Read more!

English | Telugu

ఇండియన్ ఐడల్-2 లో ‘ఉగ్రం’ మూవీ హీరో, హీరోయిన్!

ఆహా వేదికగా మొదలైన సింగింగ్ సెన్సేషన్ షో.. 'ఇండియన్ ఐడల్-2'. దీనికి యాంకర్ గా సింగర్ హేమచంద్ర, జడ్జ్ లుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్, సింగర్ గీతా మాధురి, సింగర్ కార్తీక్ లు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వారం ఈ షో సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. దానికి సంబంధించిన తాజా ప్రోమోని ఈ షో యాజమాన్యం విడుదల చేశారు. 

ఈ వారం ట్రిబ్యూట్ టు టాలీవుడ్ అనే థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు." నాకొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది " అంటూ హేమ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. "ఎవడు కొడితే చెవ్వు బ్లాక్ అవుతుందో వాడే పండు" అంటూ స్టయిలిష్ లుక్ లో ఎస్ ఎస్ తమన్ అదరగొట్టే ఎంట్రీ ఇచ్చాడు. "మాహిష్మతి ఊపిరి పీల్చుకో" అంటూ దేవసేన గెటప్ లో గీతమాధురి వచ్చేసింది. దేవసేన లాగా రమ్మంటే ఘటోత్కచుడి లాగా వచ్చావని గీతమాధురికి తమన్ పంచ్ వేయగా అందరూ నవ్వేస్తారు. ఆర్ఆర్ఆర్ లోని హీరో రామ్ చరణ్ కాస్ట్యూమ్స్ లో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కాగా ఈ ప్రోమోలో.. ప్రతి కంటెస్టెంట్ తమ పర్ఫామెన్స్ వంద శాతం ఇస్తూ జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారని తెలుస్తోంది. "జగదేకవీరుడు అతిలోక సుందరి" మూవీలోని శ్రీదేవి క్యాస్టమ్స్ తో సౌజన్య వచ్చి..  'అందాలలో అహో మహోదయం' అనే పాట పాడి జడ్జెస్ తో శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత లాస్య ప్రియ పాడిన పాటకి ఫిదా అయిన జడ్జెస్.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఆ తర్వాత ఉగ్రం మూవీ ప్రమోషన్ కోసం హీరో అల్లరి నరేశ్, హీరోయిన్ వచ్చి సరదాగా షో లో ముచ్చటించారు. ఆ తర్వాత కంటెస్టెంట్ కార్తీకేయ వచ్చి తన పర్ఫామెన్స్  ఇచ్చాడు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని నరేశ్ చెప్పాడు. ఆ తర్వాత నీ కోసం బిగ్గెస్ట్ ఫ్యాన్ వచ్చారని కార్తికేయతో హేమచంద్ర అంటాడు. అప్పుడే ఒక చిన్నపాప స్టేజి మీదకి వస్తుంది. తను రాగానే 'ఇక్కడున్న వాళ్ళు అందరూ నీకు తెలుసా' అని హేమచంద్ర అడుగుతాడు. ఆ చిన్న పాప అందరి పేర్లు ఈజీగా చెప్తుంది. నీకేం పాట ఇష్టమని  ఆ పాపని తమన్ అడగ్గా.. " కొమ్మ ఉయ్యాలా" అంటూ క్యూట్ గా పాట పాడి వినిపిస్తుంది. ఆ తర్వాత శృతి పర్ఫామెన్స్ చేయగా.. నువ్వు ఎక్కడో భయపడ్డావని అనిపించిందని గీతమాధురి చెప్తుంది.

ఆ తర్వాత తెలుగు మూవీస్ థీమ్స్ తో వచ్చే సాంగ్స్ కి.. అందరూ కంటెస్టెంట్స్ ఒకే స్టేజిపై పాడుతారు. అలా పాడిన ఆ పాటకి.. చాలా బ్యూటిఫుల్ ఎఫర్ట్ అంటూ కార్తీక్ కాంప్లిమెంట్ ఇస్తాడు. "ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా" అని కార్తీక్ అంటాడు. కార్తిక్ ఆ డైలాగ్ దేన్ని ఉద్దేశించి మాట్లాడాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మరి.