అందానికి చిట్కాలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు బ్రషర్ నే వాడండి, లిప్ స్టిక్, కోహిల్ పెన్సిల్ తో కనుబొమ్మలను సరిదిద్దుకోండి. మస్కారాని వాడితే మీ కనుబొమ్మలు, మీ కనురెప్పలు కూడా దట్టంగా కనిపిస్తాయి. బ్రషర్స్ తో కంటి షాడో ను లిప స్టిక్ ను సరిదిద్దుకోవచ్చు. కంటి రెప్పలకు బంగారు రంగు గాని , వెండి రంగులు గాని పూత పూయడం, కొంత స్పెషల్ ఫంక్షన్స్ అయితే గాని బాగుండదు. మీరు గోల్డ్, సిల్వర్ కూడా మేకప్ మెటీరియల్స్ తో పాటు వాడవచ్చు. మీ ముఖంలో బంగారు ఛాయ గాని, రజిత ఛాయ గాని కనిపించి మరింత అందంగా కనిపిస్తారు. కనుక మీరు అందంగా కనిపించాలంటే మీకు వయస్సుతో పనేలేదు. ఏ వయస్సు వారైనా సరే కాస్త శ్రద్ధ తీసుకుంటే శ్రమ అనుకోకపోతే అందంగా, ఆకర్షణీయంగా , ఆహ్లాదకరంగా, ఆహ్లాదకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించి ఆనందపరచవచ్చు, ఆహ్లాదపరచవచ్చు. మేకప్ కళలోని కొన్ని కిటుకులు...మోడరన్ మేకప్ చాలా అభివృద్ధి చెందింది. స్త్రీలు తమ అందాన్ని ఎన్నో విధాలుగా మలుచుకుంటున్నారు. సహజంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునే విధంగా మేకప్ ను అభివృద్ధి పరిచారు. స్త్రీ యొక్క ముఖకవళికలను ఎన్నో రీతులలో మార్పులు చేయగలుగుతున్నారు. అసలు ఫేస్ మేకప్ పై అద్భుతమయిన ప్రయోగాలు చేసి పర్సనాలిటీనే పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఈ నాడు మేకప్ కళ ఎంత ఎదిగిపోయిందంటే ఆధునిక యుగ రీతులకనుగుణంగా కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, వెళ్ళే అకేషన్ ని బట్టి అంతే వివాహానికి ఓ రకంగా , బర్త్ డే పార్టీకి మరో రకంగా , పిక్నిక్ కి మరో విధంగా, సాధారణ పార్టీలకో విధంగా, ఫంక్షన్ ను బట్టి తగిన మేకప్ చేసుకుంటున్నారు. దానికనువైన దుస్తులను ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా తదనుగుణంగానే ధరిస్తున్నారు. మేకప్ లేకుండా ఈ ఆధునిక యుగంలో ఏ స్త్రీ బయటకు రావడం లేదు. ఫంక్షన్స్ కి మాత్రమే కాదు మామూలుగా మార్కెట్టుకు కూరగాయలు, సరుకుల నిమిత్తం వెళ్ళినా స్త్రీలు మేకప్, మ్యాచింగ్ డ్రెస్ లేనిదే బయటికి అడుగు పెట్టరు. స్త్రీని చూస్తే కేశాలంకరణ నుంచి, పాదరక్షల వరకు, తిలకం, దుస్తులు, ఆభరణాలు అన్నీ ఒకే రంగులో మ్యాచ్ అవుతూ ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మేకప్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం కూడా కాదు. అనేక షేడ్స్ లో మ్యాచ్ ఫ్యాక్టర్స్ విదేశాలనుండి దిగుమతి అయ్యాయి. వాటి ప్రభావం అపూర్వం, మనలోని లోపాలెన్నో అత్యద్భుతంగా కప్పి పుచ్చగలుగుతున్నారు.. జబ్బు చేసి ముఖం మీద మచ్చలయినా, లేదా గుంటలు అయినా అతి సులువుగా మూసేయగలుగుతున్నారు. ముఖాన్ని మేకప్ తో పూర్తిగా మార్చి వేయాలనే పూర్వపు ఆలోచనైతే నేడు ముఖాన్ని సహజంగానే ఉంచుతూ చాలా సహజ సిద్ధంగా ఉండే లైట్ రంగుని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. పూర్వం మేకప్ డ్రైగా ఉండేది. ఇప్పటి మేకప్ లో మాయిశ్చరైజర్ వాడుతున్నారు. అందుకే మేకప్ ఎంతో ముచ్చటగా, సున్నితంగా, తెజోవంతంగా ఉంటుంది. మేకప్ లో ఉన్నప్పుడు మనలోంచి చాలా వరకు చెమట రూపంలో మనలోని తేమతనం ఇంకి పోతూ ఉంటుంది. దానిని అరికట్టి సమ శీతోష్ణతను నెలకొల్పడానికి మాయిశ్చరైజర్ ను ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. మేకప్ కు ముందుగా మన శరీరం కొంత తేమతనం కలిగి ఉండాలి. అందుకోసం మనం మాయిశ్చర్ కలిగిన రసాయనిక పదార్థాలు వాడటం మంచిది. చర్మం మెత్తగా ఉంటే మేకప్ బాగా అతుకుతుంది. చర్మం బిరుసుగా ఉంటే అతకదు. చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ లు ఇప్పుడు అనేక విధాలుగా మార్కెట్టులో విడుదలవుతున్నాయి. ఎమెల్షన్సు గాను, ద్రావకాలగాను వస్తున్నాయి. మాయిశ్చరైజర్ ను పల్చగా ముఖానికి మెడకి పట్టించాలి. దానిపైన ఫౌండేషన్ మేకప్ చేయాలి. ఫౌండేషన్ కు ఉపయోగించే రంగును అన్వేషించడంలో కొంత టెక్నిక్ అవసరం. అది ఉపయోగించే రంగు పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ పూర్తి చేశాక దానిపై కాంతిని కొంత వరకు సరఫరా చేయగల పౌడర్ ( Transcent powder) ను జల్లాలి. అప్పుడు గాని ఫౌండేషన్ బాగా సెట్ అవదు.  

  సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. మరీ దుర్భరంగా ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడివారుతుంది. వాజిలిన్లు, కోల్డ్ క్రీములూ, మాయిశ్చరైజర్లు రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి, శరీరంలో కాంతి నశిస్తుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది. ఈ ఎండల నుండి బయట పడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే, తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇక వేసవిలో అయితే, శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. . చాలామంది వేసవి తాపాన్ని భరించలేక ఐస్ క్రీములు, కూల్ డ్రింకులతో సేదతీరుతుంటారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు దాహార్తిని తీర్చేమాట నిజం. కొంతసేపు సేద తీరినట్లూ ఉంటుంది. కానీ అది చాలా తాత్కాలికం. పైగా ఈ కూల్ డ్రింకులు ఒబేసిటీ లాంటి అనేక అదనపు సమస్యలకు కారణమౌతాయి. కనుక కూల్ డ్రింకులు, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి. . కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండాలి. బొబ్బరి నీళ్ళు తాగడంవల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగడం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. పండ్ల నుండి జ్యూస్ తీయడం వల్ల అందులో ఉండే ఫైబర్ చాలావరకూ ఫిల్టరయి పోతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియలో ఎంతగానో ఉపయోపడుతుంది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. కీరా దోసకాయలు వేసవిలో విరివిగా దొరుకుతాయి. చెక్కు తీసిన కీరా దోసకాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. ముఖానికి వన్నె వస్తుంది. కీరా దోసకాయలను సన్నగా చెక్కల్లా తరిగి, ముఖంమీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పడేసి, చల్లటి నీతితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది. టొమేటో గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచుకుని, ఎండిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లు ముఖంలో ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. వేసవిలో ఆకుకూరలు మరీ మంచిది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల ముఖంలో ముడతలు రావు. ముఖం తేటగా అనిపిస్తుంది. అదీ సంగతి. వేసవివల్ల వచ్చే సమస్యలను ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు.