ఫేస్ ప్యాక్ Vsఫేస్ మాస్క్: రెండింటి మధ్య తేడాలు తెలుసా.. చర్మానికి ఏది మేలంటే!

ఫేస్ ప్యాక్ Vs ఫేస్ మాస్క్.. రెండింటి  మధ్య తేడాలు తెలుసా.. చర్మానికి ఏది మేలంటే! నేటికాలంలో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన,  ఆరోగ్యకరమైన చర్మాన్ని కోరుకుంటున్నారు. దీనికోసం రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. సాధారణంగా ఫేస్ మాస్క్ లు, ఫేస్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు. ఫేస్ మాస్క్‌లు,  ఫేస్ ప్యాక్‌లు రెండూ చర్మ సంరక్షణకు ప్రయోజనకరమైనవే,  అవి చేకూర్చే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ఉపయోగించినట్లయితే, రెండూ  చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా,  కాంతివంతంగా చేస్తాయి. కానీ చాలామంది ఈ రెండూ ఒకటే అని,  ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్ మధ్య తేడా ఏమీ లేదని అనుకుంటారు. అయితే అవి చేకూర్చే ప్రయోజనాలు, వాటిని  ఉపయోగించే విధానం  భిన్నంగా ఉంటుంది.   ఫేస్ ప్యాక్,  పేస్ మాస్క్ మద్య తేడాలు ఏంటి?  వీటిని ఎలా ఉపయోగించాలి? పూర్తీగా తెలుసుకుంటే.. పేస్ ప్యాక్.. ఫేస్ ప్యాక్‌లను సాధారణంగా సహజమైన లేదా ఇంట్లో తయారుచేసిన పదార్థాలతో తయారు చేస్తారు. ఫేస్ ప్యాక్‌ల ప్రధాన ఉద్దేశ్యం చర్మానికి పోషణనిచ్చి, నూనెను నియంత్రించడం. ఫేస్ ప్యాక్ లలో తరచుగా కింది పదార్థాలు ఉంటాయి. ముల్తానీ మట్టి శనగ పిండి పసుపు పెరుగు చందనం పొడి.. ఇవి మాత్రమే కాకుండా చర్మ రకాన్ని, చర్మానికి అవసరాన్ని బట్టి చాలా పదార్థాలు ఫేస్ ప్యాక్ లో ఉంటాయి. ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో ఫేస్ ప్యాక్ లు సహాయపడతాయి.  ఇవి చర్మం మీద అతిగా ఉత్పత్తి అయ్యే జిడ్డును నియంత్రిస్తాయి, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మానికి సహజమైన కాంతిని పెంచుతాయి. ఫేస్ మాస్క్ అంటే.. ఫేస్ మాస్క్‌లు సాధారణంగా మార్కెట్లో సులభంగా లభించే రెడీమేడ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు. నేటి కాలంలో ఇంట్లో కూడా ఫేస్ మాస్క్ లను తయారు చేసుకుని వాడుతున్నారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి.  వాటిలో కొన్న.. షీట్ మాస్క్ క్లే మాస్క్ జెల్ మాస్క్ పీల్-ఆఫ్ మాస్క్ ఫేస్ మాస్క్‌లు చర్మానికి తేమను అందించి, తక్షణ మెరుపును ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఫేస్ మాస్క్‌ల ప్రయోజనాలు.. చర్మానికి తక్షణమే తేమను అందించి ముఖ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. నిస్తేజంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి.  చర్మానికి విశ్రాంతినిస్తాయి.  అప్పటికప్పుడు చర్మం రిలాక్స్ కావాలన్నా,  వెంటనే చర్మానికి జీవం పోసినట్టు మెరుపు కావాలన్నా ఫేస్ మాస్క్ బాగా సహాయపడుతుంది. ఏది మంచిది? ఫేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ లలో చర్మానికి ఏది మంచిది అనే విషయం  చర్మ రకంపై ఆధారపడి ఉంటుంది.  జిడ్డు చర్మం అయితే, ఫేస్ ప్యాక్ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే  చర్మం పొడిగా ఉంటే, ఫేస్ మాస్క్ బాగుంటుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు రెండింటిని ఉపయోగించవచ్చు. చర్మ సంరక్షణ నిపుణుల సలహా.. వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్,  అప్పుడప్పుడు ఫేస్ మాస్క్ వాడితే,  చర్మం ఆరోగ్యంగా,  కాంతివంతంగా ఉంటుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.                                       *రూపశ్రీ.

చర్మానికి కాంతిని అందించే హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లు.. వేసవిలో తప్పక ట్రై చేయండి!

చర్మానికి కాంతిని అందించే హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లు.. వేసవిలో తప్పక ట్రై చేయండి! మారుతున్న వాతావరణం కారణంగా చర్మం చాలా ప్రభావితం అవుతుంది.  చర్మం డల్ గా మారడం, కాంతి కోల్పోవడం,  చర్మం కందిపోవడం,  చర్మం మీద టాన్ ఏర్పడటం వంటివి ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా జరుగుతాయి. అమ్మాయిలకు వేసవి అంటే చర్మానికి కఠిన పరీక్షలు పెట్టే కాలం. అయితే చర్మాన్ని  హైడ్రేటింగ్ గా ఉంచుకుంటే చర్మం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది. ఇందుకోసం హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ లు వాడాలి. చర్మాన్ని  హైడ్రేట్ గా ఉంచుతూ చర్మ కాంతిని మెరుగుపరిచే ఫేస్ మాస్క్ ల గురించి తెలుసుకుంటే.. తేనే,  పెరుగు మాస్క్.. తేనె సహజంగా తేమను లాక్ చేస్తుంది, ఇది గాలి నుండి తేమను గ్రహించి చర్మంలోకి పీల్చుకుంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ తేనెను రెండు టీస్పూన్ల పెరుగుతో కలపాలి. దీనిని  ముఖంపై 15-20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. కలబంద, దోసకాయ మాస్క్..  చర్మం ఎండకు కమిలిపోయినా లేదా బిగుసుకుపోయినట్లు అనిపించినా కలబంద,  దోసకాయ  మాస్క్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దోసకాయలో 95% నీరు ఉంటుంది, ఇది చర్మాన్ని తక్షణమే తేమగా ఉంచుతుంది. దోసకాయ రసం లేదా తురిమిన దోసకాయను తాజా కలబంద జెల్‌తో కలపాలి. దీనిని  ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ మాస్క్ తేమను అందించడమే కాకుండా, చర్మపు చికాకును కూడా తగ్గిస్తుంది. అరటి పండు, ఆలివ్ నూనె మాస్క్.. అరటిపండ్లలో విటమిన్ సి,  బి6 పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మం  స్థితిస్థాపకతను కాపాడతాయి. ఆలివ్ నూనె తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, అర టీస్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖానికి,  మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మం మీద ముడుతలు రాకుండా అడ్డుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయి, పాలు మాస్క్.. బొప్పాయిలో చర్మాన్ని కాంతివంతం చేసే పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అలాగే పచ్చి పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్,  మాయిశ్చరైజర్. కొన్ని బొప్పాయి ముక్కలను పేస్ట్‌లా చేసి, దానికి 2 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. దీనిని  ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ మాస్క్ టానింగ్‌ను తొలగించి, చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓట్స్, పాలమీగడ మాస్క్.. ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, పాల మీగడలోని  కొవ్వులు పొడి చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. పొడి చేసిన ఓట్స్‌ను కొద్దిగా పాల మీగడతో కలపాలి. దీనిని స్క్రబ్‌లాగా అప్లై చేసి, సున్నితంగా రుద్దాలి.  10 నిమిషాల తర్వాత కడిగేయాలి.                            *రూపశ్రీ.

చెమట వల్ల చర్మం జిగటగా మారుతోందా.. ఈ టిప్స్ ట్రై చేయండి!

చెమట వల్ల చర్మం జిగటగా మారుతోందా.. ఈ టిప్స్ ట్రై చేయండి! వేసవి కాలంలో చెమటలు పట్టడం సాధారణం. చాలా మంది చెమట వల్ల జిగట, జిడ్డు, మొటిమలు వంటి  సమస్యలను ఎదుర్కొంటారు. చెమట వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి, చర్మం నిస్తేజంగా,  అసౌకర్యంగా మారుతుంది.  ఇలాంటి  ఇబ్బందులు ఉన్నప్పుడు సరైన చర్మ సంరక్షణను ప్రతి రోజూ పాటిస్తుంటే ఈ సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. వేసవిలో  చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడే కొన్ని డైలీ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయి.  ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, వేసవిలో కూడా  చర్మం తాజాగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. ఫేస్ వాష్.. వేసవిలో ముఖం మీద దుమ్ము, చెమట,  నూనె పేరుకుపోతాయి. అందువల్ల, రోజుకు కనీసం రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇది చర్మాన్ని శుభ్రంగా,  తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. టోనర్.. టోనర్ చర్మ రంధ్రాలను బిగించి, అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోజ్ వాటర్ లేదా తేలికపాటి టోనర్‌ను ఉపయోగించవచ్చు. మాయిశ్చరైజర్.. చాలా మంది వేసవిలో మాయిశ్చరైజర్ వాడటం మానేస్తారు, కానీ ఇది సరైనది కాదు.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఆయిల్ ఫ్రీ లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ వాడటం మంచిది. సన్ స్క్రీన్.. వేసవిలో తీవ్రమైన ఎండ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి, బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖ్యం. ఇది టానింగ్,  స్కిన్ డ్యామేజ్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఫేస్ కూలింగ్..  చర్మం ముఖ్యంగా జిగటగా అనిపిస్తే,   ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవచ్చు.  ఐస్ క్యూబ్ తో సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఇది ఉపశమనం కలిగిస్తుంది. మంచినీరు.. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి  శరీరాన్ని లోపల నుండి హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యం. దీని కోసం, పుష్కలంగా నీరు త్రాగాలి, తాజా పండ్లు,  కూరగాయలు తినాలి.   వేయించిన ఆహారాన్ని తక్కువ తినాలి.                              *రూపశ్రీ.

