మొహాన్ని మెరిపించే  గోల్డ్ ఫేషియల్! ఈ మధ్య కాలంలో గోల్డ్ ఫేషియల్ చేయించుకోవటం కామన్ అయిపొయింది. ఒకప్పుడు  బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అలాంటిది మారుతున్న కాలంతో పాటు బంగారాన్ని వాడే విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అసలీ గోల్డ్ ఫేషియల్ వల్ల మనకొచ్చే లాభమేంటి అని ఆలోచిస్తే, చాలా లాభాలే ఉన్నాయి అని చెప్పచ్చు. బంగారం పూతలా మొహానికి వేసుకోవటం వల్ల  మొహం మీద వచ్చే ముడతలు మాయం అవుతాయట.  అలాగే  ఏవైనా మచ్చలు ఉన్నా అవి కూడా  క్రమంగా తగ్గుముఖం పడతాయి. చాలా మందికి చిన్న వయసులోనే వత్తిడి వల్ల మొహం మీద చర్మం జీవం లేకుండా వాడి పోయినట్టు తయారవుతుంది. అలాంటివాళ్ళు ఈ గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే మోహంలో నిగారింపు వచ్చి ఎంతో అందంగా కనపడే అవకాశం ఉంది. బంగారం వల్ల  ఒంట్లో రక్త ప్రసరణ చక్కగా అయ్యి, శరీరానికి కావాల్సిన ప్రాణవాయువు కూడా తగిన విధంగా అందుతుందిట. బంగారాన్ని ముక్కుపుడకగా కుట్టించుకోవటం వల్ల ఆడవారికి గర్భశోక వ్యాధులు తగ్గుతాయట. అలాగే బంగారు గాజులు, ఉంగరాల వల్ల కూడా అనేక శారీరిక రుగ్మతల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ గోల్డ్ ఫేషియల్ విషయానికి వస్తే ఈ కిట్స్ ఇప్పుడు మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. ఒక కిట్ లో క్లెన్సర్, స్క్రబ్, మాయిశ్చరైజర్, మాస్క్ ఉంటాయి. ఒక మంచి క్వాలిటి కిట్ ని ఇంటికి తెచ్చుకుని మనమే అప్లై చేసుకోవచ్చు కూడా. ఫేషియల్ చేసే ముందు చేతులని శుభ్రంగా కడుగుకోవాలి. ఆ కిట్ లో వాటితో వేరే కంపెనీల ప్రొడక్ట్స్ ని కలపకూడదు. ముందుగా క్లెన్సర్ తో మొహాన్ని శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుని ఆరనివ్వాలి. అలా ఆరిన తరువాత స్క్రబ్బర్ ని అప్లై చేసి సర్కులర్ మూవ్మెంట్స్ ఇస్తూ మొహాన్ని మసాజ్ చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు  మెడని కూడా స్క్రబ్ చేయటం మర్చిపోకండి. అలా ఒక 2 నిమిషాలు చేసాకా గోరు వెచ్చటి నీటితో మొహం కడుక్కుని ఆరనివ్వండి. గోల్డ్ మాస్క్ ని తీసుకుని మొహం మీద మెల్లిగా వేసి అది ఆరేదాకా ఉంచి తరువాత తీసేసి కాస్త క్రీం రాసుకుంటే చాలు. మొహం బంగారంలా మెరిసిపోతుంది. 3 నెలలకోసారి ఈ ఫేషియల్ చేసుకుంటే చాలు. మరీ తక్కువ వ్యవధిలో అస్తమాట్లు వేసుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇంకేంటి ఆలస్యం మార్కెట్ లో దొరికే బెస్ట్ గోల్డ్ ఫేషియల్ ఏంటో తెలుసుకుని మీ మొహాన్నికూడా బంగారంలా మెరిసిపోయేలా మార్చెయ్యండి. ..కళ్యాణి  

ముఖాన్ని మెరిపించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా రెడీ! అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. కానీ ఎన్ని బ్యూటీ ఉత్పత్తులు వాడినా ముఖంలో రవ్వంత అయినా తేడా లేక నిరుత్సాహపడే అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు ఈ కాలంలో. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన  కొరియన్స్ స్కిన్ మీద అమ్మాయిలకు చెప్పలేనంత మోజు. అయితే ఈ కొరియన్ స్కిన్ కు ఇంటి చిట్కాలు కొన్ని హెల్ప్ చేస్తాయి.  ఇంట్లోనే తయారుచేసిన విటమిన్-ఇ సీరమ్ వాడితే ముఖం యవ్వనంగా, గాజులా మెరిసిపోతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.  నిజానికి చాలా బ్యూటీ ప్రోడక్స్ట్ విటమిన్-ఇ ఆధారితంగా తయారుచేస్తారు. ఇంట్లోనే ఈజీగా విటమిన్-ఇ సీరమ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. విటమిన్-ఇ క్యాప్సూల్స్ .. 3-4 జోజోబా ఆయిల్.. 1 స్పూన్. రోజ్ షిప్ ఆయిల్.. 1స్పూన్ ఆర్గాన్ ఆయిల్.. 1స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్.. ఐదారుచుక్కలు తయారుచేసే విధానం.. మొదట గ్లాసు డ్రాపర్ బాటిల్ తీసుకోవాలి. ఇందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నీ వేయాలి. జొజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుశ్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషకాన్ని అందిస్తాయి. ఇక లావెండర్ ఆయిల్ చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మీద వాపులు, అలర్జీలు, దురద  వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చర్మానికి కొత్తదనాన్ని ఇస్తుంది. గ్లాసు డ్రాపర్ బాటిల్ లో అన్ని వేసి బాగా కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ఎండ తగలని ప్లేస్ లో పెట్టాలి. ప్రతిరోజు రాత్రి కొన్ని చుక్కల సీరమ్ ను ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. మొత్తం నూనె ముఖ చర్మంలోకి ఇంకేవరకు మసాజ్ చేసుకోవాలి. రాత్రి సమయంలో అయితే మరింత మంచి ఫలితం ఉంటుంది. ప్రయోజనాలు.. ఈ సీరమ్ రాసుకోవడం వల్ల ముఖ చర్మం మీద మచ్చలు తగ్గుతాయి. ముఖంలో గ్లో వస్తుంది. ఇందులో వాడిన పదార్థాలు అన్నీ సహజమైనవే కాబట్టి  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయినా సరే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడటం మంచిది.                                   *నిశ్శబ్ద.  

