English | Telugu

"అందం పోతుంద‌ని డ‌బ్బా పాలు పడుతున్నారా?".. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు హ‌రితేజ ఆన్స‌ర్ ఇదే!

బుల్లితెరపై సీరియల్స్ లో నటించి, ఆ తరువాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కనిపించింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో జనాలను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరిగింది. ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు కూడా పెరిగాయి. రీసెంట్ గా హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి ఇటీవల చెప్పుకొచ్చింది.

తనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. కానీ ఫైనల్ గా అంతా బాగానే జరిగిందని.. తమ పాప ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా హరితేజ త‌న‌ ఫాలోవర్లతో ముచ్చట పెట్టింది. చాలా రోజుల తరువాత ఆన్లైన్ లోకి వచ్చినా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలా మంది పాప యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు.

"అందం పోతుందని డబ్బా పాలు పడుతున్నారా..? లేక మీరే ఇస్తున్నారా..?" అని ప్రశ్నించాడు ఒక‌త‌ను. ఇది చూసిన హరితేజ.. ఒకింత వ్యంగ్యంగా నవ్వుతూ.. "ఏమిటో మీ అనుమానాలు?" అంటూ కౌంటర్ ఇచ్చింది. "వ్యాక్సిన్ వేసుకున్నారా..?" అని మరో నెటిజన్ అడగగా.. పాపకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ వేసుకోవాలో లేదో అనే విషయంలో తనకు కన్ఫ్యూజన్ ఉందని అసలు విషయం చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.