నక్షత్రం లాంటి మెరుపు మీ చర్మం సొంతం కావాలా.. ఈ ఒక్క పండుతో సాధ్యమే!

నక్షత్రం లాంటి మెరుపు మీ చర్మం సొంతం కావాలా.. ఈ ఒక్క పండుతో సాధ్యమే! పరిచయం: ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి వల్ల మన చర్మం తన సహజమైన మెరుపును కోల్పోతోంది. ముఖ్యంగా చర్మం పొడిబారిపోవడం (Dry Skin), కళ్ళల్లో మంటలు వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే, వీటన్నిటికీ ప్రకృతిలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే 'స్టార్ ఫ్రూట్' (Star Fruit). దీనిని తెలుగులో 'కమరక్' అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దపు గొప్ప యునాని వైద్యుడు హకీం ఇబ్నే రష్ ఈ పండు యొక్క ప్రాముఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఆయుర్వేద, యునాని వైద్యంలో ఎంతో విశిష్టత ఉన్న ఈ పండు మీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఈ Video Link క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) స్టార్ ఫ్రూట్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఇది ఒక పోషకాల గని. చర్మ సౌందర్యం: ఈ పండులో 90% నీరు ఉంటుంది. ఎవరికైతే బాడీలో డ్రైనెస్ ఎక్కువగా ఉండి, చర్మం పొడిబారిపోతుందో, వారికి ఇది ఒక వరం లాంటిది. రోగనిరోధక శక్తి: ప్రతి 100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో 34.4 మి.గ్రా వైటమిన్ సి ఉంటుంది. అంటే మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే వైటమిన్ సి లో సగానికి పైగా (52%) ఈ ఒక్క పండు ద్వారానే అందుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడేవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యం & బిపి నియంత్రణ: ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, హై బిపి (High BP) ని అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం శరీరంలో జరిగే 300 కంటే ఎక్కువ రసాయన చర్యల్లో పాల్గొని మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఏం చేయకూడదు? (What Not To Do?) ఏదైనా సరే అతిగా తింటే అనర్థమే. స్టార్ ఫ్రూట్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి: అతిగా తినవద్దు: ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని బుట్టలు బుట్టలు తినేయకూడదు. పరిమితంగా తీసుకున్నప్పుడే పూర్తి ఫలితాలు అందుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు: ఎవరికైతే కిడ్నీ వ్యాధులు ఉంటాయో లేదా కిడ్నీ పనితీరు తక్కువగా ఉంటుందో, వారు ఈ పండును చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి లేదా వైద్యుల సలహా తీసుకోవాలి. పచ్చివి/పుల్లని పండ్లు: పూర్తిగా పండని, చాలా పుల్లగా ఉన్న స్టార్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అజీర్తి (Indigestion) సమస్యలు రావచ్చు. ఎలా తీసుకోవాలి? (How To Use?) స్టార్ ఫ్రూట్‌ను వివిధ రకాలుగా మీ డైట్‌లో చేర్చుకోవచ్చు: నేరుగా స్లైసెస్ లాగా: పండును శుభ్రంగా కడిగి, నక్షత్రం ఆకారంలో ముక్కలుగా కోసి సలాడ్లలో వాడుకోవచ్చు. జ్యూస్ రూపంలో: దీనిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పుడ్డింగ్స్ & స్వీట్స్: వివిధ రకాల తీపి పదార్థాలు లేదా ఫ్రూట్ సలాడ్లలో దీనిని ఒక భాగంగా చేసుకోవచ్చు. ముగింపు: స్టార్ ఫ్రూట్ అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన సీజనల్ ఫ్రూట్. ముఖ్యంగా శీతాకాలం మరియు వేసవి కాలం ప్రారంభంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి, ఇవి దొరికినప్పుడు అస్సలు వదులుకోకండి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ 'నక్షత్ర ఫలం'ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: స్టార్ ఫ్రూట్‌లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి?  జ: ప్రతి 100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో కేవలం 31 నుండి 38 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి, కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిది. ప్ర: దీనికి ఇతర పేర్లు ఏమిటి?  జ: దీనిని కమరక్, కర్మాల్, చైనీస్ గూస్‌బెర్రీ, ఫైవ్ ఫింగర్ ఫ్రూట్ మరియు బాలింబింగ్ అని కూడా పిలుస్తారు. ప్ర: ఇది ఎక్కడ ఎక్కువగా పండుతుంది?  జ: ఇది ప్రధానంగా ఆగ్నేయాసియా (South East Asia) ప్రాంతానికి చెందినది. మలేషియా, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

ఈ ఇంటి చిట్కాలు వాడితే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి!

ఈ ఇంటి  చిట్కాలు వాడితే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి..!  ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా మార్చేవి పెదవులు.  అయితే చాలామందికి పెదవులు నల్లగా ఉండటం గమనిస్తూ ఉంటాం. పెదవులు నల్లగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి.  ఫిన్ తీసుకోవడం, ధూమపానం, డీహైడ్రేషన్, ఎండకు గురికావడం, రసాయనాలతో కూడిన లిప్ స్టిక్ లు అన్నీ పెదవులు నల్లబడటానికి కారణమవుతాయి. చాలామంది పెదవులు నల్లధనం పోవాలని,  పెదవులు గులాబీ రంగులోకి మారాలని ఖరీదైన  లిప్ బామ్ లు వాడుతుంటారు. కానీ ఈ ఖరీదైన లిప్ బామ్ లతో  పోలిస్తే, ఇంటి చిట్కాలు చాలా సేఫ్ అని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  పెదవులను సహజంగా గులాబీ రంగులోకి మార్చే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. పెదవులను గులాబీ రంగులోకి మార్చే ఇంటి చిట్కాలు.. తేనె, నిమ్మకాయ.. తేనె పెదవులను తేమగా ఉంచుతుంది,హైడ్రేట్ చేస్తుంది, అయితే నిమ్మకాయలోని సహజ బ్లీచింగ్ లక్షణాలు పెదవుల నల్లదనాన్ని తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ తేనెను కొన్ని చుక్కల నిమ్మరసంతో కలిపి  పెదవులకు అప్లై చేసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. గులాబీ రేకులు.. గులాబీ రేకులు  పెదవులకు సహజమైన గులాబీ రంగును తెస్తాయి. దీని కోసం, గులాబీ రేకులను పాలలో కాసేపు నానబెట్టి, పేస్ట్ లా చేసి,  పెదవులకు అప్లై చేయాలి. మారు 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయాలి. చక్కెర,ఆలివ్ ఆయిల్ స్క్రైబ్..  డెడ్ స్కిన్ తరచుగా పెదాలను నిస్తేజంగా, ల్లగా కనిపించేలా చేస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను ఒక టీస్పూన్ చక్కెరతో కలిపి స్క్రబ్ తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని  పెదవులపై రెండు నుండి మూడు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి బీట్‌రూట్ రసం.. బీట్ రూట్  దుంపలలో ఉండే సహజ ఎరుపు వర్ణద్రవ్యం  పెదాలను ప్రకాశవంతం చేయడానికి ఒక సులభమైన,ప్రభావవంతమైన మార్గం. పడుకునే ముందు బీట్‌రూట్ రసాన్ని పెదవులకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే కడిగేయాలి. కలబంద జెల్.. కలబంద జెల్ హైడ్రేట్ చేయడంలో,  చర్మాన్ని ట్రీట్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్. తాజా కలబంద జెల్‌ను  పెదవులకు అప్లై చేసి దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచాలి. కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె పెదవులకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది . పడుకునే ముందు పెదవులకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె పొడిబారకుండా చేస్తుంది,పెదవులను సహజంగా మృదువుగా, గులాబీ రంగులో ఉంచుతుంది. దీనిని పగటిపూట నాచురల్  లిప్ బామ్ గా కూడా ఉపయోగించవచ్చు. పసుపు, పాలు .. పసుపు చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే పాలు పెదవులకు పోషణనిస్తాయి. చిటికెడు పసుపును కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దానిని  పెదవులపై 5 నిమిషాలు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి.  తర్వాత శుభ్రం చేసుకోవాలి.                              *రూపశ్రీ.

జుట్టు పెరుగుదల తగ్గిపోయిందా.. పెరుగుతో ఇలా ట్రై చేయండి!

