ఈ ఆసనాలు వేస్తే జుట్టు పెరుగుతుందా? జుట్టు దృఢంగా, అందంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలా బాగున్నట్టు. అందులోనూ శరీరానికి అదనపు అందాన్ని ఇచ్చేది జుట్టు. జుట్టు పెరుగుదల కోసం ఎన్నో రకాల మందులు, చిట్కాలు, నూనెలు వాడుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి యోగ గొప్ప మార్గం. యోగాలో కొన్ని ఆసనాలు జుట్టు అద్భుతంగా పెరిగేలా చేస్తాయి. వాటిలో కొన్ని ఆసనాలు ఇక్కడున్నాయి.. అధో ముఖ స్వనాసన జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. తలలో రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఈ ఆసనం ఇతర భౌతిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఉదాహరణకు, ఇది మనస్సును శాంతపరచడానికి, శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి, శరీరానికి కొత్త శక్తినివ్వడానికి సహాయపడుతుంది. కపాలభాతి శ్వాస వ్యాయామం మెరుగైన ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది, ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను దోహదం చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు రాలే సమస్యకు కూడా గొప్ప పరిష్కారం. సర్వాంగాసనం ఇది శరీరాన్ని బ్యాలెన్స్ గా ఉండేలా చేస్తుంది, తలపై రక్త ప్రసరణను పెంచుతుంది. సర్వంగాసనం లేదా షోల్డర్ స్టాండ్ అనేది పూర్తి శరీర వ్యాయామం, ఇది వివిధ కండరాల సమూహాలపై పనిచేస్తుంది. బాలసనం ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఒత్తిడి మరియు జీర్ణ సమస్యలకు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాంగ్జైటీ సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శీర్షాసనం శీర్షాసనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది మరియు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. ఇది నిద్రాణమైన వెంట్రుకల ఫోలికల్స్ ను ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా జుట్టు పెరుగుదల సామర్థ్యాన్ని చేరుకోవడానికి, తద్వారా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. వజ్రాసనం వజ్రాసనం లేదా థండర్ బోల్ట్ భంగిమ సరళమైనది అయినప్పటికీ చాలా శక్తివంతమైనది. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. చివరికి జుట్టు పెరుగుదలకు దారితీసే పోషకాలను పెంచడంలో సహాయపడుతుంది. ఉత్తనాసన జుట్టు నాణ్యత మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జుట్టు మెరిసేలా మరియు దోషరహితంగా కనిపించేలా చేస్తుంది. ఈ యోగ భంగిమ శరీరాన్ని సాగదీయడంతో పాటు కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది ఆక్సిజన్ స్థాయిలను పెంచడం ద్వారా తలకు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మత్స్యాసనం జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో మత్స్యాసనం ది బెస్ట్ అని చెప్పవచ్చు. బలమైన, పొడవాటి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ యోగా ఆసనం రోజువారీ సాధనతో చాలా జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఎనిమిది ఆసనాల్లో వీలైనన్ని రోజూ వేస్తుంటే జుట్టు సంబంధ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ఇంకెందుకు అలద్యం మీరూ ట్రై చెయ్యండి. ◆నిశ్శబ్ద.
అమ్మాయిల అందాన్ని పెంచే రహస్య చిట్కాలు! పండు పండు పండు ఎర్ర పండు యాపిల్ దీని పేరు.. అని నాగార్జున పాడతాడు. యాపిల్ పిల్లా నీవెవరో.. ఐస్ క్రీమ్ చెలియా నీవెవరో అని ఇంకొక హీరో అందుకుంటాడు.. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ అని సంథింగ్ చేంజ్ చేస్తాడు రవితేజ.. మొత్తానికి ఫ్రూట్స్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఫ్రెష్ గా తాజాగా ఉన్నట్టు అమ్మాయిలు కూడా ఎంతో తాజాగా ఉండాలి. అప్పుడే వారిలో ఆరోగ్యం కూడా బహుబాగుగా ఉంటుంది. అయితే అమ్మాయిలు ఎండిపోయిన పండ్లలా కనిపిస్తే ఏం బావుంటుంది. ఏడ్చినట్టు ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అందరూ కిందా మీదా పడిపోనక్కర్లేదు.. ఈ చలికాలం అధిరిపోయే గిఫ్ట్ తీసుకొచ్చింది అమ్మాయిలకు. ఎక్కడ చూసినా కమలా పండ్లు కనులకు విందు చేసున్నాయి, వీటి లోపలి పండు తినడానికి పనికొస్తే వీటి తొక్క భలే మంచి స్కిన్ ప్రొటక్షన్ ఐటమ్ గా పనికొస్తుంది. ఇంతకూ కమలా పండ్లతో బ్యూటీ పెంచుకోవడం ఎలా.. అంటే ఇదిగో ఇలా.. ఇంతకూ కమలా పండ్లను చర్మ ఆరోగ్యం కోసం ఎందుకు ఉపయోగిస్తారు అంటే.... కమలా పండ్లలో విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కారణంగా ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఏముంటాయంటే... కమలా పండ్లలో కాల్షియం, విటమిన్ ఎ, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్, ఖనిజ లవణాలు అయిన పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంతేకాకుండా థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటి ఇతర అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సిట్రస్ అని పిలుచుకునే విటమిన్ సి పుష్కలంగా నిండి ఉన్న పండు ఇది. శరీరంలో తేమ స్థాయిలను పట్టి ఉంచుతుంది. చర్మాన్ని, చర్మం మీద మచ్చలు, మొటిమలు మొదలైన వాటిని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కమలా పండు మహిళల అందాన్ని మెరిపిస్తుంది. కమలా పండుతో అద్భుతమైన చిట్కాలు.. సాదారణంగా కమలాపండును తినేటప్పుడు తొక్కలు తీసి పడేస్తాం. అయితే ఆ తొక్కలను శుభ్రమైన ప్రదేశంలో ఎండబెట్టుకుని పొడిచేసుకోవచ్చు. ఇలా సహజంగా చేసుకునే పొడి మంచి ఫలితాలను ఇస్తుంది. కమలా పండు రసం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు మంచి చర్మ రక్షణ కారకంగా కూడా పనిచేస్తుంది. కమలా పండు రసానికి వేపాకు పొడి లేదా వేపాకు రసం జతచేయాలి, ఇందులో కాసింత శనగపిండి వేసుకుని పేస్ట్ లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటివి ఈ ప్యాక్ వల్ల తొలగిపోతాయి. కమలా పండు తొక్కను పొడి చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ పొడి బెస్ట్ ట్యాన్ రిమూవర్ గా పనిచేస్తుంది. కమలా పండు తొక్కల పొడిని లేదా రసాన్ని స్నానం చేసేటపుడు నీటిలో కొద్దిగా వేసి ఆ నీటితో స్నానం చేస్తే చెమట వల్ల కలిగే చెడు వాసన పోతుంది. శరీరం మంచి రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది. కమలా పండు తొక్కలను ఉడికించి, చల్లారిన తరువాత ఆ నీటిని ఒక స్ప్రే బాటల్ లో వేసుకుని ఫేస్ క్లెన్సర్ గా ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు, మృతకణాలు తొలగిపోయి ముఖ చర్మం యవ్వనంగా మారుతుంది. ఇలా కమలా పండు తొక్కలు ఎంతగానో చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. ఇకపోతే వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే… ◆నిశ్శబ్ద.
