ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి!

ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా..  ఈ తప్పులు చేయకండి! చాలామంది మహిళల్లో  ముఖంపై అవాంఛిత రోమాలు కనిపిస్తూ ఉంటాయి.  వీటిని  తొలగించడానికి ఫేస్ షేవింగ్ ఎంచుకుంటూ ఉంటారు. ఇది వెంట్రుకలను తొలగించడమే కాకుండా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మేకప్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి బాగా కలిసిపోయేలా చేసి చర్మం బాగా కనిపించేలా చేస్తుంది.  అయితే, ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సరైన జాగ్రత్త, ఉపయోగించే విధానం తెలియకుండా పేస్ రేజర్ ఉపయోగిస్తే చాలా నష్టపోతారు.  ఆ తరువాత చాలా భాదపడాల్సి ఉంటుంది.  అందుకే.. ముఖం మీద రేజర్ ఉపయోగించే ముందు కొన్ని తప్పులు చేయకూడదని బ్యూటీ ఎక్పర్ట్స్ చెబుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. రేజర్ ఎంపిక.. ముఖానికి బాడీ రేజర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ముఖం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫేషియల్ రేజర్‌ను ఉపయోగించాలి. దీనికి చిన్న, సన్నని బ్లేడ్ ఉంటుంది. రేజర్ బ్లేడ్ పదునుగా ఉందో లేదో  తనిఖీ చేసుకోవాలి. పాత బ్లేడ్‌లు చర్మానికి చికాకును కలిగిస్తాయి. అలాగే, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి రేజర్ ను ఉపయోగించే ముందు,  తర్వాత శానిటైజర్ లేదా ఆల్కహాల్‌తో రేజర్‌ను శుభ్రం చేసుకోవాలి. ప్రిపరేషన్.. పొడి చర్మం ఉన్నవారు ఎప్పుడూ రేజర్ వాడకూడదు. దీనివల్ల చికాకు పెరిగే అవకాశం ఉంది. పైగా వాడే ముందు స్కిన్ ను ప్రిపేర్ చేయాలి. ముందుగా  ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. షేవింగ్ సులభతరం చేయడానికి, కలబంద జెల్, ఫేషియల్ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్ రాయాలి . ఇది రేజర్ కు  చర్మం మధ్య ప్రొటెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. షేవింగ్ టెక్నిక్.. ముఖం షేవింగ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది, దానిని అనుసరించడం ముఖ్యం. రేజర్‌ను ఎప్పుడూ చర్మానికి 45 డిగ్రీల కోణంలో ఉంచాలి.  రేజర్‌పై ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. సున్నితంగా.. చిన్న స్ట్రోక్‌లను ఉపయోగించాలి. ఎల్లప్పుడూ జుట్టు పెరిగే దిశలోనే షేవ్ చేసుకోవాలి.  వ్యతిరేక దిశలో షేవింగ్ చేయడం వల్ల లోపలికి వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ సులభంగా జారగలిగేలా, మరో చేత్తో చర్మాన్ని కొద్దిగా పైకి లాగి  గట్టిగా పట్టి ఉంచండి. షేవింగ్ తర్వాత.. షేవింగ్ తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, కాబట్టి సరైన జాగ్రత్త అవసరం. షేవింగ్ చేసిన తర్వాత చర్మాన్ని కూల్ గా ఉంచడానికి  ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.  షేవింగ్ చేసే రోజున విటమిన్ సి లేదా AHA/BHA, లేదా రెటినోల్ వంటి  రసాయన ఎక్స్‌ఫోలియెంట్‌లను వాడకూడదు. ఇవి చర్మాన్ని చికాకుపెడతాయి.  మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్  తో ముఖాన్ని హైడ్రేట్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. షేవింగ్ ఎప్పుడు చేయకూడదు.. మొటిమలు, కోతలు లేదా చర్మ ఇన్ఫెక్షన్ ఉంటే, షేవింగ్ చేయకూడదు. రేజర్ వాడటం వల్ల  ముఖం అంతటా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.   సమస్య మరింత తీవ్రమవుతుంది.                                         *రూపశ్రీ.

స్కిన్ కేర్ లో వాడే ప్రోడక్ట్స్.. వాటి గురించి చాలామందిలో ఉన్న అపోహలు..!

స్కిన్ కేర్ లో వాడే ప్రోడక్ట్స్.. వాటి గురించి చాలామందిలో ఉన్న అపోహలు..! నేటి కాలంలో స్కిన్ కేర్ గురించి చాలా ఆసక్తి పెరిగిపోయింది. అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా ఫేస్ క్రీమ్ లు, సీరమ్ లు, లోషన్లు వాడుతూ ఉంటారు.  అయితే వీటి గురించి చాలామందిలో కొన్ని సందేహాలు ఉంటాయి.  వీటి కారణంగా చాలామంది వీటిని వాడటానికి సంకోచిస్తారు.  మార్కెట్లో కొన్ని నాణ్యమైన ఉత్పత్తులు ఉన్నప్పటికీ వాటిని వాడే విషయంలో జరిగే గందరగోళం కారణంగా వెనకడుగు వేస్తుంటారు.  అయితే కొన్ని స్కిన్ కేర్ ఉత్పత్తుల గురించి ఉన్న అపోహలు, నిజాల గురించి తెలుసుకుంటే  చాలామంది సందేహాలు తొలగిపోతాయి.  అవేంటో తెలుసుకుంటే.. రెటినోల్, విటమిన్ సి అండ్  యాసిడ్స్ వంటి  పదార్థాలు ఈ రోజుల్లో చర్మ సంరక్షణ లో  బాగా ప్రాచుర్యం పొందాయి. చాలామంది ఈ పదార్థాల గురించి విని వాటిని వాడటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే వాటి గురించి చాలా తప్పుడు సమాచారం కూడా ఉంది.  సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ ఉత్పత్తుల నుండి పూర్తిగా ప్రయోజనం పొందలేరు.  పైగా ఈ ఉత్పత్తుల వల్ల హాని జరుగుతుందేమో అని భయపడి వాటిని వాడటం మానేస్తారు. అపోహలు.. నిజాలు.. అపోహ.. సాలిసిలిక్ ఆమ్లాన్ని ఉదయం పూట వాడకూడదు.. సాలిసిలిక్ యాసిడ్ (BHA) చర్మాన్ని సూర్యరశ్మికి సెన్సిటివ్ గా మారుస్తుందని,  దీన్ని రాత్రి సమయంలో మాత్రమే వాడాలని అంటారు.  కానీ.. నిజం.. సాలిసిలిక్ యాసిడ్‌ను ఉదయం సేఫ్ గా ఉపయోగించవచ్చు. ఇది రంధ్రాల నుండి నూనెను,  ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది రోజు మురికి,  ధూళి నుండి రక్షించడానికి సహాయపడుతుంది.  దీన్ని అప్లై చేసిన తర్వాత మంచి నాణ్యత గల సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మరచిపోకూడదు. అపోహ.. రెటినాయిడ్స్  చర్మాన్ని పలుచగా చేస్తాయా.. రెటినోల్ లేదా రెటినాయిడ్స్ చుట్టూ ఉన్న అతి పెద్ద భయాలలో ఇది ఒకటి.. అవి చర్మాన్ని సన్నగా చేసి బలహీనపరుస్తుందని అనుకుంటారు. నిజం..  రెటినాయిడ్స్ వాస్తవానికి ఉపరితలంపై ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఇది కాలక్రమేణా చర్మం సన్నగా కాకుండా దృఢంగా,  యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అపోహ.. గ్లైకోలిక్ ఆమ్లం భారతీయ చర్మానికి సెట్ కాదా.. గ్లైకోలిక్ ఆమ్లం భారతీయ లేదా ముదురు చర్మపు రంగులకు చాలా బలంగా ఉంటుందని,  పిగ్మెంటేషన్‌ను పెంచుతుందని అనుకుంటారు. నిజం.. ఇది పూర్తిగా తప్పు. సరైన గాఢతలో,  సరిగ్గా ఉపయోగించినప్పుడు  గ్లైకోలిక్ యాసిడ్ భారతీయ చర్మానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది టానింగ్ తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. తక్కువ గాఢతతో ప్రారంభించడం ముఖ్యం.  దానిని అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. అపోహ.. స్నెయిల్ మ్యూసిన్ ఓపెన్ పూర్స్ ను, ముడతలు, మొటిమలను నయం చేస్తుందా.. ఈ రోజుల్లో స్నెయిల్  మ్యూసిన్ ఒక వైరల్ ఉత్పత్తిగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీనిని ప్రజలు ప్రతి సమస్యకు పరిష్కారంగా భావిస్తారు. నత్తల నుండి వెలువడే ఒక జిగురు లేదా శ్లేష్మంతో తయారు చేయబడే ప్రోడక్ట్ ఇది. నిజం.. నత్త మ్యూసిన్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి,  ఉపశమనం కలిగించడానికి గొప్పది. కానీ ఇది మంత్రదండం కాదు. ఇది తెరిచిన రంధ్రాలను మూసివేయదు, లేదా మొటిమలు లేదా ముడతలకు నివారణ కాదు. అపోహ.. విటమిన్-సి ని ఉదయం వాడకూడదా.. కొంతమంది విటమిన్ సి సూర్యకాంతిలో పనిచేయదని,  చర్మానికి హాని కలిగిస్తుందని నమ్ముతారు. కాబట్టి దీనిని రాత్రిపూట మాత్రమే అప్లై చేయాలి అంటుంటారు. నిజం.. విటమిన్ సి ఉపయోగించడానికి ఉత్తమ సమయం ఉదయమే. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది సన్‌స్క్రీన్‌తో కలిపితే, హానికరమైన సూర్య కిరణాలు,  కాలుష్యం నుండి రెట్టింపు రక్షణను అందిస్తుంది.                                     *రూపశ్రీ.

