం చల్లగా మారడమే కాకుండా చర్మం మీద టాన్ కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. చల్లని పాలు.. చల్లటి పాలలో ఒక గుడ్డను నానబెట్టి ఎండలో కందిపోయిన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. నిజానికి పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. సరిపడినన్ని పాలు లేకపోతే పాలలో కాస్త నీరు లేదా రోజ్ వాటర్ వంటివి మిక్స్ చేసుకోవచ్చు. పెరుగు, పసుపు ప్యాక్.. పెరుగులో పసుపు కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఈ పెరుగు, పసుపు ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది. పసుపు వాపును, ఎరుపును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. పెరుగు చర్మానికి మాయిశ్చరైజర్ లా మృదుత్వాన్ని ఇస్తుంది. దోసకాయ రసం.. దోసకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది. వడదెబ్బ నుండి బయటపడటానికి, దోసకాయను పలుచని ముక్కలుగా కోసి, ఎండలో కందిపోయిన ప్రదేశంలో ఉంచాలి. లేదంటే దసకాయ రసాన్ని తీసి చర్మంపై పూత లాగా పూయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం చల్లగా ఉంటుంది. కొబ్బరినూనె.. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఎండలో కందిపోయిన ప్రదేశంలో కొబ్బరి నూనెను తేలికగా రాయాలి. ఇది చర్మం తేమను కాపాడుతుంది, చికాకును తగ్గిస్తుంది. దీనితో పాటు సన్‌బర్న్ లేదా టాన్‌ను తొలగించడానికి బేకింగ్ సోడా, ఓట్ మీల్, గ్రీన్ టీని కూడా ఉపయోగించవచ్చు. *రూపశ్రీ.
టానింగ్ తొలగించే సూపర్ సోప్.. ఇంట్లోనే ఇలా చేస్కోండి..! వేసవి కాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు టానింగ్ గురించి ఆందోళన చెందుతారు. మండే ఎండలు చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి. దీని కారణంగా టానింగ్, వడదెబ్బ వంటి సమస్యలు మొదలవుతాయి. టానింగ్ వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. దీన్ని తొలగించుకోవడానికి, టానింగ్ సమస్య నుండి బయటపడటానికి చాలా చిట్కాలు, మార్కెట్ ఉత్పత్తులు వాడతారు. కానీ కొన్ని ఇంట్లోనే ఉన్న పదార్థాల సహాయంతో ఇంట్లోనే సబ్బును తయారు చేసుకుని టానింగ్ సమస్య నుండి బయటపడవచ్చు. టానింగ్ సమస్య నుండి బయటపడటానికి ఇంట్లో సబ్బును ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. టానింగ్ సోప్ తయారీకి అవసరమైన పదార్థాలు.. గ్లిజరిన్ సబ్బు బేస్ - 1 కప్పు నిమ్మరసం - 2 టీస్పూన్లు పసుపు పొడి - 1 టీస్పూన్ అలోవెరా జెల్ - 2 టీస్పూన్లు పచ్చి పాలు - 3 టీస్పూన్లు గంధపు పొడి - 1 టీస్పూన్ రోజ్ వాటర్ - 1 టీస్పూన్ బాదం లేదా కొబ్బరి నూనె - 1 టీస్పూన్ నారింజ తొక్కల పొడి - 1 టీస్పూన్ సబ్బును ఎలా తయారు చేయాలంటే.. సబ్బు తయారు చేయడానికి ముందుగా గ్లిజరిన్ సబ్బు బేస్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కరిగించాలి. సోప్ బేస్ కరిగించడానికి డబుల్ బాయిల్ పద్దతి ఉపయోగించాలి. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు మరిగాక అందులో మరొక ఖాళీ గిన్నె పెట్టి అందులో సోప్ బేస్ వేసి ఆ వేడి మీద కరిగించాలి. అది కరిగిన తర్వాత దానికి నిమ్మరసం, పసుపు, కలబంద జెల్, పాలు, గంధపు పొడి, రోజ్ వాటర్, కొబ్బరి నూనె, నారింజ తొక్కల పొడి మొదలైనవి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిని సిలికాన్ మౌల్డ్ లేదా ప్లాస్టిక్ అచ్చులో పోయాలి. స్టీల్ గిన్నెలలో అయినా వేసుకోవచ్చు. తరువాత 5 గంటలు అలాగే ఉంచండి. సబ్బు పూర్తిగా చల్లారిన తర్వాత, దానిని బయటకు తీయాలి. ఇది అచ్చం మార్కెట్లో కొన్న సోప్ లాగే కనిపిస్తుంది. ఇందులో ఉపయోగించినవి అన్నీ సహజమైన పదార్థాలే.. పైగా చర్మానికి ఎంతో మేలు చేసేవి. కాబట్టి ఈ సోప్ ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి ముఖంపై సహజమైన మెరుపు కనిపిస్తుంది. ఈ సోప్ ను రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చర్మం ఎంతో మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. *రూపశ్రీ.
ముఖాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచే సీరమ్ ఇది..! ప్రతి అమ్మాయి తన ముఖ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంది. దీని కారణంగానే మార్కెట్లో బోలెడు రకాల ఫేస్ క్రీములు, స్ప్రేలు, ఫేస్ ప్యాక్ లు, సీరమ్ లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి కావడం వల్ల ఇవి వాడితే కలిగే ఫలితాలు తాత్కాలికంగా ఉంటే. వీటిని మానేసినప్పుడు ముఖ చర్మం మునుపటికంటే దారుణంగా ఉంటుంది. కానీ ముఖ చర్మాన్ని ఇంటి పట్టునే ఆరోగ్యంగా, యవ్వనంగా, కాంతివంతంగా మార్చే సీరమ్ ఉంది. దీన్ని స్వయానా చర్మ సంరక్ష నిపుణులే రికమెండ్ చేస్తన్నారు. ఈ సీరమ్ ఏంటో.. దీన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. కొబ్బరినూనె అలోవెరా జెల్ పసుపు విటమిన్-ఇ క్యాప్సూల్ తయారీ విధానం.. పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని ఒక చిన్న కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ప్రతిరోజూ ముఖానికి పట్టించి 2 నుండి 3 నిమిషాలు ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి పొందుతుంది. ఇది ముఖంపై మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే రసాయనాలతో నిండిన సీరమ్ లకు బదులు దీన్ని వాడితే చర్మానికి ఎలాంటి హాని ఉండదు. ఇది మాత్రమే కాకుండా ఇంటి పట్టున తయారుచేసుకోగలిగిన మరొక ఫేస్ సీరమ్ కూడా ఉంది. అదెలా తయారుచేసుకోవాలి అంటే.. కావలసిన పదార్థాలు.. విటమిన్-సి క్యాప్సూల్స్.. 2 విటమిన్ ఇ క్యాప్సూల్.. 1 రోజ్ వాటర్.. 2 స్పూన్లు కలబంద జెల్.. 1 టీస్పూన్ గ్లిసరిన్.. 1 టీస్పూన్ ఒక చిన్న కంటైనర్ తయారు చేసే పద్ధతి.. ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలపాలి. అందులో 2 క్యాప్సూల్స్ విటమిన్ సి, 1 క్యాప్సూల్ విటమిన్ ఇ కలపాలి. చివరగా గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో నిల్వచేసుకోవాలి. దీన్ని వారం పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. ఎలా ఉపయోగించాలి.. రాత్రి లేదా పగటిపూట నిద్రపోయే ముందు ఈ సీరమ్‌ను ముఖంపై అప్లై చేయవచ్చు. అయితే దీనికి ముందు ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత టోనర్‌ను అప్లై చేసి ఆ తరువాత సీరమ్‌ను అప్లై చేయాలి. 2 నుండి 3 నిమిషాల తర్వాత ఫేస్ క్రీమ్ రాసుకోవచ్చు. దీన్ని డే స్కిన్ కేర్‌లో అప్లై చేస్తే సన్‌స్క్రీన్ కూడా అప్లై చేయాలి. *రూపశ్రీ.