ఒత్తైన జుట్టు రహస్యం ఈ ఆయిల్ సొంతం! అమ్మాలకు ఒత్తైన, పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. జుట్టు పెరగదు కాబట్టి అలా ఉంటారు కానీ.. అందంగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉన్న జుట్టు పెరుగుతుంటే ఎవరు మాత్రం మాకొద్దు అని అంటారు చెప్పండి. నడుము వరకు పొడవాటి మందపాటి జుట్టు కావాలనుకుంటే మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. మార్కెట్లలో బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద జుట్టు, ఇంత ఒత్తైన జుట్టు అంటూ ఒకటే ప్రమోషన్లు ఊదరగొట్టేస్తాయ్. వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది తప్ప.. మీ తలలో జుట్టు కనీసం ఒక ఇంచ్ అయినా పెరగదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారుచేసుకుంటే.. చాలా చక్కని ఆలోచన కానీ.. యూట్యూబ్ లలో చూపించే బోలెడు చిట్కాల కారణంగా ఈ హెయిర్ ఆయిల్ సొంతంగా తయారుచేసుకోవడంలో కూడా కాస్త కన్ఫ్యూజనే.. అలాంటి కన్ఫ్యూజన్ తప్పించి ఒక క్లారిటీతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేవిధానం మీకోసం… ఈ హెయిర్ ఆయిల్ గురించి చెప్పే ముందు.. అసలు ఇది ఎందుకు వాడాలి. చాలామందికి జుట్టు పలుచగా.. పొట్టిగా ఎందుకు ఉంటుంది?? అనే విషయం కూడా తెలుసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రెండు రకాలుగా పోషకాలు అందాలి. ఒకరి ఆహారం ద్వారా కడుపుకు తీసుకోవడం అయితే.. రెండవది బయటి నుండి జుట్టుకు పోషకాలు అందించడం. హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ మసాజ్ ఇవన్నీ జుట్టుకు పోషకాలు అందించేవే.. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా జుట్టు మరింత సమస్యలొకి జారుకుంటుంది. జుట్టుకు ఇలాంటి సమస్యలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు.. కొలతలతో సహా కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఇదిగో ఇక తెలుసుకోండి. కావలసిన పదార్థాలు.. 2 టేబుల్ స్పూన్లు మెంతులు 2 టేబుల్ స్పూన్లు నల్ల విత్తనాలు(కలోంజి సీడ్స్) 20 బాదంపప్పులు 10 నుండి 20 మందార ఆకులు 2 మందార పువ్వులు -20 నుండి 25 కరివేపాకు రెండు తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి నూనె. ముందుగా బాదం, మెంతి, కలోంజి గింజలను మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద చిన్న పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టిన పౌడర్ వేయాలి. ఆ తరువాత పేస్ట్ చేసిన ముద్ద వేసి కాస్త సిమ్ మీద ఉడికించాలి. మిశ్రమం అంతా ఉడికి నూనె పైకి తేరిన మూమెంట్లో గ్యాస్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత, ఒక చిన్న ప్లాస్టిక్, లేదా గాజు సీసా తీసుకుని, దానిపై కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. దీన్ని డబల్ ఫిల్టర్ చేస్తే నూనె చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ రెడి అయినట్టు. ఇది మీకు వాసన వస్తుంది అనిపిస్తే దీంట్లొకి రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్ లేదా లావెండర్, రోజ్ ఇలా ఏదైనా వాడచ్చు. ఈ ఆయిల్స్ కలపడం వల్ల ఈ నూనె జుట్టుకు అప్లై చేసినప్పుడు తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో.. గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. ◆నిశ్శబ్ద.
వీపు భాగం నల్లగా.. ఎబ్బెట్టుగా ఉందా?? ఇలా చేస్తే నలుపు పోతుంది! అందంగా కనిపించాలని కోరుకోకుండా ఎవరూ ఉండరు. ఖరీదైన జీవితం కలిగిన వారి నుండి, సాధారణ కుటుంబాల్లో అమ్మాయిల వరకు అందరూ అందంగా తయారవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి ఫాషన్ ప్రపంచంలో సాధారణ అమ్మాయిలకు కూడా సరిపోయేలా తక్కువ ధరకు లభించేలా ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి డ్రెస్సులలో వీపు భాగం ఎక్పోజ్ అయ్యేవిధంగా ఉండే దుస్తులు ఉంటున్నాయి. చీరకట్టు మహిళలు వివిధ రకాల డిజైనింగ్ బ్లౌజులు వేసుకోవడం నుండి, ఎన్నో రకాల దుస్తులు ఇందులోకే వస్తాయి. అయితే.. చాలామంది వీపు భాగం గురించి మొదటి నుండి అంత శ్రద్ధ పెట్టరు. ఈ కారణంగా వీపు భాగం చాలామందికి నల్లగా మారిపోయి ఉంటుంది. ఇలాంటి వారు ఫ్యాషన్ దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడతారు. వీపుకు ఉన్న నలుపు పోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.. మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండేవాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నోరు బాగలేనప్పుడు కాస్త పుల్లపుల్లగా బాగుంటుందని, నీరసం అనిపించినప్పుడు ఉత్సాహం ఇస్తుందని, వేసవి తాపాన్ని తగ్గిస్తుందని, పులిహోర కలుపుకోవాలని.. ఇలా కారణాలు ఏమైనా నిమ్మకాయను మనకు ఉన్న లింకు లంకె బిందె అంత పెద్దది. అలాంటి నిమ్మకాయను ఉపయోగించి వీపు భాగంలో నలుపును మాయం చేయొచ్చు.. పార్లర్ లలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకుని ట్రీట్మెంట్ కు ధీటుగా నిమ్మకాయంతో ఇంట్లోనే మ్యాజిక్ చేయచ్చు ఇలా.. నిమ్మకాయ, కలబంద నిమ్మకాయ మరియు కలబందతో వీపు తెల్లబడటానికి మంచి చిట్కా ఉంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. దీని తర్వాత దానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. తాజా కలబంద ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండింటినీ మిక్స్ చేసి వీపుపై బాగా మసాజ్ చేయాలి. కొంత సమయం తర్వాత కడిగేయాలి. నిమ్మకాయ సెనగపిండి సెనగపిండి మన వంటింట్లో ఎప్పుడూ ఉంటుంది. నిమ్మరసానికి దీన్ని జతచేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్‌స్పూన్ శెనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. దానికి రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు వీపుపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మెల్లిగా స్క్రబ్ చేస్తూ దీన్ని తొలగించాలి. నిమ్మకాయ-ఎర్రకందిపప్పు ఎర్రకందిపప్పును బ్యూటీ చిట్కాలలో బాగా వాడుతారు. దీన్ని నిమ్మకాయంతో కలిపి మంచి పలితాన్ని రాబట్టుకోవచ్చు. ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఎర్రకందిపప్పు పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. ఒక చిన్న చెంచా కలబంద, పెరుగు జోడించాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత వీపుపై అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం-బియ్యం పిండి బియ్యపు పిండిని వీపు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు , ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకొని దానికి రెండు చెంచాల పెరుగు వేయండి. దానిపై నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి ప్యాక్‌ని వీపు భాగంలో అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఈ టిప్స్ పాటిస్తే వీపు భాగంలో ఉన్న నలుపు పోతుంది. కేవలం వీపు బాగంలోనే కాదు. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పెదవుల చుట్టూ ఉన్న భాగం.. ఇలా అన్ని ప్రాంతాలలో వీటిని ఉపయోగించచ్చు. ◆నిశ్శబ్ద.
