English | Telugu

లైవ్‌లో టీవీ యాక్ట‌ర్‌ ఆత్మహత్యాయత్నం..!

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఎందరో ప్రజాలు జీవనోపాధిని కోల్పోయారు. చాలా మంది పేద ప్రజలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక ఆకలి చావులకు గురవుతున్నారు. ఈ వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా పడింది.

షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బెంగాలీ నటుడు సువో చక్రవర్తి అవకాశాలు లేక ఆర్థిక‌ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. బెంగాలీలో 'మంగళ చాందీ', 'మానస' వంటి సీరియల్స్ తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన చక్రవర్తి రీసెంట్ గా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్నాడు.

లైవ్‌లో మాట్లాడుతూ సడెన్ గా ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగేశాడు. ఇది చూసిన ఆయన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సువో చక్రవర్తిని హాస్పిటల్‌లో చేర్పించి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.