బొటాక్స్ ఫేస్ మాస్క్.. ఇది వాడితే ఎంత అందంగా కనిపిస్తారంటే..! ముఖం అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అందంగా కనిపించడం కోసం మొదటగా సౌందర్య సాధనాలు ఉపయోగించడానికి, సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడటానికే మొగ్గు చూపుతారు. ఆ తరువాత బొటాక్స్ ట్రీట్మెంట్, ఫిల్లర్లు వంటి స్కిన్ ట్రీట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ముఖ కాంతిని పెంచడానికి, ముఖం అందంగా కనిపించడానికి రసాయన ఉత్పత్తులు అక్కర్లేదు. ఇంట్లోనే సహజంగా బొటాక్స్ ఫేస్ మాస్క్ ట్రై చేయవచ్చు. ఆయుర్వేద నిపుణులు చెప్పిన ఈ బొటాక్స్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి, ఇందుకోసం ఏం అవసరం అవుతాయి దీన్నెలా ఉపయోగించాలి? మొదలైన విషయాలు తెలుసుకుంటే.. సహజ బొటాక్స్ ఫేస్ మాస్క్ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది .అలాగే చర్మంలో ఉన్న అడ్డంకులు తొలగించి చర్మాన్ని మరమ్మతు చేస్తుంది. అంతేకాదు ముఖంపై ముడతలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. అరటిపండుతో తయారు చేసే ఈ ఫేస్ మాస్క్ చర్మానికి గొప్ప మ్యాజిక్ ట్రీట్మెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 'సాధారణంగా బొటాక్స్ ట్రీట్మెంట్ కోసం 5-10 వేల రూపాయల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లో కేవలం 15-20 రూపాయలతో సులభంగా బొటాక్స్ ట్రీట్మెంట్ లాంటి ఫలితాలు పొందవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ఏ వస్తువులు అవసరమంటే.. కావలసిన పదార్థాలు.. అరటిపండు- 1 అలోవెరా జెల్ - 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ - 1 టేబుల్ స్పూన్ విటమిన్ ఇ టాబ్లెట్స్ – 2 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ - 1 ఎలా తయారుచేయాలి? ముందుగా ఒక గిన్నె తీసుకుని, అందులో పండిన అరటిపండును కట్ చేసి మెత్తగా చేయాలి. దీని తర్వాత కలబంద జెల్, గ్లిజరిన్ వేసి బాగా కలపండి. చివరగా విటమిన్ E, చేప నూనె వేసి మృదువైన పేస్ట్ తయారు చేయాలి. ముఖానికి సహజమైన మెరుపును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బొటాక్స్ ఫేస్ మాస్క్ ఇదే. దీన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఫలితాలు.. ముఖం పొడిబారడం, కరుకుదనాన్ని తగ్గించడంలో గ్లిజరిన్ వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని పొడి, సాధారణ, జిడ్డుగల అన్ని రకాల చర్మాలపై ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, క్లియర్ గా ఆకర్షణీయంగా చేస్తుంది. *రూపశ్రీ.