అవిసె గింజలను  ఈ మూడు విధాలుగా వాడితే జుట్టు పెరుగుదల అద్బుతమే!   అమ్మాయిల అందంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందంగా ఉన్న కురులు అదనపు ఆకర్షణ తెస్తాయి. దుమ్ము,  పెరుగుతున్న కాలుష్యం  ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మం,  జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సహజ మార్గాల్లో జుట్టును అందంగా, ఆరోగ్యంగా  మార్చడానికి అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.  అవిసె గింజలను మూడు మార్గాలలో ఉపయోగించడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అవిసె గింజలతో ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ జెల్..  అవిసె గింజలను హెయిర్ జెల్‌గా ఉపయోగించవచ్చు .  ఈ జెల్‌ను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. అవిసె గింజలను ఉడికించి జెల్ తీసుకోవాలి.  అందులో  అలోవెరా జెల్ కలపాలి.  ఈ హెయిర్ జెల్‌ను కొద్ది మొత్తంలో తీసుకొని మీ జుట్టు మొత్తం పొడవునా అప్లై చేయాలి. తర్వాత తలంతా   మసాజ్ చేయాలి. దీన్ని  15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాధారణ షాంపూతో కడగాలి. హెయిర్ మాస్క్.. అవిసె గింజలను  హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. కేవలం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని  జుట్టుకు పట్టించాలి. దీనితో  స్కాల్ప్‌కు మసాజ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయాలి. హెయిర్ ఆయిల్..  జుట్టుకు నూనెగా అవిసె గింజలను ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టు కోసం అవిసె గింజల  ఆయిల్ ఉపయోగించాలి. దీనితో  స్కాల్ప్‌ని ఐదు నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  అలాగే జుట్టు మెరుపును తీసుకురావడానికి కూడా అవిసె గింజల నూనె  అప్లై చేయవచ్చు. అవిసె గింజల ప్రయోజాలు.. అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కాల్ప్ సెన్సిటివిటీ,  ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అవిసె గింజలు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి  జుట్టుకు  సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.  జుట్టు పెరుగుదలను పెంచడానికి మంచి మార్గం కోసం చూస్తున్నట్లయితే, అవిసె గింజలు సహాయపడతాయి. చుండ్రు సమస్యకు కూడా అవిసెగింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తాయి, తద్వారా చుండ్రు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.                                                           *నిశ్శబ్ద.

ఎండల్లో మేను మెరవాలంటే ...   ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లెద్దు. బయటకి వెళ్ళాలంటే చాలు మొహం ఎక్కడ పాడయిపోతుందో అనే భయం. అలాంటి భయాలు దూరం చేసి ఎండల్లో కూడా మీ మేనూ మెరిసిపోవాలంటే...... ఈ జ్యూస్ లు తాగి చూడండి. మన శరీరం ఎందుకు వెలిగిపోదో చూద్దాం. ఎండాకాలం మామూలు ఆహారం కన్నా కూరగాయలు, ఆకుకూరలు తినటం మంచిదని అందరికి తెలుసు. వాటిలో కొన్ని మనకి ఎంతో మేలు చేస్తాయి అవేంటో చూద్దామా. బేబీ కార్న్ జ్యూస్: బేబీ కార్న్ సూప్ తింటాం కాని జ్యూస్ ఎక్కువగా తాగం. కాని ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరానికి ఎంతో నిగారింపు వస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తాగటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కూడా వెయ్యదు. డైటింగ్ చేసేవాళ్ళకి ఇది ఒక మంచి జ్యూస్. స్వీట్ కార్న్ లో కొన్ని పాలు కలిపి జ్యూస్ లా తయారుచేసుకుని తాగటం వల్ల ఎండకి కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.   టమాటా జ్యూస్: ఇది అందరి ఇళ్ళల్లో మనం కామన్ గా చూసే జ్యూస్.  ఇందులో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గ్రీన్ పీస్ జ్యూస్: గ్రీన్ పీస్ కూరల్లో ఎంత రుచిగా ఉంటుందో, జ్యూస్ లా చేసినా అంతే రుచిగా ఉంటుంది. ఈ పచ్చి బఠాణిలో విటమిన్ K, ఇంకా విటమిన్ B6 సమృద్దిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాక యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఒక మంచి పౌష్టికాహారం కూడా. మరీ పచ్చి వాసన వస్తోందనిపిస్తే అందులో కాస్త ఉప్పు కలిపి తాగితే బాగుంటుంది. కేరట్ జ్యూస్: విటమిన్ A పుష్కలంగా ఉండే కేరట్లు కళ్ళకి మాత్రమే కాదు చర్మం నిగారింపుకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కేరట్ జ్యూస్ తాగటం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దీర్ఘకాలం పాటు చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే క్రమం తప్పకుండా కేరట్ జ్యూస్ తీసుకోవాలి. మీ వయసు కనపడనీయకుండా మిమల్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది.   పాలకూర జ్యూస్: పాలకూర ఎండాకాలంలో మనకి తల్లిలాంటి మేలు చేస్తుంది. విటమిన్ K పుష్కలంగా లభించే పాలకూర ఎముకులని దృడంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు. మన శరీరం మంచి నిగారింపు సంతరించుకుని వయసులో చిన్నగా కనిపించాలంటే ఇలాంటి జ్యూస్ లు ట్రై చేయక తప్పదు. అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. మరి మీరు?ట్రై చేయటానికి రెడీగా ఉన్నారా ?   ..కళ్యాణి

గుడ్డుతో అందానికి మెరుగులు! గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు . ఇంట్లో నే అందానికి గుడ్డుతో మెరుగులు పెట్టుకోవటానికి కొన్ని మార్గాలు ..ఇవి.. 1. గుడ్డులోని తెల్ల సొనకి అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె , ( పావు చెమ్చా కి సగం ) , కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే ముఖం కాంతివంతం గా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది . 2. తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారెట్  తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి . యాంటి ఏజింగ్ పాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది . 3.అలాగే పచ్చ  సోనకి  తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే ..చర్మం బిగుతుగా మారుతుంది . 4. చర్మం పొడి పొడి గా వుండి , దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని ..పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది. 5. అలాగే పచ్చసోనలో ముల్తాని మట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు 6.ఒట్టి తెల్ల సొనని  బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి , అది ఆరాకా కడిగి చూడండి . ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది . ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పాక్ వేసుకుంటే , త్వరగా అయపోతుంది, మంచి ఫలితం కూడా వుంటుంది .  

