చలికాలం ముఖం నిర్జీవంగా మారిందా..అయితే ఈ 5 చిట్కాలతో మెరుపు ఖాయం..!
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొరలు పొరలుగా పగిలిపోతూ ఉంటుంది. దీంతో కొంతమందికి చాలా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఈ విధంగా పగిలిపోవడం ద్వారా కొత్త చర్మం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో కొద్దిమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. చర్మం పొడిగా మారడం ద్వారా ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖం కూడా కాంతివంతం కోల్పోయే ప్రమాదం అవుతుంది. ఇలాంటి సమయంలో చలికాలంలో చర్మం పగలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చర్మం పగలకుండా ఇంటి చిట్కాల ద్వారా మీరు మృదువైన స్కిన్ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం పాటించాల్సిన ఐదు చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరిపాలతో స్క్రబ్:
కొబ్బరి పాలు అనేవి సహజమైన మాయిశ్చరైజర్ గా ఉపయోగపడతాయి. పచ్చి కొబ్బరి పాలను సేకరించి వాటితో మీ మొహంపై సున్నితంగా స్క్రబ్ చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతం కోల్పోదు. అలాగే కొబ్బరి పాలలోని సహజమైన మాయిశ్చరైజర్.. మీ చర్మ గ్రంధులను పునరుజీవం చేస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేసుకున్నట్లయితే మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.
పచ్చిపాల మీగడతో ఫేస్ ప్యాక్:
పచ్చిపాల మీగడ అనేది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్. పచ్చిపాలను ఒక కప్పులో తీసి వాటిని ఫ్రిజ్లో పెట్టండి. అప్పుడు దానిమీద మందంగా మీగడ ఏర్పడుతుంది. ఈ మీగడను సేకరించి ప్రతిరోజు ముఖంపై అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా అదే విధంగా పగిలిన చర్మం పునర్జీవంగాను కనిపిస్తుంది.
ఆలివ్ నూనె మసాజ్:
ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ఆలివ్ నూనె సహజమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. కొద్ది చుక్కల ఆలివ్ ఆయిల్ ను మీ ముఖానికి రాసుకున్నట్లయితే. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే పగిలిన చర్మం పునరుజీవంగా కనిపిస్తుంది.
కొబ్బరి నూనె లో కలబంద:
కొబ్బరి నూనెలో ఒక స్పూను అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసుకున్నట్లయితే సహజమైన మాయిశ్చరైసర్ గా ఉపయోగపడుతుంది. అంతేకాదు కలబందలోని యాంటీబయోటిక్ లక్షణాలు మీ చర్మంపై ఉన్నటువంటి క్రిములను తొలగిస్తాయి. తద్వారా మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
నువ్వుల నూనెతో మసాజ్:
నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. చలికాలంలో మీ చర్మం పగలకుండా ఉండాలంటే. కొన్ని చుక్కల నువ్వుల నూనెను శరీర భాగాలపై రాసుకున్నట్లయితే చర్మం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ ను కోల్పోదు. మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖంపై కూడా నువ్వుల నూనెను కొద్ది చుక్కలు రాసుకున్నట్లయితే సహజ సిద్ధమైన మాయిశ్చరైసర్ గా పని చేస్తుంది.