ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం మొదట  ముఖంపైనే కనిపిస్తుంది. వృద్ధాప్యం అనేది ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి, కానీ  దాని కారణంగా ముఖం ముసలిగా కనిపిస్తుంది.  ముఖ్యంగా  30 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై  గీతలు,  ముడతలు క్రమంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు. వీటిని చూసి చాలామంది అమ్మాయిలు చాలా నీరసపడతారు, అందం గురించి భయపడతారు. ముడతలు పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు,  లోషన్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు.   కానీ ఇవి ధీర్ఘకాలిక  ఫలితాలను ఇవ్వవు. అయితే ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్  రెమిడీస్ ఉన్నాయి. ఇవి  పురాతన వైద్య శాస్త్రంలో ప్రస్తావించిన ఔషదాలు. ఇవి  చర్మ సంరక్షణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అధ్బుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎంత వయసయినా యవ్వనంగా కనిపిస్తారు.

తులసి..

ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఔషదం. ఇది ముడుతలతో పోరాడటానికి చక్కగా  సహాయపడుతుంది. ముఖంపై తులసిని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఎందుకంటే ఇది తేమను లాక్ చేస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనితో చర్మం  మీద ఉండే కరుకుదనం పూర్తిగా తొలగిపోయి చర్మం నునుపుగా మారుతుంది.

అశ్వగంధ..

అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  చర్మం  రూపాన్ని చాలా వరకు  మార్చవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల  చర్మం యవ్వనంగా,  మునుపటిలా చిన్న వయసు వారిలా మెరిసిపోతుంది . అంతే కాదు ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు  సహాయపడుతుంది.

ఉసిరి..

యాంటీ-ఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఆమ్లా లేదా అమలాకిలో లేదా ఉసిరిలో  సమృద్ధిగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

జిన్సెంగ్..

జిన్సెంగ్ ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్ . జపనీస్,  కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెర్బ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతాయి. ఇది   చర్మం సూర్యరశ్మి వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది.

సరస్వతి..

సరస్వతి మరొక అత్యంత ముఖ్యమైన,  ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్  ఔషదం. ఇందులో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి,  వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మూలిక శరీరం  మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

పసుపు..

పసుపు ఒక అద్భుత మూలిక. పసుపులో ఉండే కర్కుమిన్ వయసును  తగ్గించడంలో  అద్బుతంగా సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడుతుంది.  సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు ఆహారంలో తీసుకోవడం, ముఖానికి  పూయడం రెండూ ముఖంలో మెరుపును తెసుకొస్తాయి.

                                        *నిశ్శబ్ద.