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..!

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..! కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆహారం,  గాలి,  నీరు,  కలుషితం కావడం, పంటలు  పండించడంలో కూడా రసాయనాలు ఎక్కువ ఉపయోగించడం,  ఇన్స్టంట్ ఫుడ్ లు,  ప్యాక్డ్ ఫుడ్ లు.. ఇలా ఒకటి అని కాదు.. మనిషి శరీరం మీద చాలా ప్రభావాలు చూపిస్తాయి.  ఇవన్నీ మనిషి లైఫ్ స్పామ్ ను మెల్లిగా తగ్గిస్తున్నాయి.  అలాగే శరీర పనితీరు, శరీరంలో అవయవాలు,  చర్మం,  జుట్టు, గోళ్లు మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే నేటికాలంలో చాలామందికి చిన్నతనంలో జుట్టు బాగా పొడవుగా ఉన్నా,  పెద్దయ్యే కొద్ది పొడవుగా ఉన్న జుట్టు కాస్తా పిలకలాగా మారిపోతోంది.  అయితే అమ్మాయిలు మాత్రం తమ జుట్టు విషయంలో భగీరథ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, హెయిర్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు.  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ  కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.  ముఖ్యంగా షాంపూలో కింద చెప్పుకునే చిట్కా ఫాలో  అయితే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరు. అదేంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ లిక్విడ్.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగడానికి షాంపులోకి ప్రోటీన్ లిక్విడ్ కలిపి వాడాలి. ఈ ప్రోటీన్ లిక్విడ్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ లిక్విడ్ కావలసిన పదార్థాలు.. బియ్యం..1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు.. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు.. 10-15 ఆకులు లవంగాలు.. 5 తయారీ విధానం.. ఒక పాత్రలో నీరు తీసుకోవాలి.  ఇందులో బియ్యం, అవిసె గింజలు,  కరివేపాకు, లవంగాలు వేసి ఉడికించాలి. అవిసె గింజలు కాస్త జెల్ లాగా మారుతున్నట్టు అనిపించినప్పుడు స్టౌ ఆఫ్ చేసి వడగట్టాలి.  ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత ఉపయోగించాలి. ఉపయోగించే విధానం.. పైన తయారు చేసుకున్న లిక్విడ్ ను నచ్చిన షాంపులో కలిపి వాడాలి.  దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడాలి.  ఇది జుట్టుకు చాలా మంచి పోషణ ఇస్తుంది. ప్రయోజనాలు.. ఈ ప్రోటీన్ లిక్విడ్ లో అవిసె గింజలు ఉంటాయి.  దీని జెల్ జుట్టును సిల్కీగా మారుస్తుంది. బియ్యం జుట్టుకు పోషణ ఇస్తుంది. నేటి కాలంలో  జుట్టు, చర్మ సంరక్షణలో రైస్ వాటర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కరివేపాకు జుట్టుకు బలాన్ని,  జుట్టు నల్లగా, పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది. లవంగాలలో ఉండే రసాయన గుణాలు జుట్టును,  కుదుళ్లను బలంగా మారుస్తాయి.   పైన పేర్కొన్న పదార్థాలు తల చర్మంలో ఉన్న సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే తీసుకునే ఆహారం,  లైఫ్ స్టైల్,  అలవాట్లు బాగుంటేనే ఇలాంటి చిట్కాలు పనిచేస్తాయి.  లైఫ్ బాగలేకున్నా,  ఆహారం సరిగా తీసుకోకపోయినా, లైఫ్ స్టైల్ బాగాలేకున్నా.. అంటే అర్థరాత్రి వరకు మేలుకోవడం,  ఉదయం  ఎప్పుడో లేవడం, వ్యాయామం చేయకపోవడం,  ఎక్కువసేపు  కూర్చుని ఉండటం వంటివి లైప్ స్టైల్ సరిగా లేకపోవడాన్ని సూచిస్తాయి. అవన్ని సరిచేసుకోవడం చాలా ముఖ్యం..                                   *రూపశ్రీ.

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..!

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..! టానింగ్ చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్య. టానింగ్ రాకుండా ఉండటం కోసం అమ్మాయిలు సన్ స్క్రీన్ వాడుతుంటారు. సన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మాత్రం టానింగ్ తొలగించుకోవడానికి చాలా రకాలు క్రీములు,  లోషన్లు వాడుతూ ఉంటారు. కానీ ఇవి చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి. కానీ తక్కువ ఖరీదులో ఇంట్లోనే టానింగ్ తొలగించుకోవడానికి పసుపు బాగా సహాయపడుతుంది.  అందులోనూ పనుపును వేయించుకుని కొన్ని ఇతర పదార్థాలతో వాడటం వల్ల టానింగ్ సులువుగా పోతుందట. చర్మాన్ని కాంతివంతం చేసుకోవడానికి,  టానింగ్ తొలగించడానికి తరచుగా చర్మాన్ని రుద్దుతారు లేదా ఫెయిర్‌నెస్ క్రీములను ఉపయోగిస్తారు. అయితే, అధికంగా రుద్దడం వల్ల చర్మం క్లియర్ కాకుండా ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా, ఫెయిర్‌నెస్ క్రీములు చర్మాన్ని ప్రకాశవంతం చేయవు. అసలు టానింగ్ ఎందుకు వస్తుంది.  టానింగ్ తొలగించడానికి వేయించిన పసుపును ఎలా వాడాలి? తెలుసుకుంటే.. టానింగ్ కు కారణాలు.. టానింగ్ కు కేవలం ఒకటే కారణం కాదు.. దీనికి అనేక విషయాలు కారణం అవుతాయి. సూర్యుని హానికరమైన కిరణాలకు గురికావడం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యుడికి ఎక్కువసేపు గురికావడం,  హార్మోన్ల మార్పులు కూడా ఒక కారణం. పసుపు చర్మానికి చేసే మేలు.. పసుపులో మంచి మొత్తంలో కర్కుమిన్,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మంటను తగ్గించడంలో, మొటిమలను తగ్గించడంలో,  సహజమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయి. ఇది నల్లటి మచ్చలు, అకాల వృద్ధాప్యం,  వడదెబ్బను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పసుపు ఆరోగ్యానికి,  చర్మానికి రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. టానింగ్ తగ్గించే రెసిపీ.. కావలసిన పదార్థాలు.. పసుపు కాఫీ పొడి నిమ్మరసం తేనె తయారు విధానం..  పసుపును పాన్ మీద బాగా వేయించాలి. దానికి కొద్దిగా నిమ్మరసం,  కాఫీ పొడి కలపాలి.  ఇప్పుడు ఆ మిశ్రమంలో  తేనె కలపాలి.  ఈ పేస్ట్ ని శుభ్రమైన ముఖం మీద అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు  అలాగే ఉంచాలి.   ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు. ప్రయోజనాలు.. పైన చెప్పుకున్న వేయించిన పసుపు రెమిడీ ని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల టానింగ్  తగ్గుతుంది.  ముఖం మీద సహజ మెరుపు వస్తుంది.  చర్మం మెరుస్తుంది.                          *రూపశ్రీ.

పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..!

పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..! ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా ముఖం ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మగవారి కంటే ఆడవారే చర్మ సంరక్షణలో ఎక్కువ ఆసక్తి  కలిగి ఉంటారు. అందుకే మహిళలు ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం క్రీమ్స్,  లోషన్లు, క్లెన్సర్లు కొనుగోలు చేస్తుంటారు.  అయితే వీటికంటే కూడా పచ్చిపాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  అయితే పచ్చిపాలను వాడే విధానం, వీటితో పేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ వంటివి తయారు చేసుకునే విధానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. పచ్చిపాలను వాడటం వల్ల ముఖం మీద మచ్చలు, నల్లటి మచ్చలు తొలగడమే కాకుండా మృతకణాలు తొలగి క్రమంగా చర్మ ఛాయ మెరుగుపడుతుంది.  దీని కోసం ఏం చేయాలో.. పచ్చిపాలను ఎలా వాడాలో తెలుసుకుంటే.. ఫేస్ మాస్క్.. నేటి కాలంలో స్కిన్ కేర్ లో భాగంగా ఫేస్ మాస్క్ లు వాడటం చాలా మంచిది.  ఫేస్ మాస్క్ ల వల్ల చర్మం లోతుగా శుభ్రపడుతుంది. అవి తేమను కూడా అందిస్తాయి. ఫేస్ మాస్క్‌లు మొటిమలు,  మచ్చలు నివారించడంలో కూడా సహాయపడతాయి . ఇవి దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మతు చేయడానికి కూడా సహాయపడుతాయి. ఇంట్లో పచ్చిపాల మాస్క్.. ఎందుకు మంచిదంటే.. మార్కెట్‌లో చాలా రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండటాయి. చర్మానికి ఉండే ప్రతి సమస్యకు ఒక్కో మాస్క్ ఉంటుంది. అయితే ఈ మాస్క్‌లలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు అందరి చర్మానికి సరిపోతాయని చెప్పలేం.. పైగా  వాటిని ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు  జరగకపోగా,  నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. చర్మానికి  రసాయన మాస్క్‌ల వల్ల చికాకు కలగకూడదంటే.. సహజ పదార్ధాలతో తయారు చేసిన ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు మంచి ఛాయిస్ అవుతాయి. కావలసిన పదార్థాలు.. పచ్చిపాలు.. తగినన్ని కలబంద జెల్ రోజ్ వాటర్.. తయారీ విధానం.. ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. అందులో కలబంద జెల్ వేసుకోవాలి.  ఇందులోనే కాసిన్ని పచ్చిపాలు,  కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి.  మూడింటిని బాగా మిక్స్ చేయాలి.  ఈ ద్రావణాన్ని రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు అప్లై చేయాలి.  అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వెంటనే కడిగేయకూడదు. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మం మీద మచ్చలు తగ్గుతాయి.  చర్మం తాజాగా మృదువుగా మారుతుంది.  చర్మం మీద గీతలు కూడా క్రమంగా తగ్గి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అయితే దీన్ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇలా కూడా వాడవచ్చు.. పైన చెప్పుకున్న విధంగా పచ్చిపాలు, రోజ్ వాటర్, కలబంద కాంబినేషన్ లోనే కాకుండా.. పచ్చిపాలను నేరుగా.. కాటన్ బాల్ తో ముంచుకుని ముఖమంతా అప్లై చేయాలి.  ఆ తరువాత ఆరిపోయాక కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది.                                 *రూపశ్రీ.

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో ఇలా చేసుకోవచ్చు..!

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో  ఇలా చేసుకోవచ్చు..! జుట్టును సిల్కీగా, మృదువుగా,  బలంగా మార్చుకోవడానికి చాలామంది మహిళలు హెయిర్ స్పా మీద ఆసక్తి చూపిస్తారు.   దీని కోసం పార్లర్ కు వెళుతుంటారు. ఈ స్పాల కోసం 3వేల రూపాయల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఎంత డబ్బు ఉన్నా సరే.. జుట్టు కోసం ఏకంగా 3వేల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ముఖ్యంగా మధ్యతరగతి,  దిగువ తరగతి అమ్మాయిలకు 3వేల రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తం. కానీ 3వేల రూపాయల స్పా ట్రీట్మెంట్ వల్ల లభించే ఫలితాన్ని కేవలం 10రూపాయలతో పొందవచ్చు అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు.   జుట్టును బలోపేతం చేయడానికి,  సహజంగా సిల్కీగా,  మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో.. ఇది జుట్టుకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటే.. మసాజ్.. హెయిర్ స్పా లో మొదట  జుట్టును మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఈ నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది,  ప్రోటీన్ నష్టాన్ని నివారిస్తుంది. ఇది జుట్టును బలంగా,  లోపలి నుండి స్ట్రైయిట్ గా  చేస్తుంది. ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,  మూలాల నుండి బలపరుస్తుంది. ఆవిరి.. మసాజ్ చేసిన గంట తర్వాత  జుట్టుకు ఆవిరి పట్టాలి. ఇది జుట్టు కుదుళ్లను తెరుస్తుంది,  పొడి జుట్టు వంటి సమస్యలను నివారిస్తుంది .  జుట్టు చాలా చిట్లినట్లు,  వికృతంగా ఉంటే అలాంటి జుట్టుకు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి. మాస్క్.. ఆవిరి పట్టిన తర్వాత ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ వేసుకోవాలి.  జుట్టుకు అరటిపండు మాస్క్ వేయాలి. అరటిపండును మెత్తగా చేసి, దానికి రోజ్ వాటర్, కలబంద, విటమిన్ E క్యాప్సూల్ జోడించాలి. దీన్ని  జుట్టు మొత్తం పొడవునా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ప్రయోజనాలు.. పైన చెప్పుకున్న విధంగా మూడు స్టెప్స్ లో హెయిర్ స్పాను ఇంట్లోనే చేసుకోవచ్చు.  కొబ్బరినూనె ఇంట్లో సహజంగా ఉంటుంది.  నీటి ఆవిరి పట్టుకోవడం కూడా సులువే.. ఇక అరటిపండు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల  హెయిర్ స్పా పూర్తీ అవుతుంది.   ఈ స్పా చేసుకోవడం వల్ల  జుట్టు సహజంగా కండిషన్ అవుతుంది. జుట్టు బలంగా మారుతుంది,  చుండ్రు తగ్గడంలో సహాయపడుతుంది.  జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది.  అలాగే జుట్టుకు సహజ మెరుపు వస్తుంది.                          *రూపశ్రీ.

రోజూ ఈ ఆహారాలు తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

రోజూ ఈ ఆహారాలు తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది! జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.  ఇందుకోసం చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతారు.  చాలామంది జుట్టు పెరగడం కోసం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతుంటారు.  అయితే ఇవన్నీ అప్పటికే ఆరోగ్యంగా ఉన్న జుట్టుకు  రక్షణ కల్పిస్తాయి తప్ప,  డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయవని, జుట్టు పెరగడంలో సహాయపడవని అంటున్నారు. ఇవన్నీ జుట్టు విషయంలో పరోక్షంగా ప్రభావం చూపించేవే.. కానీ జుట్టు విరిపోవడం, రాలిపోవడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గి,  జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. కొన్ని ఆహారాలు బాగా సహాయపడతాయని అంటున్నారు ఆహార నిపుణులు.  ఇంతకీ జుట్టు బాగా పెరగాలంటే ఏ ఆహారాలు తినాలి? తెలుసుకుంటే.. ఉసిరి.. శీతాకాలంలో మార్కెట్లో ఉసిరి సులభంగా లభిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టుకు  సహజంగా ఉండే  నల్ల రంగును  నిలిపి ఉంచడానికి  సహాయపడుతుంది . రోజూ ఒక ఉసిరి తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా.. చిన్నతనంలోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారిస్తుంది. అరటి పండు.. అరటిపండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా  జుట్టుకు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లలో పొటాషియం, సహజ నూనెలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  జుట్టులో తేమను నిలుపుకోవడంలో, జుట్టును లోపలి నుండి హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. అరటిపండ్లు తినడం వల్ల  తలపై చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.  జుట్టును మృదువుగా,  మెరిసేలా చేస్తుంది. ఇది పొడి జుట్టును నివారించడంలో సహాయపడుతుంది . నారింజ.. శీతాకాలంలో నారింజ పండ్లు సులభంగా లభిస్తాయి.  వీటిలో విటమిన్ సి,  బయోఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అవి తలలో రక్త ప్రసరణను పెంచుతాయి, జుట్టు మూలాలకు సమృద్ధిగా ఆక్సిజన్‌ను అందిస్తాయి. నారింజ తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు విరిగిపోవడం,  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది . బొప్పాయి.. బొప్పాయిలో "పపైన్" అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది విటమిన్-ఎ కలిగి ఉంటుంది. ఇది తలపై ఉన్న మురికి,  అదనపు నూనెను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది.  నిర్జీవంగా,  పొడిగా ఉండే  జుట్టుకు కొత్త మెరుపును ఇస్తుంది. దానిమ్మ.. దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు పల్చబడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ పండు జుట్టు సాంద్రతను కూడా పెంచుతుంది . దానిమ్మపండ్లు తినడం వల్ల జుట్టు మందంగా, ఒత్తుగా  కనిపిస్తుంది. ఆపిల్.. ఆపిల్స్ లో జుట్టు పెరుగుదలకు అవసరమైన బయోటిన్,  ఫైబర్ ఉంటాయి. అవి జుట్టు కుదుళ్లను మూసివేసి వాటిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఆపిల్స్ తినడం వల్ల  ఆరోగ్యానికి మాత్రమే కాకుండా  జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.  జుట్టు విరిగిపోవడాన్ని,  చివరలు చిట్లకుండా నిరోధిస్తుంది.                       *రూపశ్రీ

కళ్లకింద నల్లటి వలయాలు ఉన్నాయా.. ఆయుర్వేదం చెప్పిన ఈ మ్యాజిక్ టిప్ ట్రై చేయండి..!

