English | Telugu

దీప ప్లాన్ తెలిసి బిత్త‌ర‌పోయిన డాక్ట‌ర్ బాబు!

`కార్తీక దీపం` రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం 968వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో ఊహించ‌ని ట్విస్ట్‌లు.. ట‌ర్న్‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. హిమ‌ని డాక్ట‌ర్ బాబు త‌న వ‌ద్ద‌కు చేర్చాల‌ని ప్లాన్ వేసిన మోనిత ఈ విష‌యంపై లాయ‌ర్ సుజాత‌ని రంగంలోకి దింపుతుంది. ఇందు కోసం ఆమెకి 2 ల‌క్ష‌లు ఫీజు కింద ఇచ్చేస్తుంది.

అయితే ఇంత జ‌రుగుతున్నా దీప (వంట‌ల‌క్క) మాత్రం ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేస్తుంటుంది. కార‌ణం ఏంట‌ని సౌంద‌ర్య‌తో పాటు మామ ఆనంద‌రావు ఆరాతీస్తే కోర్టు త‌న‌కే అనుకూలంగా తీర్పు చెబుతుంద‌ని లేదంటే పిల్ల‌కు మీకు ఉన్న సంబంధం ఏంటో నిరూపించుకోండ‌ని జ‌డ్జి డాక్ట‌ర్ బాబుని అడుగుతార‌ని, అదీ లేదంటే భార్య‌నీ, పిల్ల‌ల‌నీ ఇంటికి తీసుకెళ్లి బుద్దిగా కాపురం చేసుకోమ‌ని హెచ్చ‌రిస్తార‌ని దీప వివ‌రంగా ఎక్స్‌‌ప్లేయిన్ చేస్తుంది. శుక్ర‌వారం దీప వివ‌రిస్తున్న తీరుని చాటు నుంచి చూసిన డాక్ట‌ర్ బాబుకి ఫీజులెగిరిపోతాయి. షాక్‌కు గురైన డాక్ట‌ర్ బాబు అక్క‌డి నుంచి మోనిత ఇంటికి వెళ‌తాడు.

క‌ట్ చేస్తే మోనిత లాయ‌ర్ సుజాత‌కు ఫోన్ చేసి దీప గురించి, కోర్టు కేసు గురించి మాట్లాడుతుంటుంది. అక్క‌డికి చేరుకున్న డాక్ట‌ర్ బాబు వెంట‌నే మోనిత ఫోన్ లాక్కుని `హాలో నేను కార్తీక్‌ని.. మీరా చెప్పండి.. అంటుంది లాయ‌ర్ సుజాత‌. టెన్ష‌న్ ప‌డ‌కండి. ఆ దీప కేసు గెలిచే ఛాన్సేలేదు` అంటుంది.. అల్రెడీ గెలిచింది. మీరు వాదించ‌డానికి ఏమీ లేదు. మీ క‌న్నా నాలుగు ఆకుటు ఎక్కువే చ‌దివింది నా పెళ్లాం. ఏం అయ్యింది అని సుజాత అడుగుతుంది. కోర్టుకు వెళ్ల‌కుండానే ఈ కేసు గెలిచేసింది. కోర్టుకు వెళ్ల‌కుండానే కేసు క్లోజ్ అయ్యింది. కేసు వెన‌క్కి తీసుకుంటున్నాను... సీన్ క‌ట్ చేస్తే తుల‌సి బ్యాగ్ స‌ర్దుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటుంది.. ఇంత‌లో అక్క‌డికి మోనిత ఎంట‌రై నేను సాయం చేస్తానుగా అంటుంది. అవ‌స‌రం లేదు. తోడేలు తోడేస్తానంటే లేడి పిల్ల‌లా నీ వెంట‌రావ‌డానికి నేనేమీ దీప లాంటి పిల్ల‌ని కాదు..తుల‌సిని అంటూ మోనితని ఇరిటేట్ చేస్తుండ‌గానే సీన్‌లోకి దీప ఎంట‌ర‌వుతుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత‌.. దీప‌ల మ‌ధ్య ఎలాంటి చర్చ జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే శ‌నివారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.