English | Telugu

లాస్య‌పై యాంక‌ర్ ర‌వి ఎమోష‌న‌ల్ పోస్ట్!

బుల్లితెర‌పై ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్న జోడీ.. రవి, లాస్య‌. ఈ ఇద్ద‌రూ మాటీవీలో ప్ర‌సార‌మైన 'సంథింగ్ స్పెష‌ల్' ప్రోగ్రామ్‌తో యాంక‌ర్స్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్ద‌రూ టీవీ వీక్ష‌కుల్లోనూ కాకుండా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ జ‌ర్నీ చాలా కాలం చాలా అందంగా సాగింది. వీరిద్ద‌రూ క‌లిసి ఆ త‌రువాత చేసిన ప్ర‌తీ షో సూప‌ర్ హిట్టే.

అయితే ఇంత‌లో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం, లాస్య వేరే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లిచేసుకోవ‌డంతో వీరి జోడీకి బ్రేక్ ప‌డిపోయింది. లాస్య యాంక‌రింగ్‌కి టాటా చెప్పేసింది. అయితే ఈ రంగంలో ఎప్పుడూ ఎవ‌రూ ఒకేలా వుండ‌రు, మారుతుంటారు.. అన్న‌ది తెలిసిందే. అదే మార్పు ర‌వి,లాస్యలోనూ వ‌చ్చింది. ఐదేళ్ల త‌‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిశారు. 'స్టార్ మా' కోసం ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ షోకి లాస్య ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ ర‌వి, లాస్య క‌లిసి 'ఉప్పెన‌' మూవీ కాన్సెప్ట్‌ని పేరడీ చేశారు.

ఇందులోని "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు..." అంటూ సాగే పాట‌కు ఆడిపాడి అల‌రించారు. దీంతో ఈ షోకి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌దేవి, శేఖ‌ర్ మాస్ట‌ర్ మురిసిపోయారు. ఇలా మిమ్మ‌ల్ని చూసి ఎన్నే‌నేళ్ల‌యింది.. అయినా మీ మ్యాజిక్ మార‌లేదంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డిస్తూ లాస్య‌పై రవి ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని షేర్ చేశాడు. "కాలం మారింది.. జీవితాలు మారాయి. కానీ మా ఇద్ద‌రి మాయాజాలం మాత్రం పిస‌రంత‌ కూడా మార‌లేదు. అప్పుడు, ఇప్పుడు మేం మిమ్మ‌ల్ని అల‌రిస్తుంటాము. ఎందుకంటే మేం పెర్ఫార్మ‌ర్స్ కాబ‌ట్టి. మీ అంద‌రి అన్ కండీష‌న‌ల్ ల‌వ్‌కు థ్యాంక్స్‌." అంటూ లాస్య‌తో 'ఉప్పెన' పాట‌కు రొమాన్స్ చేసిన ఫొటోల్ని పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు వేల సంక్‌య‌లో లైక్స్ వ‌చ్చాయి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.