చిక్కులు పడే జుట్టుకు చక్కని పరిష్కారాలు! అమ్మాయిలకు తమ జుట్టు అంటే చాలా ఇష్టం. పొడవాటి శిరోజాలు కావాలని అనుకోని మహిళ ఉండదు. అయితే జుట్టు ఆరోగ్యకరంగా పెరగడం, ఒత్తుగా, పట్టు కుచ్చులా ఉండటం చాలా కొద్దిమందిలోనే కనబడుతుంది. శారీరక అందాన్ని మరించ పెంచే అంశంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు సంరక్షణ విషయంలో దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అయితే, చాలా తొందరగా చిక్కుబడే జుట్టుతో చెప్పలేనంత నరకం అనుభవిస్తుంటారు ఎంతోమంది. కొందరిలో చిక్కుబడిన జుట్టును విడదీయడం చాలా శ్రమతో కూడుకున్న పనిగా ఉంటుంది. అలాంటి జుట్టును సరిగ్గా చిక్కు తీయకపోతే, అది హెయిర్ డ్యామేజ్ కు, వెంట్రుకలు విరిగిపోవడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల జుట్టుకు ఏమాత్రం హాని కలిగించకుండా చిక్కు తీయడం ఎంతో నేర్పుతో కూడుకున్నది. ఎక్కువ చిక్కుబడిపోయే జుట్టును తేలికగా ఆరోగ్యంగా చిక్కు తీయడానికి కొన్ని టిప్స్ ఇవే… వెడల్పాటి పంటి దువ్వెన ఎక్కువ హెయిర్ ఫాల్ లేకుండా సులువుగా చిక్కు తీయడానికి మొదటి మార్గం పర్ఫెక్ట్ దువ్వెన. వెడల్పాటి పళ్ళు కలిగిన దువ్వెన వాడి చిక్కును సులువుగా తీయవచ్చు. చిక్కు మీద చమ్మక్: లీవ్-ఇన్ కండీషనర్ లేదా డిటాంగ్లింగ్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించడం వల్ల చిక్కుబడిన జుట్టును చాలా సులువుగా తీసేయచ్చు. వీటిని స్ప్రే చేసి పెద్ద పళ్ళ దువ్వెనతో దువ్వితే సరిపోతుంది. వేళ్లను ఉపయోగించవచ్చు: దువ్వెన లేదా బ్రష్‌ని చిక్కు తీయడానికి ఉపయోగించే ముందు చిక్కుముడులను వేరు చేయడానికి జుట్టును చేతి వేళ్ళతో చిక్కులు విడదీయాలి. పాయలుగా విడదీయడం: జుట్టు బాగా చిక్కులుగా ఉన్నప్పుడు దువ్వెనతో పట్టి లాగకుండా జుట్టును చిన్న పాయలుగా విడదీసి మెల్లిగా చిక్కు తీయాలి. సున్నితంగా ఉండాలి: చిక్కులు విడదీసేటప్పుడు సున్నితంగా ఉండాలి. చిక్కు చాలా ఎక్కువ ఉందని, అది సులువుగా రావడం లేదని చిరాకు, కోపం అసహనంతో జుట్టును పట్టి లాగకూడదు. చివర్ల నుండి చిట్కా: జుట్టు చిక్కులు తీసేటపుడు పై నుండి కిందకు దువ్వకుండా మొదట జుట్టు కింద భాగం దువ్వి చిక్కులు తీసుకోవాలి. ఆ తరువాత పైన నుండి కిందకు దువ్వాలి జుట్టు తడిగా చిక్కులు తీయొద్దు: చాలామంది జుట్టు తడిగా ఉండగానే జుట్టు లాగడం, దువ్వడం చేస్తుంటారు. ఇది చిక్కులు ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే చిక్కులు తీయాలి. మరొక విషయం ఏమిటంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, కోపం చిరాకు అసహనం వంటివి ఉన్నా జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంది. వీలైనవరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రశాంతగా ఉండటానికి ప్రయత్నించండి. ◆నిశ్శబ్ద.
తులసి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు! భారతీయుల జీవితంలో తులసి అనేది చాలా ప్రత్యేకమైనది. అది కేవలం దైవ సంబంధమైన మొక్కగానే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించే అద్భుత సంజీవనిగా కూడా అందరికి తెలుసు. మన రోజు వారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరిమికొట్టడంతో పాటు మొండి రోగాలను, ఎంతో తీవ్రమైన జబ్బులను నెమ్మదిగా తగ్గుముఖం పట్టించడంలో తులసి చాలా గొప్పగా పనిచేస్తుంది. అయితే అమ్మాయిలు సాధారణంగా సౌందర్యాన్ని పెంచుకోవాలని అనుకుంటే వారు తమ సహజమైన బ్యూటీ థెరపిలో కచ్చితంగా తులసిని భాగం చేసుకోవాలి. తులసి శరీరం లోపలి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శరీరం పైన చర్మాన్ని కూడా చక్కదిద్దగలదు. అంతర్గతంగా, బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసే తులసి గ్రేట్ మెడిసిన్. తులసి చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పొడి, సున్నితమైన చర్మం మీద వచ్చే మొటిమలను, వయసు రీత్యా ఏర్పడే ముడుతలను తగ్గించడంలో తులసిది శక్తివంతమైన పాత్ర. తులసిని రోజువారీ చర్మ సంరక్షణలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది స్కిన్ స్పెసిషలిస్ట్స్ తులసిని రోజులో భాగం చేసుకోమని కూడా సలహా ఇస్తున్నారు. ఏ రకమైన తులసి అయినా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఏ రకమైన తులసి ఉపయోగించాలనే సంశయం కూడా వద్దు. అమ్మాయిలకు తులసితో అద్భుతమైన అయిదు ప్రయోజనాలు ఇవిగో... యాంటీ ఏజింగ్ లక్షణాలు తులసిలో యాంటీఆక్సిడెంట్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో తులసి సహాయపడుతుంది. ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ చర్మం మీద వచ్చే వాపు మరియు ఎరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఈ రెండూ వృద్ధాప్యం రావడానికి దోహదం చేస్తాయి. తులసి రసం లేదా నూనెతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మొటిమల చికిత్స తులసి మొక్క సహజ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలకు సమర్థవంతమైన చికిత్స చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండ మొటిమలు వచ్చినప్పుడు మొటిమల తాలూకూ నొప్పి, మంట తగ్గించడానికి, చర్మ రంధ్రాలను అన్ లాగ్ చేయడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలలో దుమ్ము, ధూళి, మురికి మొదలైనవి చేరడం మొటిమలకు దోహదపడే కారకాలు. తులసిని రోజులో చేర్చడం ద్వారా మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మళ్ళీ మొటిమలు రాకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది తులసిలో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. అలాగే చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి, చర్మం రంగు వెలసిపోకుండా మెరుస్తూ సహాయపడుతుంది. సాధారణ స్కిన్ కేర్ కంటే తులసిని అందులో భాగం చేసుకుని ఉపయోగించడం వల్ల చర్మానికి అధిక కాంతి, ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. నిస్తేజంగా ఉన్న చర్మాన్ని ఆక్టివేట్ చేస్తుంది. మాయిశ్చరైజింగ్ తులసితో ఉన్న మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా, చర్మాన్ని తేమగా, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి లోతైన పోషణను అందించగల ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది, ఇది పొడి చర్మం ఉన్నవారు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన, తేమతో కూడిన చర్మం కావాలంటే తులసి బెస్ట్ ఆప్షన్. విశ్రాంతిని ఇస్తుంది తులసిలో ఉన్న సహజమైన గుణాలు ఉన్నాయి, చర్మపు చికాకును తగ్గించి ప్రశాంతంగా ఉంచడానికి , ఉపశమనానికి సహాయపడతాయి. ఇది యూజెనాల్‌ను కలిగి ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇదే చర్మాన్ని విశ్రాంత స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇలా తులసి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది. ◆నిశ్శబ్ద.
