English | Telugu

ఆ నిర్మాత న‌న్ను మోసం చేశాడు!

కమెడియన్ గా వెండితెరపై పలు సినిమాల్లో నటించిన అభి.. 'జబర్దస్త్' షోతో మరింత హాస్యాన్ని పండిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా 'జబర్దస్త్' షోలో కనిపిస్తోన్న అభి తన టీమ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. అలా వచ్చిన వారిలో హైపర్ ఆది టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అభి తన స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు లేకుండా క్లీన్ కామెడీ ఉండేలా చూసుకుంటాడు.

మధ్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. ఆ తరువాత హీరోగా మారాలని ప్రయత్నించాడు. కొన్నాళ్లక్రితం అతడు హీరోగా నటించిన సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ అభికి అంత క్రేజ్ ను తీసుకురాలేకపోయింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చాడు అభి. అతడితో పాటు రామ్ ప్రసాద్ కూడా వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అభి తనకు జరిగిన మోసాన్ని బయటపెట్టారు.

అభి దర్శకుడిగా ఓ నిర్మాత ఐదు కోట్లు పెట్టి సినిమా చేయాలనుకున్నాడట. తన మీద అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నాడు కదా.. అలాంటిది తను కొంచెమైనా హెల్ప్ చేయాలని ఐదు లక్షల చెక్కు రాసిచ్చానని అభి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత డబ్బులు వెనక్కి రాలేదని, దానికోసం పోలీసుల దగ్గరకు కూడా వెళ్లానని తెలిపాడు. అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్ల‌డించ‌లేదు. అలానే తనకు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయని అన్నాడు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.