తేనెతో పెదాలకు మరింత అందం!   మొహానికి అందాన్ని తెచ్చి పెట్టేవి పెదాలంటే మీరూ  ఒప్పుకుంటారు కదూ. అలాంటి పెదాలు మరింత ఎర్రగా మెరిసిపోవాలంటే వాటిని మరికాస్త ఎక్కువగా పట్టించుకోవాల్సిందే. కొంతమందికి టెన్షన్ లో పెదాలు కోరికే అలవాటు ఉంటుంది. అది మానుకుంటే చాలు పెదాలు బండగా తయారవ్వకుండా ఉంటాయి. కొంత మంది పెదాలు నల్లగా ఉండి అందాన్ని తగ్గిస్తాయి. అలాంటివారు రాత్రి పడుకునే ముందు నిమ్మరసాన్ని రాసుకుని పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదాలపై ఉండే నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి. ఇలాగే ఇంకొన్ని చిట్కాలని చూద్దామా. * మూడు స్పూన్ల పంచదార పొడిలో రెండు స్పూన్ల వెన్న కలిపి పేస్ట్ లా చేసి పెదాలకి పట్టించి ఉంచి ఒక గంట తర్వాత చన్నీళ్ళతో కడుగుకోవాలి.పంచదార డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేస్తుంది,వెన్న మృదుత్వాన్ని ఇస్తుంది. * బీట్రూట్ పేస్టు ని రాత్రి పడుకునే ముందు పెదాలకి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకున్నా పెదాలు ఎరుపురంగులోకి మారతాయి. * ఒక స్పూన్ నిమ్మరసం, కొబ్బరి నూనె, రెండు స్పూన్ల పంచదార పొడి కలిపి పేస్ట్ లా చేసి ఉంచుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఈ పేస్ట్ పెదాలకి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. * ఒక స్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్ లో రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీ కలిపి పెదాలకి పట్టిస్తే పెదాలు స్ట్రాబెర్రీ  రంగులోకి మారిపోతాయి. *   మనకి సులువుగా దొరికేవి గులాబి రేకులు. వాటిని ముద్దలా చేసి పెదాలకి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు అందమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇలాంటివి చేస్తూ వీటితో పాటు తగినంత నీళ్ళు తాగటం వాళ్ళ కూడా పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. నీళ్ళతో పాటు ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినటం వల్ల కూడా పెదాలు అందంగా కనిపిస్తాయి. ఇలా కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే చాలు మాములుగా ఉండే మీ పెదాలు ఎర్రని ద్రాక్ష పళ్ళలా మెరిసిపోతాయి.    కళ్యాణి...

 ప్రతి రోజూ ఉదయాన్నే చేసే ఈ ఆరు తప్పుల వల్ల అమ్మాయిలు  ఎంత నష్టపోతున్నారో తెలుసా?   ఉదయం లేచింది మొదలు మనిషి రోజు మొదలవుతుంది. ఈకాలంలో చాలామంది ఎక్కువగా ఆరోగ్యోం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆరోగ్యం అనుకుంటూ ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మరికొందరు సాధారణం అనుకునే అలవాట్లు ఎన్నెన్నో  నష్టాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు డైటింగ్ విషయంలోనూ, అందాన్ని కాపాడుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిలో చాలావరకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి. వీటిని తెలుసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పూర్తీగా అందం ఆరోగ్యం నష్టపోయాక భాధపడాలి. అందరూ కామన్ అనుకుంటూ చేస్తున్న ఆ ఆరు తప్పులు ఏంటో తెలుసుకుంటే.. ఓట్స్.. అమ్మాయిలు ఉదయాన్నే ఎక్కవగా తీసుకునే అల్పాహారం ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగరని తద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ప్రతి రోజూ ఓట్స్ తీసుకుంటే ఉదయాన్నే శరీరానికి అందాల్సిన పోషకాలు చాలావరకు లాస్ అవుతారు. ఓట్స్ లో పైబర్, బరువు తగ్గింటే కారకాలు ఉంటాయి తప్ప శరీరానికి ప్రోటీన్ ఏమీ అందించదు. పైపెచ్చు ఓట్స్ ను ప్రతిరోజూ తింటే చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. చర్మం మీద చారలు చారలుగా గీతలు ఏర్పడటం జరుగుతుంది. స్నానం.. ఉదయాన్నే వేడినీటితో స్నానం చేస్తే కలిగే రిఫ్రెష్మెంట్ యే వేరు. కానీ ప్రతిరోజూ వేడి నీటి స్నానం ఆరోగ్యానికి మంచి చేకూర్చకపోగా చెడు చేస్తుందంటున్నారు. వేడినీటి స్నానం శరీరంలో తేమశాతాన్ని చాలా తొందరగా లాగేస్తుందట. ఇక ముఖం కడగడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం చాలా తొందరగా  ముడతలు వస్తాయి. ముఖం ముసలిగా మారిపోతుంది. కాఫీ.. చాలామందికి కాఫీ అనేది ఒక ఎమోషన్.  ఉదయాన్నే ఒక కప్పు కాఫీ పడితే కానీ పనులు ముందుకు సాగవు. ఆ తరువాత కాఫీ టిఫిన్  కు ముందు, ఇక చాలామందికి టిఫిన్ తరువాత  వేడిగా, స్ట్రాంగ్ గా కాపీ పడాల్సిందే. కానీ ఈ అలవాటు చాలా చెడ్డది. సహజంగానే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లడంలో ఇబ్బంది కలిగిస్తుంది. సన్ స్క్రీన్.. అమ్మాయిలు సన్ స్క్రీన్ అప్లై చేయడం లైఫ్ స్టైల్ లో భాగం చేసుకున్నారు. ఇది  సుర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కానీ కొందరు అలవాటులో పొరపాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్నానం తరువాత సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. దీని కారణంగా చర్మం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే అవసరమైన సందర్బాలలో మాత్రమే సన్ స్క్రీన్ ఉపయోగించాలి. బ్యూటీ ప్రోడక్ట్స్.. చర్మం  ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అమ్మాయిలు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ చర్మం బాగుండాలంటే ఈ బ్యూటీ ఉత్పత్తులేవీ అక్కర్లేదు. కేవలం సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా సీజన్ తో సంబంధం లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే  ముఖచర్మం చాలా తొందరగా వృద్దాప్యంగా మారుతుంది. ఫేస్ వాష్.. ఉదయం లేవగానే చాలామందికి ముఖమంతా చాలా జిడ్డుగా ఉంటుంది.  దీన్ని వదిలించుకోవడానికి చాలా గాఢత కలిగిన కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరికి పేస్ వాష్ ఉపయోగించడం అంటే అదొక ఫ్యాషన్. కానీ  ఫేష్ వాష్ లు ముఖ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తాయి. అందుకే  ముఖం జిడ్డుగా ఉంటే తేలికపాటి క్లెన్సర్ ని ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.                                               నిశ్శబ్ద.  

