Read more!

English | Telugu

నేను దేశానికి చేస్తున్న సేవ ఇదే.. మీరూ చేయండి!

 

ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతగా విజృభిస్తుందో తెలిసిందే. రోజుల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు బాగానే ఉండడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. మ‌రోవైపు వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్, బెడ్ల‌ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశం విఫలమైందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా గెటప్ శ్రీను ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆయన కొన్ని విషయాల గురించి మాట్లాడారు. 

మన దేశ జనాభాను ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాలతో పోల్చి చెప్పారు. అమెరికా, రష్యా, జర్మనీ, టర్కీ, యూకే అంటూ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల జనాభా మొత్తం మన దేశ జనాభాకు సమానమని చెప్పారు. అలా ఇంత జనాభా ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్క భారతదేశ జనాభా 139 కోట్లు అని చెప్పిన జబర్దస్త్ శ్రీను.. కొవిడ్ ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎంత పని చేస్తున్నాయో అంత పని ఇండియా ఒక్కటే చేస్తోంద‌ని అన్నారు. 

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అనడం చాలా సులువు కానీ ప్రపంచదేశాలకు సాటిగా, ధీటుగా నిలబడడానికి నీ వంతు సహకారం అందించు అని ప్రజలను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. మీరు ఎలాంటి ఆర్ధిక సహాయం చేయక్క‌ర‌లేద‌నీ.. ఈ లాక్ డౌన్ ను విజయవంతం చేస్తే చాలనీ చెప్పుకొచ్చారు. "ఇంట్లోనే ఉంటూ.. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, ఇతరులను కాపాడండి.. ఇదే మీరు దేశానికి చేసే చిన్న సేవ." అంటూ గెటప్ శ్రీను ఓ పోస్ట్ పెట్టారు.