English | Telugu

"ఆ డ‌బ్బుతోనే క‌ట్టిస్తున్నావా?".. శ్యామ‌ల లగ్జరీ విల్లాపై నెటిజ‌న్ల కామెంట్లు!!

ఈ మధ్యకాలంలో చాలా మంది బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్లు యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టి పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా ఇలానే ఛానెల్ స్టార్ట్ చేసి వీడియోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈమె తన కొత్త విల్లాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ ఖరీదైన విల్లాను పాలరాతితో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ విల్లాను లగ్జరీ హౌస్ గా నిర్మిస్తున్నారు.

ఈ డూప్లెక్స్ హౌస్ లో మొత్తం రెండు హాల్స్, కిచెన్, బెడ్ రూమ్, దేవుడి గది, శ్యామల మేకప్ రూమ్, చిల్డ్రన్స్ కోసం స్పెషల్ ఎలివేషన్ రూమ్, ప్లే గ్రౌండ్, ఇంట్లోనే లిఫ్ట్, స్టడీ రూమ్, ఉయ్యాల కోసం స్పెషల్ రూమ్, పార్టీల కోసం స్పెషల్ స్పేస్ ఇలా ఫుల్ లగ్జరీగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు శ్యామల భర్త నరసింహ ఇంట్లోనే బార్ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు చూపించింది శ్యామల.

ఈ విల్లా నిజంగానే అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. "ఈ విల్లాను నీ భర్త నరసింహ కొట్టేసిన డబ్బుతోనే కట్టిస్తున్నావా..?" అంటూ ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్లక్రితం శ్యామల భర్త నరసింహ తన వద్ద కోటి రూపాయలు తీసుకొని ఎగ్గొట్టారంటూ ఓ మహిళ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నరసింహను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. శ్యామల.. ఈ హోమ్ టూర్ వీడియోపై ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించి ఉండదు. ఏదైతేనేం ఇప్పటికే ఈ వీడియోకి మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.