హెయిర్ పాక్స్! ఎవరి జుత్తయిన వత్తుగా నిగనిగలాడుతూ ఉంటే మనసు పారేసుకోని  ఆడవాళ్లు ఉండరనటంలో ఆశ్చర్యం లేదు. అలాంటి శిరోజాలు పొడిబారి జీవం లేకుండా ఉంటే బ్యూటి పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెయిర్ పాక్స్ చేసుకోవటం ఎంతో సులభం. కొంతమంది జుట్టు పొడిబారిపోయి ఉంటే మరికొందరి జిడ్డుగా ఉంటుంది కదా?అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితోనే మళ్లీ అందమైన జుట్టుని తమ సొంతం చేసుకోవచ్చు. సాధారణ జుట్టుకి సరిపోయే హెయిర్ ప్యాక్: కేరట్ శరీరానికే కాదు జుట్టుకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ఐదు కేరట్ దుంపలని మెత్తగా గ్రైండ్ చేసి పేస్టులాగా తయారుచేసుకోవాలి. ఆ పేస్టుని  జుట్టు మొదళ్ళ నుంచి చివరి దాకా బాగా పట్టించి నలభై నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత చల్లని నీటితో కడగాలి. జిడ్డుగా ఉండే జుత్తు కోసం(oily hair)   మూడు కమలాపండ్ల నుండి తీసిన తొక్కలను(పచ్చివి)  మెత్తగా గ్రైండ్ చేసుకొని, దానిలో ఒక స్పూన్ శెనగపిండి, 1/2 స్పూన్ కాఫీపొడి, ఒక కమలాపండు నుండి తీసిన జ్యూస్ ని అన్నిటిని కలిపి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకి పట్టించి 25 నిమిషాల పాటు ఉంచి, తరువాత చల్లని నీటితో జుట్టుని కడగాలి.  ఈ విధంగా 15 రోజులకొకసారి మనకి కావలసిన ప్యాక్ ని వేసుకొంటూ ఉంటే జుత్తు అందం రెట్టింపు అవుతుంది. చుండ్రుని నివారించే హెయిర్ ప్యాక్ గుడ్డులో ఉండే తెల్ల సొనని అరకప్పు పెరుగులో కలిపి అందులో మూడు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత నీతితో కడగాలి. పదిహేను రోజులకొకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిగనిగలాడే జుట్టు కోసం నాలుగు స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్టు చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట ఆరాకా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా పదిరోజులకి ఒకసారి ఈ ప్యాక్ వెయ్యటం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టుకి ఎప్పుడు హెన్నా పెట్టుకున్నా లేదా ఎలాంటి ప్యాక్ వేసుకున్నా అదే రోజు షాంపూ వాడటం కన్నా మరుసటి రోజు షాంపూ వాడటం మంచిది.జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకి మనకి అందుబాటులోనే ఎన్నో నివారణలు కూడా ఉంటాయి,వాటిని కాస్త ఓపికతో తెలుసుకుని అప్లై చేసుకుంటే చాలు,ఒత్తుగా నిగనిగలాడే మన జుట్టుని చూసుకుని మనమే మురిసిపోవచ్చు. - కళ్యాణి