జుట్టు పెరుగుదల తగ్గిపోయిందా? పెరుగుతో ఇలా ట్రై చేయండి..! జుట్టు మనిషి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.  అయితే జుట్టు అందంగా,  బలంగా ఉంటే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.  నేటి కాలంలో జుట్టు ఆరోగ్యం కోసం అమ్మాయిలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అవంతా కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. కొందరిలో ఎన్నాళ్లు గడిచినా జుట్టు పెరుగుదలలో పెద్దగా మార్పు ఉండదు.  జుట్టు పెరుగుదల మందగించినది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అయితే జుట్టు తగ్గిపోయిన జుట్టు పెరుగుదలను తిరిగి వేగంగా మార్చగల చిట్కాలు ఉన్నాయి.  ఇందుకోసం పెరుగు బాగా సహాయపడుతుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్లు,  విటమిన్లు జుట్టు మూలాలను పోషిస్తాయి. ఇది నెత్తిమీద చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలు,  మలినాలను తొలగిస్తుంది. కాబట్టి జుట్టు రాలడం లేదా జుట్టు పెరుగుదల మందగించడంతో ఇబ్బంది పడేవారు పెరుగుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగల హెయిర్ మాస్క్ లను ప్రయత్నించవచ్చు.  ఆ హెయిర్ మాస్క్ లు ఏంటో,  అవి ఎలా తయారు చేసుకుని వాడాలో.. తెలుసుకుంటే.. పెరుగు, కరివేపాకు మాస్క్.. కరివేపాకులో బీటా-కెరోటిన్,  ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి . ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి అర కప్పు పెరుగులో కరివేపాకు పొడి లేదా కరివేపాకు పేస్ట్ ను కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.   పెరుగు, తేనె, నిమ్మకాయ.. చుండ్రు ఉంటే అది జుట్టు పెరుగుదలను నియంత్రిస్తుంది.  జుట్టు పెరగకుండా చేస్తుంది.  అలాంటి వారికి పెరుగు, తేనె, నిమ్మకాయ మాస్క్ బాగా సహాయపడుతుంది. నిమ్మకాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు,  తేనెలోని తేమ జుట్టును సిల్కీగా ఉంచుతాయి. ఒక టీస్పూన్ తేనె,  సగం నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నె పెరుగులో కలపాలి. దీన్ని  జుట్టు మూలాలకు అప్లై చేసిస కనీసం  20 నిమిషాలు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది నెత్తి యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. పెరుగు, గుడ్డు మాస్క్.. జుట్టు ప్రధానంగా కెరాటిన్‌తో తయారవుతుంది. గుడ్డు,  పెరుగు కలిపితే  జుట్టుకు శక్తివంతమైన ప్రోటీన్ బూస్ట్ లభిస్తుంది. ఈ మాస్క్ సిద్ధం చేయడానికి, ఒక గుడ్డును కొట్టి 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు జోడించాలి. దీన్ని  మొత్తం జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిని వాడటం మానుకోవాలి. ఎందుకంటే వేడి నీరు తగిలితే గుడ్డు గట్టిపడి జుట్టుకు అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఈ మాస్క్  జుట్టును మందంగా చేస్తుంది. పెరుగు, మెంతి గింజలు.. మెంతుల్లో నికోటినిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. ఈ పేస్ట్ తయారు చేయడానికి, రాత్రిపూట నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా పేస్ట్ చేసి పెరుగుతో కలపాలి. దీన్ని తలకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి, 45 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.  ఇది జుట్టును కుదుళ్ల  నుండి బలపరుస్తుంది. పెరుగు, కలబంద.. పొడిబారిన,  నిర్జీవమైన జుట్టు ఉంటే జుట్టు పెరుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. . కలబందను పెరుగుతో కలిపి, తలకు అప్లై చేస్తే అది తలకు తేమను అందిస్తుంది . దీన్ని తయారు చేయడానికి తాజా కలబంద జెల్‌ను పెరుగుతో సమాన మొత్తంలో కలపాలి.  జుట్టు పొడవు,  మూలాలకు అప్లై చేయాలి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చిక్కులను తగ్గిస్తుంది, జుట్టు విరిగిపోకుండా చేస్తుంది. ఇవి గుర్తుంచుకోండి.. తాజా పెరుగు..   ఎల్లప్పుడూ తాజా పెరుగును,  అందులోనూ సాదా పెరుగును వాడాలి. క్రమబద్దంగా..   ఉత్తమ ఫలితాల కోసం, ఈ మాస్క్‌లలో దేనినైనా కనీసం వారానికి ఒకసారి అప్లై చేయాలి. ప్యాచ్ టెస్ట్   మీ చర్మం సున్నితంగా ఉంటే, ఉపయోగించే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.                                  *రూపశ్రీ.

మీ అందమైన కురులు మీ ఆత్మవిశ్వాసం.. జుట్టు సమస్యలకు ఇంటి వద్దే పరిష్కారాలు!

మీ అందమైన కురులు మీ ఆత్మవిశ్వాసం.. జుట్టు సమస్యలకు ఇంటి వద్దే పరిష్కారాలు! పరిచయం (Intro): జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు అందానికి ప్రతిరూపం. అద్దంలో చూసుకున్నప్పుడు రాలిపోతున్న జుట్టును చూసి కంగారు పడని వారు ఉండరు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో చెమట, దురద, మరియు జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు మనల్ని మానసిక వేదనకు గురిచేస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే చింతించకండి. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సునైన గారు సూచించిన శాస్త్రీయమైన మరియు సులభమైన పద్ధతులతో మీ జుట్టును ఎలా కాపాడుకోవాలో ఈ Video Link క్లిక్ చేసి  తెలుసుకోండి. జుట్టు సంరక్షణ ఎందుకు ముఖ్యం? (Why should we?) మన శరీరం వలెనే, జుట్టు కూడా వాతావరణ మార్పులకు ప్రతిస్పందిస్తుంది. సీజనల్ హెయిర్ ఫాల్: వేసవిలో శరీర ఉష్ణోగ్రత మరియు చెమట వల్ల జుట్టు రాలడం (Cyclical shedding) సహజంగా జరుగుతుంది. స్కాల్ప్ ఆరోగ్యం: జుట్టు పెరగడానికి మూలం మీ స్కాల్ప్ (మాడు). అది శుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లు మరియు కురుపులు వచ్చే అవకాశం ఉంది. రక్షణ: బయట తిరిగేటప్పుడు ధూళి, ఎండ ప్రభావం నుండి జుట్టును కాపాడుకోవడం దాని దృఢత్వానికి చాలా అవసరం. అస్సలు చేయకూడని పనులు (What NOT to do!) మనం చేసే చిన్న చిన్న తప్పులే జుట్టుకు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి: బట్టలు ఉతికినట్లు జుట్టును రుద్దకండి: చాలా మంది షాంపూ పెట్టేటప్పుడు జుట్టును గట్టిగా పిండుతారు లేదా రుద్దుతారు. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. స్నేహితుల సలహాలు వద్దు: మీ స్నేహితులకు సెట్ అయిన క్రీమ్ లేదా సీరమ్ మీకు సెట్ అవ్వాలని లేదు. డాక్టర్ సలహా లేకుండా ఖరీదైన ప్రొడక్ట్స్ వాడకండి. తడి జుట్టుతో జాగ్రత్త: స్నానం చేసిన తర్వాత జుట్టును అలాగే వదిలేయకండి. తడి వల్ల జుట్టు వాచి (swell), చిట్లిపోయే అవకాశం ఉంది. అతిగా దువ్వడం: డ్రైగా ఉన్నప్పుడు జుట్టును అతిగా దువ్వడం వల్ల ఫ్రిజీ (frizzy) గా మారుతుంది. సరైన పద్ధతిలో జుట్టును కాపాడుకోవడం ఎలా? (How to?) డాక్టర్లు సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి: షాంపూ అప్లికేషన్: షాంపూ కేవలం స్కాల్ప్ (మాడు) క్లీన్ చేయడానికి మాత్రమే. జుట్టు చివరల వరకు షాంపూ రుద్దాల్సిన అవసరం లేదు, నీటితో కడిగితే సరిపోతుంది. కండిషనర్ వాడకం: షాంపూ తర్వాత కండిషనర్ లేదా లీవ్-ఇన్ కండిషనర్ వాడటం వల్ల జుట్టు సిల్కీగా ఉంటుంది మరియు చిక్కు పడదు. వేసవి రక్షణ: ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించండి. అలాగే సాటిన్ (Satin) పిల్లో కవర్లపై పడుకోవడం వల్ల జుట్టు రాపిడికి గురికాకుండా ఉంటుంది. సహజ పద్ధతులు: ఒకవేళ మీరు కుంకుడుకాయలు లేదా శీకాకాయ వాడుతుంటే, వాటి వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉండటానికి ముందుగా ఆయిల్ పెట్టుకోవడం లేదా తర్వాత కండిషనర్ వాడటం మర్చిపోవద్దు. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం పెరుగుతుందా?  జ: అవును, వేసవిలో 'సైక్లికల్ షెడ్డింగ్' వల్ల జుట్టు కొంచెం ఎక్కువగా రాలవచ్చు. ఇది సహజం, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది. ప్ర: పెయిన్లు (Lice) పోవాలంటే ఏం చేయాలి?  జ: పర్మెత్రిన్ (Permethrin) ఉన్న షాంపూలు వాడాలి. కానీ ఒక్కసారి వాడితే సరిపోదు, పెయిన్ల గుడ్లు (ఈదులు) చావవు కాబట్టి సరిగ్గా 7 రోజుల తర్వాత మళ్ళీ వాడాలి. ప్ర: హెయిర్ స్పా చేయించుకోవడం మంచిదేనా?  జ: హెయిర్ స్పా అనేది తాత్కాలికంగా జుట్టుకు నునుపుదనాన్ని ఇస్తుంది. ఇది ఒక డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ మాత్రమే, దీనివల్ల జుట్టు రాలడం తగ్గదు. మరిన్ని ఆసక్తికరమైన మరిన్ని చిట్కాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

నెయ్యి లేదా కొబ్బరి నూనె చిన్న పిల్లల బాడీ మసాజ్ కు ఏది మంచిది!

