English | Telugu

నువ్వు వర్జినా..? నెటిజన్ ప్రశ్నకు దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన న‌టి కూతురు!

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. లాక్ డౌన్ కావడంతో వీరిద్దరూ చాలా వీడియోలను షేర్ చేస్తున్నారు. వరుసగా లైవ్ చాట్ లు పెడుతూ.. తమ‌ ఫాలోవర్లతో ముచ్చట పెడుతున్నారు.

నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా లైవ్ సెషన్ నిర్వహించిన సుప్రితకు నెటిజన్ల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా.. "ఏదైనా అడగండి, సమాధానాలు చెబుతా" అంటూ లైవ్ మొదలుపెట్టింది సుప్రిత. ఇందులో భాగంగా ఓ నెటిజన్ "నువ్ వర్జినా..?" అంటూ అడగకూడని ప్రశ్నను సంధించాడు.

ఇది చూసిన సుప్రిత అదిరిపోయే కౌంటర్ రిప్లై ఇచ్చింది. 'వకీల్ సాబ్' సినిమాలో కోర్ట్ సీన్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ తన సమాధానం చెప్పకనే చెప్పింది. సినిమాలో ప్రకాష్ రాజ్.. నివేదా థామస్ ను కోర్టులో ఇలాంటి ప్రశ్నే అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతాడు. ఆ సీన్ ను సుప్రిత షేర్ చేసింది. మొత్తానికి అమ్మడు రియాక్షన్ చూసిన వాళ్లు గట్టిగానే ఆన్స‌ర్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.