Jojoba oil is a nutrient rich natural oil that is great for hair and skin. Over the years, jojoba oil has been increasingly used in cosmetics, soaps and hair conditioners. There are numerous health benefits the oil offers. Jojoba oil has amazing healing properties. This oil will leave the skin feeling refreshed after massage. It not only soothes away muscle aches and pains, but it will speed heeling of scars or abrasions on the skin, making it more comfortable and easier to move freely. It is non-greasy and feels light on the skin. It's natural feel allows the therapist to apply and massage easily. It also hydrates dry, flaky skin with deep penetrating fatty acids and nourishing vitamins that helps to keep skin feeling soft and smooth. The different species of plants have been discovered through research over the years, but the jojoba plant and its extracted oil is the only one that comes close to resembling the oils our body excretes naturally. The fact that it is so close to human sebum means the scalp on our head will not react badly with the oil. The natural balance is maintained on the top of our head and that’s why jojoba oil is so good for hair as well as for your beard. Since jojoba oil regulates the production of sebum, which causes acne, its use can help reduce further breakouts. Because it is very similar to sebum, it does not clog pores and will even help to clean out build-up of dead skin cells around pores that lead to acne. The vitamin E present in the oil contains anti-oxidants that help remove damaged cells and help new ones grow, therefore fading acne scars. When used as a conditioner will help to eliminate dandruff. Often times, dandruff is caused by a dry scalp. Using jojoba oil helps to moisturize the scalp, thereby preventing dandruff. Simply, massage the oil into your head half an hour before washing your hair. Afterwards, shampoo as usual. Jojoba oil contains Linoleic acid and other antioxidants that aid in skin and cell regeneration. This is especially important to those of us who have struggled or are struggling with hair loss issues. With our body regenerating cells, this allows our scalp to grow new, strong and healthy hairs, which contributes to the overall health, volume and lustre of our hair. Most people forget to exfoliate but this can lead to aged and wrinkled skin. Use a few drops of jojoba oil, emulsify with water, massage face using a muslin cloth then rinse well with clean water. This is a gentle way of exfoliating – you can do this once a week. Jojoba oil improves the look and health of skin, especially in regards to fine lines and texture. Although a topical product won’t solve the underlying health issues which lead to eczema and psoriasis, jojoba oil is a favorite among people looking for relief from these conditions. Jojoba oil works well to treat the dry, scaly skin typical of eczema, and is a favorite of many eczema-prone natural beauties even when they’re not in the middle of a flare-up.Flaky skin is especially helped by jojoba oil. ..Divya
వెంట్రుకలు రాగి రంగులోకి మారుతున్నాయా?? ఇదిగో మీకోసమే ఇది.. అమ్మాయిలకు వెంట్రుకలు అంటే ప్రాణం. జుట్టు పొడవుగా పెంచుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకప్పుడు మహిళలకు చాలమంచి కేశసంపద ఉండేది. అయితే రాను రాను అది తగ్గిపోతోంది. జుట్టు తెల్లబడటం, రాగి రంగులోకి మారడం, పలుచగా మారిపోవడం వంటి సమస్యలు మహిళలను వెంటాడుతుంటాయి. వెంట్రుకలు పలుచగా వున్న స్త్రీలు వారమునకు రెండుసార్లు తల స్నానం చెయ్యాలి. రాత్రులు తేలికగా నూనె వ్రాసుకొని అలాగే వదిలేయవలెను. అప్పుడప్పుడు కొబ్బరి నుండే వేడి చేసి, తలకు మర్దించాలి. వెంట్రుకలు పలుచదనం పోయి దృఢంగా తయారవడానికి పౌష్టిక ఆహారము, బి-కాంప్లెక్సు సమృద్ధిగా తీసుకోవాలి. . కుంకుడుకాయలు రాత్రి నాన పెట్టి, ఉదయము నానిన కుంకుడుకాయలు ఉడికించి ఆ నీటితో తలంటుకోవాలి. పోషకాహారముతోనే అందమైన జుట్టు సొంతమవుతుంది. ముఖ్యంగా జుట్టు రాగి రంగులోకి మారడం, వెంట్రుకలు రాలిపోవడం మొదలైన సమస్యలకు వెంట్రుకలు నల్లగా, దృఢముగా వుండటానికి పైపై మెఱుగులు ప్రయోజనాన్ని ఇవ్వవు. అందుకే పౌష్టికాహారము తీసుకొనుటలో శ్రద్ధ అధికముగా చూపాలి గుడ్లు, చేప మాంసము, ఆకుకూరలు, పళ్ళు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి! వెంట్రుకలు "కెరోటిన్” అనే 'మాంసకృత్తు'ల వలన తయారౌతాయి వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడాలంటే....' ఆమ్లతైలము' ఉపయోగించడం మంచిది. తలంటు పోసుకోవడానికి ఒక గంట ముందుగా ఆమ్లతైలము బాగా దట్టముగా పట్టించాలి. ఆ తరువాత నిమ్మరసమ తీసుకొని, తలకు మర్దన చేయాలి. ఆ తరువాత ఆరనిచ్చి, సీకాయ లేక కుంకుడు కాయతో తలంటు పోసుకోవాలి. దీనివల్ల కొంత కాలానికి వెంట్రుకలు నల్లగా నిగనిగలాడే స్థితికి మారుతాయి. షాంపూ లాంటి 'కెమికలైజ్డ్' పదార్థాలు ఉపయోగించకూడదు. అలాగే ఐరన్, విటమిన్ బి వంటివి ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రాగిరంగు వెంట్రుకలు నల్లబడటానికి హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలంటే.. 250 గ్రా॥ల "మస్టర్డ్ ఆయిల్" (Mustard oil = ఆవాల నూనె)" ను మరగబెట్టాలి. ఈ నూనె మరిగేటప్పుడు 60 గ్రా॥