కళ్లకింద నల్లటి వలయాలు ఉన్నాయా.. ఆయుర్వేదం చెప్పిన ఈ మ్యాజిక్ టిప్ ట్రై చేయండి..! కళ్ళ కింద నల్లటి వలయాలు అనేక కారణాల వస్తుంటాయి.  కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా రావడానికి కారణం మనమే అంటుంది ఆయుర్వేదం.   దీనికి మనం ఎలా బాధ్యత వహిస్తామని  ఆశ్చర్యం కలుగుతుంది. తమ ముఖాన్ని నాశనం చేసుకోవాలని ఎవరూ అనుకోరు.  కానీ తెలియకుండానే అది జరిగిపోతుంది. నేటికాలంలో చాలామంది నిద్రను నాశనం చేసుకుంటుంటారు. చాలా వరకు రాత్రంతా మేల్కొని ఉండటానికి అలవాటు పడిపోయి నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు.  దీని ఫలితంగా   కళ్ళ కింద నల్లటి వలయాలు  వచ్చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి చాలా ఇతర కారణాలు కూడా ఉంటాయి. అసలు కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి?  కళ్ళ కింద నల్లటి వలయాలు వదిలించుకోవడానికి ఆయుర్వేదం చెప్పిన పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. కళ్ల కింద నల్లటి వలయాలకు కారణాలు..  కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణాలు నిద్ర లేకపోవడం, ఒత్తిడి, తక్కువ హిమోగ్లోబిన్, పోషకాహార లోపాలు, ఇన్సులిన్ నిరోధకత, కాస్మెటిక్ అలెర్జీలు, కంటి అలెర్జీలు. నల్లటి వలయాలు వదిలించుకునే కారణాలు.. కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి అండర్ ఐ క్రీములు వాడుతుంటారు. ఈ క్రీములు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. కానీ ఇవి కంటికి సంబంధించిన అనేక సమస్యలను కూడా కలిగిస్తాయి. ఈ క్రీములు,  ఆయింట్‌మెంట్లలో ఉపయోగించే రసాయనాలు కళ్ళకు హానికరం. చికాకు, వాపు, ఎరుపు,  మంటకు దారితీస్తాయి. కళ్ల కింద క్రీమ్ ఉపయోగించకుండా నల్లటి వలయాలు వదిలించుకోవాలంటే ఆయుర్వేదం చెప్పిన చిట్కా ఫాలో అవ్వాలి. అతిమధురం.. అతిమధురం ఆయుర్వేదంలో చాలా గొప్ప మూలిక.  అతిమధురం పొడిని నీటిలో కలిపి పేస్ట్ లాగా చేయాలి.  దీన్ని కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాల మీద లేపనం చేయాలి. ఇది  కళ్ళను చల్లబరుస్తుంది,  నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది  చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. బాదం నూనె..  కళ్ళ కింద బాదం నూనెను నల్లటి వలయాలకు పూయడం వల్ల  చర్మానికి పోషణ ఇస్తుంది. బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలలో  ఉండే బ్లాకేజెస్  సరిచేయడానికి సహాయపడుతుంది. రోజ్ ఆయిల్ ఈ నూనెను రోజ్‌షిప్ ఆయిల్ అంటారు. పిగ్మెంటేషన్  కొల్లాజెన్ సమస్యలను నివారించాలనుకుంటే రోజ్‌షిప్ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.                         *రూపశ్రీ.  

రోజూ ఈ 5 తింటే చాలు.. నెల రోజుల్లో ముఖం మెరిసిపోతుంది..!

రోజూ ఈ 5 తింటే చాలు.. నెల రోజుల్లో ముఖం మెరిసిపోతుంది..! చాలామంది అమ్మాయిలు అందం కోసం బ్యూటీ పార్లర్ మీద ఆధారపడతారు.  అయితే బ్యూటీ పార్లర్ ఇచ్చే అందం కేవలం పైపై మెరుగులు గానే ఉంటుంది. అది కేవలం కొన్ని గంటలు, లేదంటే ఒకటి రెండు రోజులలో తగ్గిపోతుంది.  ఫేషియల్ చేయించుకోవడం,  బ్యూటీ ట్రీట్మెంట్ వంటివి తాత్కాలిక అందాన్ని ఇస్తాయి.  కానీ  శాశ్వతమైన అందం లేదా ఎక్కువ కాలం అందంగా కనిపించాలంటే అది కేవలం ఆహారం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు ఆహార నిపుణులు.  5 రకాల ఆహారాలు రోజూ తింటుంటే కేవలం ఒక నెల రోజుల్లోనే ముఖం మెరిసిపోతుందని అంటున్నారు.  ఇంతకీ అందంగా మారడానికి రోజూ ఏం తినాలో తెలుసుకుంటే.. సహజంగా మెరిసే చర్మం కావాలంటే ఇవి తినాలి.. సహజంగా మెరిసే చర్మాన్ని పొందడానికి ప్రోటీన్ అధికంగా ఉండే సలాడ్ తినాలి. దీని కోసం దోసకాయ, టమోటా,  క్యారెట్ లను చిక్పీస్, కాటేజ్ చీజ్ లేదా మొలకలతో కలిపి తినవచ్చు. ఈ సలాడ్  చర్మాన్ని లోపలి నుండి పోషిస్తుంది. దీనిలోని ప్రోటీన్ చర్మ కణాలను రిపేర్ చేస్తుంది, ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం, చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది. పెరుగు చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.  ఇది చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మొటిమలను తగ్గించడానికి, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి,  ముఖానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది . గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించి,  చర్మాన్ని మెరుగ్గా ఉంచుతుంది. సహజమైన మెరుపు కోసం స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లను  తినవచ్చు. వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల దృఢమైన, ప్రకాశవంతమైన,  మచ్చలు లేని చర్మం లభిస్తుంది.  బాదం, వాల్‌నట్స్, చియా,  అవిసె గింజలను తినవచ్చు. వీటిలో చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల పొడి చర్మం నుండి ఉపశమనం లభిస్తుంది . ఇది  ముఖానికి పార్లర్ లాంటి మెరుపును ఇస్తుంది.                         *రూపశ్రీ.      

మెరిసే చర్మానికి అద్బుతమైన ఇంటి రెమిడీ.. దీని ముందు బ్యూటీ పార్లర్లు బలాదూర్!

మెరిసే చర్మానికి అద్బుతమైన ఇంటి రెమిడీ.. దీని ముందు బ్యూటీ పార్లర్లు బలాదూర్! అందంగా, ఆరోగ్యంగా,  మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందు కోసం అమ్మాయిలు మార్కెట్లో లభించే ఉత్పత్తుల నుండి బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ వరకు ప్రతీది ట్రై చేస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వడం లేదా అసలు ఫలితాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది.  మరీ ముఖ్యంగా  కొన్ని యాడ్స్ చూసి వాడిన మార్కెట్ ఉత్పత్తులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంటాయి.    కానీ ఎన్ని అనుభవాలు ఎదురైనా అమ్మాయిలు తమ అందం కోసం ఏదో ఒకటి ప్రయోగిస్తూనే ఉంటారు. అవన్నీ వదిలేసి కేవలం ఒకే ఒక్క ఉత్పత్తి వాడటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందవచ్చు.  చర్మాన్ని అటు మెరిపిస్తూ, ఇటు అందంగా ఆరోగ్యంగా ఉంచే అద్బుతమైన ఇంటి రెమిడీ ఒకటుంది.  అదేంటో.. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుంటే.. హోమ్ మేడ్ కాఫీ స్క్రబ్.. హోమ్ మేడ్ కాఫీ స్క్రబ్ తయారు చేసుకోవడం చాలా సులువు. అలాగే వాడటం కూడా కష్టమేం కాదు. దీనికి కావలసిన పదార్థాలు.. ½ కప్పు కాఫీ పొడి 1/2 కప్పు చక్కెర ¼ కప్పు కొబ్బరి నూనె 1-2 టేబుల్ స్పూన్లు తేనె 1 టేబుల్ స్పూన్ మైల్డ్ బాడీ వాష్ తయారీ విధానం.. కాఫీ స్ర్కబ్ తయారు చేయడానికి కనీసం స్టౌ కూడా అవసరం లేదు.  ఒక శుభ్రమైన పొడిగా ఉన్న ఖాళీ సీసా తీసుకోవాలి.  ఇందులో కాఫీ పౌడర్ వేయాలి.  అందులోనే చక్కెర, కొబ్బరి నూనె, తేనె వేయాలి.  అన్నింటిని  బాగా మిక్స్ చేయాలి.  అందులో ఒక స్పూన్ మైల్డ్ బాడీ వాష్ కలపాలి.  ఈ పదార్థాలు అన్నీ బాగా కలిపితే అద్బుతమైన స్క్రబ్ తయారైనట్టే.. కాఫీ స్క్రబ్ ఎలా వాడాలి? కాఫీ  స్క్రబ్ ఉపయోగించడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు. మొదట చర్మాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.  తర్వాత స్క్రబ్  మిశ్రమాన్ని తడి చర్మానికి అప్లై చేయాలి. వృత్తాకారంగా రుద్దుతూ  సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది పొడి చర్మం,  టానింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . బాగా స్ర్కబ్ చేసుకున్న తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మళ్లీ ఎలాంటి సోప్ లేదా లిక్విడ్ వాష్ లాంటివి వాడకూడదు.  ఈ స్క్రబ్ వాడుతుంటే చర్మం చిన్న పిల్లల్లా ఎంతో స్మూత్ గా, తాజాగా మారుతుంది.  పైన చెప్పుకున్న కొలతలలోనే కాకుండా కొద్ది మొత్తంలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. కాఫీ స్ర్కబ్ ఎలా పని చేస్తుంది.. ఇంట్లో తయారు చేసుకున్న కాఫీ స్ర్కబ్ అనేక చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చక్కెర చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె చర్మానికి  పోషకాలను అందిస్తుంది,  తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చివరగా, బాడీ వాష్ చర్మం నుండి మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.                             *రూపశ్రీ.

