ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో  బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!

 

చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికం అవుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఆ తరువాత చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే అమ్మాయిలు చాలా మంది మార్కెట్లో బోలెడు బాడీ లోషన్లు కొనుగోలు చేస్తారు. బ్యూటీ ఉత్పత్తి దారులు కూడా చలికాలం మొదలైందంటే బాడీ లోషన్, మాయిశ్చరైజర్లకు సంబంధించి యాడ్స్ తో సావగొడుతుంటారు. అయితే ఇవన్నీ రసాయలతో కూడినివి కావడంతో వీటిని కొనుగోలు చేయడంలో చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో బ్రాండెడ్ బాడీ లోషన్ల లాగా  ఫలితాలు ఇచ్చే బాడీ లోషన్ ను తయారుచేయవచ్చు. దీనికి కావలసిన పదార్థాలేంటో.. పూర్తీగా తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

బాడీ లోషన్ తయారీకి కావసిన పదార్థాలు చాలా సింపుల్ గా ఇంట్లో లభ్యమయ్యేవే..

ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె

నిమ్మకాయ అరచెక్క

విటమిన్-ఇ క్యాప్సుల్స్ మూడు నుండి నాలుగు

తయారుచేసుకునే విధానం..

ముందుగా  నిమ్మకాయ రసం తీయాలి. ఒక కప్పు కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేసుకునే సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి. ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్, నిమ్మరసం వేయాలి.

దీని ప్రభావం మరింత ధృడంగా ఉండటానికి దీనికి కొబ్బరి నూనెతో పాటు బాదం నూనెను సమంగా తీసుకుని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసిన తరువాత దీన్ని ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేస్తూంటే ఏ బ్రాండ్ బాడీ లోషన్ కూడా ఇవ్వని గొప్ప ఫలితాలు ఇస్తుంది.

                                      *నిశ్శబ్ద.