English | Telugu

ముదిరిపోయిన బెండకాయ.. సుధీర్‌పై రష్మీ కామెంట్‌!

బుల్లితెరపై సుధీర్, రష్మీ జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎనిమిదేళ్లుగా ఈ జంట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో బుల్లితెరపై ఇప్పటికీ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు వీరిద్దరి మధ్య బంధం జనాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తామిద్దరం కేవలం స్నేహితులమేనని.. కనీసం క్లోజ్ ఫ్రెండ్స్ లా కూడా ఉండమని సుధీర్ గతంలో చెప్పుకొచ్చాడు.

కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తెరపై అలా నటిస్తామని చెప్పాడు. కానీ అభిమానులు మాత్రం రష్మీని పెళ్లి చేసుకోమని సుధీర్ కి సలహాలు ఇస్తుంటారు. ఈ విషయంలో రష్మీ అప్పుడప్పుడు సీరియస్ అవుతూ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ ఈ జంట ఎలా ఉన్నప్పటికీ తెర మీదకు వచ్చేసరికి మాత్రం అందరినీ కట్టిపడేస్తుంటారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఇందులో రష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్కిట్ లో సందర్భానుసారంగా సుధీర్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. "సొరంగాల సుధీర్" అని రోజా అంటే.. తవ్వి తవ్వి తవ్వి ఇక్కడి వరకు వచ్చాడంటూ రష్మీ కౌంటర్ వేసింది. ఇక మరో స్కిట్ లో రష్మీ సెటైర్ వేస్తూ.. "ఓ ముదిరిపోయిన బెండకాయ.. బెండకాయలను ఏరుతున్నాడం"టూ పరువు తీసేసింది. ఇక సుధీర్.. పండుగాడు అనే డైలాగ్ చెబుతున్న సమయంలో 'దిండుగాడు' అంటూ సెటైర్ వేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.