English | Telugu

'కార్తీకదీపం' దర్శకుడితో వంటలక్క.. ఆడిపోసుకుంటున్న‌ నెటిజన్లు!

బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్ గా అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది 'కార్తీకదీపం'. వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు. బోర్ కొట్టిన ప్రతిసారీ ఓ కొత్త ట్విస్ట్ ను తెరపైకి తీసుకొచ్చి.. ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్ ను అభిమానించే వారితో పాటు తిట్టుకుంటూ చూసేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

సీరియ‌స్‌లో దీపను ముప్పుతిప్పలు పెడుతున్న 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి లేటెస్ట్‌గా ఓ ఫోటో తీసుకుంది వంటలక్క. ఈ ఫోటోను తన సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేయగా.. నెటిజన్లు ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ''సీరియల్ ను ఏం తీస్తున్నారు సార్.. సూపర్'' అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంకెన్నాళ్లు సాగదీస్తారు? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే లేటెస్ట్‌ ఎపిసోడ్ లో మోనిత ప్రెగ్నంట్ అనే ట్విస్ట్ ను రివీల్ చేశారు. ఈ పాయింట్ గనుక ఎక్కువ రోజులు సీరియల్ ని సాగదీస్తే రేటింగ్స్ పడిపోవడం ఖాయమని శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' లాంటి సీరియల్స్ ని డైరెక్ట్ చేశాడు. అలానే తెలుగులో కొన్ని సినిమాలను సైతం డైరెక్ట్ చేశాడు. మోహ‌న్‌బాబు, సౌంద‌ర్య జంట‌గా వ‌చ్చిన 'శివ‌శంక‌ర్' మూవీ డైరెక్ట‌ర్ ఆయ‌నే. ఆ సినిమా కానీ, దాని త‌ర్వాత వ‌చ్చిన 'రాంబాబు గాడి పెళ్లాం' కానీ వ‌ర్క‌వుట్ కాకపోవడంతో టీవీ సీరియల్స్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. కార్తీక దీపం బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో ఆయ‌న ద‌శ తిరిగింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.