చర్మం పొడిబారుతోందా...ఈ టిప్స్ ఫాలో అయితే సరి..! చర్మం పొడిబారే సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇది మొదట్లో ఒక చిన్న ఇబ్బందిగా మొదలై దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్ది పెద్ద సమస్యగా మారుతుంది. చర్మం పొడిబారడం వల్ల సున్నితంగా తయారవుతుంది. ఇది చర్మాన్ని వాతావరణ పరిస్థితులకు విరుద్దంగా మారుస్తుంది. పొడి చర్మం ఉన్నవారు ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో నూనెలు వాడటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మనం సాధారణం అనుకున్న నూనెలు చర్మాన్ని ఎలా కాపాడతాయో తెలుసుకుంటే.. కొబ్బరినూనె.. కొబ్బరినూనె గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గించి చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. స్నానానికి గంట ముందు కొబ్బరినూనెను ఒళ్లంతా పట్టించుకోవాలి. తరువాత స్నానం చేయాలి. కెమికల్స్ ఎక్కువగా ఉన్న సోప్ వాడకూడదు. పొడి చర్మానికి గ్లిజరిన్ సోపులు మంచివి. తేనె.. తేనెను ఇష్టమైన పేస్ మాస్క్ లో ఉపయోగించవచ్చు. లేదా తేనెను ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. కలబంద.. సౌందర్య ఉత్పత్తులలో కలబంద జెల్ బాగా పేరు పొందింది. కలబంద జెల్ ను చర్మం పై అప్లై చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. అలాగే తాజా కలబంద జెల్ ను సేకరించి పేస్ ప్యాక్ లా వేసుకుని కడిగేస్తున్నా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనెను ఇష్టమైన లోషన్ లో కలిపి ఉపయోగించవచ్చు. మంచి ఫలితం ఉంటుంది. పెరుగు.. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయడానకిి సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా కూడాచేస్తుంది. చర్మం పొడిబారుతుంటే పెరుగును ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేయవచ్చు. దోసకాయ.. దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం మీద మొటిమలు, దద్దుర్లు వంటివి రాకుండా చేస్తుంది. చర్మం రంధ్రాలను రిపేర్ చేస్తుంది. దోసకాయ రసాన్ని చర్మానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓట్ మీల్.. ఓట్ మీల్ ను నీటిలో కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. దీన్ని చర్మం పైన అప్లై చేయాలి. ఫస్ట్ ముఖానికి స్క్రైబ్ చేసి ఆ తరువాత దీన్ని ప్యాక్ లాగా వదిలేయాలి. ఇది చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. నీరు.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖ్యమైన అంశాలలో నీరు ప్రధానమైనది. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగుతూ ఉండాలి. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉండటంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు చేసే ఈ పనులు కొంప ముంచుతాయి తెలుసా... అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే అందం.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటారు. ఆడవాళ్ల కోసం రాజ్యాలే కూలిపోయాయి. అంత పవర్ ఉంది అందానికి, ఆడవారికి. అలాంటిది అందం పెంచుతామంటూ సాగే వాణిజ్య ఉత్పత్తులు, వ్యాపారాలకు మంచి ఊపు రాకుండా ఉంటుందా? స్వతహాగా అందంగా తయారు కాలేని వారికి ఇదిగో మేమున్నాం అంటూ బ్లూటీ పార్లర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడేమో వీధికి ఒక బ్యూటీ పార్లర్ వెలిసింది. చాలా మంది అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కు వెళితే.. కొందరేమో డబ్బు దండగ అని ఇంట్లోనే బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే బ్యూటీ ట్రీట్మెంట్ లో భాగంగా ఫేషియల్ చేయడం, ముఖానికి ఆవిరి పట్టడం సహజంగా చేసేదే. కానీ ఇలా ఫేషియల్ చేయడం, ముఖానికి ఆవిరి పట్టడం వంటివి చేయడం చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే.. చర్మ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న విషయాల గురించే అమ్మాయిలు చాలా ఆందోళన చెందుతారు. వీటిని సరిచేయడానికి, కొన్నిసార్లు బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఆవిరి తీసుకుంటారు. కానీ ఈ రెండూ పరిమితిని మించితే అవి చర్మానికి హాని కలిగిస్తాయి. ఆవిరి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రంధ్రాలను శుభ్రం చేయడానికి సులభమైన మార్గం. కానీ ఏదైనా అతిగా తీసుకోవడం హానికరం. ముఖానికి ఎక్కువ ఆవిరి పట్టుకుంటు ఉంటే దాన్ని వెంటనే ఆపడం మంచిది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను పెద్దగా అయ్యేలా చేస్తుంది. చర్మం లో ఉత్పత్తి అయ్యే నూనెలను తగ్గిస్తుంది. ఇది మొటిమల సమస్యలకు లేదా చర్మం పగుళ్లకు దారితీస్తుంది. కాబట్టి ఫేస్ స్టీమ్ చేయడానికి సమయం, వ్యవధిని నిర్ణయించుకోవాలి. రసాయన రహిత ఫేస్ ప్యాక్.. ముఖం సహజంగా అందంగా కనిపించడానికి రసాయనాలు లేని ఫేస్ ప్యాక్ లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి పేస్ ప్యాక్ ఏ ఇది. స్వయానా వైద్యులు సూచించిన ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మంచి ఫలితాలు అందిస్తుంది. కావలసిన పదార్థాలు.. పసుపు - 1/3 టీస్పూన్ నిమ్మరసం - 1/2 టీస్పూన్ గంధం - 1 టీస్పూన్ అలోవెరా జెల్ - 1 టీస్పూన్ తేనె - 1 టీస్పూన్ (అవసరాన్ని బట్టి పై పదార్థాలు ఎక్కువ నిష్పత్తిలో కూడా తీసుకోవచ్చు) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గంధం, పసుపు, నిమ్మకాయ రసం, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. చివరగా తేనె వేసి అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. తయారుచేసిన ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. మొదటిసారి వాడినప్పుడే చర్మం శుభ్రంగా, రంధ్రాలు చిన్నగా కనిపించడం గమనించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించి చర్మాన్ని సహజంగా శుభ్రం చేసుకుంటూ ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ ఫేస్ ప్యాక్‌లో గంధపు చెక్కను ఉపయోగించారు . దీని శీతలీకరణ ప్రభావం కారణంగా ముఖంపై వేడి సంబంధిత మొటిమలు పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే తేనె చర్మాన్ని తేమగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ చర్మాన్ని స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఏజింగ్, యాంటీ ఫంగల్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖంపై చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరగకుండా నివారిస్తాయి. అందువల్ల చాలా మంది పెరుగు, పసుపు, శనగపిండి ఫేస్ ప్యాక్‌లను కూడా ఉపయోగిస్తారు. *రూపశ్రీ.
7రోజుల్లో జుట్టు రాలడం ఆగి జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా చేయండి..! జుట్టు పెరగడం, జుట్టు రాలడం రెండూ ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. చాలా మంది జుట్టు రాలిపోతుంటే జుట్టు బాగా రాలిపోతోంది నాకు జుట్టు పెరగాలి అని జుట్టు పెరగడానికి చిట్కాలు, నూనెలు, షాంపూలు వాడతారు. కానీ జుట్టు రాలుతున్నప్పుడు మొదట చెయ్యాల్సింది జుట్టు రాలడాన్ని అరికట్టడం. జుట్టు రాలడాన్ని అరికట్టామంటే జుట్టు పెరుగుదల మోడ్ లోకి అదే వస్తుంది. అప్పుడు జుట్టు పెరుగుదలకు అవసరమైన చిట్కాలు పాటించవచ్చు. అయితే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక చిట్కా పాటిస్తే అటు జుట్టు రాలడం తగ్గి.. ఇటు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుంటే.. జుట్టు రాలడం ఆగి, జుట్టు తిరిగి పెరగడంలో అల్లం, ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తాయి. అల్లం ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అల్లం, ఉల్లిపాయ ఎలా వాడాలంటే.. ముందుగా, అల్లం, ఉల్లిపాయలను