టీనేజ్ మొటిమలకు చెక్ చెప్పాలంటే... టీనేజ్ లోకి రాగానే ప్రతి వాళ్ళు ఎదుర్కొనే సమస్యే మొటిమలు. కాని వీటివల్ల అంతగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు డెర్మిటాలజిస్టులు. అప్పటిదాకా నున్నగా, ముద్దుగా కనిపించే మొహంలో ఎర్రగా కనిపించే ఈ మొటిమలు వాళ్ళ అందానికి ఆనకట్టలుగా కనిపిస్తాయి. కొంతమంది అంతగా పట్టించుకోకపోయినా,మరికొందరు మొటిమల మొహంతో బైటకి వెళ్ళాలంటే తెగ ఇబ్బంది పడిపోతారు. వయసు పెరుగుతూ 14, 15 సంవత్సరాల వయసు రాగానే శరీరంలో వచ్చే హార్మోన్ ఇమబాలన్స్ వల్ల ఎక్కువగా ఈ సమస్య మొదలవుతుందిట. శరీరంలో వచ్చే మార్పులు ఎదుర్కోవటం ఒక సమస్య అయితే ఈ మొటిమల బాధ ఇంకో సమస్య. దీనికోసం తల్లితండ్రులే కాస్త జాగ్రత్తలు తీసుకుని కొన్ని ఇంటి వైద్యాలు చేయటం వల్ల వాళ్ళ బాధని కొంతైనా తగ్గించగలుగుతారు. ఈ సమస్య నివారణకి ముఖ్యంగా చేయాల్సింది శుభ్రత పాటించటం. పిల్లలు పడుకునే పిల్లో కవర్స్ వారానికి ఒకసారి మర్చిపోకుండా మారుస్తూ ఉండాలి. వాళ్ళు అస్తమాట్లు మొటిమలని ముట్టుకోకూడదని హెచ్చరించాలి. వాటిని గిల్లటం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందని చెప్పాలి. బయట తినుబండారాలు తగ్గించాలి. ఈ వయసులో ఎక్కువగా బయట నూనేతో చేసిన పదార్థాలు తినటం వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయి. ఇక వచ్చిన మొటిమలనితగ్గించుకోవటం ఎలాగో చూద్దాం... బేకింగ్ సోడా - మొటిమల నివారణకు బేకింగ్  సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి ఆ పేస్టుని వాటి మీద రాసి కాసేపు ఉంచాకా నీతితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ - చర్మంలో ఉన్న సూక్ష్మ రంద్రాలనిశుభ్రపరిచే గుణం ఓట్స్ లో పుష్కలంగా ఉంది. అంతేకాక ఎక్కువగా ఉన్న జిడ్డుని కూడా తగ్గిస్తుంది. ఉడికించిన ఓట్స్ లో 1 స్పూన్ తేనే,1/2 స్పూన్ నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి అరగంట తరవాత గోరువెచ్చటి నీటితో కడుగుకుంటే చాలు, సమస్య తగ్గుముఖం పడుతుంది. ముల్తాని మిట్టి -  మొహం మీద ఉండే మృత కణాలు సులువుగా పోవాలంటే ముల్తాని మిట్టి ఒక మంచి ఉపాయం. రోజ్ వాటర్, చందనం పొడి, ముల్తాని మిట్టి ఈ మూడింటిని సమపాళ్ళలో పేస్టులా కలిపి వాటిని మొహం మీద అప్లై చేసి అది ఆరేవరకు ఆగి నీటితో శుబ్రపరుచుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు. టూథ్ పేస్టు - ఆశ్చర్యపోయే పని లేదు నిజంగానే టూత్ పేస్టు మొతిమలకి మంచి మందు. రాత్రి పడుకునే ముందు తెల్లగా ఉండే టూత్ పేస్టు మొటిమలపై రాసి మర్నాడు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే రెండు, మూడు రోజులలోనే మార్పు గమనించచ్చు. దాల్చిన చెక్క పొడి - ఇంట్లో సులువుగా దొరికే దాల్చిన చెక్క పొడిని మొటిమల నివారణకు వాడచ్చు. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా దాల్చీనీ పొడి కలిపి దానిని మొటిమలపై రాస్తే అవి బాగా తగ్గుతాయి. బొప్పాయి - బొప్పాయి కూడా మొటిమల నివారణకి ఒక మందులా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. పండిన బొప్పాయిని గుజ్జులా చేసి మొహానికి పట్టించాలి, అది పూర్తిగా ఆరాకా గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే చాలు మోహంలో మొటిమలు పోవటమే కాదు, నున్నగా కూడా కనిపిస్తుంది. అరటి తొక్క - అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని తొక్క మొటిమలకు అంత మంచి మందు. అరటి తొక్కతో మొహం మీద గుండ్రంగా రుద్దుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా చేసాకా అరగంట ఆరనిచ్చి కడిగెయ్యాలి. బంగాళదుంప - ఇంట్లో ఉండే ఆలుని పెట్తటి పేస్టులా చేసి మొటిమలపై రాసి ఒక పావుగంట తరువాత కడిగితే మొటిమలు తగ్గుముఖం పడతాయి. మొటిమలతో బాధపడే వాళ్ళు వారానికి ఒకసారి మొహానికి ఆవిరి పట్టటం మంచిదని చెప్తున్నారు వైద్యులు. అలాగే పచ్చి పాలల్లో దూది ముంచి దానితో మొహాన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చెయ్యటం వల్ల మొహం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మాయం అయ్యి మొహంలో నిగారింపు వస్తుంది. అలాగే టీనేజ్ లోకి వచ్చిన పిల్లలు ఎక్కువగా నూనేతో చేసిన పదార్థాలు తినటం తగ్గించాలి. ఇలా మొటిమలపై కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టావు. - కళ్యాణి

ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే!    అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..  అశ్వగంధ.. తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు. ఉసిరి.. ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.   తులసి.. తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. నెయ్యి.. నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి.. బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.                                            *నిశ్శబ్ద.

నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..  అమ్మాయిల అందానికి బోలెడు అలంకారాలు. వీటిలో దుస్తులు, నగలు, పాదరక్షల దగ్గర నుండి దుస్తులకు వేసుకుని పిన్నులు, జడలకు వేసుకుని క్లిప్పుల వరకు బోలెడు ఉంటాయి. ఇక చేతులు అందంగా కనిపించడం కోసం, బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు అట్రాక్షన్ గా ఉండాలని గోళ్ళకు  నెయిల్ పాలిష్ వేస్తుంటారు. ఈ రోజుల్లో బట్టలకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నెయిల్ పాలిష్ వేయడం చాలా సులభం, కానీ దానిని తొలగించేటప్పుడు చాలా కష్టం. డ్రస్ మార్చిన ప్రతిసారి నెయిల్ పాలిష్ మార్చడం చాలామందికి సమస్యగా ఉంటుంది. కారణం నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా నెయిల్ పాలిష్ అంత ఖరీదైనదే.. భీభత్సంగా వాడితే అది మాత్రం అయిపోకుండా ఉంటుందా ఏంటి? అయితే  గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. టూత్‌పేస్ట్.. పళ్లు తోమడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్  గోళ్లకున్న పాత నెయిల్ పాలిష్ తొలగించడంలో  కూడా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం గోళ్లపై టూత్‌పేస్ట్‌ను రాసి లైట్ గా  బ్రష్ సహాయంతో గోళ్లను తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ తొలగిపోతుంది. టూత్‌పేస్ట్,  బేకింగ్ సోడా.. టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని  గోళ్లపై రాస్తే పాత నెయిల్ పాలిష్ చాలా సులువుగా  తొలగిపోతుంది. వేడి నీరు..  వేడి నీటి సహాయంతో నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొంచెం నీటిని ఒక పాత్రలో వేడి చేయాలి.  తరువాత వేళ్లను  గోరు వెచ్చని నీటిలో 25-30 నిమిషాలు ఉంచాలి. ఇది ఓపికతో కూడుకున్నది అయినా గతిలేని పరిస్థితిలో కచ్చితమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.  ఇలా ఉంచితే క్రమంగా నెయిల్ పెయింట్ దానంతట అదే రాలిపోతుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం  ద్వారా కూడా గోళ్ళకు ఉన్న  నెయిల్ పాలిష్‌ను వదిలించుకోవచ్చు. నిమ్మరసం కలిపిన నీళ్లలో గోళ్ళను ముంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచితే  నెయిల్ పాలిష్ పోవడమే కాదు గోర్లు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్  నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెనిగర్‌లో నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే  నెయిల్ పాలిష్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.                                                           *నిశ్శబ్ద.