వ్యాక్సింగ్ లేకుండానే అవాంఛిత రోమాలను మాయం చేసే సూపర్ చిట్కా..!

వ్యాక్సింగ్ లేకుండానే అవాంఛిత రోమాలను మాయం చేసే సూపర్ చిట్కా..! అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్యలలో అవాంఛిత రోమాలు కూడా ప్రధానమైనవి.  అవాంఛిత రోమాలు అందాన్ని చాలా దెబ్బతీస్తాయి.  చాలామంది అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ ను ఎంచుకుంటారు. కానీ ఇది చాలా నొప్పిగా ఉంటుంది.  ఇప్పట్లో మార్కెట్లో చాలా రకాల క్రీమ్ లు కూడా దొరుకుతాయి. మరికొందరు హెయిర్ ట్రిమ్మింగ్ విధానానని ఎంచుకుంటారు.  కానీ ఇవి చర్మానికి హాని కలిగిస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతారు. థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ మరియు ప్లకింగ్ వంటి పద్ధతులలో అవాంఛిత రోమాలు చాలా తొందరగా తిరిగి పెరుగుతాయి.  చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఇంట్లోనే సూపర్ టిప్ ఫాలో కావచ్చు. కేవలం మూడు పదార్థాలు ఉపయోగించి అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. అవాంఛిత రోమాలు తొలగించే రెసిపి.. కావలసిన పదార్థాలు.. గోధుమపిండి.. తేనె.. పసుపు.. పాలు.. పైన  పేర్కొన్న పదార్థాలను అవసరానికి కావలసినంత తీసుకోవాలి. తయారీ  విధానం.. ఒక చిన్న గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి.  అందులో తేనె, పసుపు, పాలు వేసి పేస్ట్ లాగా చేయాలి.  ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై  చేయాలి.  అది ఆరిపోయేవరకు అలాగే ఉంచాలి.  ఆ తరువాత చర్మం మీద హెయిర్ పెరిగె  వ్యతిరేక దిశలో సున్నితంగా రుద్దుతూ ముఖం మీద పేస్ట్ ను తొలగించాలి.  ఇలా తొలగించేటప్పుడు ఎండిన పేస్ట్ తో పాటు చర్మం మీద అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి.  థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ నొప్పి కలిగి ఉంటుంది.   ఈ టిప్ ను వారానికి ఒకసారి ఫాలో అవుతూ ఉంటే ముఖం మీద అవాంఛిత రోమాలు  అనేవి అసలు కనిపించవు. ఇందులో ఎలాంటి రసాయనాలు,  హాని చేసే పదార్థాలు లేవు కాబట్టి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించవచ్చు.                                 *రూపశ్రీ.

ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..!

ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..! అందమైన ముఖాన్ని కూడా  ఎబ్బెట్టుగా కనిపించేలా చేయడంలో ముఖం మీద మచ్చలు,  గీతలు,  మొటిమలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మచ్చలు లుక్స్ ను చాలా ప్రబావింత చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువ పడటం,  మొటిమలు, పిగ్మెంటేషన్, హార్మోన్ల మార్పులు,  స్కిన్ కేర్ సరిగా ఫాలో కాకపోవడం వంటి తప్పుల వల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.  ఈ మచ్చలు పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల  ఆశించిన ఫలితాలు అయితే ఉండవు.  ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో లభించే కొన్ని నేచురల్ పదార్థాలు,  ఇంటి చిట్కాలు చర్మపు రంగును సహజంగా మెరుగుపరిచి మచ్చలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. క్రమం తప్పకుండా వీటిని వాడితే చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకీ మచ్చలను తగ్గించే ఆ సూపర్ టిప్ ఏంటో తెలుసుకుంటే.. మచ్చలను తగ్గించే మ్యాజిక్ క్రీమ్.. మచ్చలను తగ్గించడంలో ఇంట్లోనే తయారు చేసే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.   కావలసిన పదార్థాలు.. అలోవెరా జెల్.. 1 స్పూన్ నిమ్మరసం.. అరటీ స్పూన్ రోజ్ వాటర్.. ఒక టీస్పూన్.. తయారు విధానం.. ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేయాలి.  అందులో ఒక అర స్పూన్ నిమ్మరసం వేయాలి. అందులోకే ఒక స్పూన్ రోజ్ వాటర్ కూడా వేయాలి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.  ఇది క్రీమీగా మారుతుంది.   అలోవెరా జెల్ చర్మాన్ని రిపేర్ చేయడానికి, మచ్చలను లైట్ గా చేసి అవి తగ్గడానికి సహాయపడుతుంది.   నిమ్మరసం సహజ బ్లీజ్ గా పనిచేస్తుంది.  ఇది పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని కూల్ గా మారుస్తుంది.  చర్మాన్ని తేమగా మృదువుగా మారుస్తుంది. ఎలా ఉపయోగించాలి? మొదటగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని పొడి టవల్ తో బాగా తుడుచుకోవాలి.  ఇలా చేసిన తరువాత తయారు చేసుకున్న క్రీమ్ ను చేతి వేళ్లతో కొద్దిగా తీసుకుని ముఖం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి.  15 నుండి 20 నిమిషాల  వరకు అలాగే ఉంచాలి.  20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.  మంచి ఫలితాల కోసం ఈ క్రీమ్ ను వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించాలి. జాగ్రత్త.. ఈ క్రీమ్ లో నిమ్మరసం ఉంటుంది.  ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా చికాకు కలిగిస్తుంది.  అందుకే దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ క్రీమ్ ను అప్లై చేసినప్పుడు మంట,  దురద,  లేదా చర్మం ఎర్రగా మారడం వంటి  లక్షణాలు కనిపిస్తే వాడటం మానేయాలి.  ఈ క్రీమ్ చర్మానికి  ఎలాంటి హాని కలిగించకపోతే దీన్ని ఉదయం సమయాల్లో కంటే రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది.  రాత్రి సమయంలో దీన్ని ముఖానికి అప్లై చేసి అలాగే వదిలేయవచ్చు.  పైన పేర్కొన్న క్రీమ్ ను రెగ్యులర్ గా వాడుతుంటే  ముఖం మీద మచ్చలు మెల్లిగా తేలిక అవుతాయి. కలబంద చర్మాన్ని లోపలి నుండి పోషణ ఇస్తుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం చర్మం రంగును సమంగా చేస్తుంది.  రోజ్ వాటర్ ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.  కొన్ని వారాలు ఈ క్రీమ్ వాడితే చర్మం మీద స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.                                     *రూపశ్రీ.

శీతాకాలంలో చర్మాన్ని రక్షించే టోనర్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేస్కోండి!

శీతాకాలంలో చర్మాన్ని రక్షించే టోనర్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేస్కోండి!  శీతాకాలం చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుంది.  కొన్ని సందర్బాలలో ఇది చర్మాన్ని ఎర్రగా మార్చి చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా చర్మం నుండి కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. ఇవన్నీ జరగకూడదు అంటే చర్మం ఎప్పుడూ  హైడ్రేటెడ్‌గా  తాజాగా ఉండాలి. ఇందుకోసం  టోనర్‌ను ఉపయోగించడం చాలా అవసరం. మార్కెట్లో లభించే టోనర్లు చర్మాన్ని హాని చేసే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి అలర్జీ,  ఇరిటేషన్ కలిగిస్తాయి.   అందుకే ఇంట్లో తయారుచేసిన టోనర్  చాలా మంచిది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టోనర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   టోనర్ చేసే మ్యాజిక్.. టోనర్ చర్మంలో ఉండే  సహజ నూనెలను సమతుల్యం చేస్తుంది. చర్మానికి  గ్లో ఇస్తుంది.    మృదుత్వాన్ని పెంచుతుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది, పొడి చర్మాన్ని తగ్గించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది.  ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవడం వల్ల కెమికల్ ఫ్రీ ఉత్పత్తి చర్మానికి వాడినట్టే.  దీని వల్ల చర్మం ఆరోగ్యంగా  ఉంటుంది. రోజ్ వాటర్, దోసకాయ టోనర్.. శీతాకాలంలో  ముఖాన్ని వెంటనే చల్లబరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి రోజ్ వాటర్, దోసకాయ టోనర్ బెస్ట్ సొల్యూషన్. దోసకాయ సహజంగా హైడ్రేటింగ్ కలిగి ఉంటుంది, చర్మపు మంటను తగ్గిస్తుంది. తయారు చేసే విధానం.. దోసకాయను తురుమి దాని రసాన్ని తీయాలి. దోసకాయ రసానికి సమాన మొత్తం రోజ్ వాటర్. ఈ రెండింటి కలిపి ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని ప్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు.  ఇదిచర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ టీ టోనర్.. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో డల్ గా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి, చర్మానికి  శక్తినిస్తాయి. తయారు విధానం.. గ్రీన్ టీని మరిగించి పూర్తిగా చల్లబరచాలి. దానిని స్ప్రే బాటిల్‌లో పోయాలి. ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మం వెంటనే   రిఫ్రెష్ అవుతుంది. చర్మ  రంధ్రాలు బిగుతుగా మారుతాయి. ఇది జిడ్డుగల,  డల్ గా  ఉన్న  చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలోవెరా టోనర్.. పొడి చర్మం, చాలా  రఫ్ గా ఉన్న చర్మానికి అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ తో చేసే టోనర్ కూడా అదేవిధంగా సహాయపడుతుంది. తయారు విధానం.. రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను అర కప్పు నీటిలో వేసి  బాగా కలపాలి.  తేలికగా, చర్మాన్ని  హైడ్రేట్ చేసే టోనర్ ఇది.  ఈ  టోనర్ చర్మపు చికాకు, ఎరుపును తగ్గించడమే కాకుండా చర్మం మీద  పొలుసులను తగ్గిస్తుంది. దీన్ని  అప్లై చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా మారుతుంది. అలాగే  చల్లగా ఉంటుంది. లెమన్ వాటర్ టోనర్.. శీతాకాలంలో చాలా సార్లు ముఖ చర్మానికి ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇందుకోసం లెమన్ వాటర్ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది. తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ టోనర్ రంధ్రాల నుండి మురికిని శుభ్రపరుస్తుంది. నూనెను నియంత్రిస్తుంది.  ముఖానికి క్లియర్  రూపాన్ని ఇస్తుంది. చాలా పొడి చర్మం ఉన్నవారు దీనిని తక్కువ పరిమాణంలో ఉపయోగించడం బెటర్. పైన చెప్పుకున్న టోనర్ లు  చాలా సహజంగా, తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.  వీటిలో రసాయనాలు లేకపోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుటుంది.  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.                                *రూపశ్రీ.

చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా! చలికాలం చర్మానికి పరీక్ష కాలం.  చలి,  చల్లగాలి కారణంగా చర్మం పగులుతుంది. చలి కారణంగా చాలామంది నీరు తక్కువ తాగుతారు.  ఈ కారణంగా కూడా శరీరంలో నీరు తగ్గి చర్మం పొడిబారుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి చాలామంది మాయిశ్చరై జింగ్ క్రీములు, స్కిన్ కేర్ క్రీములు,  స్కిన్ రిపేర్ క్రీములు అంటూ చాలా రకాలు పూస్తుంటారు. ఇవి చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయని,  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని అనుకుంటారు. కానీ ఈ క్రీములను ఇష్టమొచ్చినట్టు వాడినా, లేక తప్పుగా ఉపయోగించినా చర్మానికి చాలా డేంజర్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. స్కిన్ క్రీమ్స్.. చర్మానికి ఉపయోగించే క్రీములలో ప్రోటీన్లు,  కొవ్వులు అధికంగా ఉంటాయి.  ఇవి కొంతమంది చర్మంపై దద్దుర్లు, బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలు వంటివి కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు,  జిడ్డు చర్మం గలవారు ఈ క్రీమ్స్ ను వాడటం వల్ల అలెర్జీ కి గురికావడం లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మ సంబంధ సమస్యలు రావడం వంటి వాటికి కారణం అవుతుంది. స్కిన్ కోసం వాడే క్రీములు తాజాగా లేకపోయినా లేదా చర్మం మీద ఎక్కువ సేపు ఉంచినా అవి చర్మ ఇన్ఫెక్షన్లు,  నల్లటి మచ్చలు రావడానికి కూడా కారణం అవుతుంది.అందుకే చర్మానికి వాడే క్రీములు తాజాగా ఉండాలి. అలాగే చర్మానికి క్రీమ్స్ రాసేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  అదేవిధంగా చర్మానికి కేవలం వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వాడటం మంచిది. క్రీమ్స్  ఉపయోగించేవారు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రీమ్స్ ను జాగ్రత్తగా వాడినప్పుడే వాటి ఫలితం బాగుంటుంది.  లేకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి.                                                *రూపశ్రీ.

న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!

న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!   డిసెంబర్ నెలను పార్టీ సీజన్ అని చెప్పవచ్చు.  ఒకవైపు క్రిస్మస్ వేడకలు,  మరొకవైపు న్యూ ఇయర్ వేడుకలు.. ఈ పార్టీ సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి చోట చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలని కోరుకుంటుంది.  అది ఫ్రెండ్  పార్టీ అయినా, ఆఫీస్ పార్టీ అయినా, లేదా ఫ్యామిలీ మీట్ అయినా ప్రతి ఒక్కరూ తమ ఎంట్రీ  స్టైలిష్‌గా,  రాయల్ గా  కనిపించాలని కోరుకుంటారు. అయితే వీటికి అటెండ్ అవ్వడానికి  ఖరీదైన మేకప్ ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలని  అనుకుంటూ ఉంటారు.  కానీ నిజమేంటంటే అలాంటివి అవసరం లేదు. స్మార్ట్ స్కిన్ కేర్, సరైన మేకప్ చిట్కాలు,  గ్లో ట్రిక్స్‌తో.. ఇంట్లోనే పర్పెక్ట్ పార్టీ లుక్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అందాన్ని పెంచే సులభమైన గ్లో చిట్కాలు.. పార్టీకి ముందు..   ఏదైనా మేకప్‌కి బలమైన బేస్ అవసరం.  ఇందుకోసం  చర్మం ప్రిపేర్ కాకపోతే,  మేకప్ ఎంత బాగున్నప్పటికీ, అది అంత బాగా కనిపించదు. పార్టీకి ముందు  చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి,   చర్మాన్ని మృదువుగా చేయడానికి టోనర్‌ను అప్లై చేయాలి. దీని తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది  చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా సహాయపడుతుంది. బేస్ మేకప్..  బేస్ మేకప్‌లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అప్లై చేయడం. ప్రైమర్  ఫౌండేషన్ సజావుగా కలపడానికి, క్రాక్స్   నివారించడానికి సహాయపడుతుంది. చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకుని, దానిని పూర్తిగా బ్లెండ్ చేయాలి.  నల్లటి మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే వాటిని తేలికపాటి కన్సీలర్‌తో కప్పాలి. ఇది  ముఖాన్ని తాజాగా,  కంప్లీట్ గా  కనిపించేలా చేస్తుంది. ఐ మేకప్.. పార్టీ లుక్ కోసం ఐ మేకప్ చాలా ముఖ్యం.  కళ్ళకు మెరుపు,  కళ్ల సైజ్, కళ్లు అట్రాక్షన్ గా కనిపించడానికి  ఐషాడోను ఉపయోగించవచ్చు.  ఐలైనర్ అంచులుగా ఉండేలా చేసి,  హెవీ మస్కారాను అప్లై చేయడం  ద్వారా  కంటి మేకప్‌కు గ్లామర్‌ను జోడించవచ్చు. కావాలనుకుంటే లుక్‌ను డ్రామాటిక్ గా,  పార్టీకి తగ్గట్టు మరింత హైలెట్ చేయడానికి   ఐ లాషెస్ కూడా పెట్టుకోవచ్చు. మెరిసే లుక్ కోసం.. చర్మం సహజంగా,  తాజాగా మెరిసిపోవాలంటే హైలైటర్, బ్లష్,  డ్యూయ్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా ముఖ్యం.  చెంప ఎముకలు, ముక్కు,  గడ్డంపై తేలికపాటి హైలైటర్‌ను అప్లై చేయాలి. ఇది  ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా పార్టీ లైట్లలో షైనింగ్ ఇస్తుంది.  లుక్‌ను తాజాగా,  యవ్వనంగా ఉంచడానికి  బ్లష్‌ను లైట్ గా, నాచురల్ గా   ఉంచాలి.  మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే.. మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే వేయడం చాలా అవసరం. ఇది  లుక్‌ను తాజాగా ఉంచుతుంది,  అలాగే తొందరగా చెదిరిపోకుండా  ప్రొటెక్ట్ చేస్తుంది.  పార్టీ సమయంలో  ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం చాలా ముఖ్యం.  ఇది  మేకప్‌ ఎక్కువసేపు  చెదిరిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.                            *రూపశ్రీ.

శీతాకాలంలో చుండ్రు పెరుగుతోందా...ఈ మిస్టేక్స్ చేస్తున్నట్టే..!

