English | Telugu

నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన 'కార్తీకదీపం' హిమ!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సినీ ప్రముఖులు కరోనాతో మరణిస్తున్నారు. మరికొందరు అనారోగ్య కారణాల వలన మృతువాత పడుతున్నారు. తాజాగా బుల్లితెరపై తీవ్ర విషాదం నెలకొంది. జీతెలుగులో ప్రసారమయ్యే 'నెంబర్ వన్ కోడలు' సీరియల్ నిర్మాత హరీష్ మృతి చెందారు. దీంతో ఆ సీరియల్ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణవార్త విని షాక్ అయినట్లు సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోన్న సుధా చంద్రన్ తెలిపారు.

ఉదయం లేవగానే షాకింగ్ న్యూస్ విన్నానని.. ప్రొడ్యూసర్ హరీష్ గారు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ మరణించారని.. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆయన.. త్వరగా వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యారు. హరీష్ గారు ఎంతో తక్కువగా మాట్లాడతారని.. సహృదయులు అని చెప్పారు. "మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం." అంటూ సుధా చంద్రన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

'కార్తీకదీపం' ఫేమ్ హిమ (సహృద) సైతం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సహృద నిర్మాత మరణంపై స్పందించింది. ''హరీష్ సర్ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నన్ను మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మీరు మా నుండి భౌతికంగా దూరమయ్యారేమో కానీ.. మా హృదయంలో ఎప్పుడూ మీరుంటారు. మిమ్మల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.