English | Telugu

ప‌వ‌న్ నా బుగ్గ గిల్లి ముద్దుపెట్టారు!

కొరియోగ్రాఫర్ గా 1400కి పైగా సినిమాలకు పని చేసిన శివశంకర్ మాస్టర్ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మద్రాస్ లో పుట్టిన ఆయన.. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నాటి త‌రం అగ్ర హీరోల‌ సినిమాలతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి నేటి త‌రం హీరోల సినిమాలకు కూడా పని చేశారు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తూనే.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అలానే నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివశంకర్ మాస్టర్ 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు శివశంకర్ మాస్టర్. అందరికీ సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకి తాను పనిచేశానని తెలిపారు.

ఈ సినిమాలో 'దేవదేవం' అనే పాటకు తాను కొరియోగ్రఫీ చేశానని శివశంకర్ చెప్పారు. తనను సెట్స్ పై చూడగానే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారంటూ హగ్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసే సమయంలో పవన్ త‌న బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నారని.. "ఎంత బాగా చేస్తున్నారు మాస్టర్" అంటూ తనను మెచ్చుకున్నారని శివశంకర్ మాస్టర్ అన్నారు. నటుడిగా కంటే పవన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.