English | Telugu

నా బయోపిక్ నేనే తీసుకుంటా! నా ల‌వ్ స్టోరీలో మంచి మ‌సాలా ఉంది!!

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చాయి. హీరోలు, రాజకీయనాయకులు, స్వాతంత్య్ర యోధులు ఇలా చాలామందిపై బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా డబ్బు బాగా ఉన్నప్పుడు తనపై తానే బయోపిక్ తీసుకుంటానని చెబుతోంది. తన లవ్ స్టోరీలో మంచి మసాలా ఉందని.. దాన్ని దట్టించి బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చింది. తన లవ్ స్టోరీ, పెళ్లి, పిల్లలు వంటి అంశాలపై స్పందించింది అనసూయ.

చిన్నప్పుడు తన తల్లి బాగా పూజలు చేసేదని.. తను కూడా తల్లితో కలిసి టెంపుల్స్ కి తిరిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రేమించిన వాడితో పెళ్లి జరగాలని తెగ పూజలు చేశానని.. ఏడేళ్ల పాటు చాక్లెట్, ఆలు గడ్డ తినలేదని.. సాయిబాబాకు వదిలేశానని తెలిపింది. తన భర్తే తన ప్రపంచమని.. ఎన్‌సీసీ క్యాంప్ లో అతడిని కలిసినట్లు.. అది చాలా పెద్ద కథ అని.. బాగా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తన లవ్ స్టోరీతో బయోపిక్ తీస్తానని.. తన లైఫ్ లో చాలా మసాలా ఉందని, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.

పెళ్లి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు.. సాక్షిలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ.. ఓ పాపని కనాలనుందని చెప్పింది. ఆడబిడ్డను కనడం, పెంచడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పిన అనసూయ తనకు 40 ఏళ్లు రాగానే కూతుర్ని కనడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. కూతుర్ని కనేప్పుడు చాలా వరకు తన వర్క్ ను పాపకి డెడికేట్ చేస్తానని చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.