నెయ్యి లేదా కొబ్బరి నూనె చిన్న పిల్లల బాడీ మసాజ్ కు ఏది మంచిది! చిన్న పిల్లలకు శరీరం  మసాజ్ చేయడం వారి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో మసాజ్ వారి చర్మానికి మాత్రమే కాకుండా వారి శరీరానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతుంది. భారతదేశంలో చిన్నపిల్లల నుండి పెద్ద వారి వరకు శరీరానికి నూనె లేదా వేరే పదార్థంతో మసాజ్ చేయడం  అనేది పురాతన సంప్రదాయం. ఇది పిల్లలకు పోషణను, అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే  చిన్న పిల్లల శరీరం మసాజ్ కోసం సరైన నూనెను ఎంచుకోవడం వల్ల  ఎముకలు, కండరాలు,  మొత్తం ఆరోగ్యం సురక్షితంగా ఉండటంలో సహాయపడుతుంది. సాధారణంగా చాలామంది కొబ్బరి నూనె లేదా నెయ్యిని బేబీ మసాజ్ కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటిలో ఏది మంచిది? ఆయుర్వేదం దేన్ని సిఫారసు చేస్తుంది? తెలుసుకుంటే.. నెయ్యితో మసాజ్.. లాభాలు.. నెయ్యిని మసాజ్ కోసం  వాడటాన్ని ఆయుర్వేదం చాలా ప్రయోజనకరమైనదిగా చెబుతుంది. నెయ్యిలో సహజ కొవ్వులు,  విటమిన్లు A, D, E,  K ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. చిన్న పిల్లలకు పొడి చర్మం ఎక్కువ ఉంటుంది.  ఇందుకోసం నెయ్యి  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో నెయ్యితో మసాజ్ చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇది చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.  ఆయుర్వేదం ప్రకారం, పిల్లల శరీరాన్ని నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఎముకలు,  కండరాలు బలపడతాయి. పిల్లల శరీరాన్ని నెయ్యితో మసాజ్ చేయడం చర్మం  సహజ మెరుపు పెరుగుతుంది, పొడిబారడం తగ్గుతుంది. నష్టాలు.. చిన్నపిల్లల శరీరాలను మసాజ్ చేయడానికి నెయ్యిని ఉపయోగించడం మంచిదే అయినప్పటికీ.. దీంతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వేసవిలో పిల్లల శరీరాన్ని మసాజ్ చేయడానికి నెయ్యిని ఉపయోగించడం భారంగా పరిగణించబడుతుంది. కొంతమంది పిల్లలకు జిడ్డు చర్మం లేదా అలెర్జీ స్కిన్ కూడా ఉండవచ్చు.  ఇలాంటి వారికి  నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.   నెయ్యి స్వచ్ఛమైనది కాకపోతే, ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. కొబ్బరి నూనెను మసాజ్ కోసం వాడితే.. కొబ్బరి నూనె చిన్న పిల్లల శరీరాన్ని మసాజ్ చేయడానికి ప్రయోజనకరంగా,  సురక్షితంగా పరిగణించబడుతుంది. కొబ్బరి నూనె తేలికగా ఉంటుంది.   చర్మంలోకి సులభంగా శోషించబడుతుంది. అందువల్ల దీన్ని మసాజ్ కోసం వాడటం సులభం. ఇది  పిల్లలకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించదు. కొబ్బరి నూనె చల్లదనాన్ని  కూలింగ్ ఇస్తుందని, చర్మాన్ని కూల్ చేస్తుందని చెబుతారు. ఇది వేడి వాతావరణంలో పిల్లల చర్మానికి మరింత అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె సహజ యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి చర్మాన్ని రక్షించడంలో  సహాయం చేస్తుంది. పిల్లలకు సున్నితమైన చర్మం లేదా అలెర్జీలు ఉంటే, కొబ్బరి నూనె చాలా మంచి ఎంపిక. నష్టాలు.. కొబ్బరి నూనె పిల్లల చర్మానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి కూలింగ్ ఇస్తుంది. కాబట్టి శీతాకాలంలో  పిల్లల శరీరానికి సరైన వెచ్చదనాన్ని ఇవ్వదు. చాలా చల్లని వాతావరణంలో చర్మానికి సరైన తేమ లభించదు. ఏది మంచిదంటే.. నెయ్యి,  కొబ్బరి నూనె రెండూ పిల్లల శరీర మసాజ్‌కు సురక్షితమైనవి,  ప్రయోజనకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే చలి కాలంలో పిల్లల చర్మానికి నెయ్యి బాగుంటుంది. ఎందుకంటే ఇది చర్మాన్ని లోతుగా పోషిస్తుంది,  వెచ్చగా ఉంచుతుంది. కొబ్బరి నూనె వేసవిలో పిల్లల చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తేలికగా ఉంటుంది,  శరీరాన్ని చల్లబరుస్తుంది.                                     *రూపశ్రీ.

హోలీ రంగులతో అమ్మాయిలు మీ అందం జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

హోలీ రంగులతో అమ్మాయిలు మీ అందం జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..! హోలీ అంటే రంగుల పండుగ.  ఒకరికి ఒకరు రంగులు చల్లుకోవడంలోనే హోలీ ఆనందం దాగి ఉంటుంది. అయితే రంగులు ఎంత సహజమైనవి అయినా అవి చర్మం మీద, జుట్టు మీద పడ్డాక ఎంతో కొంత హాని చేయకుండా ఉండవు. ఇక కృత్రిమ రంగులు అయితే ఈ హాని మరీ ఎక్కువ ఉంటుంది.  హోలీ తర్వాత, చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారడం, మొటిమలు, జుట్టు రాలడం,  చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే హోలీ తర్వాత కూడా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. హోలీకి ముందు.. హోలీ ఆడటానికి కనీసం 20-30 నిమిషాల ముందు ముఖం,  శరీరంపై మాయిశ్చరైజర్‌ను పూర్తిగా రాసుకోవాలి. కొబ్బరి నూనె, బాదం నూనె,  ఆలివ్ నూనె లేదా  హెవీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పూసుకోవాలి. నూనె లేదా క్రీమ్ చర్మంపై ఒక ప్రొటెక్షన్ లేయర్ ను సృష్టిస్తుంది. రంగులు నేరుగా చర్మంలోకి చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది. హోలీని ఎక్కువగా ఎండలో ఆడతారు కాబట్టి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోకూడదు. మేకప్.. భారీ మేకప్ వాడటం మానుకోవాలి. ఫౌండేషన్,  పౌడర్, రంగులతో పాటు, చర్మ రంధ్రాలు  మూసుకుపోయేలా చేస్తాయి. తేలికపాటి లిప్ బామ్,  వాటర్ ప్రూఫ్ కాజల్ అప్లై చేసుకోవచ్చు, కానీ చర్మానికి, చర్మ రంధ్రాలకు గాలి ప్రసరణ జరిగేలా ఉండాలి. జుట్టుకు.. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. రంగులు వేసే ముందు కొబ్బరి నూనె, ఆవాల నూనె లేదా ఆర్గాన్ నూనె రాయవచ్చు. ఈ నూనె జుట్టు కుదుళ్లను కప్పి, రంగు చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే రంగులు వేసే ముందు  జుట్టును వదులుగా ఉంచకుండా జాగ్రత్త పడాలి. జడ లేదా బన్స్ వేసుకుంటే బెటర్. స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మరింత మంచిది. తడి జుట్టు వద్దు.. తడి జుట్టు ఎక్కువ రంగును గ్రహిస్తుంది. అందుకే హోలీ ఆడే  ముందు జుట్టు పొడిగా ఉంచుకోవడం,   జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది. హోలీ తర్వాత.. హోలీ తర్వాత వెంటనే స్క్రబ్ లేదా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సబ్బును ఉపయోగించకూడదు. ముందుగా సాధారణ నీటితో రంగును తొలగించుకోవాలి.  తరువాత తేలికపాటి క్లెన్సర్ తో కడగాలి.  అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేయాలి. జుట్టు కోసం.. తేలికపాటి షాంపూతో జుట్టు కడగాలి, తరువాత డీప్ కండిషనర్ అప్లై చేయాలి.  హోలీ రంగుల నుండి క్లీన్ అవ్వాలనే ఉద్దేశంతో  రోజుకు 2-3 సార్లు షాంపూ చేయకూడదు. దీనివల్ల జుట్టు మరింత పొడిగా మారుతుంది. చర్మంపై దద్దుర్లు ఉంటే.. హోలీ రంగుల వల్ల చర్మం పై దద్దుర్లు ఉంటే చల్లటి నీటితో కడగాలి.  కాలమైన్ లోషన్ రాయాలి. అవసరమైతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. దురదగా ఉంటే రుద్దకూడదు.. లేకుంటే చర్మం దెబ్బతింటుంది.                             *రూపశ్రీ.

అద్బుతమైన ఫేస్ మాస్క్.. రాత్రి దీన్ని అప్లై చేస్తే మ్యాజిక్కే!

అద్బుతమైన ఫేస్ మాస్క్.. రాత్రి దీన్ని అప్లై చేస్తే మ్యాజిక్కే..! ముఖం అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.  ముఖ్యంగా ఏవైనా పార్టీలు, ఈవెంట్లు, పండుగల ముందు స్కిన్ కేర్ గురించి చాలా ఆలోచిస్తారు.  అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేస్ ప్యాక్ వంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ తో అద్బుతమైన రిజెల్ట్ పొందవచ్చు.  ముఖానికి రాత్రిపూట సహజమైన మెరుపు తీసుకురావాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వంటగదిలో లభించే కొన్ని సులభమైన,  సహజ పదార్థాలతో తయారు చేయబడిన  ఫేస్ మాస్క్  చర్మాన్ని పోషించడంలో, చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో,  తొందరగా ఫలితాన్ని ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. ఆ ఫేస్ ప్యాక్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ శనగ పిండి 1 టీస్పూన్ పెరుగు  1 టీస్పూన్ తేనె  నిమ్మరసం 2-3 చుక్కలు  చిటికెడు పసుపు తయారీ విధానం.. ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకోవాలి. అందులో శనగపిండి, పెరుగు, తేనె కలపాలి. ఇప్పుడు దానికి నిమ్మరసం,  పసుపు కలపాలి.  అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఉపయోగించే విధానం.. ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుని తేలికగా తుడవాలి.  ఇప్పుడు తయారుచేసుకున్న పేస్ట్ ను ముఖం, మెడ అంతటా సమానంగా అప్లై చేయాలి. 15 -20 నిమిషాలు ఆరనివ్వండి. వృత్తాకారంగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఫేస్ మాస్క్ వేసిన తర్వాత.. ముఖం కడుక్కున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాయాలి.  పగటిపూట బయటకు వెళ్ళవలసి వస్తే, సన్‌స్క్రీన్ రాసుకోవడం మరచిపోకూడదు.   ముఖం కడుక్కున్న తర్వాత ముఖాన్ని రుద్దకూడదు టవల్ తో మెల్లగా తుడవాలి. ఒకేసారి ఎక్కువ మేకప్ వేసుకోవడం మానుకోవాలి.  జాగ్రత్తలు.. చర్మం చాలా సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎక్కువ నిమ్మకాయను జోడించకూడదు. ఇది  మంటను  కలిగించే అవకాశం ఉంటుంది.  గాయాలు లేదా మొటిమలు ఉంటే ఈ ఫేస్ ప్యాక్  పూయకూడదు. వారానికి 1-2 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.  ఏదైనా అలెర్జీ  రియాక్షన్ కనిపిస్తే  వెంటనే వాడటం మానేయాలి.                                          *రూపశ్రీ.

