English | Telugu
రంగస్థలం మూవీలో సమంత గెటప్ లో...విష్ణు ప్రియా
Updated : Mar 10, 2025
చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కి పృద్వి - విష్ణుప్రియ ఇద్దరూ కలిసి రంగస్థలం మూవీ గెటప్స్ వేసుకొచ్చారు. విష్ణుప్రియ రామలక్ష్మి గెటప్ లో వచ్చింది. "రామ లక్ష్మినే కానీ రాంగ్ స్థలంలో ఉన్నట్టు ఉంది" అంటూ సుమ సెటైర్ వేసింది. తర్వాత అమర్ దీప్ వచ్చి "బేసిక్ గా అక్కడ నడుము ఉండాలి. కానీ అక్కడ లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఫ్రస్ట్రేట్ ఐపోయిన విష్ణు ప్రియా.."పృద్వి ఏమీ మాట్లాడవేంటి" అని సీరియస్ గా అడిగేసింది. దానికి అంబటి అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. "నీ నడుము గురించి పృద్వి ఎందుకు చెప్తాడు" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఎందుకంటే రంగస్థలం మూవీలో హీరోయిన్ సమంత నడుము చాలా సన్నగా ఉంటుంది.
ఇక్కడ విష్ణుప్రియ నడుము అలా సన్నగా లేకపోవడంతో అమర్ డైలాగ్ వేసాడు. ఇక తర్వాత దీపికా హడావిడి చేసుకుంటూ వచ్చింది...జడ్జ్ కం మాష్టర్ షెఫ్ కె లైన్ వేసేసింది. ఇక సుమ ఐతే "జీవన్ గారు కంగ్రాట్యులేషన్స్..దీపికా మీతో ఏదో చెప్పాలనుకుంటుంది" అంటూ స్టేజి మీదకు పిలిచింది. జీవన్ పేరును చేతి మీద రాసుకొచ్చింది దీపికా.. ఇక అది చూసిన జీవన్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో "పచ్చబొట్టేసినా పిల్లగాడా" అనే సాంగ్ కూడా ప్లే చేశారు. ఇక జీవన్ ఆమె చేతిని బలవంతంగా పట్టుకునేసరికి ఇంకో వైపు నుంచి అంబటి అర్జున్ కత్తి పట్టుకుని ఇంతకు తెగించిందిరా అది..అంటూ దీపికా మీద దాడి చేయడానికి వెళ్ళబోతే మిగతా వాళ్లంతా ఆపారు. జీవన్ వీళ్ళందరికీ పూతరేకులు వేసే టాస్క్ ఇచ్చారు. చూడండి పూతరేకులు వేయడానికి కుండల్ని రుద్ది రుద్ది రుద్దుతూనే ఉన్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి రాజీవ్ కనకాల కూడా వచ్చాడు. రాజీవ్, సుమ వాళ్ళ 26 వ వెడ్డింగ్ యానివర్సరీని సెట్ లో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. తర్వాత అన్ని జోడీస్ వాళ్లకు విషెస్ చెప్పారు.