చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసా!

చర్మం  ఆరోగ్యంగా ఉండటానికి  ప్రోటీన్లు, విటమిన్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా విటమిన్-కె చర్మసంరక్షణలో చాలా అవసరం. అందరూ విటమిన్-ఇ గురించి మాట్లాడతారు కానీ విటమిన్-కె గురించి అస్సలు తెలియనే తెలియదు. అందుకే  ముఖ చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చర్మానికి విటమిన్-కె చేసే మేలు..

విటమిన్-కె చర్మం మీద వాపులు, దురదలు తగ్గించడంలో సహాయపడుతుంది.  దీనికారణంగా ఇది తామర వంటి దారుణమైన సమస్యలను కూడా తగ్గించగలదు.

చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం.  కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ స్వభావాన్ని ఇస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పడకుండా చేస్తుంది. అయితే విటమిన్-కె కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది.

కళ్లకింద నల్లని వలయాల గురించి ఆందోళన చెందని వారు ఉండనే ఉండరు. కానీ విటమిన్-కె దీనికి చెక్ పెడుతుంది. కళ్ల కింద నల్లగా మారిన చర్మంలో రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి. ఈ రక్తనాళాలను బలోపేతం చేయడం ద్వారా కళ్లకింద నల్లటి వలయాలు తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది.

చర్మం మీద చాలామందికి నరాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. వీటిని స్పైడర్ సిరలు అని అంటారు. ఈ స్పైడర్ సిరల రూపాన్ని తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది.

చాలామందిలో పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయిన డార్క్ స్పాట్స్, వయసు వల్ల వచ్చే ముడతలు, మచ్చలు మొదలైనవాటికి విటమిన్-కె భలే పరిష్కారం. హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో కూడా విటమినే-కె సమర్థవంతంగా పనిచేస్తుంది.

చర్మానికి కలిగే మంటలు, ఆక్సీకరణ ఒత్తిడి, సూర్యుని హానికరమైన యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా విటమిన్-కె సహాయపడుతుంది.

విటమిన్-కె కొత్త చర్మకణాలు ఏర్పడటాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవి రెండూ గాయాలు తొందరగా నయం కావడానికి సహాయపడతాయి.

                   *నిశ్శబ్ద.