English | Telugu

ఫ్రెండ్ ఇంట్లో ఉరేసుకున్న 25 ఏళ్ల టీవీ యాక్ట‌ర్!

శుక్ర‌వారం ఇందిరా కుమార్ అనే టెలివిజ‌న్ యాక్ట‌ర్ మృతి చెందాడు. అత‌ని వ‌య‌సు కేవ‌లం 25 సంవ‌త్స‌రాలు. త‌మిళ సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్న అత‌ను చెన్నైలోని త‌న ఫ్రెండ్ నివాసంలో ఉరివేసుకొని ఉండ‌గా క‌నుగొన్నారు. అందిన స‌మాచారం మేర‌కు, త‌న ఫ్రెండ్‌ను క‌లుసుకోవ‌డానికి అత‌ని ఇంటికి వ‌చ్చిన ఇందిరా కుమార్‌, మ‌రుస‌టి రోజు పొద్దున్నే ఉరేసుకుని క‌నిపించాడు. ఆందోళ‌న‌కు గురైన అత‌ని ఫ్రెండ్, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభించిన పోలీసులు మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్‌కు త‌ర‌లించారు.

రిపోర్టుల ప్ర‌కారం, ఇందిరా కుమార్ మృతికి కార‌ణాలు వెల్ల‌డి కాలేదు. సూసైట్ నోట్ లాంటిదేమీ పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఆశించిన అవ‌కాశాలు రాక‌పోతుండ‌టంతో అత‌ను మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు త‌మిళ టీవీ రంగంలో చెప్పుకుంటున్నారు. అత‌ను శ్రీ‌లంకకు చెందిన త‌మిళుడు. కొన్ని పాపుల‌ర్ త‌మిళ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. అత‌నికి భార్య‌, ప‌సివాడైన కుమారుడు ఉన్నారు. చెన్నైలోని శ‌ర‌ణార్ధి శిబిరంలో ఉంటున్నాడు. ధ‌నుష్ సినిమా 'తూటా'లో న‌టించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.