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఇలా చేస్తోండి!

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్.. ఇలా చేస్తోండి! నేటి బిజీ జీవితాల్లో అందం మీద సెల్ఫ్ కేర్ మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యంగా  మారింది. అందులోనూ చాలామంది ముఖ చర్మ రక్షణ గురించి,  హెయిర్ కేర్ గురించి ఆలోచించినంత పాదాల గురించి ఆలోచించరు.  పాదాల సంరక్షణను బ్యూటీ పరిబాషలో పెడిక్యూర్ అని అంటారు.    పెడిక్యూర్ కోసం చాలామంది బ్యూటీ సెలూన్ కు వెళ్లాల్సిందే అనుకుంటారు.  పైగా దీనికోసం చాలా ఖర్చు కూడా అవుతుంది.  కానీ దీన్ని ఇంట్లో చేయడం చాలా సులభం, అలాగే డబ్బు కూడా ఆదా చేసుకున్నట్టే.. ఇంట్లో చేసుకునే పెడిక్యూర్ పాదాలను మృదువుగా ఉంచడమే కాకుండా చాలా అందంగా కనిపించేలా చేస్తుంది.  ఇంతకీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడానికి ఏమేమి కావాలి? దీన్నెలా చేసుకోవాలి? తెలుసుకుంటే.. ఇంట్లోనే పెడిక్యూర్.. ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుంటే ఇది ఎంత సులభమో కూడా అర్థమవుతుంది. పైగా ఇంట్లో చేసుకోవడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది. ముందుగా పాదాలను బాగా కడిగి గోరువెచ్చని నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది,  చనిపోయిన చర్మాన్ని తొలగించడం సులభం చేస్తుంది. నానబెట్టిన తర్వాత  పాదాలను ఆరబెట్టి, గోళ్లను కత్తిరించి  వాటిని మంచి షేప్ చేసుకోవాలి. తరువాత మడమలు,  గోళ్ల నుండి గట్టిగా ఉన్న చర్మాన్ని సున్నితంగా తొలగించడానికి నెయిల్ ఫైల్ లేదా పెడిక్యూర్ రగ్గర్‌ని ఉపయోగించాలి.  గోళ్లపై పాత నెయిల్ పాలిష్ ఉంటే, దానిని నెయిల్ పాలిష్  రిమూవర్‌తో తొలగించాలి. తరువాత పాదాలు,  మడమలకు తేలికపాటి స్క్రబ్‌ను అప్లై చేసి, చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి పూర్తిగా మసాజ్ చేయాలి. స్క్రబ్ చేసిన తర్వాత  చర్మాన్ని తేమగా,  మృదువుగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ లోషన్ లేదా పెడిక్యూర్ క్రీమ్‌తో  పాదాలను మసాజ్ చేయాలి. ఆ తర్వాత కావాలంటే నెయిల్ పాలిష్ ను అప్లై చేసి బాగా ఆరేవరకు అలాగే ఉండాలి. చివరగా పాదాలను తాజాగా ఉంచుకోవడానికి తేలికపాటి టాల్క్ పౌడర్ లేదా ఫుట్ స్ప్రేని ఉపయోగించాలి. పైన చెప్పుకున్న విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం  వల్ల  పాదాలు శుభ్రంగా, మృదువుగా,  ఆరోగ్యంగా ఉంటాయి, ఇంట్లోనే సెలూన్ లాంటి పెడిక్యూర్‌ రిజెల్ట్ చూడొచ్చు.                                     *రూపశ్రీ.

మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చెయ్యండి..!

మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చెయ్యండి..! చాలామంది స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే మోకాళ్లు,  మోచేతుల దగ్గర మాత్రం సరిగా కేర్ తీసుకోరు.  మోకాళ్లు మోచేతులు బాగా గమనిస్తే.. చాలామందిలో ఈ ప్రాంతాలలో చర్మం నల్లగా కాస్త గరుకుగా, గట్టిగా మారి ఉంటుంది. కొందరికి మాత్రం మోకాళ్లు, మోచేతుల చర్మం నల్లగా కాకుండా సాధారణ చర్మం రంగులో ఉంటుంది. కానీ ఈ ప్రాంతాలలో నలుపును తొలగించుకోవడం కష్టం అనుకుంటారు. మోకాళ్ల, మోచేతుల రంగు సాధారణంగా మారాలంటే ఏం చేయాలో,  ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. హైపర్పిగ్మెంటేషన్.. మోకాళ్లు, మోచేతుల ప్రాంతంలో కాలక్రమేణా మృతకణాలు పేరుకుపోవడం, ఘర్షణ కారణంగా నల్లగా,  గరుకుగా మారుతుంది. వైద్య పరిభాషలో దీనిని హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు, ఇది అధిక మెలనిన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. మోచేతులు,  మోకాళ్లపై చర్మంలో తక్కువ నూనె గ్రంథులు ఉంటాయి. దీనివల్ల ఈ ప్రాంతాలు పొడిబారడం,  ధూళికి గురవడం జరుగుతాయి. ఖరీదైన మార్కెట్లో లభించే క్రీములకు బదులుగా  వంటగదిలో లభించే సహజ పదార్థాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు. నిమ్మకాయ, చక్కెర స్ర్కబ్.. నిమ్మకాయ విటమిన్ సి అధికంగా ఉండే సహజ బ్లీచింగ్ ఏజెంట్, ఇక  చక్కెర స్పటికాలు అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిపై కొంచెం చక్కెర చల్లుకోవాలి.  మోచేతులు,  మోకాళ్లపై 5-10 నిమిషాలు రుద్దాలి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించడమే కాకుండా నల్లటి మచ్చలను తేలికపరచడంలో కూడా సహాయపడుతుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. బేకింగ్ సోడా, పాలు పేస్ట్.. బేకింగ్ సోడా చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  పాలు చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా పాలతో కలిపి మందపాటి పేస్ట్ లా చేయాలి. మోకాళ్లు, మోచేతుల  ప్రాంతంలో అప్లై చేసి, వృత్తాకారంగా   స్క్రబ్ చేసి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది,  క్రమంగా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. అలోవెరా జెల్, కొబ్బరి నూనె.. పొడిబారడం అనేది నల్లటి మచ్చలకు ప్రధాన కారణం, కాబట్టి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. కలబంద జెల్ లోని అలోయిన్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. పడుకునే ముందు  చర్మానికి తాజా కలబంద జెల్,  కొబ్బరి నూనె మిశ్రమాన్ని పట్టించి మసాజ్ చేయాలి. ఈ పద్ధతి చర్మాన్ని బాగు చేసి మృదువుగా చేస్తుంది, నల్లటి మచ్చలు తిరిగి రాకుండా చేస్తుంది. కేరింగ్.. కంటిన్యూటీ.. ఏ ఇంటి చిట్కాలు అయినా కేవలం  ఒక్క రాత్రిలోనే  ఫలితాలను చూపించదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఓపికతో కంటిన్యూగా ప్రయత్నం చేయడం  చాలా అవసరం. సూర్యరశ్మిలోకి వెళ్లే ముందు ఈ ప్రాంతాలకు సన్‌స్క్రీన్ రాయడం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే UV కిరణాలు నల్లబడటాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అలాగే పుష్కలంగా నీరు త్రాగాలి.  మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీకు ఏవైనా చర్మ అలెర్జీలు లేదా కోతలు ఉంటే, ఈ చిట్కాలు ప్రయత్నించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.                                      *రూపశ్రీ.

ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి!

ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా..  ఈ తప్పులు చేయకండి! చాలామంది మహిళల్లో  ముఖంపై అవాంఛిత రోమాలు కనిపిస్తూ ఉంటాయి.  వీటిని  తొలగించడానికి ఫేస్ షేవింగ్ ఎంచుకుంటూ ఉంటారు. ఇది వెంట్రుకలను తొలగించడమే కాకుండా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మేకప్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి బాగా కలిసిపోయేలా చేసి చర్మం బాగా కనిపించేలా చేస్తుంది.  అయితే, ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సరైన జాగ్రత్త, ఉపయోగించే విధానం తెలియకుండా పేస్ రేజర్ ఉపయోగిస్తే చాలా నష్టపోతారు.  ఆ తరువాత చాలా భాదపడాల్సి ఉంటుంది.  అందుకే.. ముఖం మీద రేజర్ ఉపయోగించే ముందు కొన్ని తప్పులు చేయకూడదని బ్యూటీ ఎక్పర్ట్స్ చెబుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. రేజర్ ఎంపిక.. ముఖానికి బాడీ రేజర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ముఖం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫేషియల్ రేజర్‌ను ఉపయోగించాలి. దీనికి చిన్న, సన్నని బ్లేడ్ ఉంటుంది. రేజర్ బ్లేడ్ పదునుగా ఉందో లేదో  తనిఖీ చేసుకోవాలి. పాత బ్లేడ్‌లు చర్మానికి చికాకును కలిగిస్తాయి. అలాగే, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి రేజర్ ను ఉపయోగించే ముందు,  తర్వాత శానిటైజర్ లేదా ఆల్కహాల్‌తో రేజర్‌ను శుభ్రం చేసుకోవాలి. ప్రిపరేషన్.. పొడి చర్మం ఉన్నవారు ఎప్పుడూ రేజర్ వాడకూడదు. దీనివల్ల చికాకు పెరిగే అవకాశం ఉంది. పైగా వాడే ముందు స్కిన్ ను ప్రిపేర్ చేయాలి. ముందుగా  ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. షేవింగ్ సులభతరం చేయడానికి, కలబంద జెల్, ఫేషియల్ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్ రాయాలి . ఇది రేజర్ కు  చర్మం మధ్య ప్రొటెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. షేవింగ్ టెక్నిక్.. ముఖం షేవింగ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది, దానిని అనుసరించడం ముఖ్యం. రేజర్‌ను ఎప్పుడూ చర్మానికి 45 డిగ్రీల కోణంలో ఉంచాలి.  రేజర్‌పై ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. సున్నితంగా.. చిన్న స్ట్రోక్‌లను ఉపయోగించాలి. ఎల్లప్పుడూ జుట్టు పెరిగే దిశలోనే షేవ్ చేసుకోవాలి.  వ్యతిరేక దిశలో షేవింగ్ చేయడం వల్ల లోపలికి వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ సులభంగా జారగలిగేలా, మరో చేత్తో చర్మాన్ని కొద్దిగా పైకి లాగి  గట్టిగా పట్టి ఉంచండి. షేవింగ్ తర్వాత.. షేవింగ్ తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, కాబట్టి సరైన జాగ్రత్త అవసరం. షేవింగ్ చేసిన తర్వాత చర్మాన్ని కూల్ గా ఉంచడానికి  ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.  షేవింగ్ చేసే రోజున విటమిన్ సి లేదా AHA/BHA, లేదా రెటినోల్ వంటి  రసాయన ఎక్స్‌ఫోలియెంట్‌లను వాడకూడదు. ఇవి చర్మాన్ని చికాకుపెడతాయి.  మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్  తో ముఖాన్ని హైడ్రేట్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. షేవింగ్ ఎప్పుడు చేయకూడదు.. మొటిమలు, కోతలు లేదా చర్మ ఇన్ఫెక్షన్ ఉంటే, షేవింగ్ చేయకూడదు. రేజర్ వాడటం వల్ల  ముఖం అంతటా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.   సమస్య మరింత తీవ్రమవుతుంది.                                         *రూపశ్రీ.

స్కిన్ కేర్ లో వాడే ప్రోడక్ట్స్.. వాటి గురించి చాలామందిలో ఉన్న అపోహలు..!

స్కిన్ కేర్ లో వాడే ప్రోడక్ట్స్.. వాటి గురించి చాలామందిలో ఉన్న అపోహలు..! నేటి కాలంలో స్కిన్ కేర్ గురించి చాలా ఆసక్తి పెరిగిపోయింది. అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా ఫేస్ క్రీమ్ లు, సీరమ్ లు, లోషన్లు వాడుతూ ఉంటారు.  అయితే వీటి గురించి చాలామందిలో కొన్ని సందేహాలు ఉంటాయి.  వీటి కారణంగా చాలామంది వీటిని వాడటానికి సంకోచిస్తారు.  మార్కెట్లో కొన్ని నాణ్యమైన ఉత్పత్తులు ఉన్నప్పటికీ వాటిని వాడే విషయంలో జరిగే గందరగోళం కారణంగా వెనకడుగు వేస్తుంటారు.  అయితే కొన్ని స్కిన్ కేర్ ఉత్పత్తుల గురించి ఉన్న అపోహలు, నిజాల గురించి తెలుసుకుంటే  చాలామంది సందేహాలు తొలగిపోతాయి.  అవేంటో తెలుసుకుంటే.. రెటినోల్, విటమిన్ సి అండ్  యాసిడ్స్ వంటి  పదార్థాలు ఈ రోజుల్లో చర్మ సంరక్షణ లో  బాగా ప్రాచుర్యం పొందాయి. చాలామంది ఈ పదార్థాల గురించి విని వాటిని వాడటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే వాటి గురించి చాలా తప్పుడు సమాచారం కూడా ఉంది.  సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ ఉత్పత్తుల నుండి పూర్తిగా ప్రయోజనం పొందలేరు.  పైగా ఈ ఉత్పత్తుల వల్ల హాని జరుగుతుందేమో అని భయపడి వాటిని వాడటం మానేస్తారు. అపోహలు.. నిజాలు.. అపోహ.. సాలిసిలిక్ ఆమ్లాన్ని ఉదయం పూట వాడకూడదు.. సాలిసిలిక్ యాసిడ్ (BHA) చర్మాన్ని సూర్యరశ్మికి సెన్సిటివ్ గా మారుస్తుందని,  దీన్ని రాత్రి సమయంలో మాత్రమే వాడాలని అంటారు.  కానీ.. నిజం.. సాలిసిలిక్ యాసిడ్‌ను ఉదయం సేఫ్ గా ఉపయోగించవచ్చు. ఇది రంధ్రాల నుండి నూనెను,  ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది రోజు మురికి,  ధూళి నుండి రక్షించడానికి సహాయపడుతుంది.  దీన్ని అప్లై చేసిన తర్వాత మంచి నాణ్యత గల సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మరచిపోకూడదు. అపోహ.. రెటినాయిడ్స్  చర్మాన్ని పలుచగా చేస్తాయా.. రెటినోల్ లేదా రెటినాయిడ్స్ చుట్టూ ఉన్న అతి పెద్ద భయాలలో ఇది ఒకటి.. అవి చర్మాన్ని సన్నగా చేసి బలహీనపరుస్తుందని అనుకుంటారు. నిజం..  రెటినాయిడ్స్ వాస్తవానికి ఉపరితలంపై ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఇది కాలక్రమేణా చర్మం సన్నగా కాకుండా దృఢంగా,  యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అపోహ.. గ్లైకోలిక్ ఆమ్లం భారతీయ చర్మానికి సెట్ కాదా.. గ్లైకోలిక్ ఆమ్లం భారతీయ లేదా ముదురు చర్మపు రంగులకు చాలా బలంగా ఉంటుందని,  పిగ్మెంటేషన్‌ను పెంచుతుందని అనుకుంటారు. నిజం.. ఇది పూర్తిగా తప్పు. సరైన గాఢతలో,  సరిగ్గా ఉపయోగించినప్పుడు  గ్లైకోలిక్ యాసిడ్ భారతీయ చర్మానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది టానింగ్ తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. తక్కువ గాఢతతో ప్రారంభించడం ముఖ్యం.  దానిని అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. అపోహ.. స్నెయిల్ మ్యూసిన్ ఓపెన్ పూర్స్ ను, ముడతలు, మొటిమలను నయం చేస్తుందా.. ఈ రోజుల్లో స్నెయిల్  మ్యూసిన్ ఒక వైరల్ ఉత్పత్తిగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీనిని ప్రజలు ప్రతి సమస్యకు పరిష్కారంగా భావిస్తారు. నత్తల నుండి వెలువడే ఒక జిగురు లేదా శ్లేష్మంతో తయారు చేయబడే ప్రోడక్ట్ ఇది. నిజం.. నత్త మ్యూసిన్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి,  ఉపశమనం కలిగించడానికి గొప్పది. కానీ ఇది మంత్రదండం కాదు. ఇది తెరిచిన రంధ్రాలను మూసివేయదు, లేదా మొటిమలు లేదా ముడతలకు నివారణ కాదు. అపోహ.. విటమిన్-సి ని ఉదయం వాడకూడదా.. కొంతమంది విటమిన్ సి సూర్యకాంతిలో పనిచేయదని,  చర్మానికి హాని కలిగిస్తుందని నమ్ముతారు. కాబట్టి దీనిని రాత్రిపూట మాత్రమే అప్లై చేయాలి అంటుంటారు. నిజం.. విటమిన్ సి ఉపయోగించడానికి ఉత్తమ సమయం ఉదయమే. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది సన్‌స్క్రీన్‌తో కలిపితే, హానికరమైన సూర్య కిరణాలు,  కాలుష్యం నుండి రెట్టింపు రక్షణను అందిస్తుంది.                                     *రూపశ్రీ.

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..!