ల గోరింటాకు తైలాన్ని వేసి, బాగా కలియబెట్టి, బాగా కాచాలి. తరువాత వడగట్టి, సీసాలో పోసుకొని, కొద్ది రోజులు నిలువ వుంచాలి. వెంటనే వాడకూడదు. కొన్నిరోజుల తరువాత ఈ నూనెను తలనూనెగా ఉపయోగిస్తూ వుంటే . మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఈ నూనెను ఒక్కసారే ఎక్కువగా చేసుకోకూడదు. కొంచెం కొంచెం చేసుకుని వాడుకుంటూ ఉంటే మంచిది. అలాగే జుట్టు సంరక్షణకు మరికొన్ని సహజమైన మార్గాలు.. మెత్తగా దంచిన ఉసిరికాయ పై చెక్కులను రాత్రిపూట నీటిలో వేసి, నానపెట్టి వుంచాలి. ఉదయమే ఆ నీటిని తలకు పట్టించి, కొద్దిసేపు ఆరనిచ్చి, ఆ తరువాత తలకు కొబ్బరి నూనె వ్రాసుకోవాలి. ఈ విధానము వలన వెంట్రుకలు నల్లగా మారతాయి. పైన చెప్పుకున్నట్టే ఉసిరికాయ పై తొక్కను గిన్నెలో వేసి, అందులో "గుంటగలిజేరు" రసము పోసి, ఏడురోజులు నానబెట్టాలి. ఆ తదుపరి ఆ తొక్కలను ఎండించి, చూర్ణముచేసి, పూటకు పావుతులము(2.5grms) చొప్పున తేనెలో కలిపి తింటూవుంటే వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లబడతాయి. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మెంతి ఆకులు బాగా నూరి, శిరోజాలకు రాత్రి పడుకొనే ముందు పట్టించి, ఉదయము తల స్నానము చేస్తే వెంట్రుకలు మృదువుగా మారతాయి. రేగు చెట్టు ఆకులు బాగా నూరి, తలకు పట్టించి, 1-2 గంటలు వుంచి, తల స్నానము చేస్తే .. వెంట్రుకలు బాగా పెరిగి, పట్టులా మృదువుగా వుంటాయి. ప్రతిరోజూ కొబ్బరినూనె క్రమము తప్పకుండా జుట్టుకు రాస్తూవుంటే..... వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లగా వుంటాయి. బాగా పెరుగుతాయి. చాలా మృదువుగా కూడా వుంటాయి. తలకు నూనె అవసరం లేదు అనే మాట చాలామంది చెబుతారు. కానీ జుట్టు రఫ్ గా మారిపోతుంది. అందుకే జుట్టుకు నూనె పెట్టడం అవసరం. ◆నిశ్శబ్ద.
Getting Fair Skin Is Now Very Easy! To have fair skin is the dream of every girl. Now all girls will be pleasantly surprised to know that this dream can come true. You don’t have to go very far to get the perfect skin complexion. Simply reach out to the natural ingredients at home and you can get your dream look. As tea rejuvenates you from within, it has the capacity to do the same for your skin. Use a pack of green tea, lemon tea or herbal tea while taking a bath or spray it on your face whenever you feel the need to refresh your skin. Adding honey to the tea is also a good idea as it keeps your skin hydrated. The procedure of making a face pack with these ingredients, is also very simple. Make a fine mixture of a cup of cooled tea water, 2 spoons of rice flour and half a spoon of honey. Keep it on for 20 minutes and massage your skin in circular motion before washing it off. In this case the rice flour acts as a scrub to help you get rid of dead skin. The next option is a mix of oats and lemon juice. Oats are natural exfoliators and therefore very beneficial to the skin. They are also used in the treatment of eczema. Besides, they also help you get rid of excess oils, grime and impurities. Coming to lime, its extracts are known to lighten your skin because of the presence of vitamin C. --Kruthi Beesam
Nail care Well, Nails though tiny, need to be taken care of and maintain them well. Nails are pivot in protecting the tips of your finger and seal the entry of the germs through your cuticle. Here is how you can gratify your nails: • Apply and massage with cuticle oil once a week, it nourishes and smoothens your cuticle. Cuticle cream with urea, phospholipids or lactic acid help in preventing cracks! • Applying one or two coats of nail strengther over your nails and bare tips and side of your nails, it prevents breakage of nails! • While applying nail polish over your nails, make it a point to apply a nourishing base coat and finally finish it with a top coat • The nail color too has to be taken care of, so avoid using nail polish removers that contain high amounts of acetone or formaldehyde • The white spots over your nails are the indicative of iron or zinc deficiency, so include the foods rich in these minerals in your diet • While you file your nails make it a point not file them to a point, rather file it in one direction and round the tip slightly • Follow a balanced diet enhanced with vitamins and biotin • Refer a dermatologist instead of digging the ingrown nails • Avoid nail biting and nail picking!! • When you use artificial nails, check out for the greenish discoloration, caused by bacterial growth Nourish your tips!! - Siri
Benefits of Applying Curd Curd has many health benefits and it is also used as a beauty product. It is an excellent source of calcium. Even lactose intolerant people can take curd daily. Applying curd on face helps to get soft and smooth skin. It also acts a good moisturizer and good for dry skin. Whether you suffer from acne, dry skin, skin dullness or excessive oiliness, a plain yogurt mask is a budget-friendly way to treat your face. Yogurt is effective at cleansing and disinfecting pores, preventing acne, moisturizing skin and revitalizing its texture. * Apply paste of curd in the flour (besan) into the hair roots for an hour and wash the head. This will return the hair shine and will exclude you from the problem of dandruff. * Using pepper powder mixed in yogurt for head wash twice a week will end dandruff, and will also help in making hair soft, black, long and dense, which will raise your beauty. * If acne on your skin is bothering you then apply sour curd paste on your face and let it dry and then wash the face. In a few days you will see the unexpected benefits. * Massage sour curd on the blackish part of the neck leave it for 15 minutes and then wash the sour yogurt. This application will help in removing neck blackish part. * Applying curd on face helps to get soft and smooth skin. It also acts a good moisturizer and good for dry skin. If curd is mixed with henna powder and applied to hair, it acts as a good hair conditioner.