కేవలం 10రూపాయలకే ముఖం చందమామలా మెరిసిపోతుంది! అమ్మాయిలు ముఖ చర్మం మెరిసిపోవడానికి ఎన్ని మార్కెట్ ఉత్పత్తులు వినియోగిస్తారో లెక్కపెట్టడం కష్టం. కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే..ఎన్ని వాడినా  చర్మం అలాగే కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిల్లా చర్మం మిల్కీగా, ముడతలు లేకుండా, మెరుస్తూ ఉండాలనేదే అమ్మాయిల ఆరాటం అంతా. అయితే దీనికోసం వందలు, వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ కొని వాడక్కర్లేదు. కేవలం 10రూపాయల ఖర్చుతో అద్భుతం చేయవచ్చు.  ఈ టిప్ ఫాలో అయితే ముఖం మీద ముడుతలు, మచ్చలు, మొటిమల తాలూకు గుంతలు అన్నీ మాయమైపోతాయి. ఇంతకూ అంత మ్యాజిక్ చేసే టిప్ ఏంటి? దీన్నెలా ఉపోయోగించాలి తెలుసుకుంటే.. ఇప్పటికాలంలో బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే అమ్మాయిలందరికీ విటమిన్-ఇ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు పెరుగుదల కోసం క్యారియర్ ఆయిల్ తో కలిపి విటమిన్-ఇ ఆయిల్ ను అప్లై చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ ఆయిల్ కలిపి రాయడం వల్ల మ్యాజిక్ జరుగుతుంది. రెండు స్పూన్ల  కొబ్బరినూనెలో రెండు విటమిన్-ఇ టాబ్లెట్ల ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ మోతాదులో తయారుచేసి నిల్వచేసుకోవచ్చు. మొదటగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖం మీద తడిలేకుండా తుడుచుకుని తయారుచేసుకున్న  ఆయిల్ ను నాలుగైదు చుక్కలు అరచేతిలో వేసుకుని బాగా రబ్ చేసి ముఖమంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. దీన్ని ఓ 20నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ఆయిల్ వల్ల మరింత మంచి ఫలితాలు కావాలంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. ఇలా చేస్తే ముఖ  చర్మంలోకి బాగా ఇంకిపోయి ముఖం మీద ముడుతలు తొలగించడంలో మరింత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఈ నూనెను అప్లై చేస్తుంటే ముఖ చర్మం చాలా తొందరగా యవ్వనంగా మారుతుంది. ఈ నూనె ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉదయం సమయంలో అప్లై చేయకపోవడం మంచిది. విటమిన్ ఇ లో  అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా ఇది   రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.  చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కూడా. ఇలాంటి మచ్చలు హార్మోన్ల అసమతుల్యత   లేదా ఎండకు  ఎక్కువగా చర్మం ఎఫెక్ట్ కావడం వల్ల వస్తుంటాయి.  విటమిన్-సితో కలిపి  విటమిన్-ఇ ఆయిల్‌ని ఉపయోగించడం ద్వారా  ఈ మచ్చలు తొలగించుకోవడమే కాకుండా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడెలాగో వర్షాకాలం మొదలయ్యింది. వర్షం, చలికి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పెదవులు చాలా తొందరగా పగులుతాయి. ఇలాంటి వారు పగిలిన పెదవులు, పెదవుల మూలల్లో విటమిన్-ఇ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మం రిపేర్ అయ్యి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో విటమిన్-ఇ తో స్కిన్ కు మ్యాజిక్ చేయండి.                                                 *నిశ్శబ్ద.

కళ్ళు పెద్దగా కనపడాలంటే....   అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్ లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించచ్చు. మరి అవేంటో చూసేద్దామా. మనం రోజూ పెట్టుకునే కాటుకతో పాటు మరికొన్ని మేకప్ ఐటమ్స్  జతచేసుకోవటం ఎంతైనా అవసరం. ఐ లైనర్ కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది  వేసుకోవటం మొదట్లో కాస్త రాకపోయినా అలవాటయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటిగా ఒకేసారి కనురెప్పలపై  పెద్దగా ఐ లైనర్ దిద్దుకుని వెళితే మీ స్నేహితులు మిమ్మల్ని ఏడిపించే వీలుంది. కాబట్టి మొదట్లో  రెప్పలపై సన్నగా వేసుకోవటం మంచిది. అలా అలా ఆ లైన్ ని పెంచుతూ వెళ్ళండి.   మస్కారా కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనురెప్పలని పైకి ఒత్తుతూ వేసుకునే మస్కారా వల్ల  కళ్ళు విశాలంగా కనపడతాయి. కొంతమందికి కనుబొమలు, కనురెప్పలు కూడా పల్చగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కళ్ళు మరీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే కొన్ని రోజుల్లోనే అవి వత్తుగా మారతాయి. కొంతమంది ఆముదాన్ని కూడా వాడతారు.   కళ్ళకి ఐ లైనర్ పెట్టుకునేటప్పుడు కంటి చివర వరకు  దానిని అప్లై చేస్తూ కాస్త బయటకి కూడా తీసుకెళ్ళి కోన్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే కళ్ళకన్నా కాస్త బయటకి తీసుకెళ్లటం అన్నమాట. రెగ్యులర్ గా ఐబ్రోస్ షేప్ చేయించుకుంటూ ఉండాలి కూడా. ఐబ్రోస్ ఎప్పుడయితే మరీ వత్తుగా ఉంటాయో అప్పుడు అవి కళ్ళని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా చూసుకుంటే చాలు.   మనం ఎంత మేకప్ వేసుకున్నా కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కళ్ళ అందాన్నిదెబ్బతీసి అవి హైలైట్ అవ్వకుండా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ పోవటానికి ఒక మంచి చిట్కా ఉంది. రెండు స్టీల్ చెంచాలని రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఉదయం లేవగానే వాటిని కళ్ళపై బోర్లించి మూడు నిముషాలు అలానే ఉంచండి. దీనివల్ల కళ్ళ చుట్టూ ఉండే నలుపు పోవటమే కాదు ఆ రోజంతా కళ్ళు కాస్త పెద్దగా కనిపించటం కూడా మీరే గమనించచ్చు. అలాగే కనురెప్పలు  వెనక్కి వంపు తిరిగి ఉండాలంటే రెండు చెంచాలని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి వాటిని తీసి కనురెప్పలను వంచుతూ వెనక్కి నొక్కి పెట్టి ఆ చెంచాను అలానే ఉంచాలి. రెండు మూడు నిమిషాల తరువాత తీసి చూస్తే రెప్పలు వంపు తిరిగి కనిపిస్తాయి. అవి ఆ రోజంతా అలానే ఉంటాయి కూడా. ఇప్పుడు మార్కెట్ లో ఫాల్స్ ఐ లాషేస్ కూడా దొరుకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవటం వస్తే చాలు, వాటివల్ల కూడా కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మొత్తానికి చిన్నగా కనిపించే కళ్ళు మరింత అందంగా, ఆరోగ్యంగా కనపడాలంటే రోజూ తగినన్ని నీళ్ళు తాగటం మర్చిపోకూడదు. అలాగే కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి వాటి కోసం వాడే ఐ లైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్, కాజల్ ఇలాంటివన్నీ మంచి కంపెనీవి ఎంచుకుని కొనుక్కోవాలి. ఎంతైనా కళ్ళే కదా మనకి అందాన్ని రెట్టింపు చేసేవి. - కళ్యాణి

ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ మాస్క్ బెస్ట్! అమ్మాయిలు తమ ముఖం చాలా అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇక ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాలలో ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం చాలా రకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు, బ్యూటీ థెరపీలు తీసుకుంటారు. అయితే ముఖం కాంతివంతంగా కనిపించడానికి  కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు చాలా బెస్ట్ గా పనిచేస్తాయి. అలాంటి వాటిలో మందార పువ్వుల ఫేస్ మాస్క్ చాలా బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. ఇంతకీ ముఖం మెరిసిపోవాలి అంటే మందార ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏంటి?  తెలుసుకుంటే.. మందార పువ్వులను హైబిస్కస్ అని కూడా అంటారు. ఇది జుట్టుకు, చర్మానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. మందార పువ్వులతో ఫేస్ మాస్క్ వేస్తుంది ముఖం యవ్వనంగా మారుతుంది.  ముఖం మీద ముడుతలు, గీతలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. మందార ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. మందార పొడి 2 టేబుల్ స్పూన్లు.. పచ్చి తేనె 1 టేబుల్ స్పూన్..   పాలు.. 1 టేబుల్ స్పూన్.. పై మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెో వేసి బాగా మిక్స్ చేసి మెత్తని పెస్ట్ లా చేసుకోవాలి.   మొదట ముఖాన్ని చల్లని నీటిలో శుభ్రపచుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందైనా ఇదే పని చేయాలి. ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ తాలూకు మెరుపు, వాటిలోని గుణాలు చర్మానికి బాగా పనిచేస్తాయి. ముఖం  శుభ్రం చేసుకున్నతరువాత తయారుచేసుకున్న మందార పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 20నిమిషాల పాటూ  అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. మందార ఫేస్ ప్యాక్ ను పాలతోనే కాకుండా మరొక విధంగా కూడా ట్రై చేయవచ్చు.. మందార పొడి 2 టేబుల్  స్పూన్లు.. తేనె 1 టీ స్పూన్.. పెరుగు కొద్దిగా.. పై మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు  ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  సుమారు 15 నిమిషాలు దీన్ని అలాగే ఉంచి ఆ తరువాత కాటన్ సహాయంతో ముఖం మీద ఉన్న ఫేస్ మాస్క్ ను తొలగించాలి.  దీని తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు మొత్తం ముఖానికి ఎలాంటి సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు.                                           *నిశ్శబ్ద.  

  కొరియన్ అమ్మాయిల గ్లాసీ స్కిన్ సీక్రెట్ ఇదే..! బ్యూటీ ప్రపంచంలో కొరియన్ అమ్మాయిల రూటే సపరేటు. చాలామంది కొరియన్ అమ్మాయిల లాంటి స్కిన్ టోన్ తెచ్చుకోవడం కోసం బోలెడు చిట్కాలు పాటిస్తుంటారు. కొరియన్ అమ్మాయిల ముఖ చర్మం మచ్చలు, ముడతలు లేకుండా అద్దంగా మెరుస్తూ ఉండటమే కొరియన్ అమ్మాయిలకు క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.  అయితే కొరియన్ అమ్మాయిలు తమ ముఖ చర్మం అద్దంలా మెరవడం కోసం ఈ కింది సప్లిమెంట్లు తీసుకుంటారు. అవేంటో తెలుసుకుంటే.. గ్రీన్ టీ.. గ్రీన్ టీ శతాబ్దాలుగా కొరియన్ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పాలీఫెనాల్స్,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ సప్లిమెంట్ గా పేర్కొనబడుతుంది. జీవక్రియను పెంచడానికి, గుండె ఆరోగ్యానికి,  బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. పసుపు.. కొరియన్ వంటకాలలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్ సి భారతీయులు కూడా చాలా విరివిగా తీసుకుంటారు.  ఇందులో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  రోగనిరోధక వ్యవస్థను  బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొరియన్లు తరచుగా వారి ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు,  ఆకుపచ్చ కూరగాయలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు.  కొందరు విటమిన్ సి సప్లిమెంట్లపై ఆధారపడతారు. కొల్లాజెన్.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కొల్లాజెన్ పాత్ర ముఖ్యమైనది. కొల్లాజెన్ ఒక ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు,  గోర్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలా మంది కొరియన్లు తమ బ్యూటీ డైట్‌లో కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. ఈ సప్లిమెంట్లు చర్మ స్థితిస్థాపకత,  ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. అంతే కాదు ముఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవడానికి ఇది మంచి మార్గం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.. సాల్మన్,  మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో సమృద్ధిగా లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ప్రతి ఒక్కరూ చేపలను క్రమం తప్పకుండా తినరు కాబట్టి, చాలా మంది కొరియన్లు ఒమేగా-3 సప్లిమెంట్లను  ఎంచుకుంటారు. ముఖ్యంగా చేపనూనె లేదా ఆల్గే కలిపి తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. ప్రోబయోటిక్స్..  దక్షిణ కొరియాలో ఈ ప్రోబయోటిక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కిమ్చి, పెరుగు,  ఇతర సాంప్రదాయ కొరియన్ వంటకాలు,  పులియబెట్టిన ఆహారాలు మంచి బ్యాక్టీరియాను తీసుకోవడానికి దోహదం చేస్తాయి. అయినప్పటికీ చాలా మంది కొరియన్లు జీర్ణ ఆరోగ్యాన్ని,  రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తీసుకుంటారు. రెడ్ జిన్సెంగ్.. రెడ్ జిన్సెంగ్ ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కొరియన్ రెమెడీ. ఇందులో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది,  శక్తి స్థాయిలను పెంచుతుంది. రెడ్ జిన్‌సెంగ్‌ను కొరియన్లు క్యాప్సూల్స్, ఎక్స్‌ట్రాక్ట్‌లు, టీలు,  టానిక్‌లలో ఒక భాగంలా తీసుకుంటారు.                                        *నిశ్శబ్ద.