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..! కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆహారం,  గాలి,  నీరు,  కలుషితం కావడం, పంటలు  పండించడంలో కూడా రసాయనాలు ఎక్కువ ఉపయోగించడం,  ఇన్స్టంట్ ఫుడ్ లు,  ప్యాక్డ్ ఫుడ్ లు.. ఇలా ఒకటి అని కాదు.. మనిషి శరీరం మీద చాలా ప్రభావాలు చూపిస్తాయి.  ఇవన్నీ మనిషి లైఫ్ స్పామ్ ను మెల్లిగా తగ్గిస్తున్నాయి.  అలాగే శరీర పనితీరు, శరీరంలో అవయవాలు,  చర్మం,  జుట్టు, గోళ్లు మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే నేటికాలంలో చాలామందికి చిన్నతనంలో జుట్టు బాగా పొడవుగా ఉన్నా,  పెద్దయ్యే కొద్ది పొడవుగా ఉన్న జుట్టు కాస్తా పిలకలాగా మారిపోతోంది.  అయితే అమ్మాయిలు మాత్రం తమ జుట్టు విషయంలో భగీరథ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, హెయిర్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు.  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ  కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.  ముఖ్యంగా షాంపూలో కింద చెప్పుకునే చిట్కా ఫాలో  అయితే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరు. అదేంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ లిక్విడ్.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగడానికి షాంపులోకి ప్రోటీన్ లిక్విడ్ కలిపి వాడాలి. ఈ ప్రోటీన్ లిక్విడ్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ లిక్విడ్ కావలసిన పదార్థాలు.. బియ్యం..1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు.. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు.. 10-15 ఆకులు లవంగాలు.. 5 తయారీ విధానం.. ఒక పాత్రలో నీరు తీసుకోవాలి.  ఇందులో బియ్యం, అవిసె గింజలు,  కరివేపాకు, లవంగాలు వేసి ఉడికించాలి. అవిసె గింజలు కాస్త జెల్ లాగా మారుతున్నట్టు అనిపించినప్పుడు స్టౌ ఆఫ్ చేసి వడగట్టాలి.  ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత ఉపయోగించాలి. ఉపయోగించే విధానం.. పైన తయారు చేసుకున్న లిక్విడ్ ను నచ్చిన షాంపులో కలిపి వాడాలి.  దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడాలి.  ఇది జుట్టుకు చాలా మంచి పోషణ ఇస్తుంది. ప్రయోజనాలు.. ఈ ప్రోటీన్ లిక్విడ్ లో అవిసె గింజలు ఉంటాయి.  దీని జెల్ జుట్టును సిల్కీగా మారుస్తుంది. బియ్యం జుట్టుకు పోషణ ఇస్తుంది. నేటి కాలంలో  జుట్టు, చర్మ సంరక్షణలో రైస్ వాటర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కరివేపాకు జుట్టుకు బలాన్ని,  జుట్టు నల్లగా, పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది. లవంగాలలో ఉండే రసాయన గుణాలు జుట్టును,  కుదుళ్లను బలంగా మారుస్తాయి.   పైన పేర్కొన్న పదార్థాలు తల చర్మంలో ఉన్న సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే తీసుకునే ఆహారం,  లైఫ్ స్టైల్,  అలవాట్లు బాగుంటేనే ఇలాంటి చిట్కాలు పనిచేస్తాయి.  లైఫ్ బాగలేకున్నా,  ఆహారం సరిగా తీసుకోకపోయినా, లైఫ్ స్టైల్ బాగాలేకున్నా.. అంటే అర్థరాత్రి వరకు మేలుకోవడం,  ఉదయం  ఎప్పుడో లేవడం, వ్యాయామం చేయకపోవడం,  ఎక్కువసేపు  కూర్చుని ఉండటం వంటివి లైప్ స్టైల్ సరిగా లేకపోవడాన్ని సూచిస్తాయి. అవన్ని సరిచేసుకోవడం చాలా ముఖ్యం..                                   *రూపశ్రీ.

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..!

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..! టానింగ్ చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్య. టానింగ్ రాకుండా ఉండటం కోసం అమ్మాయిలు సన్ స్క్రీన్ వాడుతుంటారు. సన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మాత్రం టానింగ్ తొలగించుకోవడానికి చాలా రకాలు క్రీములు,  లోషన్లు వాడుతూ ఉంటారు. కానీ ఇవి చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి. కానీ తక్కువ ఖరీదులో ఇంట్లోనే టానింగ్ తొలగించుకోవడానికి పసుపు బాగా సహాయపడుతుంది.  అందులోనూ పనుపును వేయించుకుని కొన్ని ఇతర పదార్థాలతో వాడటం వల్ల టానింగ్ సులువుగా పోతుందట. చర్మాన్ని కాంతివంతం చేసుకోవడానికి,  టానింగ్ తొలగించడానికి తరచుగా చర్మాన్ని రుద్దుతారు లేదా ఫెయిర్‌నెస్ క్రీములను ఉపయోగిస్తారు. అయితే, అధికంగా రుద్దడం వల్ల చర్మం క్లియర్ కాకుండా ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా, ఫెయిర్‌నెస్ క్రీములు చర్మాన్ని ప్రకాశవంతం చేయవు. అసలు టానింగ్ ఎందుకు వస్తుంది.  టానింగ్ తొలగించడానికి వేయించిన పసుపును ఎలా వాడాలి? తెలుసుకుంటే.. టానింగ్ కు కారణాలు.. టానింగ్ కు కేవలం ఒకటే కారణం కాదు.. దీనికి అనేక విషయాలు కారణం అవుతాయి. సూర్యుని హానికరమైన కిరణాలకు గురికావడం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యుడికి ఎక్కువసేపు గురికావడం,  హార్మోన్ల మార్పులు కూడా ఒక కారణం. పసుపు చర్మానికి చేసే మేలు.. పసుపులో మంచి మొత్తంలో కర్కుమిన్,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మంటను తగ్గించడంలో, మొటిమలను తగ్గించడంలో,  సహజమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయి. ఇది నల్లటి మచ్చలు, అకాల వృద్ధాప్యం,  వడదెబ్బను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పసుపు ఆరోగ్యానికి,  చర్మానికి రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. టానింగ్ తగ్గించే రెసిపీ.. కావలసిన పదార్థాలు.. పసుపు కాఫీ పొడి నిమ్మరసం తేనె తయారు విధానం..  పసుపును పాన్ మీద బాగా వేయించాలి. దానికి కొద్దిగా నిమ్మరసం,  కాఫీ పొడి కలపాలి.  ఇప్పుడు ఆ మిశ్రమంలో  తేనె కలపాలి.  ఈ పేస్ట్ ని శుభ్రమైన ముఖం మీద అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు  అలాగే ఉంచాలి.   ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు. ప్రయోజనాలు.. పైన చెప్పుకున్న వేయించిన పసుపు రెమిడీ ని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల టానింగ్  తగ్గుతుంది.  ముఖం మీద సహజ మెరుపు వస్తుంది.  చర్మం మెరుస్తుంది.                          *రూపశ్రీ.

పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..!

పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..! ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా ముఖం ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మగవారి కంటే ఆడవారే చర్మ సంరక్షణలో ఎక్కువ ఆసక్తి  కలిగి ఉంటారు. అందుకే మహిళలు ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం క్రీమ్స్,  లోషన్లు, క్లెన్సర్లు కొనుగోలు చేస్తుంటారు.  అయితే వీటికంటే కూడా పచ్చిపాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  అయితే పచ్చిపాలను వాడే విధానం, వీటితో పేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ వంటివి తయారు చేసుకునే విధానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. పచ్చిపాలను వాడటం వల్ల ముఖం మీద మచ్చలు, నల్లటి మచ్చలు తొలగడమే కాకుండా మృతకణాలు తొలగి క్రమంగా చర్మ ఛాయ మెరుగుపడుతుంది.  దీని కోసం ఏం చేయాలో.. పచ్చిపాలను ఎలా వాడాలో తెలుసుకుంటే.. ఫేస్ మాస్క్.. నేటి కాలంలో స్కిన్ కేర్ లో భాగంగా ఫేస్ మాస్క్ లు వాడటం చాలా మంచిది.  ఫేస్ మాస్క్ ల వల్ల చర్మం లోతుగా శుభ్రపడుతుంది. అవి తేమను కూడా అందిస్తాయి. ఫేస్ మాస్క్‌లు మొటిమలు,  మచ్చలు నివారించడంలో కూడా సహాయపడతాయి . ఇవి దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మతు చేయడానికి కూడా సహాయపడుతాయి. ఇంట్లో పచ్చిపాల మాస్క్.. ఎందుకు మంచిదంటే.. మార్కెట్‌లో చాలా రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండటాయి. చర్మానికి ఉండే ప్రతి సమస్యకు ఒక్కో మాస్క్ ఉంటుంది. అయితే ఈ మాస్క్‌లలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు అందరి చర్మానికి సరిపోతాయని చెప్పలేం.. పైగా  వాటిని ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు  జరగకపోగా,  నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. చర్మానికి  రసాయన మాస్క్‌ల వల్ల చికాకు కలగకూడదంటే.. సహజ పదార్ధాలతో తయారు చేసిన ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు మంచి ఛాయిస్ అవుతాయి. కావలసిన పదార్థాలు.. పచ్చిపాలు.. తగినన్ని కలబంద జెల్ రోజ్ వాటర్.. తయారీ విధానం.. ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. అందులో కలబంద జెల్ వేసుకోవాలి.  ఇందులోనే కాసిన్ని పచ్చిపాలు,  కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి.  మూడింటిని బాగా మిక్స్ చేయాలి.  ఈ ద్రావణాన్ని రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు అప్లై చేయాలి.  అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వెంటనే కడిగేయకూడదు. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మం మీద మచ్చలు తగ్గుతాయి.  చర్మం తాజాగా మృదువుగా మారుతుంది.  చర్మం మీద గీతలు కూడా క్రమంగా తగ్గి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అయితే దీన్ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇలా కూడా వాడవచ్చు.. పైన చెప్పుకున్న విధంగా పచ్చిపాలు, రోజ్ వాటర్, కలబంద కాంబినేషన్ లోనే కాకుండా.. పచ్చిపాలను నేరుగా.. కాటన్ బాల్ తో ముంచుకుని ముఖమంతా అప్లై చేయాలి.  ఆ తరువాత ఆరిపోయాక కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది.                                 *రూపశ్రీ.

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో ఇలా చేసుకోవచ్చు..!