మిక్సర్‌లో రుబ్బి పేస్ట్ సిద్ధం చేయాలి. దీని తరువాత, 50 గ్రాముల అల్లం రసం, 50 గ్రాముల ఉల్లిపాయ రసం కలిపి స్ప్రే బాటిల్‌లో ఉంచాలి. రాత్రిపూట, అల్లం-ఉల్లిపాయ రసాన్ని తల మొత్తం చల్లుకుని, తేలికపాటి చేతులతో జుట్టును మసాజ్ చేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, స్నానం చేసేటప్పుడు, షాంపూ లేదా సబ్బు లేకుండా శుభ్రమైన నీటితో జుట్టును కడగాలి. ఇలా తయారు చేసిన రసాన్ని రెండు రోజులు నిల్వ చేయవచ్చు. మైగ్రేషన్, సైనస్ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రాత్రి వాడకూడదు. దీన్ని మధ్యాహ్నం సమయంలో తలకు అప్లై చేసుకుని కేవలం ఒక గంట సేపు తలకు అలాగే ఉంచి తరువాత తల స్నానం చేయాలి. సాధారణంగా ఉల్లిపాయ రసం మాత్రమే వాడటం వల్ల తల దుర్వాసన వస్తుంది. కానీ దీనికి అల్లం కూడా జోడించడం వల్ల ఉల్లిపాయ దుర్వాసన రాదు. ఇది జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు విరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది. అకాల బూడిద రంగును నివారించడంలో అలాగే జుట్టును మందంగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.
జిడ్డు చర్మాన్నివదిలించుకోవాలి అంటే.. ఈ టిప్స్ ట్రై చెయ్యండి..! జిడ్డు చర్మం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. చర్మం ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు చర్మం తొందరగా పగుళ్లు రావడం, పొలుసులు రావడం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడితే.. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖం జిడ్డుగా ఉంటూ.. మొటిమల కారణంగా ఇబ్బంది పడతారు. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యను తొలగించుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్.. జిడ్డు చర్మం ఉన్నవారు ఉపయోగించే ఫేస్ వాష్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫేస్ వాష్ ఉపయోగించాలి. సల్పేట్ లేని ఫేస్ వాష్ వాడాలి. ఇది చర్మం నుండి నూనె తొలగించి ముఖం మెరిచేలా చేస్తుంది. మొటిమలు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మాయిశ్చరైజర్.. జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడాలి. ఇది చర్మం మెరిసే చేయడానికి అలాగే జిడ్డు లేని చర్మానికి సహాయపడుతుంది. తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం పిహెచ్ ను సమతుల్యంగా ఉంచుతుంది. టోనర్.. టోనర్ వాడటం వల్ల చర్మం లోని నూనెను నియంత్రించవచ్చు. చర్మం రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో కూడా టోనర్ సహాయపడుతుంది. జిడ్డు చర్మానికి అలోవెరా, గ్రీన్ టీ, సాలిసిలిక్ యాసిడ్ కలిగిన టోనర్లు చాలా బాగుంటాయి. బ్లాటింగ్ పేపర్.. ఎక్కడికి వెళ్లినా హ్యాండ్ బ్యాగ్ లో బ్లాటింగ్ పేపర్ ఉంచుకోవాలి. ముఖం మీద జిడ్డు ఏర్పడినప్పుడు ఈ బ్లాటింగ్ పేపర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. వీటి వల్ల చర్మానికి ఎలాంటి హాని, నష్టం కలగదు. ఆహారం.. జిడ్డు చర్మం ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేయించిన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం మానాలి. ఆకుకూరలు, పండ్లు తినడం, పుష్కలంగా నీరు తాగడం చేయాలి. ప్రతిరోజూ డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని లోపల శుభ్రం చేసే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి. ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం తొలగించడానికి ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలి. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ పేస్ ప్యాక్.. లేద వేప ఫేస్ ప్యాక్ వంటివి ఎంచుకోవచ్చు. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. జిడ్డును కూడా తొలగిస్తాయి. *రూపశ్రీ.





