అదిరే అదరాల కోసం..   ఎవరి ముఖమైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు...ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అంద విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవటానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్‌బామ్‌లు, లిప్‌స్టిక్‌లు పూయడమే పనిగా పెట్టుకుంటారు...వీటి వల్ల అందం పెరగటం మాట అటుంచితే ధీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పాడయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువల సాయంతోనే పెదాలను అందంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.. * బీట్‌రూట్ రసం తీసుకుని, దానికి మీగడ కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా అవ్వడంతో పాటు ముడతలు పోతాయి. * మరీ పోడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయొచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. * నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనే కలిపి రాసిన ప్రయోజనం ఉంటుంది. * తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేయటం వల్ల పెదాల తగ్గుతుంది. * పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతుంటే రాత్రి పోడుకునే ముందు నెయ్యితో మర్ధన చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. * గులాబీ రెమ్మలను పేస్ట్‌గా చేసి, ఆ పేస్ట్‌కు కాసిన్ని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి. * తరచూ నాలుకతో పెదాలను తడుపడం మానండి..దీని వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. * నీరు, తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

కొబ్బరినూనెలో ఇవి రెండూ కలిపి తలకు రాస్తే చాలు.. మొండి చుండ్రు కూడా మటుమాయం! జుట్టుకు సంబంధించిన సమస్యలలో చుండ్రు చాలా సాధారణమైన విషయం. తేలికపాటి చుండ్రు సమస్య ఉంటే అది పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కానీ చుండ్రు సమస్య ఎక్కువ ఉంటే మాత్రం అది అనుభవించేవారికి నరకాన్ని పరిచయం చేస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారడం, కాంతి కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే  కొబ్బరినూనెలో కేవలం రెండు పదార్థాలు కలిపి రాస్తే చాలు. మొండి చుండ్రు కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, ఉపయోగించే తీరు పూర్తీగా తెలుసుకుంటే.. చుండ్రు తగ్గించుకోవడానికి తలకు కర్పూరం, నిమ్మకాయ నూనె తయారుచేసుకోవాలి. దీన్ని వారంలో మూడు సార్లు ఉపయోగించాలి. ఈ నూనె తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. భీమసేని కర్పూరం..2,3 నిమ్మకాయ.. సగం కొబ్బరినూనె..  ఒక కప్పు మొదట భీమసేని కర్పూరాన్ని బాగా పొడిగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సగం నిమ్మకాయను పిండి రసం తీసి  ఆ రసాన్ని కలపాలి. దీంట్లో వేడిచేసిన కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారంలో మూడుసార్లు దీన్ని తలకు పట్టించి తలస్నానం చేస్తుంటే తలలో చుండ్రు చాలా సులువుగా తగ్గిపోతుంది. ఈ నూనెను ఎక్కువగా కాకుండా కొద్దిమొత్తంలో తయారుచేసుకుని అప్పటికప్పుడు వాడుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నూనె ఎలా పనిచేస్తుందంటే.. వాస్తవానికి భీమసేని కర్పూరం యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగస్ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్ కు చల్లదనాన్ని అందించడం ద్వారా చికాకును తగ్గించడంలో  సహాయపడతుంది.  దీన్ని  జుట్టుకు అప్లై చేస్తే  జుట్టు కుదుళ్లను తెరవడంలో సహాయపడుతుంది,  జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే  నిమ్మరసం దాని ఆమ్ల గుణాల కారణంగా జుట్టు pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది  ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి ఇది తయారు చేయడం సులభం, వాడటం కూడా సులువు  మాత్రమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుంది.                                               *నిశ్శబ్ద.  

చలికాలంలో మెరిసే జుట్టు సొంతం కావాలంటే.. ఇలా చేయండి! శీతాకాలంలో జుట్టు తరచుగా పొడిగా,  గరుకుగా మారుతుంది. దాదాపు ప్రతీ అమ్మాయి సీజన్ తో సంబంధం లేకుండా అందంగా ఉండాలని ఎలా కోరుకుంటుందో జుట్టు కూడా అలాగే మెరుస్తూ ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మెరిసే జుట్టు ఎప్పుడూ దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చలికాలంలో జుట్టు మెరుపు కోల్పోవడం వల్ల జుట్టు బలహీన పడి క్రమంగా జుట్టు రాలిపోతుంది కూడా. అందుకే చలికాలంలో జుట్టుకోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగని జుట్టును  జాగ్రత్తగా చూసుకోవడానికి శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది టిప్స్ పాటిస్తే సరి.. పెరుగు.. తలకు పెరుగుతో  హెయిర్ ప్యాక్ వేసుకుంటే  చాలా ప్రయోజనాలు ఉంటాయి.  జుట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా మొండి చుండ్రు ఉంటే పెరుగును కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్‌తో కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. మెరిసే జుట్టు కావాలంటే ఈ మిశ్రమంలో  తేనెను కూడా కలుపుకోవచ్చు. అలోవెరా.. కలబంద జుట్టు సంరక్షణలో చక్కగా సహాయపడుతుంది. జుట్టును మాయిశ్చరైజ్ చేసి మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.  తాజా అలోవెరా జెల్ లో ఆలివ్ కలిపి తలకు హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత తల స్నానం చెయ్యాలి. ఇది జుట్టును సిల్కీగా మారుస్తుంది. ఉసిరికాయ.. ఈ వింటర్ సీజన్ లో ఉసిరికాయలు  మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఉసిరికాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. కోల్పోయిన మెరుపును తిరిగి అందిస్తుంది. తెల్లజుట్టు సమస్య తగ్గించడంలోనూ, చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలలోనూ ఉసిరికాయ  సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు ఇస్తుంది. షియా బటర్.. దీన్నే షీ బటర్ లేదా షియా వెన్న అని కూడా అంటారు. జుట్టు మెరుపును పెంచడంలో షియా బటర్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని నిమ్మకాయతో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మెరిసే జుట్టు కావాలంటే నిమ్మరసంలో షియా బటర్ మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత  జుట్టును నీటితో కడగాలి. జుట్టుకు మెరుపును ఇవ్వడమే కాదు.. జుట్టు ఆకృతిని కూడా చక్కగా ఉంచుతుంది.                                        *నిశ్శబ్ద.