English | Telugu

విష్ణుప్రియ డాన్సుకి శ్రీ‌ముఖే కాదు.. ఎవ‌రైనా షాక‌వ్వాల్సిందే!

యాంకర్ విష్ణుప్రియకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. 'పోవే పోరా' అనే షోతో విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది. అంతకుముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా విష్ణుప్రియకి గుర్తింపు లభించింది. అయితే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు చేస్తూ బాగా ఫేమస్ అయింది.

చిన్నప్పటి నుండి ఆమెకి నటి లేదంటే యాంకర్ కావాలనే కోరిక ఉండేదట. అందుకే ఇప్పుడు హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో విష్ణుప్రియ తన అందాల ఆరబోతతో రెచ్చిపోయిందనే విమర్శలు వచ్చాయి. మొన్నామధ్య అమ్మడు హాట్ ఫోటో షూట్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఓ డాన్స్ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

రీసెంట్ గా యాంకర్ శ్రీముఖి ఓ డాన్స్ వీడియోను షేర్ చేశారు. దాన్ని అలానే ప్రాక్టీస్ చేసిన విష్ణుప్రియ కాస్త తడబడింది. మొదటి స్టెప్ మాత్రమే గుర్తుందని.. ఆ తరువాత ఏదో మ్యానేజ్ చేశానంటూ విష్ణుప్రియ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన శ్రీముఖి 'మ్యానేజర్ మ్యానేజెస్' అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియోలో విష్ణుప్రియ వేసిన స్టెప్పులు చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.