ముఖ సౌందర్యాన్ని పాడు చేసే బ్లాక్ హెడ్స్ మామూలుగా ఏ స్త్రీ లేదా పురుషుని అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు ముఖాన్ని గురించి ముందుగా ప్రస్తావిస్తారు. ముఖమే ఎవరి అందానికైనా కొలబద్దగా ఉంటుంది. అందమైన ముఖానికి చక్కటి ముక్కు ఒక ఆకర్షణగా నిలుస్తుంది. కాని ఈ అందమైన నాసికా సౌందర్యాన్ని తగ్గిస్తాయి బ్లాక్ హెడ్స్. మిగిలిన వారిలో కూడా ఇది కనిపించినా, ప్రధానంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఇవి చికాకును తెప్పిస్తాయి. ఎంతో అందమైన ముఖం వున్నా వీటి వల్ల ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ఇవి ఒకసారి తీసేసినా పడే పడే వస్తూ ఉంటాయి. దీని వల్ల మానసికంగా కొంచెం దిగులు ఏర్పడుతుంది. పడే పడే అద్దంలో వీటిని చూసుకుంటూ ఉండటం కంటే తీసివేసే మార్గాన్ని చూడటం ఉత్తమం. వీటి నివారణోపాయం ఏమిటంటే బ్యూటీషియన్ దగ్గరకు వెళ్ళి వాటిని తగిన విధంగా తీసి వేయించుకుంటూ ఉండటం. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీసివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ లో లేదా స్వంతంగా వారానికి రెండు సార్లు ముల్తానా మట్టి ప్యాక్ వేయించుకోవడం ఒక పధ్ధతి మరో పధ్ధతి ఏమిటంటే రోజూ మర్చి రోజు రాత్రి పూట నిద్రపోయే ముందు ట్రెటినాయిన్ ను పల్చగా ముక్కుకు తాసుకోవడం. దీని అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కు పై భాగంలో ఏర్పడే సన్నని పొరలు తొలగిపోతాయి. అక్కడి చర్మం ప్రకాశవంతంగా , అందంగా తయారవుతుంది. ఈ కారణం వల్ల బ్లాక్ హెడ్స్ రావడం బాగా తగ్గిపోతుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్ళే విషయంలో కొంత పరిశీలన అవసరం. అనుభవం ఉన్న బ్యూటీషియన్ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కొంచెం నైపుణ్యం అవసరం . పరిశుభ్రతను పాటించే బ్యూటీ పార్లర్ లను ఎంచుకోవాలి. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం కొంత ఖరీదైన వ్యవహారం కాబట్టి నెలకు ఒకసారి వెళ్ళినా సరిపోతుంది. కొంతమందికి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ తో పాటుగా వైట్ హెడ్స్ కూడా వస్తాయి. అయితే ఇవి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆస్ట్రిన్జెంట్ లోషన్ లో దూదిని ముంచి, ముక్కు చుట్టూ రాసుకుంటే సరిపోతుంది. దీంతో వైట్ హెడ్స్ రావడం తగ్గిపోతుంది.
మెరుపుతీగలా మెరిసిపోతారు ఇలా చేస్తే... ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?? అని సినిమాలలో హీరో పాట పాడితే.. హీరోయిన్ తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది. ఆమె అందం కూడా నిజంగానే చూపరులను ఆకట్టుకుంటూ మెరుస్తూ ఉంటుంది. హీరోయిన్లు తాము అందంగా కనిపించడానికి పడని పాట్లు ఉండవంటే నమ్మండి. చర్మాన్ని, శరీర ఆకారాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటేనే వారికి అవకాశాలు వచ్చేది. అయితే అందమంటే హీరోయిన్లే కాదు. సాధారణ అమ్మాయిలు కూడా హీరోయిన్ అంత అందంగా ఉండచ్చు. సహజంగానే కాస్త ఖరీదైన బట్టలు వేసుకుని, ఖరీదైన వస్తువులు పెట్టుకుని, మంచి మేకప్ వేస్తే ప్రతి అమ్మాయీ హీరోయిన్ లాగే ఉంటుంది. కానీ… ఈ పూతలు పూయడం, ట్రీట్మెంట్ లు ఇవ్వడం వంటివి వదిలేసి సహజంగా అందంగా మెరిసిపోతే ఎంత బావుంటుంది కదా… ప్రతి అమ్మాయి మనసులో ఏదో ఒక సందర్భంగా అనుకునే ఉంటుంది ఈ మాట. అయితే అలా అనుకోవడం అత్యాశ ఏమి కాదు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా.. ఎలాంటి కృత్రిమ పూతల జోలికి వెళ్లకుండా అద్భుతమైన దేహకాంతిని సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..ఇదిగో ఇలా… ◆విటమిన్ ఎ ను పుష్కలంగా కలిగి ఉండి, కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దుంప కూరగాయ క్యారెట్. ఇది సహజంగానే ఆకర్షణగా ఉంటుంది. ఈ క్యారెట్ ను కూరల్లోనూ, స్వీట్ చేయడానికి, జ్యుస్ చేసుకుని తాగడానికి, మరికొందరు నేరుగా డైటింగ్ పేరుతో తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ క్యారెట్ ను ఇలా కాకుండా విభిన్నంగా ఉపయోగిస్తే కాంతులీనే చర్మం సొంతమవుతుంది. క్యారెట్ ను బాగా ఉడికించాలి. ఆ తరువాత బాగా మెదిపి గుజ్జులాగా చేయాలి. ఈ గుజ్జును శరీరమంతా పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. ఈ గుజ్జు బాగా ఆరిన తరువాత కొన్ని పాలు తీసుకుని ఈ ఎండిన క్యారెట్ గుజ్జుమీద కొద్ధికొద్దిగా పాలు వేసి మర్దనా చేస్తూ క్యారెట్ గుజ్జును తొలగించాలి. దీని తరువాత సాధారణంగా స్నానం చేయాలి. స్నానానికి ఎలాంటి సోప్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా మారి మంచి రంగులోకి వస్తుంది. ◆కొరియన్ స్కిన్.. సాధారణంగా ఇప్పట్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొరియన్ ప్రాంత అమ్మాయిల్లా చర్మం కావాలంటే ఇలా చేయండి అలా చేయండి అంటూ బోలెడు టిప్స్ చూపిస్తూ ఉంటారు. అయితే కొరియన్ స్కిన్ కావాలంటే కింది చిట్కా ఫాలో అవ్వాలి. బఠానీ పువ్వులు ( బఠానీ కాయలు కాయడానికి ముందు పువ్వులు కాస్తాయి) తీసుకుని వాటిని ఎండబెట్టి పొడి చేయాలి, ఓట్స్ పొడి తీసుకోవాలి, ఇందులో పన్నీరు కలిపి మెత్తగా గుజ్జులాగా చేయాలి. దీన్ని శరీరమంతా పట్టించి బాగా ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే రబ్బరు బొమ్మలగా కొరియన్ స్కిన్ సొంతమవుతుంది. ◆అందరికీ అందుబాటులో దొరికేది బొప్పాయి కాయ. బాగా పండిన బొప్పాయి కాయను తీసుకుని పొట్టు తీసేసి బాగా మెదిపి గుజ్జు చేయాలి. బొప్పాయి కాయ గుజ్జును శరీరమంతా పట్టించి ఆరిపోయిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే… క్రమంగా చర్మంలో జీవం పెరుగుతుంది. చర్మం మీద మచ్చలు, మంగు, మొటిమల తాలూకూ గుర్తులు వంటివి అన్నీ పోయి చర్మం స్పష్టంగా తయారవుతుంది. ◆నారింజ కాయ గురించి తెలియనిది ఎవరికి?? తింటాం తొక్కలు పడేస్తాం. అయితే ఈ నారింజ తొక్కలను కూడా ఉపాధి వనరుగా మార్చేసుకున్నాయి నేటి వ్యాపార పోకడలు. నారింజకాయ తొక్కను ఎండబెట్టి పొడిచేసి నిలవచేసుకోవాలి. నారింజ తొక్క పొడి, ఓట్స్ పొడి, పాలమీగడ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి శరీరమంతా పట్టించాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీర చర్మం నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది. పై చిట్కాలు పాటిస్తే హీరోయిన్ లాగా మీరూ తయారవుతారు అందంగానూ… మెరిసిపోతూనూ… ◆నిశ్శబ్ద.