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో  ఇలా చేసుకోవచ్చు..! జుట్టును సిల్కీగా, మృదువుగా,  బలంగా మార్చుకోవడానికి చాలామంది మహిళలు హెయిర్ స్పా మీద ఆసక్తి చూపిస్తారు.   దీని కోసం పార్లర్ కు వెళుతుంటారు. ఈ స్పాల కోసం 3వేల రూపాయల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఎంత డబ్బు ఉన్నా సరే.. జుట్టు కోసం ఏకంగా 3వేల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ముఖ్యంగా మధ్యతరగతి,  దిగువ తరగతి అమ్మాయిలకు 3వేల రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తం. కానీ 3వేల రూపాయల స్పా ట్రీట్మెంట్ వల్ల లభించే ఫలితాన్ని కేవలం 10రూపాయలతో పొందవచ్చు అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు.   జుట్టును బలోపేతం చేయడానికి,  సహజంగా సిల్కీగా,  మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో.. ఇది జుట్టుకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటే.. మసాజ్.. హెయిర్ స్పా లో మొదట  జుట్టును మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఈ నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది,  ప్రోటీన్ నష్టాన్ని నివారిస్తుంది. ఇది జుట్టును బలంగా,  లోపలి నుండి స్ట్రైయిట్ గా  చేస్తుంది. ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,  మూలాల నుండి బలపరుస్తుంది. ఆవిరి.. మసాజ్ చేసిన గంట తర్వాత  జుట్టుకు ఆవిరి పట్టాలి. ఇది జుట్టు కుదుళ్లను తెరుస్తుంది,  పొడి జుట్టు వంటి సమస్యలను నివారిస్తుంది .  జుట్టు చాలా చిట్లినట్లు,  వికృతంగా ఉంటే అలాంటి జుట్టుకు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి. మాస్క్.. ఆవిరి పట్టిన తర్వాత ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ వేసుకోవాలి.  జుట్టుకు అరటిపండు మాస్క్ వేయాలి. అరటిపండును మెత్తగా చేసి, దానికి రోజ్ వాటర్, కలబంద, విటమిన్ E క్యాప్సూల్ జోడించాలి. దీన్ని  జుట్టు మొత్తం పొడవునా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ప్రయోజనాలు.. పైన చెప్పుకున్న విధంగా మూడు స్టెప్స్ లో హెయిర్ స్పాను ఇంట్లోనే చేసుకోవచ్చు.  కొబ్బరినూనె ఇంట్లో సహజంగా ఉంటుంది.  నీటి ఆవిరి పట్టుకోవడం కూడా సులువే.. ఇక అరటిపండు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల  హెయిర్ స్పా పూర్తీ అవుతుంది.   ఈ స్పా చేసుకోవడం వల్ల  జుట్టు సహజంగా కండిషన్ అవుతుంది. జుట్టు బలంగా మారుతుంది,  చుండ్రు తగ్గడంలో సహాయపడుతుంది.  జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది.  అలాగే జుట్టుకు సహజ మెరుపు వస్తుంది.                          *రూపశ్రీ.

రోజూ ఈ ఆహారాలు తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

రోజూ ఈ ఆహారాలు తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది! జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.  ఇందుకోసం చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతారు.  చాలామంది జుట్టు పెరగడం కోసం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతుంటారు.  అయితే ఇవన్నీ అప్పటికే ఆరోగ్యంగా ఉన్న జుట్టుకు  రక్షణ కల్పిస్తాయి తప్ప,  డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయవని, జుట్టు పెరగడంలో సహాయపడవని అంటున్నారు. ఇవన్నీ జుట్టు విషయంలో పరోక్షంగా ప్రభావం చూపించేవే.. కానీ జుట్టు విరిపోవడం, రాలిపోవడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గి,  జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. కొన్ని ఆహారాలు బాగా సహాయపడతాయని అంటున్నారు ఆహార నిపుణులు.  ఇంతకీ జుట్టు బాగా పెరగాలంటే ఏ ఆహారాలు తినాలి? తెలుసుకుంటే.. ఉసిరి.. శీతాకాలంలో మార్కెట్లో ఉసిరి సులభంగా లభిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టుకు  సహజంగా ఉండే  నల్ల రంగును  నిలిపి ఉంచడానికి  సహాయపడుతుంది . రోజూ ఒక ఉసిరి తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా.. చిన్నతనంలోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారిస్తుంది. అరటి పండు.. అరటిపండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా  జుట్టుకు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లలో పొటాషియం, సహజ నూనెలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  జుట్టులో తేమను నిలుపుకోవడంలో, జుట్టును లోపలి నుండి హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. అరటిపండ్లు తినడం వల్ల  తలపై చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.  జుట్టును మృదువుగా,  మెరిసేలా చేస్తుంది. ఇది పొడి జుట్టును నివారించడంలో సహాయపడుతుంది . నారింజ.. శీతాకాలంలో నారింజ పండ్లు సులభంగా లభిస్తాయి.  వీటిలో విటమిన్ సి,  బయోఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అవి తలలో రక్త ప్రసరణను పెంచుతాయి, జుట్టు మూలాలకు సమృద్ధిగా ఆక్సిజన్‌ను అందిస్తాయి. నారింజ తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు విరిగిపోవడం,  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది . బొప్పాయి.. బొప్పాయిలో "పపైన్" అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది విటమిన్-ఎ కలిగి ఉంటుంది. ఇది తలపై ఉన్న మురికి,  అదనపు నూనెను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది.  నిర్జీవంగా,  పొడిగా ఉండే  జుట్టుకు కొత్త మెరుపును ఇస్తుంది. దానిమ్మ.. దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు పల్చబడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ పండు జుట్టు సాంద్రతను కూడా పెంచుతుంది . దానిమ్మపండ్లు తినడం వల్ల జుట్టు మందంగా, ఒత్తుగా  కనిపిస్తుంది. ఆపిల్.. ఆపిల్స్ లో జుట్టు పెరుగుదలకు అవసరమైన బయోటిన్,  ఫైబర్ ఉంటాయి. అవి జుట్టు కుదుళ్లను మూసివేసి వాటిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఆపిల్స్ తినడం వల్ల  ఆరోగ్యానికి మాత్రమే కాకుండా  జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.  జుట్టు విరిగిపోవడాన్ని,  చివరలు చిట్లకుండా నిరోధిస్తుంది.                       *రూపశ్రీ

కళ్లకింద నల్లటి వలయాలు ఉన్నాయా.. ఆయుర్వేదం చెప్పిన ఈ మ్యాజిక్ టిప్ ట్రై చేయండి..!

కళ్లకింద నల్లటి వలయాలు ఉన్నాయా.. ఆయుర్వేదం చెప్పిన ఈ మ్యాజిక్ టిప్ ట్రై చేయండి..! కళ్ళ కింద నల్లటి వలయాలు అనేక కారణాల వస్తుంటాయి.  కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా రావడానికి కారణం మనమే అంటుంది ఆయుర్వేదం.   దీనికి మనం ఎలా బాధ్యత వహిస్తామని  ఆశ్చర్యం కలుగుతుంది. తమ ముఖాన్ని నాశనం చేసుకోవాలని ఎవరూ అనుకోరు.  కానీ తెలియకుండానే అది జరిగిపోతుంది. నేటికాలంలో చాలామంది నిద్రను నాశనం చేసుకుంటుంటారు. చాలా వరకు రాత్రంతా మేల్కొని ఉండటానికి అలవాటు పడిపోయి నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు.  దీని ఫలితంగా   కళ్ళ కింద నల్లటి వలయాలు  వచ్చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి చాలా ఇతర కారణాలు కూడా ఉంటాయి. అసలు కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి?  కళ్ళ కింద నల్లటి వలయాలు వదిలించుకోవడానికి ఆయుర్వేదం చెప్పిన పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. కళ్ల కింద నల్లటి వలయాలకు కారణాలు..  కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణాలు నిద్ర లేకపోవడం, ఒత్తిడి, తక్కువ హిమోగ్లోబిన్, పోషకాహార లోపాలు, ఇన్సులిన్ నిరోధకత, కాస్మెటిక్ అలెర్జీలు, కంటి అలెర్జీలు. నల్లటి వలయాలు వదిలించుకునే కారణాలు.. కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి అండర్ ఐ క్రీములు వాడుతుంటారు. ఈ క్రీములు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. కానీ ఇవి కంటికి సంబంధించిన అనేక సమస్యలను కూడా కలిగిస్తాయి. ఈ క్రీములు,  ఆయింట్‌మెంట్లలో ఉపయోగించే రసాయనాలు కళ్ళకు హానికరం. చికాకు, వాపు, ఎరుపు,  మంటకు దారితీస్తాయి. కళ్ల కింద క్రీమ్ ఉపయోగించకుండా నల్లటి వలయాలు వదిలించుకోవాలంటే ఆయుర్వేదం చెప్పిన చిట్కా ఫాలో అవ్వాలి. అతిమధురం.. అతిమధురం ఆయుర్వేదంలో చాలా గొప్ప మూలిక.  అతిమధురం పొడిని నీటిలో కలిపి పేస్ట్ లాగా చేయాలి.  దీన్ని కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాల మీద లేపనం చేయాలి. ఇది  కళ్ళను చల్లబరుస్తుంది,  నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది  చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. బాదం నూనె..  కళ్ళ కింద బాదం నూనెను నల్లటి వలయాలకు పూయడం వల్ల  చర్మానికి పోషణ ఇస్తుంది. బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలలో  ఉండే బ్లాకేజెస్  సరిచేయడానికి సహాయపడుతుంది. రోజ్ ఆయిల్ ఈ నూనెను రోజ్‌షిప్ ఆయిల్ అంటారు. పిగ్మెంటేషన్  కొల్లాజెన్ సమస్యలను నివారించాలనుకుంటే రోజ్‌షిప్ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.                         *రూపశ్రీ.