శీతాకాలంలో చుండ్రు పెరుగుతోందా...ఈ మిస్టేక్స్ చేస్తున్నట్టే..!   జుట్టు ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది చుండ్రు. చుండ్రు తల చర్మాన్ని చాలా ఇర్రిటేట్ చేయడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలహీనం కావడానికి,  హెయిర్ ఫాల్ కావడానికి కారణం అవుతుంది. అంతేకాదు చుండ్రు ఉన్నప్పుడు జుట్టు పెరుగుదల కూడా సాధారణం కంటే కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టును చాలా దెబ్బతీయడంలో చుండ్రు  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాంటి చుండ్రు సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో విజృంభిస్తుంది.  హెయిర్ ఫాల్ చలికాలంలో ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే చలికాలంలో చుండ్రు పెరగడానికి రోజువారీ చేసే మిస్టేక్స్ కూడా ఉన్నాయి.  ఈ మిస్టేక్స్ కారణంగా చుండ్రు పెరిగి జుట్టు నాశనం కావడానికి దారి తీస్తుంది.  చుండ్రు పెరగడానికి కారణమయ్యే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. చల్లగాలి.. శీతాకాలం గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. తలపై చర్మపు తేమ వేగంగా తగ్గుతుంది. ఇది చర్మం  రక్షణ పొరను బలహీనపరుస్తుంది. మలాసెజియా ఫంగస్ చురుగ్గా పెరుగుతుంది. దీని వల్ల మందపాటి పొరలు ఏర్పడతాయి. ఇదే చుండ్రు. వేడి నీటి స్నానం.. శీతాకాలంలో వేడి నీటి స్నానం చాలా మందికి ఊరటగా అనిపిస్తుంది. కానీ అది తలపై చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. దీని ఫలితంగా దురద, ఎరుపు, ఫంగస్ పొరలు పెరగడం వంటివి జరుగుతాయి. తక్కువ తల స్నానం.. చలికాలంలో తలస్నానం చేయడం తగ్గిస్తుంటారు.  దీనివల్ల నూనె పేరుకుపోతుంది, చర్మం మృతకణాలు పేరుకుపోతాయి,  ఫంగస్  పెరుగుతుంది. నూనె వాడకం.. శీతాకాలంలో బరువుగా ఉన్న  నూనెలు రాయడం వల్ల ఫంగస్ పెరుగుతుంది.  ఫలితంగా దురద ఎక్కువగా రావడం, మందంగా పొలుసులు రావడం,  చుండ్రు తగ్గినట్టే తగ్గి  తిరిగి రావడం జరుగుతుంది. హెయిర్ క్యాప్.. చలి భరించలేక చాలామంది తలకు టోపి లేదా క్యాప్ లాంటివి ధరిస్తుంటారు.  ఇవి ధరించినప్పుడు  వేడి,  చెమట పేరుకుపోతుంది.  ఫంగస్ పెరగడానికి ఇది కారణం అవుతుంది. ఎక్కువ వేడి.. చలికారణంగా తేమ తక్కువగా ఉన్నప్పుడు.. ఆ చలి నుండి ఉపశమనం కోసం చాలామంది వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతుంటారు.  దీనివల్ల  మరింత పొడిబారి ఫంగస్ పెరుగుతుంది. హెయిర్ స్టైలింగ్ మిస్టేక్స్.. బ్లో డ్రైయర్లు,  స్ట్రెయిట్నర్లు తల చర్మం నుండి తేమను తొలగిస్తాయి. దీని వలన చుండ్రు పెరుగుతుంది.  కండిషనింగ్ మిస్టేక్స్.. చాలామంది తలకు కాకుండా కేవలం జుట్టుకు మాత్రమే కండిషనింగ్ చేస్తారు.  దీనివల్ల తల చర్మం మరింత ఎండిపోతుంది. తక్కువ నీరు త్రాగడం.. శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీనివల్ల  శరీరం,  తల చర్మంలో తేమ తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారి చుండ్రు పెరుగుతుంది. విటమిన్ డి లోపం.. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా తలపై చర్మ రోగనిరోధక శక్తి బలహీనపడి ఇన్ఫెక్షన్ త్వరగా పెరుగుతుంది.                           *రూపశ్రీ.

పాదాలు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నాయా... అయితే మీకోసమే ఈ టిప్స్!

పాదాలు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నాయా... అయితే మీకోసమే ఈ టిప్స్! మహిళలు ఆరోగ్యం కంటే ఎక్కువగా అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. జుట్టు, ముఖం, పెదవులు, కనుబొమ్మలు, గోళ్లు ఇలా చాలా విషయాల్లో ఎన్నెన్నో టిప్స్ పాటిస్తారు. అయితే ఇన్ని టిప్స్ ఫాలో అయ్యే మహిళలు తమ పాదాల సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. ఏ చెప్పుల షాపుకో వెళ్ళినప్పుడు, పట్టీలు వంటివి దరిస్తున్నపుడు తప్ప కాళ్ళ వైపు చూసేవారు కూడా తక్కువే అనుకోవచ్చు. ఈ కారణంగా మహిళల్లో పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఇది పాదాలు పొడిబారడంతో మొదలయ్యి  మడమలు పగుళ్లు, కాల్లస్‌లకు దారితీస్తుంది. పగిలిన మడమల వల్ల అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోయినా అవి ఎబ్బెట్టుగానూ, కొన్నిసార్లు నొప్పి పుట్టి ఇబ్బందిని కలిగిస్తాయి.  పాదాల పగుళ్లు సాధారణం కంటే లోతుగా ఉన్నప్పుడు నడవడం కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది.  కొందరి పాదాలు ఎంతో సుకుమారంగా, అందంగా ఎలాంటి పగుళ్లు లేకుండా ఉంటాయి. అది అందరికీ సాధ్యం కాదేమో అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. పాదాల పగుళ్లు తగ్గి, ఆరోగ్యంగా మారేందుకు మూడే మూడు చిట్కాలు పాటిస్తే చాలు.  స్నానం చేసిన తరువాత పాదాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఉదయం రాత్రి రెండు పూటలా పాదాలకు కూడా మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ వల్ల సరిపడినంత మృదుత్వం లభించడం లేదని అనిపిస్తే వెజిలైన్ లేదా ఇతర వైట్ పెట్రోలియం జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. దీన్ని రోజూ క్రమం తప్పకుండా పాటిస్తుంటే తొందరలోనే మిగిలిన పాదాలు సాధారణ స్థితికి వస్తాయి.  బాగా పొడిబారి, పగిలిన మడమల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన సాక్స్‌లను ఉపయోగించవచ్చు. వీటిని మాయిశ్చరైజింగ్ సాక్సులు అంటారు. వీటిలో కలబంద, విటమిన్ ఇ, షియా బటర్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి పాదాల చర్మాన్ని ఎప్పుడూ  హైడ్రేట్ గా ఉంచగలుగుతాయి.  కాలి పగుళ్లు నయం అయిన తర్వాత, పాదాలకు పెడిక్యూర్ చేసుకోవాలి. ఇది బ్యూటీపార్లర్లలోనే లభిస్తుందని అనుకుంటే పొరపాటే. వారంలో ఒకసారి అయినా ఇంటి పట్టున ఉన్నప్పుడు పెడిక్యూర్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం తక్కువ ధరలోనే కావలసిన పదార్థాలు లభిస్తాయి. వీటన్నింటికి బదులుగా పాలు, తేనె మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు .పాదాలను నానబెట్టిన తరువాత , ప్యూమిస్ స్టోన్ ను  ఉపయోగించడం వల్ల పాదాలను నునుపుగా మార్చవచ్చు. సాధారణమైన ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే చర్మసంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలాటి సమస్యలు ఎదురవుతాయి. మిగిలిన పాదాల చర్మాన్ని చేత్తో లాగడం చేయకూడదు. పాదాల సంరక్షణకు ఓపిక చాలా ముఖ్యం కాబట్టి మొదట్లో ఓపికగా పగుళ్లను నివరించుకుంటే.. ఆ తరువాత దాన్ని కాపాడుకోవడం సులువు అవుతుంది.                               ◆నిశ్శబ్ద.  

ముఖం మీద మచ్చలను వదిలించుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్‌ను ఎలా వాడాలంటే..!

ముఖం మీద మచ్చలను వదిలించుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్‌ను ఎలా వాడాలంటే..! మచ్చలు లేదా చాలా ఎక్కువగా ఉన్న టాన్  ముఖ  చర్మాన్ని  చాలా దెబ్బతీస్తాయి.  వికారంగా కనిపించేలా చేస్తాయి.  చాలామంది వీటిని తొలగించుకోవడానికి,  చర్మాన్ని క్లియర్ గా, అందంగా కనిపించం కోసం వివిధ రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు.  అయితే ఈ మధ్య  కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో  ఎక్కువగా  గ్లైకోలిక్ యాసిడ్  అనే పేరు వినబడుతోంది.  ముఖ చర్మం మీద ఉండే  అతి చిన్న రంధ్రాలను కూడా లోతుగా శుభ్రపరిచే లక్షణం ఉండటం వల్ల ఇది చర్మం మీద మచ్చలు,  చాలా ఎక్కువగా ఉండే టాన్ వంటివి కూడా సులువుగా తొలగిస్తుంది. అసలు గ్లైకోలిక్ యాసిడ్ అంటే ఏంటి? దీన్నెలా వాడాలి? దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. గ్లైకోలిక్ ఆమ్లం.. గ్లైకోలిక్ ఆమ్లం చెరకు నుండి తీసుకోబడిన ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం (AHA). చాలా చిన్న అణులుసు కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం  చిన్న. ఇవి చర్మం పై పొరలలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.  తాజాగా, ప్రకాశవంతంగా ఉన్న  చర్మాన్ని తిరిగి ఇవ్వడంలో చాలా సహాయపడుతుంది.  అందుకే ఇది పిగ్మెంటేషన్, టానింగ్,  మొటిమల గుర్తులను తగ్గించడంలో చాలా ప్రబావవంతమైన పదార్థంగా పరిగణించబడుతోంది. మచ్చలకు గ్లైకోలిక్ యాసిడ్.. నల్లటి మచ్చలు, ఎండ కారణంగా చర్మం రంగు మారడం, వయసు పెరిగే కొద్ది వచ్చే  మచ్చలు లేదా మొటిమల గుర్తులు అన్నీ మెలనిన్ పేరుకుపోవడం వల్ల వస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్ చనిపోయిన చర్మాన్ని సున్నితంగా తొలగిస్తుంది.  మెలనిన్ పొరను తగ్గిస్తుంది. మచ్చలను కాంతివంతం చేస్తుంది. కొన్ని వారాల పాటు రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల  చర్మపు రంగు మొత్తం బాలెన్స్డ్ గా ఉంటుంది. ముఖ చర్మం మెరుస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ ఎలా వాడాలి? టోనర్‌గా.. 3% నుండి 7% వరకు బలం కలిగిన గ్లైకోలిక్ యాసిడ్ టోనర్లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కాటన్ ప్యాడ్ మీద కొంత టోనర్ తీసుకోవాలి.  ముఖం అంతా సున్నితంగా అప్లై చేయాలి. ఇది వాడటం మొదలుపెట్టిన రోజుల్లో వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి. ఇది  చర్మాన్ని ఎక్కువ చిరాకు  కలిగించకుండా మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. సీరం.. మచ్చలు లోతుగా ఉంటే 5% నుండి 10% గ్లైకోలిక్ ఆమ్లం కలిగిన సీరం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత  ముఖంపై 2-3 చుక్కలు అప్లై చేసుకోవాలి.  చర్మం పొడిబారకుండా ఉండటానికి దానిపై మాయిశ్చరైజర్ రాయాలి. ఈ సీరం కొంచెం బలంగా ఉంటుంది.  అందుకే మొదట్లో వారానికి 1-2 సార్లు మాత్రమే అప్లై చేసి క్రమంగా ఫ్రీక్వెన్సీని పెంచాలి.  పీల్.. 10% వరకు పీల్స్ ఇంట్లో వాడటానికి సేఫ్ గా ఉంటాయి. ముఖం మీద 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మృత చర్మాన్ని తొలగించి కొత్త మెరుపును ఇస్తుంది. జాగ్రత్తలు.. గ్లైకోలిక్ యాసిడ్ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్ అవసరం.  లేకుంటే సన్‌బర్న్,  పిగ్మెంటేషన్ పెరుగుతుంది.  చర్మం చాలా సున్నితంగా  ఉన్నవారు  ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే దీన్ని ముఖం మీద వాడాలి. మొదట్లో తక్కువ పవర్ ఉన్న గ్లైకోలిక్ యాసిడ్ ను వాడటం  మొదలుపెట్టాలి. ఆ తరువాత క్రమంగా దా బలంగా ఉన్నదాని వైపు వెళ్లాలి. అంతేకానీ మొదట్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి వాడకూడదు.                              *రూపశ్రీ.    

మెరిసే చర్మం కావాలా... ఈ పండ్లు తినండి చాలు..!

మెరిసే చర్మం కావాలా... ఈ పండ్లు తినండి చాలు..! అందంగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించే చర్మం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇదంతా కలగానే ఉంటుంది. చాలామంది ఇలా మెరిసే చర్మం కోసం బోలెడు ట్రీట్మెంట్లు,  మరింత ఖరీదైన చర్మ ఉత్పత్తులు వాడుతుంటారు.  కానీ ఇవన్నీ తాత్కాలికంగా చర్మాన్ని మెరిపిస్తాయి. అంతేకానీ వీటితో దీర్ఘకాలం మెరిసే చర్మం లభించదు.  అయితే అయితే చర్మం అందంగా,  ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలంటే కొన్ని పండ్లు తింటే చాలని అంటున్నారు వైద్యులు.  ఇంతకీ చర్మాన్ని మెరిచేలా చేసే పండ్లు ఏంటి? అసలు పండ్లు చర్మాన్ని మెరిపించడంలో ఎలా సహాయపడతాయి?  తెలుసుకుంటే.. చర్మాన్ని మెరిపించడంలో పండ్లు.. చర్మాన్ని మెరిపించడంలో పండ్లు అద్బుతంగా సహాయపడతాయని,  ఇది చాలా సీక్రెట్ మెథడ్ అని చర్మ సంరక్షణ నిపుణులు, వైద్యులు అంటున్నారు. పండ్లు తింటే చర్మం మృదువుగా,  ప్రకాశవంతంగా,  యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాదు.. కేవలం తినడానికే కాకుండా నేరుగా చర్మం పైన ఉపయోగించినా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. అరటిపండు.. అరటిపండు చర్మాన్ని లోపలి నుండి, వెలుపలి నుండి కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే ఎక్స్ఫోలియేషన్ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి.  మొటిమలను కూడా తగ్గిస్తాయి. నారింజ.. నారింజలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్లు, ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.  ఇది సహజ బ్లీచ్ గా పనిచేస్తుంది. మచ్చలు, గుర్తులను తొలగిస్తుంది. బొప్పాయి.. బొప్పాయి చర్మానికి చాలా అద్బుతంగా పనిచేస్తుంది.  చర్మం పై మృత కణాలను తొలగించి కొత్త కణాలు ఏర్పడటంలో సహాయపడుతుంది.  ఇది మెటిమలు, పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి,  సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని యువి కిరణాల నుండి రక్షిస్తాయి.  స్ట్రాబెర్రీ చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కిన్ కేర్ లో చాలా మంది స్ట్రాబెర్రీని ఎంచుకుంటారు. కీర దోస.. కీర దోసకాయ చర్మాన్ని హెడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తుంది.   ఇది చలువ గుణం కలిగి ఉండటం వల్ల వడదెబ్బ,  చికాకు తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుతుంది. కెవి.. కివిలో విటమిన్-సి, ఇ పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి.  ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.

జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఇవే..!

జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఇవే..! మందంగా, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టు సంబంధిత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి అయినా, హెయిర్ ట్రీట్మెంట్ గురించి చెప్పేటప్పుడు అయినా ఖచ్చితంగా ఈ విషయాలే పేర్కొంటూ ఉంటారు.  చాలా తొందరగా రిజల్ట్ ఉంటుందంటూ ఇచ్చే ప్రకటనలు,  ఖరీదైన ట్రీట్మెంట్లు,  ఖరీదైన హెయిర్ ఉత్పత్తులు.. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా,  వేగంగా, బలంగా పెరగడంలో సహాయపడతాయని చెప్పే మాటలు అస్సలు నిజం కాదు.  జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా,  పొడవుగా మందంగా పెరగాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటం ముఖ్యం. జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వల్లనే జుట్టు పలుచ బడటం,  జుట్టు రాలడం, జుట్టు తెలుపు రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.  అయితే జుట్టు కుదుళ్లు బలంగా ఉండటంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-బి7.. జుట్టు పెరుగుదలకు ప్రమోట్ అయ్యే విటమిన్లలో బయోటిన్ ప్రముఖమైనది. బయోటిన్ ఉత్పత్తులంటూ చాలా ఉత్పత్తులు  మార్కెట్లో వస్తుంటాయి. బయోటిన్  శరీరానికి కెరాటిన్ తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది  జుట్టును ఆరోగ్యంగా నిర్మించే ప్రోటీన్. ఇది తగినంతగా లేకపోతే జుట్టు కుదుళ్లు బలహీనంగా, పెళుసుగా మారి విరిగిపోవడం, రాలిపోవడం వంటివి  జరుగుతాయి.   విటమిన్-డి.. బలమైన ఎముకల కోసం విటమిన్ డి చాలా అవసరం.  కాని  జుట్టు కుదుళ్లు వాస్తవానికి విటమిన్ డి గ్రాహకాలతో నిండి ఉంటాయట. విటమిన్-డి లోపం  ఉన్నప్పుడు   జుట్టు పెరుగుదల మందగిస్తుందట. కొన్ని అధ్యయనాలు విటమిన్ డి లోపం వల్ల  అలోపేసియా అరేటా వంటి సమస్యలకు కూడా కారణం అవుతుందట . ఐరన్.. ఐరన్  జుట్టుకు విద్యుత్ సరఫరా లాంటిదని చెబుతారు. తగినంత ఐరవ్ లేకపోతే జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్  సరఫరా కష్టమవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా,  జుట్టు పలుచగా మారుతుంది. ఐరన్   లోపం వల్ల  రక్తహీనత సమస్య  మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా  పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం. రక్తం ఎక్కువగా పోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఐరన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. జింక్.. జింక్ దెబ్బతిన్న జుట్టు కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.  జుట్టు కుదుళ్ల చుట్టూ ఉన్న నూనె గ్రంథులు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. జింక్ లోపం వల్ల  జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండటం వంటివి జరుగుతాయి. విటమిన్-ఇ.. విటమిన్ ఇ గొప్ప యాంటీఆక్సిడెంట్.  ఇది తల చర్మాన్ని, జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.  బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర,  అవోకాడోలలో విటమిన్-ఇ ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్.. జుట్టు పొడిగా, పెళుసుగా ఉంటే అది ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల లోపమే. ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు  పోషణ ఇస్తాయి.  జుట్టును హైడ్రేట్ గా ఉంచుతాయి.   విటమిన్-ఎ.. విటమిన్ ఎ   నెత్తిమీద చర్మ గ్రంథులలో ఉండే  సహజ కండీషనర్ అయిన సెబమ్ తయారీకి సహాయపడుతుంది. ఇది లోపిస్తే జుట్టు పొడిబారడం, దురద,  జుట్టు పెరుగుదల మందగించడం వవంటివి ఎదురవుతాయి. అయితే విటమిన్-ఎ ఎక్కువైతే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది.                               *రూపశ్రీ.