చుండ్రును ఇలా తరిమికొట్టండి! తల దువ్వగానే తెల్లగా పొట్టు పొట్టు రాలుతుంది. తల మొత్తం దురద, ఎక్కువగా దువ్వినా, గోకినా తలలో మెల్లగా మంట, దానికి తోడు పుండ్లు ఏర్పడటం, కుదుళ్లను బలహీనం చేయడం. వీటి కారణంగా జుట్టు రాలిపోవడం, జుట్టు రంగు మారడం ఇలాంటి కారణాలు ఎన్నో వస్తున్నాయి కేవలం చుండ్రు అనే ఒకే ఒక సమస్య వల్ల. ఇంతగా ఇబ్బంది పెట్టే చుండ్రు చలికాలంలో మరింత పెరుగుతుంది. చాలామందికి ఈ చలికాలంలో చుండ్రు విశ్వరూపం దాలుస్తుందని అనడంలో సందేహమే లేదు. అయితే ఈ చుండ్రును సులువుగా అధిగమించే ఉపాయాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చుండ్రు చక్కగా పారిపోతుంది మీ నుండి. జుట్టుకు నూనె పెట్టడం అందరూ చేస్తారు. అయితే చుండ్రు పోవాలంటే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ మూడింటిలో ఏదో ఒక నూనెను కప్పులో తీసుకుని దాన్ని వేడి చేసి తలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తరువాత ఒక మందం టవల్ తీసుకుని వేడి నీళ్లలో ముంచి పిండి, దాన్ని తలకు చుట్టెయ్యాలి. వేడి తగ్గిపోయిన తరుణం తలకు చుట్టిన టవల్ ను విప్పేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుంటే తల చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది. తల చుండ్రుకు మరొక చక్కని పరిష్కారం కోడిగుడ్డు. కోడిగుడ్డులో ఉండే సొనను తలకు పట్టించి ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే… కొన్ని వారాలలో క్రమంగా తలలో చుండ్రు తగ్గిపోతుంది. కాసిన్ని వేడినీరు తీసుకుని అందులో కొబ్బరిపాలు, నిమ్మరసం వేయాలి. వాటిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా చుండ్రు తగ్గిపోతుంది. తలలో చుండ్రు తగ్గించుకోవడానికి ఎన్ని మార్గాలు ఫాలో అయినా దానికి ఆహారం కూడా ఒక పరిష్కారంగా పనిచేస్తుంది. విటమిన్ బి, సి, ఇ లు పుష్కలంగా కలిగిన ఆహారాన్ని తీసుకుంటే తలలో చుండ్రును అరికట్టవచ్చు. మెంతి ఆకు చుండ్రుకు చక్కని పరిష్కారం. మెంతి ఆకులను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి ఒక పావుగంట అలాగే ఉంచి, ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే… చుండ్రు మెల్లగా తగ్గుముఖం పడుతుంది. తల చుండ్రుకు మరొక శక్తివంతమైన టిప్ ఉంది. వేడినీటిలో వెనిగర్ వేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటిరోజు ఎగ్ ఆధారిత షాంపూ తో తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు సమస్య పరిష్కరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చుండ్రు ఉన్నవారు వాడే దువ్వెనలు, తువాళ్ళు, దిండు కవర్లు మొదలైనవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని మారుస్తూ ఉండాలి. జుట్టు చల్లగా ఉన్నట్టే దువ్వడం, జడ వేయడం వంటివి చేయకూడదు. ఇవన్నీ పాటిస్తూ పైన చిట్కాలు ఫాలో అయితే చుండ్రును తగ్గించేసుకోవచ్చు. ◆నిశ్శబ్ద.
పరువాల పాదాల కోసం మనలో చాలా మంది అందం విషయంలో ముఖానికిచ్చే ప్రాధాన్యత పాదాలకి ఇవ్వరు. దాని పర్యవసానమే జీవం కోల్పోయిన పాదాలు వాటి వల్ల వచ్చే పగుళ్ళు. మొహం ఎంత అందంగా ఉన్నా పగుళ్లతో నిండిన పాదాలు చూసుకుంటుంటే మనకే బాధగా ఉంటుంది కదా. అందుకే వాటి మీద కూడా శ్రద్ధ చూపించి పాడాలని కూడా మెరిసేలా చేద్దాం. సాదారణంగా రోజు కాళ్ళని బాగా కడిగి కొద్దిగా నూనే రాసుకుని పడుకునే వారి పాదాలు ఎంతో మృదువుగా కనిపిస్తాయి. ఇలానే ఇంకొన్ని చిట్కా వైధ్యాలతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన పని లేకుండానే పాడాలని సంరక్షించుకుందాం. * రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని దానిలో దూది ముంచి దానిని పాదాలకు రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కడిగెయ్యాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పాదాలు మృదువుగా మారిపోతాయి. * బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు. * గోరువెచ్చని నీటిలో తేనే వేసి ఆ నీటిలో పాదాలని 20-30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగినా మంచి నిగారింపు వస్తుంది. * రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇంట్లో ఉండే వేసలైన్ ని పాదాలకి పట్టించి పడుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే మీ పాదాలలో వచ్చిన తేడాని మీరే గమనించవచ్చు. * పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి. * అరటిపండుని గుజ్జులా చేసి దానిని పాదాలకి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగినా మెరిసే పాదాలు మీవి అవుతాయి. * నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. * ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ఆ దూదిని గుండ్రటి ఆకారంలో తిప్పుతూ పాదాలని ఒక పది నిమిషాలు మసాజ్ చేసి సాక్స్ వేసుకుని ఒక అరగంట ఉంచి తర్వాత వేడి నీతితో కడిగినా చాలు పదాలు మెరిసిపోతాయి. చూసారా పాదాల సంరక్షణకి ఇంట్లోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో. మరి మొదలుపెడదామా ఏదో ఒక చిట్కాని. ....కళ్యాణి
6 Best natural ways to clean your make up! With so many chemicals being spread onto your face every time you apply make up, it only gets easier if you could use a natural home made make up remover which will help reduce the damage being done to your glowing skin by those chemical. Recent research shows that there are more than 10,000 chemicals found in personal care and beauty products. Only 10% of those products even have safety data. And some ingredients that we know are bad are still being used in the stuff you use every day. So instead of heading to the store, look no further than your refrigerator or your kitchen to get these wonderful homemade natural cleansers and make up removers. Milk & Almond Oil Make up remover: You would need Almond Oil and Milk for this. Add a few drops of almond oil to a tablespoon of whole milk in small bowl. Use a cotton ball and gently dab milk and oil mixture onto face, then remove with a fresh piece of cotton. To maintain hygiene be sure to rinse thoroughly, removing all traces of the milk. Cucumber as a make up remover: There are many beauty products that use cucumber in them to help remove makeup.Cucumbers have anti-inflammatory properties, so they will help to soothe irritated skin or acne-prone skin. Take one cucumber and blend it into a paste. Use it as a cleanser on your face. If you have tough makeup to remove, add a little bit of milk or olive oil to the mixture. Banana for moisturizing while cleaning your make up: If you like to moisturize while you clean, look no further than the most easily available fruit - banana. Mash up a banana to a paste before applying it onto your face like a mask. Let it sit for five minutes while the enzymes remove makeup, dirt and grime from deep down in your pores. Rinse off with a warm wash cloth for smooth, clean skin that’s dreamily hydrated. Olive oil: This is best for people that have dry skin. Just put a few drops of olive oil on your face and spread it everywhere by gently massaging it. Remove with a tissue soaked in warm water. If your face gets too oily, rinse with neutral soap and warm water. Olive oil is great for removing makeup on your eyes because it won’t make this delicate area irritated. Baking Soda and Honey: Pour honey on a wet soft cloth used to clean make, now sprinkle some baking soda on it. This helps you remove the most stubborn of the make up and also is the best natural way to do so, while you are causing no harm to your skin with those chemical based cleansers which are out there in the market. Also baking soda might not suit all skin types, so test it on a small patch before you use it entirely on your face. Then wash it out thoroughly with lukewarm water. Cow Milk: Plain old milk from your fridge works just as well for makeup removal. Simply dab a cotton ball in a cup of milk and gently rub it all over your face and eyelids. Not only will it remove all your makeup and refresh your skin, the lactic acid present in cow’s milk will also gently exfoliate your skin. For oily skin, use skim milk; if you have dry skin, you should use whole. Make sure to rinse your face thoroughly afterwards; your skin will feel smooth and oh so clean. Curd: Curd is another kitchen staple that is great for your skin because it serves a number of different purposes. Using yogurt on your skin can help to moisturize it, and it’s perfect for relieving sunburns. Take a clean cotton round and dip it into some plain yogurt, rub it all over your face in a circular motion, and then rinse off with cool water to easily get rid of the stubborn make up. ...Divya
Is Your Hair Turning Grey Because Of Stress! Hair is something both men and women love to take care of and also flaunt new styles will a lot of excitement. But one thing which sends distress signals across is the discovery of a grey strand in those lustrous locks! Research says that the first silvery strands of hair normally appear around age 30 for men and 35 for the women. However for some people, graying can start in as early as high school, and for some as late as their 50s. There could be various reasons in play for this. Initially, hair is white. It gets its natural color from a type of pigment called melanin. The formation of melanin begins before birth. The natural color of our hair depends upon the distribution, type and amount of melanin in the middle layer of the hair shaft or cortex. Hair has only two types of pigments: dark (eumelanin) and light (phaeomelanin). They blend together to make up the wide range of hair colours. There are various reasons for hair turning grey. Some of the most prominent ones are, you’re exposed to cigarette smoke, your hormones are changing, your environment is polluted, you’re super stressed, and your age. You may not be ready for the grey hair, but your hair is. Melanin production, what gives hair its pigment, decreases with age. For every decade after you turn 30, your risk of going gray increases 10 to 20 percent, according to research. So while some people may be able to maintain their natural hair color for longer, it’s inevitable. In time, everyone’s hair goes grey. A lot of general health practitioners have reported that clients who have reported to be living under stress for a few years have accelerated graying processes. Scientists surmise that while hair graying is genetically outlined, stress and certain lifestyle choices can give you a variation of about plus or minus 10 years. Since stress causes hair loss, it's possible that losing some pigmented hair can make those gray hairs more noticeable. Our heads contain hundreds of thousands of follicles, and each follicle is charged with producing one hair. Cells known as keratinocytes build the keratin that becomes our hair, our skin and fingernails are also composed of keratin. Before hair emerges from the follicle, though, other cells known as melanocytesinject a pigment called melanin into the keratin. When our hair turns gray, it's due to lowered amounts of melanin, and when hair is completely white, our hair lacks melanin altogether. Grey hair caused by ageing is the result of exhaustion and loss of melanocyte stem cells, and stress could cause similar results. There are two prevailing hypotheses. The first is that aging wears down your DNA, somehow inhibiting the production of the cells called melanocytes that produce melanin. Most of the studies supporting this hypothesis have been done in mice, however, and so far haven’t closed in on a complete explanation of how this would work. Whatever could be the scientific results of it. Its always more healthier to stay happy and stress free. You never know you are warding off various beauty issues by it and would be leading a healthier life! ...Divya
Beauty tips to make you look lovely this Monsoon! The rainfall gives joy and happiness. However, this time brings some skin problems also. The skin becomes oily, irritable and dehydrated during this time. Here is how you could take care of the skin in the monsoon. First and foremost drink loads of water. This is one of the best and the cheapest way to attain good, healthy and flawless skin, irrespective of the season. Try to drink at least 8-10 glasses of water everyday and you would definitely notice a drastic change within 2-3 months.It is essential that you exfoliate your skin daily to rid it of dead cells but do so gently. Make your own homemade face peels and packs using ingredients from your kitchen. They are natural and will do a world of good for your skin. If oily skin is your problem then moisturizers that are water based are a great option to help keep oil secretion in check. Use a reliable sunscreen with a good SPF. It may be cloudy but that doesn’t stop the sun’s UV rays from wreaking havoc. Also cleanse your skin at least 3 times a day to remove excess grime and oil that can clog your pores. Some ladies regularly apply bleach over their face to get a glow. But, skin care tips for monsoon include avoiding of bleaching. You may use bleach in any other season but monsoon is the season when bleaches should be strictly avoided. This can even make your face rough. Here are some best ways to remove excessive oil during monsoon. If your skin is oily, the best way to is through the oatmeal scrub. This is also a skin care tip for all those with limitless oil secretion during monsoon. You have to add little honey to the oatmeal and apply over your face. Rub it to use as a scrubber and then wash away. The skin care tip for dry skin during monsoon includes a combination of almond and honey. You have to grind almond and make very small grains and then apply honey to mix it proportionately. Apply it on your face and rub with finger tips. The dead skin so formed will be easily removed with this skin care treatment. Monsoon is the time of humidity which creates itchiness on the scalp. It is recommended that warm coconut oil massage will help to get rid of itchiness. If there is dandruff in the scalp, massage with neem oil. While shampooing and conditioning your hair twice a week will suffice during any other season you might want to do so more frequently during the monsoons. This is because the humidity that is pervasive during the wet spell makes you sweat; and sweat makes it easy for grime and germs to latch on to your skin. For some care for your feet, do let your feet breathe. Wearing closed footwear will make your feet sweat, which in turn will lead to fungal and bacterial infections. Instead wear waterproof footwear like sandals and floaters. Also do make sure when you go for a pedicure that the tools are sterilized. While most salons do maintain hygienic conditions, wet spells make it hard to do so. Check that all the tools are disinfected; if required ask them to do so in front of you. ..Divya